లంచాలకు తలొంచి.. | ou employees caught accepting bribe acb trap | Sakshi
Sakshi News home page

లంచాలకు తలొంచి..

Apr 2 2026 11:57 AM | Updated on Apr 2 2026 1:06 PM

ou employees caught accepting bribe acb trap

చైతన్యపురి/ఉస్మానియా యూనివర్సిటీ: నగరంలో బుధవారం రెండు వేర్వేరు ఘటనలో ఇద్దరు ఓయూ ఉద్యోగులు, చైతన్యపురి ఏఎస్‌ఐ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలకు చిక్కారు. వివరాలు ఇలా ఉన్నాయి. లోక్‌ అదాలత్‌లో కేసు రాజీ కుదురుస్తానంటూ లంచం తీసుకున్న కోర్టు విధులు నిర్వర్తిస్తున్న  చైతన్యపురి ఏఎస్‌ఐను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఎలక్ట్రీషియన్‌గా పనిచేసే పల్లెపు రాంబాబు అనే వ్యక్తి ఓ కేసులో నిందితుడు.

 చైతన్యపురి పోలీసులు కోర్టులో చార్జిషిట్‌ దాఖలు చేశారు. లోక్‌ అదాలత్‌లో రాజీ కుదుర్చుతానని కోర్టు విధులు నిర్వహిస్తున్న ఏఎస్‌ఐ పూసల బాలయ్య నిందితుడు రాంబాబును రూ.15 వేలు లంచం డిమాండ్‌ చేశాడు. దీంతో రాంబాబు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. రంగారెడ్డి జిల్లా కోర్టు వద్ద రాంబాబు నుంచి బాలయ్య డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని కోర్టులో హాజరుపరిచారు.  

ఓయూ  పాలన భవనం కార్యాలయంలోని బిల్స్‌ సెక్షన్‌లో పని చేస్తున్న ఉద్యోగులు అరవింద్, రమేశ్ లు రూ.13 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. పెన్షన్‌ కోసం ఓ విశ్రాంత ఉద్యోగి దరఖాస్తు చేసుకోగా వీరు డబ్బులు డిమాండ్‌ చేశారు. దీంతో బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించారు. ముందస్తు ప్రణాళికతో బాధితుడి నుంచి ఓయూ ఉద్యోగులు రూ.13 వేలు లంచం  తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వీరిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement