Shobha yathra
-
హైదరాబాద్‌లో శ్రీరాముడి శోభాయాత్ర
హైదరాబాద్: నగరంలో శ్రీరాముడి శోభాయాత్ర కొనసాగుతోంది. సీతారాంబాగ్ నుంచి సుల్తాన్‌బజార్ వరకు శోభాయాత్ర ఉంటుంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లిస్తున్నారు.శ్రీరామనవమి శోభాయాత్రను పురస్కరించుకుని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సీతారాం బాగ్ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనర్ మీడియాతో మాట్లాడుతూ.. నగరంలో జరుగుతున్న శ్రీరాముడి శోభాయాత్ర ప్రశాంతంగా సాగేందుకు పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని వెల్లడించారు.ఈ యాత్ర ఇవాళ రాత్రి 10 గంటల్లోగా ముగిసేలా పక్కా రూట్ మ్యాప్ సిద్ధం చేశామని తెలిపారు. ఇప్పటికే పలు శాఖల అధికారులతో కలిసి యాత్ర సాగే మార్గాలను క్షుణ్ణంగా పరిశీలించామని, ఎక్కడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా డ్రోన్లు, సీసీ టీవీ కెమెరాల ద్వారా నిరంతరం నిశితంగా పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు.ఈ భారీ శోభాయాత్ర కోసం దాదాపు 3,000 మంది సిబ్బందితో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసినట్లు వివరించారు. అంతకుముందు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్.. శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
కాషాయ క్షేత్రంగా యాదాద్రి పుణ్యక్షేత్రం
యాదాద్రి: మహా రామభక్తుడు.. ధర్మ రక్షకుడైన ఆంజనేయ స్వామి జయంతిని పురస్కరించుకుని ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో శోభాయాత్ర నిర్వహించారు. దీంతో యాదాద్రి కాషాయ క్షేత్రంగా మారింది. ఈ యాత్ర ఆదివారం హిందూ దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన రహదారిపై హనుమాన్, శ్రీరాముడు, శివాజీ మహరాజ్‌ల భారీ విగ్రహాలతో సుమారు 6గంటలపాటు జరిగింది. కాషాయపు దుస్తులతో హనుమాన్ నామస్మరణం చేస్తూ కోలాటం, సంప్రదాయ నృత్యాలతో యాత్ర కొనసాగడం చూపరులను ఆకట్టుకుంది. హైదరాబాద్ నుంచి వచ్చిన ఒంటెలపై చిన్నారులు శోభాయాత్రలో పాల్గొనడం ప్రత్యేకంగా నిలిచింది. ఈ శోభయాత్రలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, శ్రీ రామకష్ణనందగిరి స్వామిజీ, శ్రీకష్ణ అఖండనామ సంకీర్తన ఆశ్రమ పీఠాధిపతి ప్రసన్న కష్ణదాసు ప్రభుజీ, మాతా మధు మంజరీదేవి, త్రిశక్తి పీఠాధిపతి బాలశివ స్వామిజీలు పాల్గొన్నారు. -
కృష్ణా జలాలతో శోభాయాత్ర
తెనాలి టౌన్: కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని శ్రీ వైఖానస సేవా సంఘం ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో 108 కృష్ణా జల కలశాలతో శోభయాత్ర నిర్వహించారు. వైఖానస ఆగమ శాస్త్రప్రకారం ఉదయం ఆరాధన, పుణ్యహవచన నిర్వహించిన సంఘ సభ్యులు కృష్ణా నది వద్ద తాళ్ళయపాలెంలో సేకరించిన పవిత్ర జలాలను పట్టణంలో ఊరేగించారు. అనంతరం గోవర్ధనస్వామి ఆలయంలో గోవర్ధన, వీరప్రతాప∙ఆంజనేయ, విఖానస చార్య స్వామివార్లకు విశేష స్నప్న నిర్వహించారు. చతుర్వేద్ధ పారాయణ పంచసూక్త పారాయాణాలు చేశారు. దాస్యా సాహిత్య ప్రాజెక్టు బృందం సభ్యులు గోవింద నామ సంకీర్తనాలు ఆలపించారు. సంఘ నాయకులు దన్వంతరి, టి.రఘు, వి.మాధవకుమార్, అర్చకులు భట్టాచార్యులు, రామాచార్యులు, కేసవకుమార్, యస్వంత్, వైభవ్, హరిబాబు, నాగమారుతీ, తదితరులు పాల్గొన్నారు.


