కృష్ణా జలాలతో శోభాయాత్ర | Shobha yathra along with holly krishna water | Sakshi
Sakshi News home page

కృష్ణా జలాలతో శోభాయాత్ర

Aug 18 2016 5:59 PM | Updated on Sep 4 2017 9:50 AM

కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని శ్రీ వైఖానస సేవా సంఘం ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో 108 కృష్ణా జల కలశాలతో శోభయాత్ర నిర్వహించారు.

తెనాలి టౌన్‌: కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని శ్రీ వైఖానస సేవా సంఘం ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో 108 కృష్ణా జల కలశాలతో శోభయాత్ర నిర్వహించారు. వైఖానస ఆగమ శాస్త్రప్రకారం ఉదయం ఆరాధన, పుణ్యహవచన నిర్వహించిన సంఘ సభ్యులు కృష్ణా నది వద్ద తాళ్ళయపాలెంలో సేకరించిన పవిత్ర జలాలను పట్టణంలో ఊరేగించారు. అనంతరం గోవర్ధనస్వామి ఆలయంలో గోవర్ధన, వీరప్రతాప∙ఆంజనేయ, విఖానస చార్య స్వామివార్లకు విశేష స్నప్న నిర్వహించారు. చతుర్వేద్ధ పారాయణ పంచసూక్త పారాయాణాలు చేశారు. దాస్యా సాహిత్య ప్రాజెక్టు బృందం సభ్యులు గోవింద నామ సంకీర్తనాలు ఆలపించారు. సంఘ నాయకులు దన్వంతరి, టి.రఘు, వి.మాధవకుమార్, అర్చకులు భట్టాచార్యులు, రామాచార్యులు, కేసవకుమార్, యస్వంత్, వైభవ్, హరిబాబు, నాగమారుతీ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement