ఇంకా పూర్తిగా వెనక్కిరాని పెద్ద నోట్లు! | ₹2,000 Notes Nearly Phased Out, Reserve Bank Of India Says 98.45% Returned To System, More Details Inside | Sakshi
Sakshi News home page

ఇంకా పూర్తిగా వెనక్కిరాని పెద్ద నోట్లు!

Apr 2 2026 4:32 PM | Updated on Apr 2 2026 5:11 PM

98 45 Percent of Rs 2000 Notes Returned RBI

చలామణీలో ఉన్న రూ. 2,000 కరెన్సీ నోట్లలో దాదాపు 98.45 శాతం వెనక్కి వచ్చినట్లు రిజర్వ్‌ బ్యాంకు వెల్లడించింది. 2023 మే 19న ప్రకటించిన ఈ నోట్ల ఉపసంహరణను ప్రకటించినప్పుడు రూ. 3.56 లక్షల కోట్ల విలువ చేసే రూ. 2,000 బ్యాంక్‌ నోట్లు చలామణీలో ఉండగా 2026 మార్చి 31 నాటికి ఇది రూ. 5,501 కోట్లకు తగ్గినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఆర్‌బీఐకి చెందిన 19 ఇష్యూ ఆఫీసుల్లో పెద్ద నోట్లను మార్చుకునేందుకు వెసులుబాటు ఉంది. అలాగే తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు ఇండియా పోస్ట్‌ ద్వారా కూడా ఆర్‌బీఐ ఇష్యూ ఆఫీసులకు పంపించవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement