45 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి : గేమ్ ఛేంజర్ | Tokara Leaf Warbler becomes Japan first new bird species since 1982 | Sakshi
Sakshi News home page

45 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి : గేమ్ ఛేంజర్

Mar 24 2026 1:24 PM | Updated on Mar 24 2026 1:45 PM

Tokara Leaf Warbler becomes Japan first new bird species since 1982

టోక్యో: జపాన్‌లో ఇటీవలి  కొత్త ఆవిష్కరణ విశేషంగా నిలుస్తోంది. 1982 తర్వాత జపాన్‌లో గుర్తించిన  మొట్ట మొదటి కొత్త పక్షి జాతిగా శాస్త్రవేత్తలు టోకారా లీఫ్ వార్బ్లర్‌ను గుర్తించారు దాదాపు 45 ఏళ్ల తర్వాత జపాన్‌లో గుర్తించిన మొదటి కొత్త పక్షి జాతి ఇదే కావడం విశేషం. పక్షుల శాస్త్రీయ అధ్యయనంలో ఒక ఆశ్చర్యకరమైన పరిణామం అంటూ కొత్త అతిథి రాకపై హర్షం  వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి మరికొన్ని విశేషాలు చూద్దామా...

శాస్త్రవేత్తలు జపాన్‌లోని టోకారా దీవుల్లో 'టోకారా లీఫ్ వార్బ్లర్' (Phylloscopus tokaraensis) అనే కొత్త పక్షి జాతిని కనుగొన్నారు. డాక్టర్ కెంటా మోరిషిత నేతృత్వంలోని బృందం ఈ ఆవిష్కరణ చేసింది. ఆధునిక సాంకేతికత (జన్యు పరిశోధన) అందుబాటులోకి రావడంతో ఎప్పుటినుంచో మన కళ్ల ముందే ఉన్నా గుర్తించ లేక పోయిన జీవులను ఇప్పుడు కనిపెట్టడం సాధ్యమవు తోందని నిపుణులు చెబుతున్నారు.

టోకారా లీఫ్ వార్బ్లర్ (Tokara Leaf Warbler) విశేషాలు
జన్యు అధ్యయనాలు దీనిని ఒక కొత్త జాతిగా నిర్ధారించాయి. ఈ పక్షి కేవలం మారుమూల టోకారా దీవులలో మాత్రమే, అక్కడి దట్టమైన అడవుల్లో తక్కువ సంఖ్యలో కనిపిస్తుంది. ఇది చూడటానికి 'ఇజిమాస్ లీఫ్ వార్బ్లర్' (Phylloscopus ijimae) అనే పక్షిని పోలి ఉంటుంది. ఇవి చూడటానికి దాదాపు ఒకేలా ఉంటాయి.  ఈ పక్షి  పొడవు సుమారు 10–12 సెంటీమీటర్లు, బరువు కేవలం 6–9 గ్రాములు మాత్రమే ఉంటుంది.

జన్యు పరిశోధన ఒక గేమ్-ఛేంజర్
సాధారణంగా, పక్షుల గుర్తింపు వాటి రూపాన్ని బట్టి ఉంటుంది.  ఈ పక్షి చూడటానికి పాత జాతిలాగే ఉన్నప్పటికీ, DNA (జన్యు)  సీక్వెన్సింగ్  అది పాడే పాట విధానం (Song patterns) ద్వారా ఇది కొత్త జాతి అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.  ఈ పక్షుల జనాభా చాలా తక్కువగా ఉంది. అడవుల నరికివేత మరియు వాతావరణ మార్పుల వల్ల వీటికి ముప్పు పొంచి ఉందని పరిశోధకులు భావిస్తున్నారు.

జపాన్‌లోని ద్వీపాలు  జీవవైవిధ్యాన్ని కలిగి ఉంటాయని, జాగ్రత్తగా చేసే పరిశోధనలతో వాటిని కనుక్కోవచ్చు అనేది మనకు గుర్తు చేస్తుందని ఈ కొత్త పక్షి జాతి ఆవిష్కరణలో ప్రముఖ పరిశోధకులలో ఒకరైన డాక్టర్ కెంటా మోరిషితా అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement