ప్రకృతి-మనిషి కలిసి చేసిన అద్భుతం | Switzerlands lakeside towns Japanese occupation of Hong Kong | Sakshi
Sakshi News home page

ఈ సమ్మర్‌లో చూడాల్సిన ఆహ్లాదకరమైన ప్రదేశాలివే..

Mar 23 2026 5:01 PM | Updated on Mar 23 2026 5:12 PM

Switzerlands lakeside towns Japanese occupation of Hong Kong

ఎండాకాలం మొదలవ్వగానే పర్యటనల పట్ల ఆసక్తి గలవారిలో వివిధ రకాల ఆలోచనలు మదిలో మెదలుతుంటాయి. ఈ సీజన్‌లో కొన్ని ప్రదేశాల ఉష్ణోగ్రతలు పెరిగి హాట్‌ హాట్‌గా ఉంటే..మరికొన్ని చల్లగా ఆహ్లాదాన్ని పంచుతుంటాయి. కొండల మధ్య దోబూచులాడే మేఘాలు, సరస్సులపై తేలియాడే ప్రభాత వెలుగులు, వాటిని ఆనుకుని ఉండే పట్టణ వీధుల్లో నడక ప్రయాణం .. ప్రకృతి –మనిషి కలిసి చేసిన అద్భుతం కళ్ల ముందు నిలిచి, వేసవి ప్రయాణాన్ని ఒక ప్రత్యేక అనుభూతిగా మార్చేస్తాయి. అలాంటి వాటిలో ప్రపంచంలోనే పేరొందినవి స్విట్జర్లాండ్‌లో లేక్‌ టౌన్‌గా పిలిచే లూసెర్న్, ఐస్‌లాండ్‌లో రేక్యావిక్, కెనాడలోని బ్యాన్ఫ్, ఇండియాలో లేహ్, జపాన్‌లోని హాంకొనె. ఎందుకు ఇవి మాత్రమే అంతటి ప్రత్యేకతను నింపుకున్నాయో తెలుసుకుందాం. ఈ వేసవి ప్రయాణాన్ని అత్యద్భుతంగా మార్చుకుందాం..

హిమాలయాల మధ్య..
లేహ్‌ భారతదేశంలోని లడఖ్‌లో ఉన్న ఒక హిమాలయన్‌ ప్రాంతం. ఎండాకాలంలో ఇక్కడ లోయలు, కొండల మధ్య ప్రయాణం ఒక ప్రత్యేక అనుభవంగా ఉంటుంది. హిమాలయాల్లోని మఠాలు, ప్రశాంత గ్రామాలు ఈ ప్రాంత జీవనశైలిని ప్రత్యేకంగా చూపిస్తాయి. ఉదయం సమయంలో పర్వతాలపై పడే వెలుగు వ్యాలీస్‌ను గోల్డెన్‌ రంగులో మార్చేస్తుంది. లడఖ్‌లోని ప్యాంగ్యాంగ్‌ లేక్‌ అనేది ప్రకృతి అద్భుతం.
రాక్‌ సౌందర్యం

బ్యాన్ఫ్‌ కెనడాలోని ఒక అందమైన హిల్‌ టౌన్‌. బ్యాన్ఫ్‌ నేషనల్‌ పార్క్‌ మధ్యలో ఉన్న ఈ ప్రదేశం బ్లూ లేక్స్, పచ్చని అడవులతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఎండాకాలంలో కొండలపై పడే వెలుగు, లేక్స్‌లో కనిపించే ప్రతిబింబాలు ప్రయాణికులకు గుర్తుండి΄ోయే అనుభవాన్ని ఇస్తాయి. బాన్ఫ్‌లోని లేక్‌ లూసీ నీలి నీటితో ప్రసిద్ధి చెందింది.

వెలుగు కథలు
రేక్యావిక్‌ ఐస్లాండ్‌ దేశ రాజధాని. ఎండాకాలంలో ఇక్కడ పగటి సమయం ఎక్కువగా ఉండటంతో నగరం మొత్తం వెలుగుతో నిండి΄ోతుంది. సముద్రం పక్కన ఉన్న ఈ నగరంలో రంగురంగుల ఇళ్లు, చిన్న చిన్న, సన్నని స్ట్రీట్స్, ప్రశాంతమైన కేఫ్స్‌ కనిపిస్తాయి. ఉదయం వెలుగు సముద్రంపై పడితే నగరం మొత్తం మృదువైన కాంతితో మెరుస్తుంది.

ఆల్ఫ్స్‌ మధ్య లేక్‌ టౌన్‌
లూసెర్న్‌ అనే నగరం స్విట్జర్లాండ్‌లో ఉన్న ఒక అందమైన లేక్‌ టౌన్‌. స్విస్‌ ఆల్ఫ్స్‌ కొండల మధ్య విస్తరించిన లూసెర్న్‌ సమ్మర్‌లో చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. ఈ సరస్సు పక్కన నడిచేందుకు సన్నని వీధులు, పాత వుడెన్‌ బ్రిడ్జ్‌లు ఈ నగరానికి ప్రత్యేక వాతావరణాన్ని ఇస్తాయి. ఉదయ సమయంలో సరస్సు పై పడే సూర్య కిరణాలు నీటిపై బంగారు కాంతిని వెదజల్లుతుంటాయి. కొండల నీడలు, మేఘాల ప్రతిబింబాలు కలిసి ఒక పెయింటింగ్‌లా కనిపిస్తాయి. లూసెర్న్‌లోని చాపెల్‌ బ్రిడ్జి నగర చరిత్రను మన ముందు ఆవిష్కరింప జేస్తుంది.

సమ్మర్‌ ట్రావెల్‌ అనుభవం
ప్రయాణం అంటే కేవలం ఒక ప్రదేశం చూడటం మాత్రమే కాదు. ప్రకృతి రిథమ్‌ను అనుభవించడం కూడా. కొండల మధ్య మేఘాల ప్రయాణం, లేక్స్‌పై పడే వెలుగు, గ్రామాల ప్రశాంత జీవనంం ఇవన్నీ ప్రయాణాన్ని జీవితాంతం గుర్తుండి΄ోయే అనుభవంగా మార్చేస్తాయి.

ఫుజీ కొండల దృశ్యాలు
హాంకొనే  జపాన్‌లోని ఒక నేచురల్‌ డెస్టినేషన్‌. అడవులు, సరస్సులు, కొండల మధ్య ప్రయాణించే రోడ్లు 
ఈ ప్రదేశాన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. దూరంలో కనిపించే మౌంట్‌ ఫూజీ దృశ్యం ఈ ప్రదేశానికి 
అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది. హంకొనేలోని లేక్‌ ఆషీ పక్కన ఫుజీ దృశ్యం అద్భుతంగా అనిపిస్తుంది.

– ఎం.జి.కిశోర్, పర్యాటకుడు 

(చదవండి: ఇండియాలోనే స్విట్జర్లాండ్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement