ఆ విధానం రద్దు.. తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక నిర్ణయం..! | Telangana exhibitors key decision on movie rentals procedure | Sakshi
Sakshi News home page

Telangana exhibitors: ఆ విధానం రద్దు.. తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక నిర్ణయం..!

Apr 2 2026 4:27 PM | Updated on Apr 2 2026 4:47 PM

Telangana exhibitors key decision on movie rentals procedure

తెలంగాణ ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఉన్న రెంటల్ విధానానికి స్వస్తి పలికారు.  మల్టీప్లెక్స్‌ తరహాలో పర్సంటేజీ విధానంలోనే సినిమాలను ప్రదర్శించాలని నగరంలోని 23 సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్ల యాజమాన్యాలు నిర్ణయించాయి. ఏప్రిల్‌ 3 నుంచే ఇది అమల్లోకి రానుందని ప్రకటించారు. ఎగ్జిబిటర్లకు రెవెన్యూ షేర్‌ ఇలా.. సినిమా ప్రదర్శితమైన తొలివారం 60 శాతం, రెండోవారం 50 శాతం, మూడోవారం 40 శాతం. ఈ మేరకు తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రకటన విడుదల చేసింది.

ఇప్పటికే 23 మంది ఎగ్జిబిటర్లు తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ను సంప్రదించార. తెలంగాణలోని పలువురు అగ్ర శ్రేణి డిస్ట్రిబ్యూటర్లతో చర్చించారు. వారి థియేటర్లు ముఖ్యమైన ప్రదేశాల్లో ఉన్నాయని అన్నారు. వాటిలో ప్రేక్షకులకు అన్ని సౌకర్యాలున్నాయని తెలిపారు. అయితే ఈ థియేటర్ల నిర్వహణ చాలా భారంగా మారిందన్నారు. ప్రస్తుత అద్దె విధానంతో నెట్టుకు రావడం కష్టసాధ్యమైందని వెల్లడించారు.

పర్సంటేజీ ప్రాతిపదికన సినిమాలను ప్రదర్శిస్తామన్న తమ ప్రపోజల్‌ను డిస్ట్రిబ్యూటర్లు అంగీకరించారని చెప్పారు. శశిధర్ రెడ్డి మాత్రమే నిర్మాతలు, ఇతర భాగస్వాములతో మరింత చర్చించి అభిప్రాయం చెబుతామన్నారని పేర్కొన్నారు. ఇకపై తెలంగాణలోని అన్ని సింగిల్ స్క్రీన్‌లలో సినిమాలను కేవలం శాతం ప్రాతిపదికనే ప్రదర్శిస్తామని ఎగ్జిబిటర్స్ స్పష్టం చేశారు. ఇది దశల వారీగా జరుగుతుందని అని ఫిల్మ్‌ ఛాంబర్‌ తన ప్రకటనలో పేర్కొంది.

t

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement