న్యూజెర్సీలో ఘనంగా శంకర నేత్రాలయ సంగీత–నృత్య సేవా కార్యక్రమం | Sankara Nethralaya USA Music and Dance for Vision Charity in New Jersey | Sakshi
Sakshi News home page

న్యూజెర్సీలో ఘనంగా శంకర నేత్రాలయ సంగీత–నృత్య సేవా కార్యక్రమం

Mar 20 2026 1:53 PM | Updated on Mar 20 2026 2:04 PM

Sankara Nethralaya USA Music and Dance for Vision Charity in New Jersey

అమెరికాలోని శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత–నృత్య సేవా కార్యక్రమం న్యూజెర్సీ రాష్ట్రంలో ఘనంగా జరిగింది. మార్చి 14, 2026 శనివారం సాయంత్రం ఆల్బర్ట్ ప్యాలెస్‌లో జరిగిన ఈ కార్యక్రమం భారతీయ సాంప్రదాయ కళలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రసాద్‌ రెడ్డి కటమరెడ్డి హాజరై సేవా కార్యక్రమాల ప్రాముఖ్యతను వివరించారు. మాజీ కమిషనర్ ఉపేంద్ర చివుకుల కూడా కార్యక్రమంలో పాల్గొని సందేశం ఇచ్చారు. కార్యక్రమంలో ప్రముఖ గాయకులు రాము, అంజనా సౌమ్య తమ గాన ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. వారి సంగీత ప్రదర్శనలు సభలోని ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందాయి.

అలాగే అనేక నృత్య సంస్థలు భారతీయ సాంప్రదాయ నృత్యాలను అద్భుతంగా ప్రదర్శించాయి. అందులో కళాగంగోత్రి ఫౌండేషన్, సౌపర్ణిక నృత్య అకాడమీ, కూచిపూడి నృత్య కేంద్రం, సిద్ధేంద్ర కూచిపూడి కళా అకాడమీ, నాట్య తత్వ శ్రీ సాయి వెంకటేశ్వర లలిత కళలు, చిన్మయి నృత్యాలయ, లిటిల్ మ్యూజీషియన్స్ అకాడమీ అమెరికా సంస్థలు పాల్గొని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లో కంటి వైద్య సేవలను అందించేందుకు శంకర నేత్రాలయ సంస్థ మొబైల్ కంటి శస్త్రచికిత్స యూనిట్లను నిర్వహిస్తూ వేలాది మంది పేదలకు కంటి వెలుగు అందిస్తోంది. ఈ సేవా కార్యక్రమం ద్వారా సేకరించిన విరాళాలను పేదలకు కంటి శస్త్రచికిత్సలు, వైద్య సేవలు అందించేందుకు వినియోగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

అమెరికాలోని న్యూజెర్సీ బృంద సభ్యులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సేవా కార్యక్రమాలకు మద్దతుగా నిర్వహించిన ఈ వేడుకకు స్థానిక భారతీయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

(చదవండి: సింగపూర్‌లో ఘనంగా ఉగాది వేడుకలు)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement