2025–26లో 47 లక్షల వెహికల్స్.. | 47 Lakh Vehicles Sales in 2025 26 | Sakshi
Sakshi News home page

2025–26లో 47 లక్షల వెహికల్స్..

Apr 2 2026 7:21 PM | Updated on Apr 2 2026 7:42 PM

47 Lakh Vehicles Sales in 2025 26

గత ఆర్థిక సంవత్సరం (2025–26) రికార్డు స్థాయిలో 47 లక్షల ప్యాసింజర్‌ వాహనాలు అమ్ముడయ్యాయి. మారుతీ, టాటా మోటార్స్, మహీంద్రా కంపెనీల అత్యుత్తమ పనితీరుతో పాటు ఆర్థిక సంవత్సర ద్వితీయార్థంలో జీఎస్‌టీ 2.0 అమలు వాహన విక్రయాలను మరింత వేగవంతం చేసింది.

కొత్త ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల వేగాన్ని కొనసాగించాలని ఆటోమొబైల్‌ పరిశ్రమ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అయితే పశి్చమాసియా  యుద్ధం కారణంగా సరఫరా సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో పాటు, కమోడిటీ ధరల పెరుగుదల నేపథ్యంలో ధరలు పెరిగితే డిమాండ్‌ తగ్గొచ్చని అంచనా వేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో మారుతీ సుజుకీ 24,22,713 యూనిట్లను విక్రయించింది. 2024–25లో అమ్మకాలు 22,34,266గా ఉన్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement