అమెరికాలో సంచలన సృష్టించిన ఎప్‌స్టీన్‌ ఫైళ్ల విడుదల | Epstein Files Release Sparks Shockwaves Across America | Sakshi
Sakshi News home page

అమెరికాలో సంచలన సృష్టించిన ఎప్‌స్టీన్‌ ఫైళ్ల విడుదల

Apr 2 2026 9:22 PM | Updated on Apr 2 2026 9:40 PM

Epstein Files Release Sparks Shockwaves Across America

వాషింగ్టన్‌: అమెరికాలో సంచలన సృష్టించిన ఎప్‌స్టీన్‌ ఫైళ్ల విడుదల అయ్యాయి. జెఫ్రీ ఎప్‌స్టీన్‌ కేసులో వేలపేజీల రహస్య పత్రాలు బహిర్గతమయ్యాయి. ఈ రహస్య పత్రాలను అమెరికా డీవోజే(డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌) బహిర్గతం చేసింది. పారదర్శకత కోసమే ఫైళ్లు విడుదల చేశామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎఫ్‌బీఐ ఇంటర్వ్యూలు, గ్రాండ్‌ జ్యూరీ కీలక సాక్ష్యాలు బయటపడ్డాయి. తద్వారా 2008 నాటి వివాదాస్పద ఒప్పందాల వెనక ఉన్న రహస్యాలపై ఉత్కంఠ నెలకొనగా, ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. 

కాగా, ఐదు సంవత్సరాల క్రితం జైలు గదిలో అతను ఆత్మహత్య చేసుకున్నా… అతని చుట్టూ తిరిగిన రహస్యాల కథ మాత్రం ఇంకా ముగియలేదు. ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న “ఎప్‌స్టీన్‌ ఫైళ్లు” ప్రపంచ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. జెఫ్రీ ఎప్‌స్టీన్ రాజకీయ నాయకుడు కాదు. సినీ తార కూడా కాదు. కానీ ప్రపంచంలో అత్యంత శక్తివంతుల మధ్య తిరిగిన వ్యక్తి. అపర కుబేరుడైన ఎప్‌స్టీన్

అతనికి  సొంతంగా ఉన్న లిటిల్ సెయింట్ జేమ్స్ అనే చిన్న దీవిని తమ కామ క్రీడలకు అడ్డాగా మార్చుకున్నాడు. ఇక్కడ చిన్నపిల్లలపై లైంగిక దోపిడి జరిగిందనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. బాధితుల కథలు దాదాపు ఒకేలా ఉన్నాయి — చిన్న ఉద్యోగ ఆఫర్లు, ఆకర్షణలు, తర్వాత బెదిరింపులు. లోపల జరిగినవి బయటకు చెప్పాలంటే చంపేస్తామని హెచ్చరికలు.

ఎప్‌స్టీన్ ఒంటరిగా ఇదంతా చేయలేడని చాలా మంది నమ్ముతున్నారు. అతని వెనుక ఒక వ్యవస్థ పనిచేసిందా? అతన్ని రక్షించిన శక్తులు ఉన్నాయా? అనే అనుమానాలు ఇప్పటికీ ఉన్నాయి.

అసలేంటి ఎప్‌స్టీన్ ఫైల్స్ ..
 అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేసిన పత్రాలు ఈ కేసును మరింత వేడెక్కించాయి. కోర్టు రికార్డులు, ఈమెయిల్స్, ఫ్లైట్ లాగ్స్, కాంటాక్ట్ బుక్స్ — ఇవన్నీ కలిపి లక్షల పేజీల డాక్యుమెంట్లు బయటకు వచ్చాయి. ఇందులో ప్రపంచవ్యాప్తంగా పేరున్న ప్రముఖుల పేర్లు కనిపించడంతో సంచలనం రేగింది.

మాజీ అమెరికా అధ్యక్షులు బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్, బ్రిటన్ యువరాజు ఆండ్రూ, హిల్లరీ క్లింటన్ వంటి పేర్లు కోర్టు పత్రాల్లో ప్రస్తావనకు వచ్చాయి. అలాగే ఎలాన్ మస్క్, రిచర్డ్ బ్రాన్సన్ వంటి వ్యాపారవేత్తల పేర్లు కూడా విమాన లాగ్స్ లేదా కమ్యూనికేషన్ రికార్డుల్లో కనిపించాయి. చివరికి మన భారత దేశానికి చెందిన ప్రముఖుల పేర్లు కూడా ఉండడం సంచలనంగా మారింది.

ఎప్‌స్టీన్ 2002 నుంచి 2005 మధ్య ఫ్లోరిడాలో యువతులను లైంగిక దోపిడికి గురి చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. 2019లో అరెస్టై జైలులో ఉన్న సమయంలో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అతని సహచరురాలు గిస్లేన్ మాక్స్‌వెల్ ప్రస్తుతం 20 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తోంది.

మరోవైపు ట్రంప్ -ఎప్‌స్టీన్ మధ్య ఉన్న సంబంధం కూడా పెద్ద చర్చగా మారింది. వీరిద్దరి ఫోటోలు, ఫ్లైట్ లాగ్స్, కాంటాక్ట్ బుక్ వివరాలు గతంలోనే బయటకు వచ్చాయి.వీరిద్దరి ఫోటోలు అమెరికా రాజకీయాల్లో చిచ్చురేపుతోంది. మరి ఇప్పుడు తాజాగా విడుదల చేసిన ఈ ఫైళ్లలో ఏముందో,  ఏమౌతుందో అనే ఆసక్తి నెలకొంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement