కాషాయ క్షేత్రంగా యాదాద్రి పుణ్యక్షేత్రం | Sakshi
Sakshi News home page

కాషాయ క్షేత్రంగా యాదాద్రి పుణ్యక్షేత్రం

Published Sun, May 21 2017 5:46 PM

Hanuman Shobha Yatra in Yadadri

యాదాద్రి: మహా రామభక్తుడు.. ధర్మ రక్షకుడైన ఆంజనేయ స్వామి జయంతిని పురస్కరించుకుని ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో శోభాయాత్ర నిర్వహించారు. దీంతో యాదాద్రి కాషాయ క్షేత్రంగా మారింది. ఈ యాత్ర ఆదివారం హిందూ దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన రహదారిపై  హనుమాన్, శ్రీరాముడు, శివాజీ మహరాజ్‌ల భారీ విగ్రహాలతో సుమారు 6గంటలపాటు జరిగింది.

కాషాయపు దుస్తులతో హనుమాన్‌ నామస్మరణం చేస్తూ కోలాటం, సంప్రదాయ నృత్యాలతో యాత్ర కొనసాగడం చూపరులను ఆకట్టుకుంది. హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఒంటెలపై చిన్నారులు శోభాయాత్రలో పాల్గొనడం ప్రత్యేకంగా నిలిచింది. ఈ శోభయాత్రలో గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్,  శ్రీ రామకష్ణనందగిరి స్వామిజీ, శ్రీకష్ణ అఖండనామ సంకీర్తన ఆశ్రమ పీఠాధిపతి ప్రసన్న కష్ణదాసు ప్రభుజీ, మాతా మధు మంజరీదేవి, త్రిశక్తి పీఠాధిపతి బాలశివ స్వామిజీలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement