న్యూజిల్యాండ్‌లో ఉగాది సంబరాలు | Ugadi celebrations in New Zealand | Sakshi
Sakshi News home page

న్యూజిల్యాండ్‌లో ఉగాది సంబరాలు

Mar 22 2026 10:46 PM | Updated on Mar 24 2026 10:47 PM

Ugadi celebrations in New Zealand

న్యూజిల్యాండ్‌లోని తెలుగువారు ఉగాది పండుగ‌ను ఘ‌నంగా నిర్వ‌హించుకున్నారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిల్యాండ్ ఆధ్వర్యంలో ఆక్లాండ్ నగరంలో శ్రీ పరాభవ నామ‌ సంవత్సరం వేడుక‌ల‌ను సంప్ర‌దాయ‌బ‌ద్దంగా జ‌రుపుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుతనం,  తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా పంచాంగ శ్రవణంతో రాశి ఫలితాలను స్థితిగతులను తెలుసుకున్నారు.

చిన్నారులు పెద్దలు తెలుగు సాంప్రదాయ పాటలు, నృత్యాలతో అలరించడమే కాకుండా సాంప్రదాయ పిండి వంటలతో సామూహిక భోజనం చేశారు. ఇండియన్ కాన్సులేట్ జనరల్ డాక్ట‌ర్ మదన్ మోహన్ సేథి ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో సామజికసేవలో ముందున్న తెలుగు ప్రతినిధులను ఉగాది పురస్కారాలతో సన్మానించారు. చిన్నారులకు, నృత్యకారులకు బహుమతులు అందజేశారు.


అసోసియేషన్ అధ్యక్షుడు కోడూరి చంద్రశేఖర్ అధ్య‌క్షతన జరిగిన ఈ వేడుకలో ప్రముఖ వ్యాపారవేత్త శివ కిలారి, యాదవ్, సత్యనారాయణ తట్టల, అసోసియేషన్ మాజీ అధ్యక్షులు పట్లోళ్ల నరేందర్ రెడ్డి, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విశ్వనాధు బాల, విజేత యాచమనేని, మధు ఎర్ర, కావ్య, వర్ష పట్లోళ్ల,  మేకల స్వాతి, కిరణ్మయి, విశ్వనాథ్ అవిటి, మొహమ్మద్ బిలాలోద్దీన్, విజయ్ శ్రీరామ్, రమేష్ రామిండ్ల, మనోహర్ కన్నం, హరీష్, రమేష్ ఆడెపు, శ్రీనివాస్ పందిళ్ల, రవి కుమార్ వట్టం, మారుతి, ఆర్తి, భరత్ జవ్వాజి, మహేందర్ రెడ్డి, నిఖిత తదితరులతో పాటు పెద్ద ఎత్తున ప్రవాస తెలంగాణ బిడ్డలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement