రసెల్‌ రికార్డు బద్దలు కొట్టిన రింకూ సింగ్‌ | IPL 2026: Rinku Singh breaks Andre Russell record of most catches for KKR | Sakshi
Sakshi News home page

రసెల్‌ రికార్డు బద్దలు కొట్టిన రింకూ సింగ్‌

Apr 2 2026 10:45 PM | Updated on Apr 2 2026 10:45 PM

IPL 2026: Rinku Singh breaks Andre Russell record of most catches for KKR

కేకేఆర్‌ విధ్వంసకర ఆటగాడు రింకూ సింగ్‌ ఓ అద్భుత రికార్డును సొంతం చేసుకున్నాడు. కేకేఆర్‌ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టిన నాన్‌ వికెట్‌కీపర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఆండ్రీ రసెల్‌ పేరిట ఉండిన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 

ఐపీఎల్‌ 2026లో భాగంగా ఎస్‌ఆర్‌హెచ్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 2) జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో రింకూ రెండు క్యాచ్‌లు పట్టాడు. తొలుత ముజరబానీ బౌలింగ్‌ ఇషాన్‌ కిషన్‌ క్యాచ్‌ను, ఆతర్వాత అనుకూల్‌ రాయ్‌ బౌలింగ్‌లో అనికేత్‌ వర్మ క్యాచ్‌ పట్టాడు.

ఈ రెండు క్యాచ్‌ల తర్వాత కేకేఆర్‌ తరఫున రింకూ క్యాచ్‌ల సంఖ్య 41కి చేరింది. ఈ క్యాచ్‌లను అతను కేవలం 61 మ్యాచ్‌ల్లోనే పట్టాడు. 40 క్యాచ్‌లు పట్టేందుకు రసెల్‌కు ఏకంగా 133 మ్యాచ్‌లు అవసరమయ్యాయి. ఈ విభాగంలో రింక, రసెల్‌ తర్వాతి స్థానంలో సునీల్‌ నరైన్‌ ఉన్నాడు. నరైన్‌ 191 మ్యాచ్‌ల్లో 36 క్యాచ్‌లు పట్టాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. 227 పరుగుల భారీ లక్ష్య ఛేదనను ధాటిగా ప్రారంభించిన  కేకేఆర్‌, ఆతర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి ఢీలా పడింది. ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌ (7 బంతుల్లో 28; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) తొలి ఓవర్‌లోనే ఏకంగా 24 పరుగులు రాబట్టి మెరుపు ఆరంభాన్ని అందించాడు. 

అలెన్‌ ఔటయ్యాక అదే జోరును అంగ్‌క​ృష్‌ రఘువంశీ (52) కూడా కొనసాగించినప్పటికీ.. దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు. అంతకుముందు గ్రీన్‌ (2) కూడా రనౌటయ్యాడు. 13 ఓవర్ల తర్వాత కేకేఆర్‌ స్కోర్‌ 137-5గా ఉంది. రింకూ సింగ్‌ (34) కేకేఆర్‌ను గెలిపించే ప్రయత్నం చేస్తున్నాడు. అతనికి జతగా రమన్‌దీప్‌ సింగ్‌ (8) క్రీజ్‌లో ఉన్నాడు.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ భారీ స్కోర్‌ చేసింది. 20 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. హెడ్‌ (46), అభిషేక్‌ (48), క్లాసెన్‌ (52), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (39) రాణించారు. కేకేఆర్‌ బౌలర్లలో ముజరబానీ 4, వైభవ్‌ ఆరోరా 2, కార్తీక్‌ త్యాగి ఓ వికెట్‌ తీశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement