Hyderabad
-
మొయినాబాద్ జంట హత్య కేసులో బిగ్ ట్విస్ట్
సాక్షి,హైదరాబాద్: మొయినాబాద్ జంట హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అప్పు ఇచ్చిన మొత్తం ఎనిమిది మంది చంపేందుకు నిందితురాలు కరీమాబేగం, ఆమె భర్త రెహమాన్ ప్లాన్ చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది.తాండూరు ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉండే కరీమాబేగం, రెహమాన్ దంపతులు ఆబేదాబేగం, మహబూబాబీ అనే ఇద్దరు మహిళల వద్ద కొంత మొత్తాన్ని అప్పుగా తీసుకున్నారు. అప్పు తీసుకున్న తర్వాత నెలలు గడుస్తున్నా కరీమాబేగం దంపతుల నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ క్రమంలో వారిపై మహిళలిద్దరూ ఒత్తిడి చేశారు. దీంతో వారిని చంపేయాలని కరీమాబేగం, రెహమాన్ కుట్ర చేశారు. కుట్రలో భాగంగా అప్పు ఇస్తానంటూ మొయినాబాద్ సమీపంలోని తోల్కట్ట ఫాంహౌస్ వద్దకు రావాలని సమాచారం అందించారు. అలా వచ్చిన బాధితుల్ని వేర్వేరు సమయాల్లో గొంతు నులిమి హత్య చేశారు. అక్కడే గొయ్యి తీసి మృత దేహాల్ని పూడ్చిపెట్టారు.మిస్సింగ్ కంప్లయింట్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు జంట హత్యకేసును ఛేదించారు. తాజాగా పోలీసుల దర్యాప్తులో నిందితులు అప్పు తీసుకున్న ఆరుగురిని హతమార్చేందుకు ఫామ్ హౌస్‌కు పిలిపించుకున్నారని, అప్పు ఇస్తానని చెప్పి ప్రాణం తీసేందుకు ప్రయత్నించినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. -
చిన్నారిపై నుంచి వెళ్లిన థార్.. షాకింగ్ వీడియో
-
మనవడు ఇక లేడని తెలిసి కూడా..
2007 మే 18... శుక్రవారం... మండు వేసవి... మిట్ట మధ్యాహ్నం... పవిత్ర ప్రార్థనలు జరుగుతుండగా 1.25 గంటలకు బాంబు పేలింది. ఈ ఘాతుకంలో తొమ్మిది మంది ప్రాణాలు విడువగా... పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. ఆ క్షణం అప్రమత్తమైన పోలీసులు ఎండలో కొన్ని గంటల పాటు డ్యూటీ చేస్తూనే ఉన్నారు. మొఘల్‌పుర ప్రాంతంలోని ఓ ఇంటి యజమాని తన వీధిలో విధుల్లో ఉన్న పోలీసులను చూసి లోపలకు ఆహ్వానించారు. వారికి సపర్యలు చేస్తుండగానే ఫోన్ ద్వారా పిడుగులాంటి వార్త ఆ వృద్ధుడికి చేరింది. అదే పోలీసుల కాల్పుల్లో తన మనుమడు చనిపోవడం... అయినప్పటికీ తన సాంప్రదాయాలను, అతిథి మర్యాదల్నీ మర్చిపోని ఆ పెద్దాయన అన్న మాటల్ని అక్కడ ఉన్న పోలీసులు ఇప్పటికీ తలచుకుంటున్నారు. ‘మక్కా’ పేలుళ్లు జరిగిన 19 ఏళ్లు పూర్తి అయిన నేపథ్యంలో ఆ విషయాలను ఓ ఉన్నతాధికారి ‘సాక్షి ప్రతినిధి’తో పంచుకున్నారు. ఆ వివరాలివి...హైదరాబాద్ పాతబస్తీలోని మక్కా మసీదులో ఉగ్రవాదులు రెండు బాంబుల్ని పెట్టారు. మధ్యాహ్న ప్రార్థనలు జరుగుతుండగా ఓ బాంబు పేలింది. దాన్ని ముష్కరులు అక్కడ ఉన్న మందపాటి సప్టా కింద పెట్టడంతో బ్లాస్ట్ ఇంపాక్ట్ తగ్గింది. ఫలితంగా పెను ప్రాణనష్టం తప్పి ఘటనాస్థలంలోనే ఐదుగురు మరణించగా... మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. అదనంగా మరో 58 మంది క్షతగాత్రులయ్యారు. ఈ విషయం దేశ వ్యాప్తంగా దావానలంలా వ్యాపించింది. మక్కా మసీదులో బాంబు పేలిందని, ఆ ప్రభావానికి మసీదు మొత్తం కూలిపోయిందని పుకార్లు షికారు చేశాయి. దీంతో రాజధానిలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తన మక్కా మసీదు వద్దకు చేరుకున్నారు.అప్పటికే ఉన్నతాధికారులు భారీ భద్రత ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. కొంత సమయంలోనే పెద్ద సంఖ్యలో బలగాలు పాతబస్తీని... నగరాన్ని ఆధీనంలోకి తీసుకున్నాయి. మక్కా మసీదు వద్దకు మరింత మంది ఆందోళన చేస్తూ వస్తుండటంతో పాటు రాళ్ల దాడులు మొదలయ్యాయి. దీంతో లాఠీచార్జ్, టియర్ గ్యాస్, వాటర్ క్యానన్ల ప్రయోగం తప్పలేదు. దీంతో పోలీసులకు–స్థానికులకు–మసీదు వద్దకు వచ్చే వారికి మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. అదే సమయంలో మొఘల్‌పుర వైపు కొందరు ఆందోళనకారులు దూసుకువస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.అక్కడి పరిస్థితులు, వాళ్ల చేతిలో ఉన్న వస్తువుల ఆధారంగా ఏదో జరగరానిది జరుగుతుందనే ఆందోళన అధికారులు, సిబ్బందిలో వ్యక్తమైంది. ఆ ఆందోళనకారులను అదుపు చేస్తుండగా... సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్‌కు నిప్పు పెట్టాలనే ప్రయత్నం వెలుగులోకి వచ్చింది. అదే జరిగితే ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న పోలీసులు, ప్రజలు వందల సంఖ్యలో చనిపోతారని పోలీసులు భయపడ్డారు. పాతబస్తీలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అప్పటికే అనేక మంది తమ ఇళ్లకు చేరారు. అలాంటప్పుడు పెట్రోల్ బంక్‌పై దాడి చేసే ఆందోళనకారులు దానికి నిప్పు పెడితే ఊహించని ఉపద్రవం తప్పదని నిర్థారించిన పోలీసులు అనివార్యంగా కాల్పులు జరపాల్సి వచ్చింది. అలా అల్లర్లను అదుపు చేయడానికి జరిగిన పోలీసు కాల్పుల్లో మరో ఐదుగురు మరణించారు. అదే రోజు మక్కా మసీదు నుంచి పేలకుండా ఉన్న మరో బాంబునూ స్వాధీనం చేసుకున్నారు.అలా అల్లర్లు, ఉద్రిక్తతలు, రాళ్ల దాడులు, లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం, వాటర్ క్యానన్ల వినియోగం, నిఘా, గస్తీ, పికెట్లు... ఇలా కొన్ని గంటల పాటు సిబ్బంది, అధికారులు అంతా రోడ్లకు పరిమితం అయ్యారు. వీరికి కనీసం మంచి నీరు అందించడానికి ఉన్నతాధికారులకు సమయం చిక్కలేదు. అదే సందర్బంలో అన్ని దుకాణాలు మూతపడటంతో ఆహారం, టీ విషయం వదిలేస్తే.. మంచినీళ్లు దొరకడం కూడా కష్టసాధ్యమైంది. ఎవరికి వాళ్లు తమ ఇళ్లల్లో తలుపులు బిగించుకుని ఉండటంతో పాటు తీవ్ర భయాందోళనల్లో ఉన్న వాళ్లు కనీసం తలుపు తట్టినా తీసే పరిస్థితులు లేవు. ఇలా దాదాపు నాలుగైదు గంటల గడిచాయి.అప్పుడే మరో అంశం తెరపైకి వచ్చింది. అల్లర్లు, ఆందోళనల తర్వాత చాలా మంది యువకుల, ఆందోళనకారుల ఆచూకీ తెలియలేదు. పేలుడు, కాల్పుల్లో చనిపోయిన వారిని, వారి కుటుంబీకుల గుర్తింపు పూర్తి కాలేదు. ఇవన్నీ జరిగితేనే మృతదేహాల పోస్టుమార్టం పక్రియ, కేసు దర్యాప్తు తదితరాలు వేగం పుంజుకుంటాయి. ఇన్ని ఆలోచనల, ఆచరణల మధ్య హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులతో కూడిన ఓ బృందం మొఘల్‌పురలోని ఓ ఇంటి వద్ద బందోబస్తు విధుల్లో ఉన్నారు. ఆ సమీపంలోని ఇంటి యజమాని మధ్యాహ్నం నుంచి వీరిని గమనిస్తూ... కనీసం మంచినీళ్లు కూడా తాగలేదనే విషయం గుర్తించారు. అప్పటికి పరిస్థితులు కొంత వరకు అదుపులోకి రావడంతో... వారిని తన ఇంట్లోకి ఆహ్వానించాలని భావించారు. అతికష్టమ్మీద పోలీసుల వద్దకు వచ్చిన ఆ పెద్దాయన తన ఇంటికి వచ్చి సేదతీరాలని కోరారు.ఆ వృద్ధుడి ఇంటికి వెళ్లే విషయంలో కొద్దిసేపు ఆలోచించిన పోలీసు బృందం ఎట్టకేలకు అంగీకరించింది. అల్లర్లు అదుపులోకి రావడంతో కాస్త మంచినీళ్లు తాగి, కాలకృత్యాలు తీర్చుకోవడానికైనా వెళ్లిరావడం ఉత్తమమని భావించారు. దీంతో ఆ పోలీసు బృందం వృద్ధుడి వెంట ఆయన ఇంటికి వెళ్లింది. కుశల ప్రశ్నల, కాలకృత్యాల తర్వాత అంతా హాలులో కూర్చున్నారు. పోలీసులకు మంచినీళ్లు అందించిన ఆ పెద్దాయని... టీ, బిస్కెట్లు సిద్ధం చేస్తున్నారు. హఠాత్తుగా ఆయన జేబులో ఉన్న సెల్‌ఫోన్ మోగింది. ఆ కాల్ మాట్లాడిన పెద్దాయన ముఖంలో రంగులు మారిపోయాయి. కంఠం ఒణుకుతుండగా... కన్నీళ్లు ఉబికి వచ్చాయి. ‘ఆ రోజు మధ్యాహ్నం మొఘల్‌పుర పెట్రోల్ బంక్ వద్ద పోలీసులు జరిపిన కాల్పుల్లో చనిపోయిన వారిలో మీ మనుమడు కూడా ఉన్నాడు’ అనేది ఆ కాల్ సారాంశం. మృతదేహం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో ఉందని, కుటుంబీకులు వస్తే ఇతర ఫార్మాలిటీస్ పూర్తి చేయాలని అవతలి నుంచి పోలీసులు కోరారు.ఈ విషయం తెలియడంతోనే అక్కడ ఉన్న పోలీసుల కాళ్ల కింద భూమి కంపించినట్లు అయింది. మధ్యాహ్నం నుంచి తమను ఎవరూ పట్టించుకోకపోయినా... ఈ పెద్దాయన మాత్రం నేరుగా వచ్చి ఇంటికి ఆహ్వానించారు. ఆప్యాయంగా పలకరిస్తూ సంభాషించారు. ఇప్పుడు పోలీసుల తూటాలకు మనుమడిని కోల్పోయిన వార్త విని ఎలా స్పందిస్తారో..? అనే సందేహాలు అందరి మదిలో మెదిలాయి. వీలున్నంత త్వరలో అక్కడ నుంచి బయటపడాలని అంతా భావించారు. అప్పుడే నోరు విప్పిన పెద్దాయన ‘మీరు ఎందుకు ఫీల్ అవుతారు? ఏదీ ఎవరూ కావాలని చేయరుగా? అల్లర్లు అదుపు చేయడానికి పోలీసులు కాల్పులు జరిపారు... వాడి ఆయువు తీరి పోవడంతో దేవుడి దగ్గరకు వెళ్లాడు’ అంటూ కన్నీళ్లు తుడుచుకున్నారు.అంతటిలో ఆగని ఆయన ‘ఇంటి వచ్చిన అతిథిని గౌరవించి, వారికి సపర్యలు చేయడం మా సంస్కృతి, సాంప్రదాయం. మీరు కచ్చితంగా టీ, బిస్కెట్లు తీసుకున్నాకే మా గుమ్మం దాటాలి’ అని స్పష్టం చేశారు. తన ఇంటిలో ఉన్న పోలీసులు తిరిగివెళ్లిపోయే వరకు అక్కడే ఉన్న ఆ పెద్దాయని ఆ తర్వాతే ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి పరిగెత్తారు. ఆ ఉదంతం తర్వాత ఇప్పటి వరకు ఆ పెద్దాయన సహయం కోరుతూనో... తనకు కృతజ్ఞత చూపించాలనో ఆశించలేదు... పోలీసుల వద్దకు వెళ్లలేదు.మక్కా మసీదులో పేలుడు, పేలని బాంబులపై స్థానిక హుస్సేని ఆలం పోలీసుస్టేషన్లో నమోదైన కేసులు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సెల్‌కు (ఎస్ఐసీ) బదిలీ అయ్యాయి. అక్కడ నుంచి సీబీఐ చేతుల మీదుగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దగ్గరకు వెళ్లాయి. 2008 అక్టోబర్ 28న మహారాష్ట్రలోని మాలేగావ్ పేలుడు కేసులో ఏటీఎస్ అధికారులు అభినవ్ భారత్‌కు చెందిన సాథ్వీ ప్రజ్ఞాసింగ్, శ్రీకాంత్ పురోహిత్‌లను అరెస్టు చేశారు. వీరి విచారణలో అజ్మీర్ పేలుడుకు బాధ్యులైన దేవేంద్ర, లోకేష్, రామ్‌చంద్ర, సందీప్‌ల పేర్లు వెలుగులోకి వచ్చాయి. రాజస్థాన్ ఏటీఎస్ అధికారులు దేవేంద్రగుప్తా, లోకేష్ శర్మలను 2010 ఏప్రిల్ 28న అరెస్టు చేశారు. వీరి విచారణలో ‘మక్కా’ పనీ తమదే అని అంగీకరించడంతో సీబీఐ అధికారులు రంగంలోకి దిగి రాజస్థాన్ వెళ్లారు. సీబీఐ అధికారులు 2010 జూన్ 11న దేవేంద్రగుప్తా, లోకేష్ శర్మలపై నాంపల్లి కోర్టు నుంచి పీటీ వారెంట్స్ పొందారు. వీరిని రాజస్థాన్ నుంచి హైదరాబాద్ తీసుకురావడానికి ప్రత్యేక బృందంతో అక్కడకు వెళ్లి 18న హైదరాబాద్ తీసుకువచ్చారు. న్యాయస్థానం అనుమతితో తమ కస్టడీలోకి తీసుకుని విచారించిన నేపథ్యంలో స్వామి అశిమానంద పేరు వెలుగులోకి వచ్చింది. మారు పేరుతో ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో రహస్య జీవితం గడుపుతున్న స్వామి అశిమానందను సీబీఐ అధికారులు 2010 నవంబరు 19న అరెస్టు చేశారు. ఈ కేసులో ఇతర నిందితులైన రామ్‌చంద్ర, సందీప్‌లు ఇంకా పరారీలోనే ఉన్నారు. కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ నిర్ణయం మేరకు ‘మక్కా’ కేసు దర్యాప్తు సీబీఐ నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు 2011 ఏప్రిల్ 7న బదిలీ అయింది. పరారీలో ఉన్న రామ్‌చంద్ర, సందీప్‌లపై రూ.20 లక్షల రివార్డు ప్రకటించిన ఎన్ఐఏ గాలించింది. ‘మక్కా’లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు 2011 మే 16న మరో సప్లమెంటరీ చార్జ్‌షీట్ దాఖలు చేశారు. అనేక మలుపులు తిరిగిన ఈ కేసులు 2018 ఏప్రిల్‌లో వీగిపోయాయి. నిందితులను దోషులుగా నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైంది.– శ్రీరంగం కామేష్, క్రైమ్ రిపోర్టర్, హైదరాబాద్ -
హైదరాబాద్ : మురిసిన ముద్దుగుమ్మలు (ఫొటోలు)
-
హైకోర్టు న్యాయమూర్తిపై అసత్య ప్రచారం.. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిపై సామాజిక మాధ్యమాల్లో కల్పిత వార్తలు ప్రచారం చేసిన ఘటనపై చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) బి.ఎస్. చిరంజీవి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు సమాచారం.ఫోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరధ్‌ను రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో కల్పిత వార్తలు ప్రచారం జరిగాయి. ఈ వార్తలు న్యాయమూర్తులపై ప్రభావం చూపే ప్రయత్నంగా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. కల్పిత వార్తలు ప్రచారం కావడంతో న్యాయమూర్తులు, న్యాయవాదులు, ప్రజల మధ్య విస్తృత చర్చకు దారి తీసింది. ఇది న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రమాదం ఉందని ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నారు.చార్మినార్ పోలీసులు ఐటీ యాక్ట్‌తో పాటు భారత న్యాయసంహిత (BNS)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ 353(1)(c), బీఎన్ఎస్ 353(2), బీఎన్ఎస్ 267 సెక్షన్ల కింద ఎస్ఐఆర్ (SIR) నమోదు చేసి, కేసును దర్యాప్తు నిమిత్తం హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగానికి బదిలీ చేశారు. -
కేంద్రమంత్రి బండి సంజయ్‌ను బర్తరఫ్ చేయాలి : కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: బండి భగీరథ్ పోక్సో కేసుపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. బండి భగీరథ్ కేసులో నిష్పాక్షిక విచారణ చేయాలి. కేంద్రమంత్రి బండి సంజయ్‌ను బర్తరఫ్ చేయాలి. లేదంటే విచారణ పారదర్శకంగా జరిగే పరిస్థితి లేదు. తప్పు చేసిన కొడుకును తొమ్మిది రోజులు దాచిపెట్టారు. బేటీ బచావో అన్నది నినాదాలకు సరిపెడతారా మోదీ గారూ. కేంద్ర మంత్రి కొడుకుపై లుక్ఔట్ నోటీసు ఇవ్వడం తొలిసారి. బాధిత కుటుంబాన్ని బెదిరించి, ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తీవ్రమైన కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు’అని వ్యాఖ్యానించారు. -
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లులో అగ్నిప్రమాదం
నల్లగొండ: వీర్లపాలెంలో యాదాద్రి థర్మర్ పవర్ ప్లాంటులో అగ్ని ప్రమాదం జరిగింది. యూనిట్-3లో బాయిలర్ పేలడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ప్రమాదంపై అప్రమత్తమైన ప్లాంట్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చింది. ప్రమాదంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనాస్థలంలో దట్టమైన పొగ అలుముకుంది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతుండడంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు -
‘మక్కా’ పేలుళ్లు.. ఇంట్లో పోలీసులు.. మనవడి మృతి అంటూ ఫోన్.. పెద్దాయన ఏం చేశాడు..
‘మక్కా’ పేలుళ్లు జరిగి రేపటికి 19 ఏళ్లు పూర్తి అవుతుంది. 2007 మే 18.. శుక్రవారం.. మండు వేసవి... మిట్ట మధ్యాహ్నం... పవిత్ర ప్రార్థనలు జరుగుతుండగా 1.25 గంటలకు బాంబు పేలింది. ఈ ఘాతుకంలో తొమ్మిది మంది ప్రాణాలు విడువగా... పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. కొంత సమయంలోనే పెద్ద సంఖ్యలో బలగాలు పాతబస్తీని... నగరాన్ని ఆధీనంలోకి తీసుకున్నాయి. మక్కా మసీదు వద్దకు మరింత మంది ఆందోళన చేస్తూ వస్తుండటంతో పాటు రాళ్ల దాడులు మొదలయ్యాయి. దీంతో లాఠీచార్జ్, టియర్ గ్యాస్, వాటర్ క్యానన్ల ప్రయోగం తప్పలేదు.అల్లర్లు, ఆందోళనల తర్వాత చాలా మంది యువకుల, ఆందోళనకారుల ఆచూకీ తెలియలేదు. పేలుడు, కాల్పుల్లో చనిపోయిన వారిని, వారి కుటుంబీకుల గుర్తింపు పూర్తి కాలేదు. ఇవన్నీ జరిగితేనే మృతదేహాల పోస్టుమార్టం పక్రియ, కేసు దర్యాప్తు తదితరాలు వేగం పుంజుకుంటాయి. ఇన్ని ఆలోచనల, ఆచరణల మధ్య హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులతో కూడిన ఓ బృందం మొఘల్‌పురలోని ఓ ఇంటి వద్ద బందోబస్తు విధుల్లో ఉన్నారు. ఆ సమీపంలోని ఇంటి యజమాని మధ్యాహ్నం నుంచి వీరిని గమనిస్తూ... కనీసం మంచినీళ్లు కూడా తాగలేదనే విషయం గుర్తించారు. అప్పటికి పరిస్థితులు కొంత వరకు అదుపులోకి రావడంతో... వారిని తన ఇంట్లోకి ఆహ్వానించాలని భావించారు. అతికష్టమ్మీద పోలీసుల వద్దకు వచ్చిన ఆ పెద్దాయన తన ఇంటికి వచ్చి సేదతీరాలని కోరారు.అలసిపోయిన ఉన్న పోలీసులు మరో ఆలోచనే లేకుండా.. వెంటనే అతడి ఇంటికి చేరుకున్నారు. అనంతరం, వారికి సపర్యలు చేస్తుండగానే ఫోన్ ద్వారా పిడుగులాంటి వార్త ఆ వృద్ధుడికి చేరింది. పోలీసుల కాల్పుల్లో అతడి మనవడు చనిపోయాడు అని.. ఆ తర్వాత ఏం జరిగింది?.. మనవడి మృతి పట్ల పెద్దాయన ఎలా స్పందించాడు. పోలీసులు ఎలా రియాక్ట్ అయ్యారు.. సదరు వృద్దుడు పోలీసులను ఎలాంటి సాయం కోరాడు.. తదితర విషయాలపై సాక్షి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ.. రేపు ఉదయం(సోమవారం) మీ కోసం.. -
చాయ్ గరం.. బిర్యానీ పిరం..
హైదరాబాద్ అనగానే ఎవరికైనా గుర్తొచ్చే దమ్ బిర్యానీ, ఇరానీ చాయ్ మొదలు అన్నిరకాల ఆహార పదార్థాలపై గ్యాస్ ధర పెంపు ప్రభావం పడింది. మొన్నటి వరకు రూ.220 నుంచి రూ.300 వరకు ఉన్న ప్లేట్ చికెన్, మటన్ బిర్యానీ ధర ఇప్పుడు రూ.270 నుంచి రూ.380కి చేరింది. పాతబస్తీలోని ఒక ప్రముఖ హోటల్లో మటన్ బిర్యానీ ప్లేట్ రూ.320 నుంచి ప్రస్తుతం రూ.360కి పెరిగింది. గచ్చిబౌలిలోని ఒక హోటల్లో మొన్నటివరకు రూ.340 ఉండగా రూ.380కు, ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని ఒక ప్రముఖ రెస్టారెంట్లో రూ. 320 నుంచి 360 పెరిగింది. ఇక నగర ప్రజలు ఇష్టంగా తాగే ఇరానీ చాయ్ రూ.12 నుంచి రూ.20కి ఎగబాకింది.పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో చమురు సంక్షోభం గ్యాస్ దిగుమతులపై ప్రభావం చూపించడం, వాణిజ్య సిలిండర్ ధర గణనీయంగా పెరగడంతో ఫుడ్ ఇండస్ట్రీపై పిడుగు పడినట్టయ్యింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో టీ స్టాళ్లు మొదలుకుని కర్రీ పాయింట్లు, టిఫిన్ బండ్లు, చిన్న హోటళ్లు, స్టార్ హోటళ్ల వరకు అన్నిట్లోనూ ఆహార పదార్థాల ధరలు పెరిగాయి. ఎక్కడ చూసినా ‘ధరలు పెంచాం – సహకరించండి’అనే బోర్డులు కనిపిస్తున్నాయి. టీ నుంచి బిర్యానీ వరకు అన్నింటిపైనా సగటున 20% నుంచి 40% వరకు అదనంగా ధరలు పెరిగాయి. నగరంలోని ప్రతి నలుగురిలో ఒకరు బయటి ఆహారంపైనే ఆధారపడుతున్నారనే అంచనాల నేపథ్యంలో పెరిగిన ధరలు వారికి భారంగా మారాయి. 30 శాతం జనానికి హోటలే దిక్కు! నగర జనాభా 1.55 కోట్లు దాటింది. అందులో సుమారు 30 శాతం అంటే సుమారు 46.50 లక్షల మంది నిత్యం బయటి ఆహారంపైనే ఆధారపడి ఉంటారన్నది అంచనా. కాగా తాజా గ్యాస్ ధర ప్రభావంతో ఆహార ప్రియులపై రోజుకు సగటున రూ.40 నుంచి రూ.60 అదనపు భారం పడుతోంది. ఈ లెక్కన నగరంపై రోజుకు సగటున రూ.20 కోట్ల వరకు అదనపు భారం పడుతుండగా, నెలకు రూ.600 కోట్లు దాటిపోతోంది. ఇంట్లో వంట సదుపాయం ఉన్నప్పటికీ టీ, టిఫిన్లు, భోజనాల కోసం 20.25 లక్షల మంది హోటళ్లకు వెళుతుంటారని అంచనా. మిగిలిన 26.25 లక్షల మంది విద్య, శిక్షణ, ఉపాధి, వైద్యం, ఇతరత్రా పనుల కోసం నగరానికి వచ్చి హాస్టళ్లు, అద్దె రూమ్‌లు, లాడ్జీల్లో ఉంటూ అనివార్యంగా బయటి భోజనంపైనే ఆధారపడుతుంటారు. నలుగురితో కూడిన ఒక కుటుంబం హోటల్‌కు వెళ్లి భోజనం చేసి రావాలంటే రూ. 500 నుంచి రూ.1,000 వరకు అదనంగా బిల్లు అవుతున్నట్టు తెలుస్తోంది. కడుపు నింపని భోజనం! నగరంలోని అమీర్‌పేట్, అశోక్‌నగర్, దిల్సుఖ్నగర్ మాదాపూర్ వంటి ప్రాంతాల్లో ఉండే విద్యార్థులు, నిరుద్యోగులు ఐటీ ఉద్యోగులు నూటికి నూరు శాతం మెస్‌లు, కర్రీ పాయింట్లపైనే ఆధారపడుతుంటారు. ప్రస్తుతం వీరి నెలవారీ మెస్ చార్జీలు కూడా పెరిగాయి. గ్యాస్ ధర పెంపుతో అమాంతం ధరలు పెంచిన మెస్‌లు.. మెనూ మాత్రం తగ్గించేశాయి. పప్పులో పప్పు ఉండటం లేదని, చారులో రుచి కరువయ్యిందని, పరిమాణం తగ్గిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక హోటళ్లలో కూడా మొన్నటివరకు ఇద్దరికి సరిపోయే ’ఫుల్ బిర్యానీ’ఇప్పుడు ఒకరికి కొంచెం ఎక్కువ, ఇద్దరికి తక్కువ అన్నట్లుగా మారిపోయిందని అంటున్నారు. కర్రీ..వర్రీ నగరంలో కర్రీ పాయింట్లకు యమ గిరాకీ అన్న సంగతి తెలిసిందే. కీలక ప్రాంతాల్లో గల్లీకో కర్రీ పాయింట్ ఉంటోంది. ప్రస్తుతం నాన్ వెజ్, వెజ్..అన్నిరకాల కూరల ధరలూ పెరిగాయి. ప్రతి కర్రీపై రూ.10 నుంచి రూ. 20 వరకు పెరుగుదల చోటు చేసుకుంది. కర్రీ పాయింట్లలో ఒక కప్పు కూర ధర రూ. 30 నుంచి రూ. 50కి చేరడంతో, రెండు కూరలు కొనేవారు ఇప్పుడు ఒక్కదాంతోనే సర్దుకుపోతున్నారు. క్యాటరింగ్ రంగానిదీ ఇదే పరిస్థితి. కొత్తగా వచ్చే ఆర్డర్లపై ప్లేటుకు రూ.30 నుంచి రూ.50 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు.వసతి భారం హాస్టళ్లపై వాణిజ్య గ్యాస్ ధరల పెరుగుదల తీవ్ర ప్రభావం చూపుతోంది. సుమారు 12 వేల హాస్టళ్లలో ఉంటున్న 11 లక్షల మంది విద్యార్థులు, ఉద్యోగులు దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ సిలిండర్ల కొరత, అధిక ధరలతో పాటు నిత్యావసరాల ధరలు కూడా పెరగడంతో హాస్టళ్ల నిర్వాహకులు భారీ నష్టాల్లో కూరుకుపోయారు. ఈ అదనపు భారాన్ని తట్టుకోలేక ఫీజులు పెంచడంతో పాటు మెనూలో కొంత కోతలు పెడుతున్నారు. -
ఉప్పల్ చౌరస్తా మూసివేత.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇలా..
ఉప్పల్: అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ చౌరస్తాను ఆదివారం నుంచి తాత్కాలికంగా మూసివేయనున్నారు. ఉప్పల్ విద్యుత్ జంక్షన్ ప్రాంతంలో ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్ నిర్మాణ పనుల్లో భాగంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం నుంచి ఉప్పల్ రింగ్ రోడ్ మీదుగా వరంగల్ వైపు వెళ్లే అన్ని రకాల వాహనాలను దారి మళ్లిస్తున్నా మని సూచించారు. జీహెచ్ఎంసీ కార్యాలయం పక్కనున్న వరంగల్ బస్టాప్‌ను ఇప్పటికే ఉప్పల్ నల్ల చెరువు కట్ట వద్దకు మార్చిన విషయం విదితమే. ప్రత్యామ్నాయ మార్గాలు ఇలా.. హబ్సిగూడ నుంచి వరంగల్ వైపు వెళ్లే భారీ వాహనాలు హబ్సిగూడ చౌరస్తా నుంచి నాచారం, మల్లాపూర్, ఐవోసీ, చెంగిచర్ల మీదుగా వరంగల్ రహదారికి చేరుకోవాల్సి ఉంటుంది. చిన్న వాహనాలు ఉప్పల్ ఇందిరాగాంధీ పార్కునుంచి లిటిల్ ఫ్లవర్ వెనక దారి నుంచి వరంగల్ రహదారికి చేరుకోవచ్చు. వరంగల్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలు ఉప్పల్ ఏషియన్ సినీ థియేటర్ ఎదుటి హెచ్ఎండీఏ రోడ్డు ద్వారా నాగోల్ రోడ్డుకు కలుపుతారు. ద్విచక్ర వాహనదారులు నాగోల్ మెట్రో పిల్లర్లు 812, 813 నుంచి ఉప్పల్, సికింద్రాబాద్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. అలాగే, భారీ వాహనాలు నాగోల్ బ్రిడ్జి కింద నుంచి యూ టర్న్ చేసుకుని తిరిగి ఉప్పల్ వైపు రావాలి. వరంగల్ వైపు వెళ్లేవారు హెచ్ఎండీఏ లే అవుట్ నుంచి వరంగల్ హైవేకు చేరుకోవాలి. హైదరాబాద్‌కు వచ్చే వరంగల్ బస్సులు, లారీలు, భారీ వాహనాలన్నీ ఓఆర్ఆర్ మీదుగా హయత్‌నగర్ మీదుగా నగరానికి చేరుకోవాల్సి ఉంటుంది. -
జీసీసీ హబ్‌గా హైదరాబాద్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కృత్రిమ మేథ హబ్‌గా, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకి (జీసీసీ) హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారుతోందని ఏఐ ఆధారిత క్వాలిటీ ఇంజినీరింగ్ సేవల సంస్థ క్వాలిజీల్ వెల్లడించింది. నగరంలో 400కు పైగా జీసీసీల్లో 3,00,000 మంది పైచిలుకు ప్రొఫెషనల్స్ ఉన్నారని వివరించింది. వీరితో పాటు దాదాపు పది లక్షల మంది ఐటీ, ఐటీఈఎస్ ప్రొఫెషనల్స్ ఉన్నట్లు ఎవరెస్ట్ గ్రూప్‌తో కలిసి రూపొందించిన శ్వేతపత్రంలో తెలిపింది. 2024లో 64.6 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత జీసీసీ పరిశ్రమ 2030 నాటికి 105 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకునే దిశగా వేగంగా ముందుకు సాగుతోందని వివరించింది. 58 శాతం సెంటర్లు ఇప్పటికే ఏజెంటిక్ ఏఐలో ఇన్వెస్ట్ చేస్తున్నాయని పేర్కొంది. క్వాలిజీల్కి స్వయంగా హైదరాబాద్‌లో 3 జీసీసీలు ఉండగా, వీటిలో 850 మందికి పైగా ఇంజినీర్లు పని చేస్తున్నారు. 2028 నాటికి 100 మిలియన్ డాలర్ల ఆదాయ లక్ష్యం నిర్దేశించుకుంది. -
పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్
హైదరాబాద్: పేట్బషీరాబాద్లో నమోదైన పోక్సో కేసులో బండి భగీరథ్.. పోలీసుల ఎదుట లొంగిపోయారు. అడ్వకేట్ల సమక్షంలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈరోజు(శనివారం, మే 16వ తేదీ) రాత్రి లాయర్ల సమక్షంలో బండి భగీరథ్‌ను కుటుంబ సభ్యులే పోలీసులకు అప్పగించారు. కాసేపట్లో బండి భగీరథ్‌ను జడ్జి ముందు హాజరు పరిచే అవకాశం ఉంది. పోలీసులకు అప్పగించాం: బండి సంజయ్‘చట్టంపైన గౌరవంతోనే మా అబ్బాయిని పోలీసులకు అప్పగించా. ఏ తప్పు చేయలేదని మా అబ్బాయి చెబుతున్నాడు. ఆధారాలను చూపేందుకే పోలీసులకు అప్పగింతలో జాప్యం జరిగింది’ అని పేర్కొన్నారు బండి సంజయ్.తనకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని, అందుచేత ఏ తప్పూ చేయని తన కుమారుడు పోలీసులకు లొంగిపోయాడన్నారు బండి సంజయ్. చట్టం ముందు అంతా సమానమేనని, ప్రతీ ఒక్కరూ చట్టాన్ని గౌరవించాల్సిందేనని బండి సంజయ్ స్పష్టం చేశారు. బండి భగీరథ్‌ను అరెస్ట్ చేశాం: సీపీబండి భగీరథ్‌ను అరెస్ట్ చేశామని సైబరాబాద్ సీపీ రమేష్‌రెడ్డి స్పష్టం చేశారు. భగీరథ్‌ను గాలించే క్రమంలో అరెస్ట్ చేశామన్నారు. నార్సింగ్‌లోని పోలీస్ అకాడమీ వద్ద భగీరథ్‌ను అరెస్ట్ చేశామన్నారు. అటు తర్వాత పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నామన్నారు సీపీఇదిలా ఉంచితే, బండి భగీరథ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మేడ్చల్ కోర్టులో బాధితురాలు.. మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చింది. బాధితురాలి తల్లిదండ్రుల స్టేట్మెంట్ కూడా కోర్టు రికార్డ్ చేసింది. ఇప్పటికే రెండుసార్లు స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు.కేసు తీవ్రత దృష్ట్యా స్వయంగా రంగంలోకి దిగిన న్యాయమూర్తి.. బాలిక స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. బాలిక తల్లిదండ్రుల నుంచి కూడా విడివిడిగా జడ్జి.. స్టేట్మెంట్ తీసుకున్నారు. బాధిత కుటుంబం నుంచి న్యాయస్థానం కీలక వివరాలు సేకరించింది. మూడోసారి స్టేట్మెంట్ ప్రక్రియ.. కేసు దర్యాప్తులో అత్యంత కీలకంగా మారింది. న్యాయమూర్తి సేకరించిన స్టేట్మెంట్ ఆధారంగా తదుపరి విచారణ మరింత వేగవంతం కానుంది. -
ఇల్లు కొనేందుకు ఇది మంచి ఛాన్స్!
సాక్షి, సిటీబ్యూరో: మార్కెట్ పడ్డప్పుడు కొంటేనే తక్కువ ధరకు వస్తుంది.. షేర్ మార్కెట్లో పెట్టుబడులకు వర్తించే ఈ సూత్రం రియల్టీకి వర్కవుట్ అవుతుంది. మార్కెట్ బాగలేనప్పుడు గృహ కొనుగోలుదారులకు మంచి సమయం. బిల్డర్లతో బేరసారాలకు అవకాశం ఉంటుంది. వారు అందించే ఆఫర్లు అందుకునే అవకాశం ఉంటుంది.హైదరాబాద్ స్థిరాస్తి మార్కెట్లో రెండు రకాల కస్టమర్లు ఉన్నారు. ప్రవాసులు, హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్(హెచ్ఎన్ఐ), పెట్టుబడిదారులైన మొదటి రకంలో వీళ్లంతా పెద్దస్థాయిలో భూములు, అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్లను కొనుగోళ్లు చేస్తుంటారు. ఇక, రెండో రకం రిటైల్ కస్టమర్లు. వీళ్లు సొంతంగా ఉండేందుకు గృహాలను కొనుగోలు చేస్తుంటారు.మొదటి రకం కొనుగోలుదారులేమో మార్కెట్ బాగాలేనప్పుడు కొనుగోలు చేసి, బాగున్నప్పుడు ఎక్కువ ధరకు విక్రయించేసుకుంటారు. రెండో రకమేమో ధరలు మరింత తగ్గుతాయేమోనని వేచి చూస్తారు. ధరలు పెరిగిన తర్వాత ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తుంటారు. వాస్తవానికి స్థిరాస్తి మార్కెట్లో లాభాలు ఆర్జించాలంటే మొదటి రకాన్ని ఫాలో అవడమే కరెక్ట్. అందుకే ప్రస్తుత సందిగ్ధ వాతావరణంలో గృహాలను కొనుగోలు చేయడమే మంచి నిర్ణయం. ఇలాంటి ప్రతికూల మార్కెట్లోనే ధర, వసతుల విషయంలో బిల్డర్లతో బేరసారాలకు అవకాశాలుంటాయి.ప్రభుత్వం ప్రోత్సహించాలిఏ పట్టణ ప్రాంతం అభివృద్ధికైనా కావాల్సింది విద్యా, వైద్యం, వినోదం, ఉద్యోగ అవకాశాలు. నగరవాసుల నాణ్యమైన జీవనాన్ని నిర్ణయించేవి ఈ నాలుగే. వీటిల్లో భాగ్యనగరం కేంద్ర బిందువనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెడికల్ టూరిజం, ఎడ్యుకేషనల్ హబ్, ఎంటర్టైన్మెంట్ జోన్లకు పెట్టింది పేరైన హైదరాబాద్‌లో ఐటీ, ఫార్మా, తయారీ రంగాలతో అపారమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలున్నాయి.ఇతర నగరాలతో పోలిస్తే భాగ్యనగరానికి ఉన్న మరో అద్భుతమైన అవకాశం మెరుగైన మౌలిక వసతులున్న అపారమైన భూముల లభ్యత, ఔటర్, మెట్రోలతో కనెక్టివిటీ. దీంతో నగర రియల్టీ మార్కెట్‌కు ఎలాంటి ఢోకా ఉండదని నిపుణులు చెబుతున్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధిపై నిరంతరం దృష్టి పెడుతూనే పెట్టుబడిదారులకు మరింత సానుకూల వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాలని స్థిరాస్తి సంఘాలు సూచిస్తున్నాయి.పారిశ్రామిక పాలసీ, రీజినల్ రింగ్ రోడ్డు, మూసీ సుందరీకరణ, ఫార్మా క్లస్టర్లు, సెమీ కండక్టర్ల పాలసీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ వంటి ఏదైనా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని వాటి అమలుకు చర్యలు చేపట్టాలి. ఈ విషయాన్ని ప్రజలకు చేరవేసి ఒక సానుకూల వాతావరణాన్ని రాష్ట్రంలో తీసుకురావాలి. ఆరోగ్యం, పర్యాటక రంగాలకు విశేష ప్రాధాన్యం ఇస్తూ ప్రోత్సహించాలి. ప్రభుత్వం దార్శనికతతో ప్రణాళికలు రూపొందిస్తే ఎన్నెన్నో అద్భుతాలు సృష్టించవచ్చు. ఇవన్నీ రియల్టీ రంగానికి ఇంధనంగా ఉపయోగపడతాయి.కొత్త ప్రాజెక్ట్‌లపై పునరాలోచనప్రతీ ఆరేడేళ్లకు రియల్టీకి విరామ దశ సాధారణమే. తెలంగాణ ఉద్యమం, సత్యం స్కామ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లెమాన్ బ్రదర్స్ కుప్పకూలడం వంటి వాటితో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. దీంతో 2007లో మొదలైన హైదరాబాద్ స్థిరాస్తి రంగం పతనం.. 2014 వరకూ కొనసాగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడాది కాలం వరకూ మార్కెట్ ఒడిదుడుకులకు లోనైంది.కొత్త రాష్ట్రం, ప్రభుత్వ విధానాలు, కార్యచరణలపై అస్పష్టత వంటి కారణాలు అనేకం. ఆ తర్వాత 2015 ప్రారంభంలో మొదలైన రియల్ బూమ్ 2022 వరకూ కొనసాగింది. ఈ మధ్యకాలంలో మార్కెట్లో ధరలు నాలుగైదు రెట్లు పెరిగాయి. 2023లో ఎన్నికలతో స్థిరాస్తి రంగంలో మొదలైన సందిగ్ధత ఇప్పటికీ కొనసాగుతోంది.ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి, లేఆఫ్‌లు, అపరిమిత సరఫరా, ఎఫ్ఎస్ఐపై ఆంక్షలు లేకపోవడం, అధిక ధరలు, వడ్డీ రేట్లు, ప్రభుత్వ ప్రతికూల విధానాల వంటి కారణంగా వచ్చే మూడేళ్ల వరకూ విరామ దశలోనే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే రియల్టీ రంగంలో ఈ విరామం మంచిదే అంటున్నారు. బిల్డర్లతో రాయితీలు, ఆఫర్లు వంటి బేరసారాలకు అవకాశం ఉంటుందంటున్నారు.మార్కెట్లో బోలెడంత ఇన్వెంటరీవిక్రయాలు అంతంత మాత్రంగా ఉన్న ప్రస్తుత రోజుల్లో కొత్త ప్రాజెక్ట్‌లు చేపట్టేందుకు బిల్డర్లు పునరాలోచిస్తున్నారు. భవిష్యత్తు అవసరాల కోసం భూములను కొని పెట్టుకోవడం, నిర్మాణ అనుమతులు తీసుకోవడం చేస్తున్నారే తప్ప ప్రాజెక్ట్ లాంచింగ్ చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఊహాజనిత మార్కెట్లో భూముల ధరలు పెరుగుతాయే తప్ప అపార్ట్మెంట్ల చదరపు అడుగు రేట్లు పెరగవు.ఎందుకంటే ఇప్పటికే మార్కెట్లో బోలెడంత ఇన్వెంటరీ ఉంది. నిర్మాణంలో ఉన్న, రెడీగా ఉన్న ఇన్వెంటరీ పోతేగానీ కొత్త యూనిట్లకు అవకాశం ఉండదు. అలాగే ప్రీలాంచ్ ప్రాజెక్ట్‌లు, డెవలపర్లు కూడా భూముల రేట్లు పెరగడానికి కారణమే. ఎప్పుడైనా సరే స్థిరాస్తి ధరలు స్థిరంగా పెరగాలే తప్ప అమాంతం పెరగకూడదు. రాత్రికి రాత్రే పెరిగే ధరలు గాలిబుడగ వంటివే. ఎప్పటికైనా పడిపోవాల్సిందే.. లేకపోతే తుది కొనుగోలుదారుల మీద అదనపు భారం తప్పదు. -
హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. మెహదీపట్నంలో భారీగా ఎండీఎంఏ డ్రగ్స్‌ను పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు శుభమ్ సహా 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 137 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌తో పాటు వోల్వో కారు, ప్యాకింగ్ మెటీరియల్, 9 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్స్ టాస్క్‌ఫోర్స్, మెహదీపట్నం పోలీసులు పక్కా సమాచారం ఆధారంగా ఆపరేషన్ నిర్వహించారునిందితుల్లో శుభమ్ కుమార్ మిశ్రా ఏ1 కాగా, A2 సోహమ్ నాయక్, A3 కలంగి రాజేష్, A4 ముంతున్ కుమార్ మరియు A8 అబ్దుల్ షాబాజ్ బాలానగర్ ప్రాంతానికి చెందినవారు. మిగిలిన వినియోగదారులు హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు. ప్రధాన నిందితుడు శుభమ్ కుమార్ మిశ్రాకు, అదే ప్రాంతంలో నివసించే బుసా సాయి నిఖిల్ యాదవ్ అలియాస్ సాయి చిన్ననాటి స్నేహితుడు. వీరిద్దరికీ గంజాయి, ఎండీఎంఏ తీసుకునే అలవాటు ఉంది. ఈ క్రమంలో శుభమ్.. సాయి నిఖిల్ వద్ద నుండి ఎండీఎంఏ డ్రగ్‌ను సేకరించడం ప్రారంభించాడు. కాగా, సాయి నిఖిల్‌ను ఇటీవల చిలకలగూడ పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు.సాయి నిఖిల్ అరెస్ట్ అయిన తర్వాత కూడా శుభమ్ కుమార్ మిశ్రా ఈ డ్రగ్స్ వ్యాపారాన్ని కొనసాగించాడు. తన స్నేహితులైన సోహమ్ నాయక్, కలంగి రాజేష్‌లతో కలిసి కొనసాగించాడు. శుభమ్ వారిద్దరికీ పెద్ద మొత్తంలో డ్రగ్స్ సరఫరా చేయగా.. వారు దానిని చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి కస్టమర్లకు విక్రయించేవారు. ఈ డ్రగ్స్‌ను వినియోగదారులకు చేరవేయడానికి శుభమ్ స్వయంగా వెళ్లడమే కాకుండా, రాపిడో సర్వీసులను ఉపయోగించేవాడు. అలాగే తన అన్న ముంతున్ కుమార్ ద్వారా కూడా డ్రగ్స్ డెలివరీ చేయించేవాడు. ఈ కేసులోని వినియోగదారులు.. నిందితులైన పెడ్లర్ల నుండి గ్రాము ఎండీఎంఏను రూ. 2,000 నుంచి రూ. 3,000 వరకు వెచ్చించి కొనుగోలు చేస్తున్నట్లు విచారణలో తేలింది. -
కూకట్‌పల్లిలో అగ్ని ప్రమాదం
-
హైదరాబాద్ లో హై టెన్షన్...బండి భగీరథ్ కోసం గాలింపు
-
బీటెక్ ఒకప్పుడు గ్రేట్ ఇప్పుడు వేస్ట్! పనికి రాకుండా పోతున్న బీటెక్ డిగ్రీలు తప్పు కాలేజీలదే..
-
బాలికపై బాబాయి లైంగిక దాడి
హైదరాబాద్: పరీక్షలు పూర్తి అయ్యాయి..వేసవి సెలవులు సరదాగా గడుపుదామని బాబాయి ఇంటికి వెళ్లింది ఓ బాలిక..అయితే బాబాయి బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు.పోలీసులు తెలిపిన మేరకు.. జగద్గిరిగుట్టకు చెందిన బాలిక (16) సెలవులకు తిరుపతిలోని పిన్ని ఇంటికి వెళ్లింది. జీఎస్టీ విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా పసిచేస్తున్న బాబాయి రామమూర్తి... తన భార్య ఉద్యోగానికి వెళ్లిన సమయంలో పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. కొద్ది రోజుల తరువాత నగరానికి వచి్చన బాలికను తల్లి ఆరా తీయగా విషయం వెలుగులోకి వచి్చంది. తల్లి ఫిర్యాదుతో జగద్గిరిగుట్ట పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కేసును తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేష¯న్కు బదిలీ చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. -
హైదరాబాద్ : నాంపల్లి రైల్వే స్టేషన్..ఏసీ కోచ్‌లో మంటలు (ఫొటోలు)
-
కూలిన లిఫ్ట్.. బీఆర్ఎస్ నాయకులకు గాయాలు
సాక్షి, హైదరాబాద్: లిఫ్ట్ తెగిపడి బీఆర్ఎస్ నాయకులు గాయపడిన ఘటన హైదరాబాద్‌లోని పుప్పాలగూడ డాలర్ హిల్స్‌లో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు బీఆర్ఎస్ నాయకులు గాయపడ్డారు.వైర్లు తెగిపోవడంతో లిఫ్ట్ ఒక్కసారిగి కుప్పకూలింది. ప్రమాద సమయంలో లిఫ్ట్‌లో ఆరుగురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. వీరందరికీ గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలు అవడంతో అపోలో ఆస్పత్రికి తరలించారు. ఓ అపార్ట్మెంట్ 5వ అంతస్తులో బిఆర్ఎస్ పార్టీ మీటింగ్ ముగించుకుని లిఫ్ట్ లో కిందకు దిగుతున్న సమయంలో ఘటనఈ ఘటన జరిగింది. -
బండి సంజయ్ తల్లి శకుంతలకు గుండెపోటు
సాక్షి,హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్ తల్లి శకుంతలకు గుండెపోటు వచ్చింది. అప్రమత్తమైన కుటుంబసభ్యులు అత్యవసర చికిత్స నిమిత్తం కరీంనగర్ నుంచి హైదరాబాద్ గచ్చిబౌలిలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం హార్ట్ స్టెంట్ వేసి చికిత్స అందిస్తున్నారు. బండి సంజయ్ స్వయంగా ఆసుపత్రికి చేరుకుని తల్లి ఆరోగ్య పరిస్థితిని వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. -
నాంపల్లి రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 4వ ప్లాట్‌ఫాంపై ఉన్న ఏసీ కోచ్‌లో మంటలు చెలరేగాయి. జైపూర్ వెళ్తున్నట్రైన్ ఏసీ బోగిలో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు ఎగసిపడుతున్నాయి. మూడు ఫైరింజన్లతో మంటలను సిబ్బంది అదుపు చేశారు. తోటి ప్రయాణికులు.. అద్దాలు పగలగొట్టి ప్యాసింజర్లను కాపాడారు. బీ1, బీ2 ఏసీ బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.రాత్రి 7.30కి బయలుదేరాల్సి ఉండగా 6.20 గంటల ప్రాంతంలో బోగీల్లో మంటలు వ్యాపించాయి. బోగీలలో పొగలు రావడాన్ని గమనించి ఫైర్, హైడ్రా కంట్రోల్ రూమ్‌కు రైల్వే అధికారులు సమాచారం ఇచ్చారు. వెంటనే చేరుకుని హైడ్రా, ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. పెనుముప్పు తప్పడంతో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. -
బండి భగీరథ కేసులో ఆ పేరు వాడొద్దు: కోర్టు
హైదరాబాద్: బండి భగీరథ కేసులో సిటీ సివిల్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ పేరును వాడొద్దంటూ సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బండి భగీరథ కేసులో తన పేరును వాడుతున్నారంటూ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు బండి సంజయ్. ఈ మేరుకు విచారించిన కోర్టు.. బండి భగీరథ కేసులో కేంద్రమంత్రి బండి సంజయ్ పేరు వాడొద్దంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బండి భగీరథ కేసు విషయంలో బండి సంజయ్ పేరును ఎక్కడా ఉపయోగించరాదని స్పష్టం చేసింది సివిల్ కోర్టు. తన పేరును ఉపయోగిస్తూ మీడియాలో ఎలాంటి వార్తలు రాయకుండా చూడాలని కోరారు. ఇప్పటివరకు మీడియాలో తన పేరుతో వచ్చిన ఈ కేసుకు సంబంధించిన వార్తలను డిలీట్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు విన్నవించారు బండి సంజయ్. కేంద్రమంత్రి బండి సంజయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపి గ్యాగ్ ఆర్డర్ జారీ చేసింది సిటీ సివిల్ కోర్టు. -
హైదరాబాద్‌లో ఈ దేవాలయం దర్శిస్తే.. మీ అమెరికా డ్రీమ్ నెరవేరినట్లే
వాషింగ్టన్: భక్తులు కోరిన కోరికలు తీర్చే కలియుగ దైవం.. వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రం చిలుకూరు బాలాజీ. చిలుకూరు బాలాజీ ఆలయం కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు. విదేశాల్లో స్థిరపడాలనుకునే కోట్లాది మంది భక్తుల ఆశలు, విశ్వాసాలకు ప్రతీక. అందుకే చిలుకూరు బాలాజీని వీసా గాడ్ అని పిలుస్తారు. ఇప్పుడు మరోసారి చిలుకూరు బాలాజీ విశిష్టత ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌పై దుమ్మెత్తి పోస్తూ అమెరికా రిపబ్లికన్ పార్టీ సెనేటర్ ఎరిక్ ష్మిట్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో హెచ్-1బీ వీసా పోగ్రామ్ వల్ల అమెరికన్లు నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్నారు. దేశీయంగా ఉన్న ప్రముఖ టెక్ కంపెనీలు హెచ్-1బీ వీసాను దుర్వినియోగం చేస్తున్నాయి. పనితీరు పేరుతో స్థానికుల్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి. హెచ్-1బీ వీసా ద్వారా విదేశీయులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయని అన్నారు. అమెరికా సెనేటర్ నోట చిలుకూరు బాలాజీ ఈ సందర్భంగా చిలుకూరు బాలాజీ ఆలయం గురించి ప్రస్తావించారు. ఉదాహరణకు మీరు అమెరికా హెచ్-1బీ వీసా కావాలంటే వీసా దేవాలయాన్ని సందర్శించొచ్చు. హెచ్-1బీ వీసా కోరుకునేవారు (వీసా కార్టెల్)కి హైదరాబాద్‌లో వీసా దేవాలయం ఉంది. అక్కడ వేలాది మంది భారతీయులు పుణ్యక్షేత్రంలో ప్రదిక్షణలు చేస్తారు. యూఎస్ వర్క్ వీసాల కోసం ఆశీర్వాదం పొందుతారు’అని పేర్కొన్నారు.పన్నులు కట్టేది మనం.. ఉద్యోగాలు మాత్రం భారతీయులకుఅమెరికా వీసా ప్రోగ్రామ్‌లలో మోసం, దుర్వినియోగం అధికంగా ఉంది. తద్వారా హెచ్-1బీ,ఎల్-1,ఎఫ్-1,ఓపీటీ వీసా ప్రోగ్రామ్‌లు అమెరికా మధ్యతరగతి ఉద్యోగాలను లాగేసుకుంటున్నాయి. షెల్ కంపెనీలు అక్రమ పద్దతుల్లో ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నాయి. వాటి ద్వారా తక్కువ వేతనాలతో వీసా ఆధారిత కార్మికులను అమెరికా ఉద్యోగాల్లోకి పంపుతున్నారు. అమెరికన్లను పక్కన పడుతున్నారు. ఆ కంపెనీలే భారత్‌లో ఏఐపై బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నాయి. పన్ను రాయితీ ప్రయోజనాలు మాత్రం అమెరికా నుంచి పొందుతున్నాయి. ఎల్‑1 వీసాలు వీసా కార్టెల్ వ్యాపారంగా మారాయని ఆయన ఆరోపించారు. విదేశీ కంపెనీలు నకిలీ సంస్థలను ఏర్పాటు చేసి, మేనేజర్లను ట్రాన్స్ఫర్ చేస్తూ వేతన పరిమితులను తప్పించుకుంటున్నాయి. దాదాపు సగం మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుకుని, టెక్ కంపెనీలలో మధ్యస్థాయి కంటే తక్కువ వేతనాలతో ఉద్యోగాలు పొందుతున్నారు. అమెరికా ప్రజలు చెల్లించే పన్నులే విదేశీ విద్యార్థుల ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి. ఫలితంగా, కంపెనీలు పేరోల్ ట్యాక్స్, వేజ్ రూల్స్ లేకుండా తక్కువ వేతనాలతో వారిని నియమించుకుంటున్నాయి. తర్వాత వారు హెచ్‑1బీ ఉద్యోగులు ఆపై గ్రీన్ కార్డ్‌లు పొందుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న అమెరికా గ్రాడ్యుయేట్లు తక్కువ వేతనం తీసుకుంటున్న పోటీపడుతున్నారు. వీసా వస్తే.. ఒక్కరితో ఆగదు.. అందరికి షేర్ చేస్తారుకార్టెల్ పని ఇక్కడితో ఆగదు. భారతీయ వీసా హోల్డర్లు ఇంటర్వ్యూలలో అడిగే కాన్ఫిడెన్షియల్ ప్రశ్నలను ఇతర భారతీయ అభ్యర్థులతో పంచుకుంటున్నారు చివరిగా వీసాల పేరుతో జరుగుతున్న మోసాలు ఇంక చాలు. ఆ మోసాన్ని ఆపాలి. ఈ నెట్‌వర్క్‌లను మూసివేయాలి. లోపాలను సరిచేయాలి. అమెరికన్ వర్క్ ఫోర్స్‌ను సమర్ధవంతంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. చిలుకూరు బాలాజీ ఆలయం ప్రస్తావనఅమెరికా డ్రీమ్ తరచుగా హైదరాబాద్‌లో ప్రార్థనతో ప్రారంభమవుతుందని ఆయన అన్నారు. చిలుకూరు బాలాజీ ఆలయంను వీసా టెంపుల్‌గా పిలుస్తారని, వీసా కోసం ప్రయత్నించే విద్యార్థులు, టెక్ ఉద్యోగులు ఈ ఆలయానికి వచ్చి ప్రార్థనలు చేస్తారని పేర్కొన్నారు. హెచ్-1బీ వీసాలు పొందే జాబితాలో భారత్ వాటా 70 నుంచి 80శాతం ఉంటే చైనా మాత్రం 12శాతం మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు. 11 లేదంటే 108 ప్రదక్షిణలుచిలుకూరు బాలాజీ ఆలయంలో వీసా కోసం చేసే ప్రదక్షిణల సంప్రదాయం ప్రత్యేకంగా ఉంది.కోరికను (ఉదా: అమెరికా వీసా) మనసులో పెట్టుకుని ఆలయ గర్భగుడి చుట్టూ 11 సార్లు తిరుగుతారు. కోరిక నెరవేరిన తర్వాత తిరిగి ఆలయానికి వచ్చి కృతజ్ఞతగా 108 సార్లు ప్రదక్షిణలు చేస్తారు.ఈ సంప్రదాయం 1990లలో ఐటీ విద్యార్థులు, ఉద్యోగులు అమెరికా వీసా కోసం ప్రార్థనలు చేసినప్పుడు విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. An American professor just sued SMU, alleging the department chair systematically favored Indian-origin candidates for tenure.100% approval for them, zero for equally qualified non-Indians.This isn’t isolated; it’s the pattern when these networks capture hiring. pic.twitter.com/60CezLg8pw— Senator Eric Schmitt (@SenEricSchmitt) May 13, 2026 -
భార్య రెండో పెళ్లి చిచ్చు.. భర్త ఆత్మహత్య!
హైదరాబాద్: తాను ఎంతగానో ఇష్టపడి, ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి కొన్నేళ్ల కాపురం తర్వాత రెండో పెళ్లి చేసుకోవడాన్ని అవమానంగా భావించి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలోని హయత్‌నగర్ పీఎస్ కోహెడ పరిధిలో చోటు చేసుకుంది. తమకు పుట్టిన బిడ్డను సైతం భార్య అమ్మేసి మరీ రెండో పెళ్లి చేసుకోవడంతోనే తాను ఆత్మహత్యకు చేసుకుంటున్నట్లు భర్త గోవర్థన్ వెల్లడించాడు. చనిపోయేముందు సెల్ఫీ వీడియో తీసుకోవడంతో అసలు విషయం వెలుగు చూసింది. తన భార్య రెండో పెళ్లి చేసుకుందని, తమకు ఒక బాబు కూడా ఉన్నాడని ఆ వీడియోలో తెలిపాడు. నాలుగేళ్ల కాపురం తర్వాత ఆ బిడ్డను అమ్మేసి రెండో పెళ్లి చేసుకోవడాన్ని తాను భరించలేకపోతున్నానని, తనకు చావు తప్పితే మరొక మార్గం లేదని బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు పేర్కొన్నాడు. ఆ వీడియోలో వెక్కి వెక్కి ఏడ్చిన గోవర్థన్.. తనను మోసం చేసిన ఆమెను వదిలిపెట్టవద్దని కుటుంబ సభ్యులకు విన్నవించాడు. తాను చనిపోతున్నందుకు క్షమించాలంటూ కుటుంబ సభ్యులను కోరాడు. దీనిపై గోవర్థన్ తల్లి మాట్లాడుతూ.. వారికి పెళ్లియిందనే విషయం తమకు ఇప్పుడే తెలిసిందని, బాబు పుట్టిన విషయం కూడా తమకు చెప్పలేదని, ఇప్పుడు వీడియో ద్వారా మాత్రమే వారికి పెళ్లైన విషయం, బాబు పుట్టిన విషయం తెలిసిందన్నారు. -
హలీమ్ ప్రియులకు గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: డబ్బాలో పెట్టి కేఫ్/షాప్‌ల వాళ్లు అందిస్తున్న హలీమ్ ఎలాంటిది? ఏ దినుసులు ఎంత శాతం చొప్పున కలుపుతున్నారు? అది ఎంత మేర ఆరోగ్యకరం? ఇప్పటిదాకా తెలియని ఈ కచ్చితమైన వివరాలు హలీమ్ ప్రియులకు తెలియనున్నాయి. గోధుమలు, పప్పు లు సహా ఏవేవో కలిపేసి హలీమ్ తయారీ చేసే అక్రమ వ్యాపారుల ఆగడాలకు కళ్లెం పడనుంది. హైదరాబాద్ హలీమ్ (Hyderabad Haleem) ఎంతో పాపులర్. కాగా అంతర్జాతీయంగా ఎగుమతి అయ్యే ఏ ఆహారోత్పత్తికైనా నిర్దుష్ట ప్రమాణాలు తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే కొందరు ఎగుమతిదారుల ఆరోపణల దృష్ట్యా హలీమ్ నాణ్యత ఖరారు చేయాలని, నగర సంస్కృతికి పర్యాయపదంగా నిలిచిన ప్రఖ్యాత వంటకాన్ని ప్రామాణీకరించాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిర్ణయించింది. నిర్దుష్ట ప్రమాణాలను రూపొందించింది. గత ఏప్రిల్ 28న నవీకరణను జారీ చేసింది. ప్రమాణాలను పాటించాల్సిన గడువును పొడిగిస్తూ నవంబర్ 1గా నిర్ణయించింది.ప్రమాణాలు ఏమిటి? మాంసం, ప్రోటీన్ తేమ అవసరాలతో సహా కఠిన ప్రమాణాలను ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రవేశపెట్టింది. హలీమ్‌ను ‘సాధారణ ఆహారం’ వర్గం నుంచి ఒక ప్రత్యేక విభాగానికి మార్చి కచ్చితంగా ఏమేం ఉండాలో తేల్చింది. ఇకపై చట్టబద్ధంగా ’హలీమ్’ అని పేర్కొనాలన్నా, అధికారముద్ర పడాలన్నా.. ఆ ఆహార ఉత్పత్తిలో ఇప్పుడు బరువు ప్రకారం కనీసం 25 శాతం మటన్ /చికెన్ ఉండాలి. ఖర్చులను తగ్గించుకోవడానికి గోధుమ కంకులు, పప్పులు నీళ్లు కలిపిన హలీమ్స్ను వండి వడ్డించే కొన్ని హలీమ్ స్టాల్స్ ఆటలు ఇక చెల్లవు.ప్యాక్ చేసి ఎగుమతి చేసే ప్రతి హలీమ్ తప్పనిసరిగా పాటించాల్సిన నిర్దిష్ట రసాయన ప్రమాణాలను కూడా నిబంధనలు నిర్దేశించాయి. మటన్ హలీమ్‌లో కనీసం 8 శాతం ప్రోటీన్, 70 శాతం తేమ ఉండాలి. చికెన్ హలీమ్‌లో (Chicken Haleem) కనీసం 6 శాతం ప్రోటీన్, 75 శాతం తేమ పరిమితిని నిర్దేశించారు. నిర్ణీత ప్రోటీన్, తేమ శాతాలు ఇప్పుడు హలీమ్ నాణ్యతను నిర్ధారించే ప్రయోగశాల పరీక్షల సమయంలో పారామితులుగా పనిచేస్తాయి.చదవండి: భర్త డైరెక్షన్.. భార్య యాక్షన్హలీమ్లలో కొవ్వు 12 శాతానికి పరిమితం కావాలి. వచ్చే రంజాన్ నాటికి, ప్రతి వాణిజ్య తయారీదారు ఈ ప్రోటీన్ కొవ్వు శాతాలను తమ లేబుళ్లపై చట్టబద్ధంగా ముద్రించాల్సి ఉంటుంది. మటన్, బఫెలో మీట్ హలీమ్‌ల మధ్య తేడాను లేబుళ్లపై స్పష్టంగా పేర్కొనాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశించింది. -
‘తనూజ రంజన్’ కేసులో వెలుగులోకి కీలకాంశాలు
సాక్షి, హైదరాబాద్: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజను చంపి, భారీ దోపిడీకి పాల్పడిన నేపాలీ గ్యాంగ్ కోసం నగర పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ నేరంలో ఆరుగురు నేరుగా పాల్గొన్నారని, మరొకరు పరోక్షంగా సహకరించారని గుర్తించారు. ఉత్తరాది జైల్లో కల్పన భర్త... నేపాల్ నుంచి వలసొచ్చిన కల్పనతోపాటు ఆమె భర్త ఉత్తరాదిలో కొన్ని నేరాలు చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కల్పన మరో నేపాలీ మహిళ ద్వారా వినయ్ రంజన్ రే తల్లికి సపర్యలు చేయడానికి చేరింది. రంజన్ తల్లి రెండు నెలల క్రితం చనిపోయినా, కల్పన మీద ఉన్న నమ్మకంతో పనిలో కొనసాగించారు. ఈమెకు రెండో అంతస్తులో అటాచ్డ్ బాత్రూమ్తో కూడిన గదిని ఇచ్చారు. ఉత్తరాదిలో చేసిన నేరంలో అరెస్టు అయిన కల్పన భర్త ప్రస్తుతం అక్కడి జైల్లో ఉన్నట్టు తెలిసింది. జైలు నుంచే ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా కల్పనతో సంప్రదింపులు జరిపాడని సమాచారం. ఇలా మెసెంజర్ ద్వారా రంజన్ ఇంట్లో దోపిడీకి స్కెచ్ వేసి, ఆ విషయాన్ని కల్పనకు చెప్పారు. రెండు రోజుల ముందు వచ్చిన ముగ్గురు ఇటీవల వినయ్ రంజన్ రే (Vinay Ranjan Ray) బెంగళూరు వెళ్లడంతో దోపిడీకి అదే అదునైన సమయంగా భావించిన కల్పన అదే విషయాన్ని తన భర్తకు చెప్పింది. అతడి సూచనల మేరకు నేపాల్‌కు చెందిన సుజన్ షాహి అలియాస్ సురేశ్ సాహి, గణేశ్ సాహి, భరత్, దేవేందర్ నేరం చేయడానికి రెండు రోజులు ముందు నగరానికి వచ్చారు. ఉత్తరాదిలోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వీరు రైలు ద్వారా సికింద్రాబాద్ స్టేషన్‌కు వచ్చి గోపాలపురం పరిధిలోని ఎంఎస్ హోటల్లో బస చేశారు. ఆ మర్నాడు మరో నిందితుడు వచ్చి వీరిని కలిశాడు. గురువారం ఈ హోటల్లో సోదాలు చేసిన పోలీసులు పలు రికార్డులు, నేరగాళ్లు ఇచ్చిన గుర్తింపు పత్రాల ప్రతులు, సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను స్వాదీనం చేసుకున్నారు. ఆటోలో జూబ్లీహిల్స్ వరకు...నేరం చేసిన రోజు కల్పన ఆదేశాల మేరకు ఈ ఐదుగురూ ఆటోలో ప్రశాసన్‌నగర్ వద్దకు చేరుకున్నారు. అక్కడి సీసీ కెమెరాల్లో ఇద్దరి కదలికలు మాత్రమే ఉండగా, మిగిలిన చోట్ల ఐదుగురినీ పోలీసులు గుర్తించారు. నేరం చేసిన తర్వాత వీరు వేర్వేరుగా రైళ్లల్లోనే పారిపోయారని పోలీసులకు ఆధారాలు లభించాయి. కల్పన (Kalpana) సహా కొందరు సొత్తుతో నేపాల్‌కు చేరినట్టు భావిస్తున్నారు. వీరిని పట్టుకోవడానికి ఉత్తరాదిలోని వివిధ నగరాల్లో గాలిస్తున్న టీమ్స్, ఇండో–నేపాల్ బోర్డర్లోని వివిధ ప్రాంతాలు, ఇమ్మిగ్రేషన్ చెక్‌పోస్టుల వద్ద నిఘా ఉంచాయి.పోలీసుల అదుపులో నేపాలీ మమత గ్యాంగ్? జవహర్‌నగర్: జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కౌకూర్‌లో రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీమోహన్, విజయలక్ష్మీ నివాసంలో వారిని బంధించి ఆ ఇంట్లోనే దొంగతనం చేసిన నేపాలీ మమత గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. మురళీమోహన్ నివాసంలో ఈ నెల 11న ఇంట్లో పనిచేసే నేపాలీ పనిమనిషి, నేపాల్‌కు చెందినవారు దోపిడీకి పాల్పడిన విషయం తెలిసిందే.జవహర్‌నగర్, ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో నేపాలీ గ్యాంగ్‌ను ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుల్లో పట్టుకున్నారని, అక్కడ కోర్టులో హాజరుపర్చిన తర్వాత వారిని హైదరాబాద్ తీసుకొస్తారని సమాచారం. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి స్వయంగా పర్యవేక్షించి 10 ప్రత్యేక టీమ్‌లు రంగంలోకి దించి నేపాలీ గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించలేదు. -
హైదరాబాద్ లో రెచ్చిపోతున్న నేపాలీ గ్యాంగ్
-
పేద ప్రజల ఆరోగ్యం కోసమే టిమ్స్ ఆసుపత్రులు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: నగర ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో టిమ్స్ హాస్పిటల్స్ ఏర్పాటు చేశామని కేటీఆర్ అన్నారు. సనత్‌నగర్‌లోని టిమ్స్ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. గతంలో గాంధీ, ఉస్మానియా వంటి ప్రభుత్వ ఆసుపత్రులే ప్రధాన ఆధారమైతే, నేడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన అత్యాధునిక టిమ్స్ హాస్పిటల్స్ అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో AIIMS స్థాయి వైద్యం అందించేలా టిమ్స్‌ను ఆలోచించి రూపకల్పన చేశామన్నారు.సనత్‌నగర్ టిమ్స్ కోసం 22 ఎకరాల విస్తీర్ణాన్ని వినియోగించామని అత్యాధునిక టెక్నాలజీ, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో హాస్పిటల్ నిర్మాణం చేపట్టామని వెల్లడించారు. ఇందులో మొత్తం మూడు బ్లాకులు నిర్మించామని 300 ICU బెడ్స్‌తో అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని రోగుల బంధువుల కోసం ప్రత్యేక ధర్మశాల ఏర్పాటు చేశామని తెలిపారు. రూ.1200 కోట్ల వ్యయంతో టిమ్స్ నిర్మాణం చేపట్టామని కేసీఆర్ ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈ ఆసుపత్రి రెండేళ్ల క్రితమే పూర్తయ్యేదన్నారు. -
సందడిగా యూనివర్సిటీ ఆఫ్ రొహింప్టన్ లండన్ మీట్ అండ్ గ్రీట్
సాక్షి, హైదరాబాద్ : మీట్ అండ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న యూనివర్సిటీ ఆఫ్ రొహింప్టన్ లండన్ వీసీ జాన్ వాల్.. యూనివర్సిటీ ఆఫ్ రొహింప్టన్ లండన్ మీట్ గ్రీట్ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.బంజారాహిల్స్‌లోని తాజ్ దక్కన్ హోటల్లో గురువారం యూనివర్సిటీ ఆఫ్ రొహింప్టన్ మీట్ ద గ్రీట్ కార్యక్రమంలో యూనివర్సిటీ ఆఫ్ రొహింప్టన్ లండన్ వైస్ ఛాన్సిలర్ జాన్ వాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో యువత మూస కోర్సులు చదువుకునేందుకు ఇష్టపడటం లేదని ఎప్పటికప్పుడు సరికొత్త కోర్సులు చదువుకోవడానికి ఇష్టపడుతున్నారని అన్నారు. యూనివర్సిటీ ఆఫ్ రొహింప్టన్ యూనివర్సిటీకి భారతీయ విద్యార్థులకు మంచి సంబంధాలు ఉన్నాయని ఇక్కడ లభించే కోర్సులకు ప్రతియేటా భారతీయ విద్యార్థుల నుంచి మంచి స్పందన లభిస్తున్నదని అన్నారు. టెక్నాలజీ కోర్సులు, సైబర్ సెక్యూరిటీస్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, రొబోటిక్స్ వంటి ఎన్నో అంశాలపై అధునాతన కోర్సులను విద్యార్థులకు ఈ యూనివర్సిటీ అందిస్తున్నదని తెలిపారు.ఒక వైపు చదువుకుంటూనే మరో వైపు ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తున్నదని అన్నారు. యూనివర్సిటీ ఆఫ్ రొహింప్టన్ డైరెక్టర్ రిక్రూట్మెంట్ అడ్మిన్ గులిని రిచర్డ్ మాట్లాడుతూ ప్రస్తుతం యూనివర్సిటీలో 12 వేల మంది విద్యార్థులు వివిధ కోర్సులు అభ్యసిస్తున్నారని అన్నారు. సావరియా ఎడ్యుకేషన్ సంస్థ చైర్మన్ రాజేష్ గోయల్ మాట్లాడుతూ తొలుత 200 మంది తమ కన్సల్టెన్సీ నుంచి లండన్ వెళ్ళారని ఇప్పుడు 500 మందికిపైగా వెళ్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ సర్వీస్ ఈడీ గ్రోత్ మిస్త్రి తదితరులు పాల్గొన్నారు. -
యూసుఫ్‌గూడలో అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్: యూసుఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. విశ్వ విహార్ లాండ్ మార్క్ అపార్టుమెంటులోని ఐదో అంతస్థులో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది అపార్టుమెంటులోని వారిని ఖాళీ చేయించి మంటలు ఆర్పే యత్నం చేస్తున్నారు. అయితే ఏసీ పేలడంతోనే ప్రమాదం సంభవించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. -
ఇంటర్ విద్యలో కీలక మార్పులు.. తెలంగాణ విద్యార్థులకు ముఖ్య గమనిక
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ విద్యలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. 2026-2027 అకడమిక్ ఇయర్ నుంచే నూతన విద్యా విధానం అమల్లోకి రానుంది. ఫస్ట్ ఇయర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బొటనీ, జూలజీలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఫస్ట్ ఇయర్లో 15 మార్కులు, సెకండ్ ఇయర్లో 15 మార్కులకు ప్రాక్టికల్స్ ఉంటాయి. బోర్డు మ్యాథ్స్‌లో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌ను ప్రవేశపెట్టింది. ఫైనల్ ఎగ్జామ్స్‌లో మ్యాథ్స్ మార్కులు 75 నుండి 60కి తగ్గించింది. ఇంటర్నల్ అసెస్మెంట్లో ఒక్కో ఏడాదికి 15 మార్కులు కేటాయించారు. హ్యూమానిటీస్‌లో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ద్వారా 20 మార్కులు పొందే అవకాశం కల్పించారు. ఫైనల్ పరీక్షలు 100 మార్కుల బదులు 80 మార్కులకే నిర్వహించనున్నారు. లాంగ్వేజెస్‌లో కూడా ఫైనల్ ఎగ్జామ్స్ 100 మార్కుల బదులు 80 మార్కులకే జరుగుతాయని ఇంటర్ బోర్డు వర్గాలు తెలిపాయి. -
ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్‌కు ఏసీబీ కోర్టు సమన్లు
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈకారు రేసు కేసులో ఏసీబీ కోర్టు మాజీ మంత్రి కేటీఆర్‌కు సమన్లు జారీ చేసింది. అరవింద్ కుమార్, బీఎల్ఎన్రెడ్డికి సైతం సమన్లు పంపింది. జులై 31న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీచేసింది. ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌ను ఏసీబీ కోర్టు పరిగణలోకి తీసుకుంది. -
తెలుగు రాష్ట్రాల్లో.. మూడో దశ ‘ఎస్ఐఆర్’కు ఈసీ ప్రకటన
సాక్షి,హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో.. మూడో దశ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)కు ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. ఈ ప్రకటనలో తెలుగు రాష్ట్రాలతో కలిపి దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం మధ్యాహ్నం అధికారికంగా ప్రకటించింది. ఫేజ్-3 ప్రక్రియ కోసం 3.94 లక్షలకుపైగా బూత్‌స్థాయి అధికారుల్ని నియమించింది.ఏపీలో జులై 21 నుంచి సెప్టెంబర్ 18 వరకు ఓటర్ల ముసాయిదా జాబితా.. ఏపీలో సెప్టెంబర్ 22న తుది ఓటరు జాబితా ప్రకటించనుంది. అదే విధంగా తెలంగాణలో జులై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు ఓటర్లు ముసాయిదా.. తెలంగాలో అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా విడుదల చేయనుంది. ఏపీలో ఎస్ఐఆర్ షెడ్యూల్46,397 మంది బూత్ లెవెల్ ఆఫీసర్స్ నియామకం68,868 మంది బూత్ లెవెల్ ఏజెంట్స్మే 12 నాటికి 4,16,16,061 మంది ఓటర్లుజూన్ 15 నుంచి జూలై 14 వరకు ఇంటింటికి వెళ్లి ఓట్లు తనిఖీ చేయనున్న బిఎల్ఓలుజూన్ 14 పోలింగ్ కేంద్రాల రేషన్నలైజేషన్జులై 21న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలజూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు క్లెయిమ్, అభ్యంతరాల స్వీకరణజూలై 21 నుంచి సెప్టెంబర్ 18 వరకు క్లెయిమ్ అభ్యంతరాల పరిష్కారంసెప్టెంబర్ 22న ఓటర్ల తుది జాబితా విడుదలతెలంగాణలో ఎస్ఐఆర్ షెడ్యూల్35,985 మంది బూత్ లెవెల్ ఆఫీసర్స్ నియామకం25,886 మంది బూత్ లెవెల్ ఏజెంట్స్మే 12 నాటికి 3,39,20,705 కోట్ల మంది ఓటర్లు జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటికి వెళ్లి ఓట్లు తనిఖీ చేయనున్న బిఎల్ఓలుజూన్ 24 పోలింగ్ కేంద్రాల రేషన్నలైజేషన్జులై 31న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలజూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్, అభ్యంతరాల స్వీకరణజూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు క్లెయిమ్ అభ్యంతరాల పరిష్కారంఅక్టోబర్ 1న ఓటర్ల తుది జాబితా విడుదలఈసీ అధికారిని కలవనున్న కాంగ్రెస్ నేతలుహైదరాబాద్: తెలంగాణ పీసీసీ ఛీఫ్, ఎమ్మెల్యేలు , ఎంపీలు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల అధికారిని కలవనున్నారు. త్వరలో తెలంగాణలో SIR పక్రియ చేపట్టనున్న నేపథ్యంలో తమకు ఉన్న అనుమానాలను తీర్చాలని ఎన్నికల అధికారిని కాంగ్రెస్ నేతలు కోరనున్నారు. -
లక్ష పెడితే 3 కోట్లు లాభం.. కాసుల వర్షం కురిపించిన హైదరాబాద్ స్టాక్
-
SI సురేష్ పెళ్లి పేరుతో మహిళా కానిస్టేబుల్ ని...
-
కేంద్రం.. ఆమోదమా? తిరస్కారమా?
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో రెండోదశ పై మరోసారి ఉత్కంఠ నెలకొంది. కేంద్రం అనుమతి కోసం ఇప్పటికే సీఎం రేవంత్ సహా అధికారుల బృందం కేంద్రంతో సంప్రదింపులు జరిపింది. ఆ తర్వాత సీఎం మరోసారి ప్రధాని మోదీతో మెట్రో అంశాన్ని ప్రస్తావించారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ 4 రోజుల వ్యవధిలో రెండోసారి కేంద్ర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఏడాది కాలంగా ఈ భేటీలు, సంప్రదింపులు సాగుతూనే ఉన్నాయి.. .. సీఎం సహా అధికారుల బృందాలు ఢిల్లీకి వెళ్తూనే ఉన్నారు. ఇటీవలి సమావేశాలు మెట్రో రెండో దశపై ఆశలు రేకెత్తిస్తున్నాయి. కేంద్రం ప్రతిపాదించినట్లుగా తొలి దశను రాష్ట్ర ప్రభుత్వం ఎల్అండ్టీ నుంచి టేకోవర్ చేసింది. రుణాల రీఫైనాన్సింగ్‌తో పాటు ఎల్అండ్టీ బకాయిల చెల్లింపు జూన్‌తో పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం రెండో దశపై కేంద్రం నుంచి ఆమోదం పొందేందుకు కార్యాచరణను వేగిరం చేసింది.ఇంకా ఎన్నాళ్లు..?రెండోదశకు ప్రణాళికలను రూపొందించి, కేబినెట్ ఆమోదంతో దాదాపు 18 నెలల క్రితమే కేంద్రం అనుమతి కోసం డీపీఆర్‌లను అందజేశారు. ఇటీవల పలు నగరాల్లో మెట్రో నిర్మాణానికి కేంద్రం అనుమతులను అందజేసింది. హైదరాబాద్‌లో రెండో దశను మాత్రం పెండింగ్‌లో పెట్టింది. ఇప్పటికే రెండో దశలో పేర్కొన్న ‘ఏ’, ‘బి’ విభాగాల కోసం డీపీఆర్‌లను అందజేయగా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి ఎలాంటి డీపీఆర్‌లు అందలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొనడం గమనార్హం. ఈ క్రమంలోనే మొదటి దశ స్వాధీనంతో పాటు వివిధ అంశాలపై కేంద్రానికి స్పష్టమైన నివేదిక అందజేశారు. రెండో దశలో మొత్తం 8 కారిడార్లలో మెట్రో నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సమర్పించింది. దాదాపు రూ.48 వేల కోట్లతో అంచనాలను రూపొందించారు. మొదట.. రెండో దశలోనే ఈ కారిడార్లన్నీ పూర్తిచేయాలని ప్రతిపాదించారు. కానీ, ఇటీవల సీఎం రేవంత్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో సమావేశమైన సందర్భంగా ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్‌సిటీకి మూడో దశలో చేపట్టాలని కోరారు. మరోపు మెట్రో నిర్మాణానికి జైకా, ఏడీబీ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు రుణాలు అందజేసేందుకు ఏడాది క్రితమే సంసిద్ధత వ్యక్తం చేసినా కేంద్రం నుంచి సావరిన్ గ్యారెంటీ లభించక ప్రతిష్ఠంభన నెలకొంది. గ్రేటర్ ఎన్నికలే లక్ష్యంగా.. మెట్రో రెండో దశ పనులతో పాటు మూసీ ప్రక్షాళనను ప్రారంభించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించడంతో ఎన్నికలు సవాల్‌గా మారాయి. పాతబస్తీలో మెట్రో విస్తరణకు భూ సేకరణతో పాటు, రోడ్డు విస్తరణ చేపట్టారు. కేంద్రం నుంచి అనుమతి రాగానే ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కి.మీ. మార్గాన్ని మొదట పూర్తి చేయనున్నారు. కానీ, రెండో దశపై కేంద్రం స్పష్టమైన వైఖరి వెల్లడించడం లేదు. దీంతో హెచ్ఎంఆర్ఎల్ అధికారులు ఢిల్లీకి ప్రదక్షిణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. -
మంత్రి అడ్లూరికి తప్పిన ప్రమాదం.. రోప్ తెగి కిందపడ్డ లిఫ్ట్
కరీంనగర్, సాక్షి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రైవేట్ ఆస్పత్రి లిఫ్ట్‌లో దిగుతుండగా దురదృష్టవశాత్తు లిఫ్ట్ రోప్ తెగింది. దీంతో లిఫ్ట్ ఒక్కసారిగా కిందపడడంతో అందులో ఉన్న మంత్రికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో అక్కడే ఉన్న సిబ్బంది ఆయనను వెంటనే అందులో నుంచి బయిటకి తీశారు. అనంతరం గాయాలకు చికిత్స అందించారు. కాగా ఇటీవల లిఫ్ట్ ప్రమాదాలు తరచుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. -
లిఫ్ట్‌లో చిక్కుకుని తల్లడిల్లిన పసిపాప.. ఊపిరి ఆగిపోయింది..
హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలిలో హృదయాలను పిండేసే విషాద ఘటన చోటుచేసుకుంది. గౌలిదొడ్డిలో ఉన్న ‘మహి వుమెన్ పీజీ’లో ఐదేళ్ల చిన్నారిని లిఫ్ట్ బలిదీసుకుంది. ఆడుకుంటూ అమాయకంగా గ్రిల్స్ ఉన్న లిఫ్ట్‌లోకి వెళ్లిన చిన్నారి బిస్తు సేఫ్ (5) అందులోనే చిక్కుకుపోయింది. ఆ తర్వాత నొప్పితో తల్లడిల్లిపోయింది. ఆ పసిపాప బయటపడలేకపోవడంతో చివరకు ఆమె ఊపిరి ఆగిపోయింది. జార్ఖండ్‌కు చెందిన బిస్తు సేఫ్ తన తాత, అమ్మమ్మలతో కలిసి ఆ హాస్టల్లో ఉంటోంది. కళ్లముందే ఆ చిన్నారి ప్రాణం పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. క్షణాల వ్యవధిలో ఆమె జీవితం ఆగిపోవడం.. కుటుంబానికి తట్టుకోలేని దుఃఖాన్ని మిగిల్చింది. పసిపాప నవ్వులతో మార్మోగాల్సిన ఆ ప్రదేశం ఇప్పుడు విషాదంతో నిండిపోయింది. ఈ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒక అమాయక ప్రాణం ఇలా లిఫ్ట్‌లో ఇరుక్కుపోవడం భద్రతా ప్రమాణాలపై ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా, ప్రతి లిఫ్ట్‌కి సరైన భద్రతా చర్యలు తీసుకోవడం అత్యవసరం. -
జైలు జీవితం చూడాలంటే ఇదే ఛాన్స్! ఫీజు ఎంతంటే?
-
నేపాల్ పని మనుషులతో జాగ్రత్త.. మత్తు మందు ఇచ్చి.. చేతులు కట్టేసి..
-
సిటీలో దారుణం.. నేపాలీ పని మనుషులతో జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జవహర్‌నగర్‌లో నేపాలీ గ్యాంగ్ హల్చల్ చేసింది. ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ గ్యాంగ్.. ఓనర్ దంపతుల చేతులు, కాళ్లు కట్టేసి ఇంట్లో దోపిడీకి పాల్పడ్డారు. ఇంట్లోని 60 తులాల బంగారం, వెండి, రూ.30వేల నగదు చోరీ చేశారు. వరుస ఘటన నేపథ్యంలో పని మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందేనని పలువురు చెబుతున్నారు.వివరాల మేరకు.. జవహర్‌నగర్‌లోని కౌకుర్‌లో మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్ చేసింది. గల్ప్ ఎన్‌క్లేవ్‌లో దంపతులు చేతులు, కాళ్లు కట్టేసి దోపిడీకి పాల్పడ్డారు. డాక్టర్ విజయలక్ష్మీ దంపతులకు మత్తు మందు ఇచ్చి దోపీడి చేశారు. కాగా, నేపాలీ గ్యాంగ్ 13 రోజుల క్రితమే వారి ఇంట్లో పని మనుషులుగా చేరారు. అయితే, నేపాలీ మహిళ పుట్టినరోజు వేడుకలు చేసుకుంటామని డాక్టర్ దంపతులను కోరడంతో వారు అందుకు అంగీకరించారు. ఈ క్రమంలో పని మనుషుల బంధువుల పేరుతో మరో ముగ్గురు నేపాలీలు ఇంట్లోకి వచ్చారు. అనంతరం.. ఇంట్లో పనిచేస్తున్న వారితో పాటు మరో ఐదుగురు కలిసి దోపిడీకి పాల్పడ్డారు. డాక్టర్ దంపతులకు మత్తు మందు ఇవ్వడంతో వారు నిద్రలోకి వెళ్లారు. దీంతో, ఇంట్లోని 60 తులాల బంగారం, వెండి, రూ.30వేల నగదు చోరీ చేశారు. దోపిడీ సమయంలో సదరు ముఠా.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసింది. ఆధారాలు లేకుండా చేసే ప్రయత్నం చేసి పరారీ అయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నట్టు తెలిసింది. ఇదిలా ఉండగా.. కొద్దిరోజుల క్రితమే విశ్రాంత ఐపీఎస్ సతీమణి తనూజ రంజన్ హత్య కేసులో నిందితులు కూడా నేపాలీలు కావడం తెలిసిన విషయమే. ఈ హత్య కేసులో కీలక సూత్రధారి కల్పన అలియాస్ ధర్మ (30) నేపాలీ గ్యాంగ్ స్కెచ్‌లో భాగంగానేహైదరాబాద్కు వచ్చిందని పోలీసులు అనుమానిస్తున్నారు. కల్పన కాల్‌డేటాను విశ్లేషించిన పోలీసులకు బెంగళూరులోని ఆమె భర్తగా పేర్కొంటున్న వ్యక్తితో ఎక్కువగా మాట్లాడిందని, అతడితో పాటు మరికొంతమంది వ్యక్తులతో సైతం ఫోన్లో మాట్లాడినట్లు తేలింది. వారందరిపై పోలీసులు నిఘా పెట్టారు. నగరంలో కల్పనను ఉద్యోగంలో నియమించిన వ్యక్తులను సైతం అదుపులోకి తీసుకుని వివరాలు సేకరిస్తున్నారు.కల్పన తల్లిదండ్రులు పూణేలో నివాసం ఉంటారని గుర్తించిన పోలీసులు వారిని సైతం ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. నేపాల్ సరిహద్దులు దాటేందుకు యూపీలోని మూడు ప్రాంతాల్లో అవకాశం ఉండగా, అక్కడకు ఇప్పటికే చేరుకున్న పోలీసులు వారికోసం కాపు కాస్తున్నారు. కాగా తనూజరంజన్ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన వైద్యులు ప్రాథమిక నివేదిక అందజేసినట్లు తెలుస్తోంది. నేపాల్‌లో ఉంటూనే భారత్‌లో వందలాదిమంది నేపాలీ వ్యక్తులను పావులుగా వాడుకుంటూ చోరీలు చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు విదేశీ వ్యవహారాలశాఖ సాయం తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. -
బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌కు సిట్ నోటీసులు
సాక్షి,హైదరాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు దర్యాప్తు ముమ్మరమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పర్యవేక్షణాధికారిగా నియమితులైన కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ సిట్ బృందం బండి భగీరథ్‌కు నోటీసులు జారీ చేసింది. పోక్సో కేసులో నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసుల్లో రేపు మధ్యాహ్నం 2గంటలకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో సిట్ విచారణకు హాజరు కావాలని సూచించింది.భగీరథ్‌ను వెంట తీసుకుని రావాలని కరీంనగర్లో నివసించే అతని మేనమామ వంశీ కృష్ణకు పోలీసులు నోటీసులు పంపించారు. మరోవైపు బండి బగీరథ్ మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అభ్యర్థిస్తూ నేడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎల్లుండి విచారణకు రానుట్లు తెలుస్తోంది. భగీరథ్.. తన కుమార్తెను వేధిస్తున్నాడంటూ 17 ఏళ్ల బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఈ నెల 8న కేసు నమోదైన సంగతి తెలిసిందే. మరోవైపు ఆ బాలిక, ఆమె తల్లి తనను డబ్బు కోసం బెదిరిస్తున్నారంటూ భగీరథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 8వ తేదీనే కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు తర్వాత భగీరథ్ అజ్ఞాతంలోకి వెళ్లారు. సోమవారం (మే11,2026)న భగీరథ్ పోక్సో కేసు వ్యవహారంలో కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఈ మేరకు మెమో జారీ చేసింది. ‘‘సైబరాబాద్ కూకట్పల్లి జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రితిరాజ్ పెట్-బషీరాబాద్ పోలీస్ స్టేషన్ క్రైం నెం. 684/2026లో బీఎన్ఎస్ 74, 75 సెక్షన్లు, పోక్సో 12 సెక్షన్ కింద నమోదైన కేసు దర్యాప్తును వ్యక్తిగతంగా పర్యవేక్షించాల్సిందిగా కోరుతున్నాం.దర్యాప్తు సరైన, నిష్పాక్షిక, వృత్తిపరమైన విధానంలో సాగేటట్లు చూసి, కేసుకు సంబంధించిన అన్ని అంశాలను నిర్లక్ష్యం లేకుండా, ఎటువంటి తప్పుదారి పట్టింపు లేకుండా పరిశీలించాల్సిందిగా ఆమెకు ఆదేశాలు ఇచ్చాం. దర్యాప్తు పురోగతిని డీసీపీ వ్యక్తిగతంగా పర్యవేక్షించి, ప్రతిరోజూ దర్యాప్తు నివేదికపై సంతకం చేసిన అధికారికి తప్పనిసరిగా సమర్పించాలి’’ అని పేర్కొంది. -
తాను చనిపోయి 5 మందికి ప్రాణదానం
-
ఆమ్మో ఇదేం బావి అవాక్ అవుతున్న కాలనీ వాసులు
-
బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ కోసం బండి భగీరథ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు మే 14న విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.ఇక ఈ కేసు విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. సిట్ బృందం భగీరథ్‌ను స్వయంగా విచారణ చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. పోక్సో కేసు నమోదు, సిట్ ఏర్పాటు పరిణామాల నడుమ భగీరథ్ పరారీలో ఉన్నాడు. అతని ఆచూకీ తెలిసిన వెంటనే పోలీసులు విచారణ చేపట్టనున్నారు. ఇప్పటికే బాధితురాలి స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. ఆ స్టేట్మెంట్ ఆధారంగా భగీరథ్‌ను ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో బండి భగీరథ్ మధ్యంతర బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కేసు పూర్వాపరాల్ని పరిశీలిస్తే బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై పేట్ బషీరా బాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన పోక్సో కేసు దర్యాప్తును ప్రత్యేక బృందానికి అప్పగించారు. కూకట్పల్లి జోన్ డీసీపీ రితిరాజ్ ఈ టీమ్‌ను పర్యవేక్షించనున్నారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీసు కమిషనర్ ఎం. రమేశ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కుత్బుల్లాపూర్ సమీపంలోని సుచిత్రలో నివసించే పదిహేడేళ్ల బాలికపై భగీరథ అసభ్యంగా ప్రవర్తించి ఇబ్బందులకు గురి చేశారనే ఫిర్యాదు మేరకు శుక్రవార రాత్రి పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. తనతో స్నేహం చేసిన భన రథ డిసెంబర్ 31న మొయినాబాద్ లోని ఫామ్ హౌస్‌కు తీసుకువెళ్లారని, పెళ్లి చేసుకుంటానంటూ ఆదేరోజు రాత్రి అసభ్యంగా ప్రవర్తించారని మైనర్ ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భగీరథపై కేసు నమోదు చేశారు.బాలికను భరోసా కేంద్రానికి తీసుకువెళ్లడంతో పాటు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అయితే పేట్ బషీరాబాద్ ఠాణాలో కేసు నమోదుకు ముందే కరీంనగర్ లో సదరు బాలికపై భగీరథ ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో డీజీపీ సీవీ ఆనంద్ సోమవారం సమీక్ష నిర్వహించారు. కాగా ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా విచారణ సాగుతుందని, ప్రతి అంశాన్నీ పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేస్తామని సైబరాబాద్ సీపీ ప్రకటించారు. మరోవైపు భగీరథపై వార్తా పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఈ కేసును రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సుమోటోగా స్వీకరించింది.బండి భగీరథ పరారీలో ఉన్నట్లు కేసు విచారణాధికారి,డీసీపీ రీతిరాజ్ సోమవారం మీడియాకు తెలిపారు. మూడు రోజులుగా అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ లో ఉందని చెప్పారు. అతని ఆచూకీ కోసం గాలి స్తున్నామని, కాల్ డేటా రికార్డ్ (సీడీఆర్) పరిశీలిస్తుస్తున్నామని వెల్లడిం చారు. బాలిక స్టేట్మెంట్ రికార్డ్ చేశామని, మరిన్ని వివరాల కోసం ఇం కోసారి ప్రశ్నిస్తామని వివరించారు. -
బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్టు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపిన బండి సంజయ్ తనయుడి కేసు మరో మలుపు తిరిగేలా కనిపిస్తోంది. ఈ కేసులో భగీరథ్‌ను విచారించాలని ప్రత్యేక దర్యాప్తు బృందం భావిస్తోంది. అలాగే బాధితురాలి స్టేట్మెంట్ను మరోసారి రికార్డ్ చేసే అవకాశం కనిపిస్తోంది. కేసు దర్యాప్తు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించిన మరుసటిరోజే ఈ పరిణామాలు చోటు చేసుకుంటుండడం గమనార్హం. ఈ కేసులో ఇప్పటికే బాధితురాలు, ఆమె కుటుంబం స్టేట్మెంట్లు నమోదు అయ్యాయి. అయితే సిట్ ఏర్పాటు నేపథ్యంలో మరోసారి రికార్డు చేయాలని అనుకుంటోంది. తద్వారా ఎఫ్ఐఆర్లోని సెక్షన్లు మార్చే అవకాశమూ కనిపిస్తోంది. అలాగే బండి భగీరథ్ ఆచూకీ లేకుండా పోయాడన్న ప్రచారం నేపథ్యంలో నోటీసులు ఇచ్చి మరీ విచారణ జరిపొచ్చని తెలుస్తోంది. మైనర్ బాలిక కేసుతో పాటు గతంలో జరిగిన ఘటనలు, సోషల్ మీడియా వైరల్ వీడియోల ఆధారంగా విచారణ జరిపే చాన్స్ ఉంది. అలాగే కేసుల్లో సంబంధం ఉన్నవారిని సైతం సిట్ విచారించవచ్చని తెలుస్తోంది. కేసు విచారణను వేగవంతం చేయడానికి పేట్ బషీరాబాద్ ఏసీపీ, ఇన్స్పెక్టర్లతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) చీఫ్, కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ ఇప్పటికే సమావేశం నిర్వహించి, భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేశారు.ఈ కేసుపై ఆమె స్పందిస్తూ.. ‘‘పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు నంబర్ 684/2026 కింద దర్యాప్తు జరుపుతున్నాం. ఈ కేసులో అందుబాటులో ఉన్న అన్ని వివరాలను ఇప్పటికే అధ్యయనం చేశాం. చట్టప్రకారం అవసరమైన అన్ని ఆధారాలు సేకరిస్తున్నాం. ఫోన్ కాల్ డేటా, టెక్నికల్ ఎవిడెన్స్‌తో పాటు ఇతర ముఖ్యమైన ఆధారాలు కూడా సమీకరిస్తున్నాం. నేరం రుజువైతే నిందితుడిని తప్పకుండా అరెస్టు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. బాధితురాలికి న్యాయం చేస్తాం’’ అని వెల్లడించారామె. -
తెలంగాణలో బండి సంజయ్ తనయుడు భగీరథపై నమోదైన కేసు
-
బండి భగీరథ్ కేసులో ట్విస్ట్.. టార్గెట్ బండి సంజయ్!
-
పట్టపగలే పంజాగుట్టలో రూ.15లక్షల మాయం
సాక్షి, హైదరాబాద్: పట్టపగలే పంజాగుట్టలో రూ.15 లక్షలు ఉన్న బ్యాగ్ మాయమైంది. నగదు డిపాజిట్ చేసేందుకు బ్యాంక్‌కు వచ్చిన ఆఫ్షద్ అనే వ్యక్తి.. గణేష్ స్టాంప్స్ అండ్‌కో వద్ద ఆగి బ్యాగ్‌ను కుర్చీలో పెట్టారు. రూ.15 లక్షలు నగదు ఉన్న బ్యాగ్‌ను క్షణాల్లో చోరీచేశారు. బాధితుడు పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. సీపీఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. -
రూ.500కే.. జైలు యోగం!
చంచల్‌గూడ (హైదరాబాద్): సాధారణంగా జైలుకెళ్లాలంటే ఏదో ఒక నేరం చేయాలి.. పోలీసులు అరెస్ట్ చేయాలి.. కోర్టు రిమాండ్ విధించాలి.. ఇదంతా పాత పద్ధతి. అసలు సిసలైన ‘ఖైదీ’ఫీలింగ్ కోసం ఇకపై అలాంటి కష్టాలేమీ పడక్కర్లేదు. కేవలం ఐదు వందల రూపాయలు జేబులో ఉంటే చాలు, చంచల్‌గూడ జైలు గేట్లు మీ కోసం గౌరవంగా తెరుచుకుంటాయి!.. మీరు చదివింది నిజమే. తెలంగాణ జైళ్ల శాఖ ఆలోచనతో చంచల్గూడలోని శిక్షణ సంస్థ (సీకా) ప్రాంగణంలో సరికొత్త ‘జైలు మ్యూజియం’కొలువుదీరింది. మంగళవారం ఉదయం గవర్నర్ శివప్రతాప్ శుక్లా దీనికి రిబ్బన్ కట్ చేయగానే, పర్యాటకులు క్యూ కట్టేయొచ్చు.రూ.500 టికెట్ కొంటే,ఒక్క రోజంతా జైలు వాతావరణాన్నిఅనుభవించవచ్చు. కేసుల భయం లేదు, బెయిల్ కోసం తిప్పలు లేవు!పాత కాలపు శిక్షలు ఎలా ఉండేవి?జైలు విధానాలు ఏంటన్నవిపెయింటింగ్స్ రూపంలో చూపిస్తూ మనల్ని భయపెడతారు. నేను జైలు చూశానని కాలర్ఎగరేయడానికి ఇదో సువర్ణావకాశం. -
1 నుంచి ప్రెస్ క్లబ్ సభ్యులకు మాస్టర్ హెల్త్ చెకప్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ వారోత్సవాల్లో భాగంగా నిమ్స్ ఆస్పత్రిలో ప్రెస్ క్లబ్ సభ్యులు అందరికీ మాస్టర్ హెల్త్ చెకప్ చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హామీ ఇచ్చారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శ్రీగిరి విజయ్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేష్ వరికుప్పల, ఉపాధ్యక్షురాలు అరుణ అత్తలూరి సోమవారం సచివాలయంలో మంత్రి దామోదర్ రాజ నరసింహకు వినతి పత్రం సమరి్పంచారు. తెలంగాణ ఆవిర్భావ వారోత్సవాల్లో భాగంగా జూన్ 1 నుంచి నిమ్స్‌లో మాస్టర్ హెల్త్ చెకప్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ ఈ స్పెషల్ డ్రైవ్‌లో మాస్టర్ హెల్త్ చెకప్ ఉచితంగానే చేస్తామని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. ఇందుకు నిమ్స్‌లో అవసరమైన ఏర్పాటు చేయాలని దామోదర్ రాజనర్సింహ రాష్ట్ర ఆరోగ్య విభాగం కార్యదర్శి క్రిస్టినాను ఆదేశించారు. -
పెళ్లి చేసుకుందామనుకున్నా.. నా మరదలినే ప్రేమిస్తావా..!
హైదరాబాద్: చిలకలగూడలో యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని తేలచ్చారు. సోమవారం అంబర్‌పేటలో డీసీపీ రక్షిత కె మూర్తి వివరాలు వెల్లడించారు. నామలగుండుకు చెందిన యవన్(21) చిలకలగూడకు చెందిన యువతి పాఠశాల స్థాయి నుంచే ప్రేమించుకుంటున్నారు. ఇటీవల జవహార్‌నగర్‌లో డబుల్బెడ్రూం కేటాయించడంతో అక్కడికి కుటుంబాన్ని మార్చారు. అయితే యవన్ సోదరి కుటుంబం నామలగుండు ప్రాంతంలో ఉండడంతో వస్తూ పాత స్నేహితులతో పాటు యువతితో సైతం సంప్రదిస్తున్నాడు. యువతి బావ అల్లాబోయిన సాయికిరణ్ సైతం వరసకు యువతి మరదలు కావడంతో పెళ్లి చేసుకుందమని భావించాడు. అప్పటికే సాయికిరణ్ చిలకలగూడ పోలీసు స్టేషన్ పరిధిలో రౌడిïÙటర్. దీంతో ప్రేమ వ్యవహారానికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించి కుటుంబ సభ్యులతో చర్చించారు. యవన్‌ను హత్య చేయడమే పరిష్కారమని భావించి పథకం వేశారు. ఈ నెల 7న స్నేహితుడు సుబ్బు ఇంటికి యవన్ వచ్చినట్లు తెలుసుకున్నారు. యవన్‌ను బయటకు పిలిచి దాడి చేశారు. పెళ్లి చేసుకుందామనుకుంటున్న నా మరదలిని ప్రేమిస్తావా అంటూ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. పోలీసులు విచారణ జరిపి యవన్ హత్యకు కారణమైన యువతి బావ అల్లబోయిన సాకిరణ్(27), తండ్రి రాజం నర్సింహాయాదవ్, బాబాయ్‌లు రాజం శ్రీశైలం యాదవ్(48), రాజం మల్లేశ్‌యాదవ్(48), సోదరులు రాజం పరేమేశ్ యాదవ్(19, రాజం వంశీకృష్ణ(19, రాజం మనీష్(21), వీరి స్నేహితులు సిరిగిరి రాహుల్(22), కుచ్చుల శివనందన్‌యాదవ్(20)తో పాటు మరో మైనర్ బాలున్ని అరెస్టు చేశారు. -
ఆటగాళ్ల ఎంపికపై ‘సెలక్షన్ షీట్’
సాక్షి, హైదరాబాద్: దేశవాళీ క్రికెట్లో పాల్గొనే హైదరాబాద్ జట్ల ఎంపికలో మరింత పారదర్శకత పాటిస్తామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆపరేషన్స్ హెడ్, మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వెల్లడించాడు. ప్రతిభ గల ఆటగాళ్లను జట్టులోకి తీసుకునే ప్రక్రియలో భాగంగా దేశంలోనే తొలిసారిగా ‘సెలక్షన్ షీట్’ను తీసుకొస్తున్నామని అతను చెప్పాడు. దీని ప్రకారం ఇకపై ఎవరిని జట్టులోకి ఎంపిక చేసినా అందుకు తగిన కారణం, వారి ప్రదర్శన వివరాలతో పాటు ఎవరినైనా తప్పిస్తే అందుకు గల కారణాలను కూడా రాతపూర్వకంగా నమోదు చేస్తారు. కాబట్టి క్రికెటర్ల ఎంపిక ఎవరికీ అనుమానాలు లేని రీతిలో సాగుతుందని రాయుడు స్పష్టం చేశాడు. సోమవారం జరిగిన మీడియా సమావేశంలో హెచ్‌సీఏ కార్యదర్శి ఎం.జీవన్ రెడ్డితో కలిసి రాయుడు ఈ వివరాలు వెల్లడించాడు. త్వరలోనే ఓపెన్ సెలక్షన్స్ కూడా నిర్వహిస్తామని... హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే విషయంలో కూడా మూడు అంచెల్లో ఎంపిక జరుగుతుందని అతను వివరించాడు. ఈ సందర్భంగా హైదరాబాద్ సీనియర్, జూనియర్ సెలక్షన్ కమిటీలను రాయుడు ప్రకటించాడు. సీనియర్ సెలక్షన్ కమిటీకి అక్షత్ రెడ్డి చైర్మన్‌గా వ్యవహరించనుండగా... తిరుమలశెట్టి సుమన్, మెహదీ హసన్, టి.పవన్ కుమార్, ఇంద్రశేఖర్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. పి.రమేశ్ కుమార్, షోయబ్, సర్వేశ్ కుమార్, టిమోతీ కుమార్ సభ్యులుగా ఉన్న జూనియర్ సెలక్షన్ కమిటీకి ఆకాశ్ భండారీని చైర్మన్‌గా ఎంపిక చేశారు. -
‘ప్రభుత్వ పాఠశాలలే దేశ భవిష్యత్‌కు వేదికలు’
హైదరాబాద్: విద్యాశాఖను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని నిర్ణయించామన్నారు రేవంత్. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా నగరంలోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన విద్యా వారోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ ప్రసంగించారు. ‘రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీలను అభివృద్ధి చేస్తున్నాం. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని నిర్ణయించాం. విద్యాశాఖ పనితీరు నీతి ఆయోగ్ కూడా ప్రశంసించింది. నర్సరీ నుంచి 12వ తరగతి వరకూ పేదవారికి విద్యను అందిస్తాం. ప్రైవేటు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారుచేస్తాం. విద్యాశాఖకు అంచెలంచెలుగా 15 శాతం నిధులు కేటాయిస్తాం. ప్రభుత్వ పాఠశాలలే దేశ భవిష్యత్‌కు వేదికలు. తెలంగాణ కల సాకారంలో విద్యార్థుల కృషి వెలకట్టలేనిది. 22వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చాం.’ అని రేవంత్ పేర్కొన్నారు.విద్య మూలంగానే కుటుంబాలు ఉన్నత శిఖరాలకు..మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రసంగిస్తూ.. ‘ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ లో బాగంగా ఈరోజు ముఖ్యమంత్రి విద్యా వారోత్సవాలు ప్రారంభించారు. అందులో భాగంగా దాదాపు 1100 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలతో పాటు ,క్యూర్ ప్రాంతంలో నిర్మించే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. సీఎం రేవంత్ చెప్తుంటారు..విద్యార్థి సంఘ్ రాజకీయాల నుండి వచ్చిన వ్యక్తిగా అనేక సమావేశాల్లో వేదికలపై చెప్పడం జరిగింది.. ఒక వ్యక్తి అభివృద్ధి వెనుక కులం , మతం డబ్బు కారణం కాదు ,విద్య మూలంగానే కుటుంబాలు ఉన్నత శిఖరాలకు చేరుతాయి’ అని తెలిపారు. -
‘యావన్‌ను హత్య చేయడానికి కారణం అదే’
సికింద్రాబాద్: చిలకలగూడకు చెందిన యావన్ హత్య ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని సికింద్రాబాద్ డీసీపీ రక్షిత స్పష్టం చేశారు. అమ్మాయి కుటుంబ సభ్యులు ప్లాన్ ప్రకారం హత్య చేశారన్నారు. అమ్మాయి తండ్రి, బాబాయి, బావ, అన్న, కజిన్ బ్రదర్స్ కలిసి యావన్‌ను హత్య చేసినట్లు గుర్తించామన్నారు. మే 7వ తేదీ జరిగిన ఈ హత్య కేసుకు సంబంధించి వివరాలను డీసీపీ మీడియాకు వెల్లడించారు.మే 7 అర్ధరాత్రి యావన్ హత్య జరిగింది. ఐదు ప్రత్యేక బృందాలతో ఈ కేసు దర్యాప్తు చేసాము.. యావన్, చంద్రికలు స్కూల్ డేస్ నుండి ఫ్రెండ్స్.. గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. గతంలో అమ్మాయి కుటుంబ సభ్యులు యావన్ ను హేచ్చరించారు. హత్యకు ఐదు రోజుల ముందే హత్య కోసం నిందితులు ప్లాన్ చేసుకున్నారు. అందరూ కలిసి రెక్కి నిర్వహించారు. A1 అల్లబోయిన సాయి కిరణ్ యువతి బావ.. ప్రధాన నిందితుడు..హత్య కు ప్లాన్ చేశారు. సాయి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఈ కేసులో మొత్తం 10 మందిని అరెస్ట్ చేశాం. నిందితులలో ఇద్దరికి గాంజా పాజిటివ్ వచ్చింది ఈ కేసులో మొత్తం 9 మంది నిందితులతో పాటు ఓ మైనర్ అరెస్ట్ చేశాం’ అని తెలిపారు. ప్రేమించాడని నరికి చంపారు.. -
చిలకలగూడ యువకుడి కేసులో 10 మంది నిందితుల అరెస్ట్
-
చంద్రబాబు ఇంటికే.. మోదీ ఎందుకు వెళ్లారు?
-
మోదీ సభ.. కదం తొక్కిన కాషాయ దళం (ఫొటోలు)
-
‘క్లూ’ దొరికింది
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్లో విశ్రాంత ఐపీఎస్ వినయ్ రంజన్ భార్య తనూజ రంజన్‌ను పని మనిషితో పాటు మరో ముగ్గురు నేపాలీలు హత్య చేసి, నగదు, నగలతో ఉడాయించిన ఘటనపై పోలీసులు సీరియస్‌గా దృష్టి సారించారు. నిందితులు పుణెలో ఉన్నట్లు సమాచారంతో గ్యాంగ్‌ను పట్టుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. హత్య జరిగిన రాత్రి నిందితులు నాంపల్లి రైల్వే స్టేషన్లో తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలులో వెళ్లి పుణెలో దిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పది పోలీసు బృందాలు అక్కడ జల్లెడ పడుతున్నాయి. కాగా.. నిందితురాలు కల్పన లక్నోలో పని చేస్తున్న సందర్భంలో కూడా నేరాలకు పాల్పడినట్లు.. పథకం ప్రకారం హైదరాబాద్‌కు వచ్చి సంపన్నుల ఇళ్లలో పని చేస్తూ వారి కదలికలను గమనిస్తూ అవకాశం రాగానే అందినకాడికి దండుకుంటున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. లక్నోలో కల్పన పని చేసిన ఇంట్లోనూ ఓ పోలీసు బృందం విచారణ చేపట్టింది. మూడు బృందాలు నేపాల్ సరిహద్దులో తిష్టవేశాయి. ముంబై, ఢిల్లీ, కోల్‌కతాలో కూడా మరో మూడు బృందాలు నిఘా పెట్టి నిందితుల కోసం గాలిస్తున్నాయి. ఘటన జరిగిన తర్వాత నిందితులు పుణె చేరుకోగా అక్కడ నుంచి ఎక్కడిడి ప్రయాణం కాలేదని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో పుణె చుట్టూ బృందాలు నిఘా పెట్టాయి. వినయ్ రంజన్ ఇంట్లో ఈ గ్యాంగ్ 225 గ్రాముల బంగారు ఆభరణాలను దోచుకెళ్లింది. నగదు ఎంత చోరీ అయిందనేది ఇంకా లెక్క తేలలేదు. నేడో, రేపో నిందితులను పట్టుకునే దిశలో పోలీసులు ముమ్మర గాలింపు చేపడుతున్నారు. నిందితుల వద్ద ఎలాంటి సెల్ఫోన్లు లేవని పోలీసులు గుర్తించారు. రెండు సెల్ఫోన్లు హైదరాబాద్‌లోనే పడేసిపోయినట్లు సమాచారం. నగర పోలీస్ కమిషనర్ సజ్జనర్ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. -
సినీ రంగంలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో యువ హీరో మృతి
-
తెలంగాణలోనూ గెలుస్తాం... పరేడ్‌గ్రౌండ్స్ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ
-
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు షార్ట్ ఫిల్మ్ యాక్టర్ల మృతి
ఇబ్రహీంపట్నం రూరల్: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు షార్ట్ ఫిల్మ్ యాక్టర్లు మృతిచెందారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వేదాయపాలేనికి చెందిన కత్తి భరత్‌కాంత్(31), గూడ సాయి త్రిలోక్(31) అనే ఇద్దరు షార్ట్ ఫిల్మ్ యాక్టర్లు శనివారం సాయంత్రం నెల్లూరు నుంచి కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు. ఓఆర్ఆర్ మీదుగా శంషాబాద్ వైపు వస్తుండగా బొంగ్లూర్ ఎగ్జిట్–12 సమీపంలో కారు డ్రైవర్ అతివేగంగా వెళ్లడంతో అదుపుతప్పి ఎదురెదురుగా వెళ్తున్న కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న కత్తి భరత్‌కాంత్, గూడ సాయి త్రిలోక్‌కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఆదివారం తెల్లవారుజామున 3.20గంటల సమయంలో ఓఆర్ఆర్ పెట్రోలింగ్ అధికారి శ్రీకాంత్ ఇచి్చన సమాచారం మేరకు రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. -
ఈ నెల 12 బీఆర్ఎస్ సమావేశం.. హాజరుకానున్న కేసీఆర్
సాక్షి హైదరాబాద్: ఈ నెల 12వ తేదీన కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. . ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వం, బలోపేతంపై అంతర్గతంగా చర్చించనున్నట్లు పేర్కొంది. త్వరలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికలు సైతం జరిగే అవకాశం ఉండడంతో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి చేరిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో కేసీఆర్ ప్రసంగం సూపర్ హిట్ అయ్యింది. దీంతో బీర్ఎస్ శ్రేణులు జోరుమీదున్నాయి. ఈ నేపథ్యంలోనే గులాబీ బాస్ మరోసారి నాయకులకు దిశా నిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. -
అందుకే బీజేపీ మళ్లీ మళ్లీ గెలుస్తోంది: ప్రధాని మోదీ
హైదరాబాద్: నగరంలోని పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని మాట్లాడారు. మోదీ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘‘బెంగాల్‌లోని విజయ ఉత్సాహం తెలంగాణలోనూ కనపడుతోంది. తొలిసారి బెంగాల్లో అఖండ విజయం సాధించాం.పుదుచ్చేరిలోనూ మరోసారి ఎన్డీఏనే గెలిచింది. అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించింది. నిన్న నేను బెంగాల్లో ఉన్నాను. తొలిసారి అక్కడ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారి బెంగాల్లో భారతీయ జనతా పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఈ చారిత్రాత్మక విజయోత్సాహం తెలంగాణలో కూడా కనిపిస్తోంది. ఇక్కడ ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఉత్సాహంతో నిండిపోయి ఉన్నారు. ఈ రోజు దేశం నలుమూలలా భారతీయ జనతా పార్టీకి ప్రజల ఆశీర్వాదం నిరంతరం పెరుగుతోంది. భారతీయ జనతా పార్టీ అభివృద్ధి నమూనాకు ప్రజలు మళ్లీ మళ్లీ తమ ఆమోద ముద్ర వేస్తున్నారు. నిన్న నేను బెంగాల్లో ఉన్నాను. తొలిసారి అక్కడ బీజేపీ సీఎం ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణలో ప్రతి బీజేపీ కార్యకర్త ఉత్సాహంతో నిండిపోయి ఉన్నారు. దేశం నలుమూలలా బీజేపీకి ప్రజల నుంచి ఆరదణ నిరంతరం పెరుగుతోంది. బీజేపీ అభివృద్ధి నమూనాకు ప్రజలు మళ్లీ మళ్లీ ఆమోద ముద్ర వేస్తున్నారు. పచ్చిమ బెంగాల్లో బీజేపీ విజయంతో దేశం అంతా సంబరాలు జరుగుతున్నాయి. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిని పెంచింది. పశ్చిమ బెంగాల్‌ను సంకెళ్ల బందీ నుంచి విడదీశాం. ఇక తెలంగాణలో అబ్ కీ బార్ బీజేపీ సర్కార్. దేశంలో కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో అధికారంలో మాత్రమే ఉంది. అబద్ధాలు చెప్పడం కాంగ్రెస్ నైజం. తెలంగాణలో అబద్ధాలతో ప్రభుత్వం నడుస్తుంది. కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల కంటే లెఫ్ట్ అయింది. కాంగ్రెస్ ముస్లిం లీగ్ కంటే ఎక్కువగా కాంగ్రెస్ ముస్లిం లీగ్ అయింది. మావోయిస్టులను కాంగ్రెస్ ఎన్నో ఏండ్ల నుంచి రక్షిస్తుంది. తెలంగాణ పోలీస్ కేంద్రంతో కలిసి పనిచేసి ఉంటే మావోయిస్టులు ఎప్పుడో ఖతం అయ్యేవారు. కొంత ఆలస్యం అయినా మావోయిస్టులు ఖతం అయ్యారు. కొత్త విజన్, ఆలోచన, వికసిత్ తెలంగాణ పేరుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది’’ అని తెలిపారు . -
మోదీ కాన్వాయ్ చూస్తే మైండ్ పోవాల్సిందే
-
‘‘రాజకీయాలు మాట్లాడబోనని రేవంత్ అన్నారు.. నేను కూడా..’’
హైదరాబాద్: ‘‘రాజకీయాలు మాట్లాడబోనని రేవంత్‌రెడ్డి అన్నారు. నేను కూడా రాజకీయాలు మాట్లాడబోను’’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ చమత్కరించారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా హెచ్ఐసీసీలో నిర్వహించిన సభలో మోదీ పాల్గొన్నారు. పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. మోదీ ప్రసంగానికి ముందు రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. ఆ సమయంలో రేవంత్ చేసిన వ్యాఖ్యను గుర్తు చేస్తూ మోదీ పై విధంగా వ్యాఖ్యానించడంతో అక్కడున్న వారంతా చిరునవ్వులు చిందించారు.కాగా, మోదీ ప్రసంగిస్తూ.. ‘‘గుజరాత్‌కు యూపీఏ హయాంలో ఎన్ని నిధులు ఇచ్చారో తెలంగాణకు అంతే నిధులు ఇస్తాం. దీంతో తెలంగాణకు అందుతున్న నిధుల్లో సగం కోత పడుతుంది. కాబట్టి మీరు ఎక్కడికైతే చేరుకోవాలనుకుంటున్నారో అది సాధ్యం కాదు. మీరు కూడా నాతో కలిసి రండి సైబరాబాద్ అభివృద్ధికి వేల కోట్లు రూపాయలు కేటాయించాం. తెలంగాణలో జాతీయ రహదారులు రెట్టింపు అయ్యాయి. ఇప్పుడు బడ్జెట్లో తెలంగాణకే రూ.5,500 కోట్లు రైల్వే పనులకు కేటాయించాం. దేశంలో టెక్స్టైల్ రంగానికి ఊతమిచ్చేలా నిర్ణయాలు తీసుకున్నాం. వరంగల్ పీఎం మిత్ర పార్కు ద్వారా దేశంలో టెక్స్టైల్స్ రంగానికి ఊతమిస్తుంది.అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలతో ఉద్యోగ కల్పన జరుగుతుంది. ఉద్యోగ అవకాశాలకు హైదరాబాద్ కేంద్రంగా మారింది. ఇప్పుడు తెలంగాణ రైల్వే బడ్జెట్ ఎన్నో రెట్లు పెరిగింది. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోంది. 2014లో ఉమ్మడి ఏపీలో రైల్వే బడ్జెట్ రూ.1000 కోట్లు మాత్రమే. హైదరాబాద్ అభివృద్ధికి వేలాది కోట్లు కేటాయించాం. రోడ్లు, రైల్ కనెక్టివిటీని పెంచాం. తెలంగాణ అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది.’’ అని చెప్పారు. -
Watch Live: హైదరాబాద్ లో ప్రధాని మోదీ పర్యటన
-
‘బండి సంజయ్ కుమారుడి ఎపిసోడ్.. 36 గంటలైనా కేసు లేదా?’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడిపై కేసు విషయంలో రాజకీయం హీటెక్కింది. బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై పోక్సో కేసు నమోదు చేయడంలో పోలీసుల జాప్యంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం కోసం బాధితురాలు పోలీస్ స్టేషన్‌కు వెళ్తే.. కేసు నమోదు చేయడానికి 8 గంటల సమయం ఎందుకు పట్టిందని ప్రశ్నించారు.మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా..‘బాధితురాలు న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కి వెళ్తే.. కేసు నమోదు చేయడానికి 8 గంటల సమయం ఎందుకు పట్టింది?. కేసు నమోదై 36 గంటలు గడుస్తున్నా నిందితులపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్ర హోంమంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య చీకటి ఒప్పందానికి, కుమ్మక్కు రాజకీయాలకు ఇంతకంటే నిదర్శనం వేరే ఏమైనా ఉంటుందా? పోలీసులు వెంటనే నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.బాధితురాలు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్తే.. కేసు నమోదు చేయడానికి 8 గంటల సమయం ఎందుకు పట్టింది?కేసు నమోదై 36 గంటలు గడుస్తున్నా నిందితులపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.హోం మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి @revanth_anumula దీనికి సమాధానం చెప్పాలి.రాష్ట్రంలో కాంగ్రెస్,…— Harish Rao Thanneeru (@BRSHarish) May 10, 2026 డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తతబండి సంజయ్ కుమారుడిని అరెస్టు చేయాలని బీఆర్ఎస్వీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ కార్యాలయం ముందు ఆదివారం మెరుపు ధర్నా చేశారు. అలాగే కేంద్రమంత్రి బండి సంజయ్‌ను వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపైనా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌ను పలువురు మహిళలు ముట్టడించారు. బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌ను ముట్టడించిన మహిళలుబండి సంజయ్ కొడుకు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్‌ను ముట్టడించిన మహిళలు.#pocso #bandisanjaypic.twitter.com/8akltWzosD— ఉప్పిడి పిండి (@bharathbunny27) May 10, 2026 -
హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. ఇవాళ ఆ రూట్లలో వెళ్లొద్దు!
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా నగరంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 2,000 మంది శాంతిభద్రతల పోలీసు సిబ్బంది, 620 మంది ట్రాఫిక్ పోలీసు సిబ్బందితో పాటు ప్రత్యేక యూనిట్లను మోహరించాయి. పరేడ్‌గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.👉ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..⇒బేగంపేట నుంచి సంగీత్ వైపు వెళ్లే వాహనాలను ప్యారడైజ్– ప్యాట్నీ– క్లాక్ టవర్ మీదుగా సంగీత్ చౌరస్తాకు మళ్లిస్తారు. సంగీత్ నుంచి బేగంపేట వెళ్లే వాహనాలకూ ఇదే మార్గంలో మళ్లింపు ఉంటుంది.⇒బేగంపేట నుంచి తిరుమలగిరి వైపు వెళ్లే వాహనాలను ప్యారడైజ్, ప్యాట్నీ ఫ్లైఓవర్ల మీదుగా సెయింట్ జాన్స్, ఏఓసీ మార్గాల నుంచి మళ్లిస్తారు. ⇒బాలానగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వాహనాలను ఫతేనగర్, అమీర్‌పేట, పంజాగుట్ట నుంచి బేగంపేట మార్గంలోకి మళ్లిస్తారు.⇒బేగంపేట నుంచి వచ్చే వాహనాలు ప్రత్యామ్నాయంగా రసూల్‌పురా జంక్షన్, మినిస్టర్ రోడ్డు రాణిగంజ్, సికింద్రాబాద్ వైపు వెళ్లాలి.⇒సికింద్రాబాద్ నుంచి తిరుమలగిరి వైపు వెళ్లే వాహనాలు క్లాక్‌టవర్, ప్యాట్నీ, ప్యారడైజ్ – సీటీఓ మీదుగా బోయిన్పల్లి వైపు మళ్లిస్తారు.⇒ట్యాంక్ బండ్ నుంచి తిరుమలగిరి వైపు వెళ్లే వాహనాలను ప్యారడైజ్ నుంచి సీటీఓ టాడ్బంద్– డైమండ్ పాయింట్ మార్గాల్లో మళ్లిస్తారు.👉ఈ ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్.. ⇒నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్ నుంచి వచ్చే వాహనాలకు ఐఏఎల్, ఆర్జీఐ స్టేడియం, ఉప్పల్ భగాయత్, రైల్వే డిగ్రీ కళాశాల, ఆర్ఆర్సీ గ్రౌండ్స్ వద్ద పార్క్ చేయాలి.⇒నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ మార్గాల నుంచి వచ్చే వాహనాలను కంటోన్మెంట్ పరిధిలోని దోభీఘాట్, ఇంపీరియల్ గార్డెన్స్,బోయిన్పల్లి మార్కెట్ యార్డు ఆవరణలో నిలపాలి.⇒మెహిదీపట్నం, మహబూబ్ నగర్, కర్ణాటక నుంచి వచ్చే వాహనాలను నెక్లెస్ రోడ్డులోని సంజీవయ్య పార్కు, ఎన్టీఆర్ స్టేడియం, బస్‌భవన్, నిజాంకాలేజ్, పబ్లిక్ గార్డెన్స్ ఆవరణలో పార్కు చేయాలి.⇒సంగారెడ్డి, హైటెక్ సిటీ నుంచి వచ్చే వాహనాలను నల్లగుట్ట, నెక్లెస్ రోడ్డు మార్గంలో పార్కు చేయాలి. -
తెలంగాణలో అబ్ కీ బార్ బీజేపీ సర్కార్: మోదీ
ప్రధాని మోదీ ఆదివారం తెలంగాణ పర్యటనకు రానున్నారు. మూడోసారి ప్రధాని అయిన రెండేళ్ల తర్వాత తొలిసారి రాష్ట్రానికి రానున్నందున మోదీ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. -
భర్త కదలికలు ప్రియుడికి తెలిసేలా సీసీ కెమెరాలు
హైదరాబాద్: ఓ వ్యక్తిపై భార్యతోపాటు ఆమె ప్రియుడు హత్యాయత్నం చేశారు. ఈ సంఘటనలో పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేశారు. పోచారం ఐటీ కారిడార్ పోలీసులు శనివారం తెలిపిన మేరకు.. చౌదరిగూడలోని విజయపురి కాలనీకి చెందిన రమావత్ సుజాత అదే కాలనీకి చెందిన జటోతు మంగిలాల్‌తో వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. ఈ విషయం భర్త రమావత్ బిక్కుకు తెలియకుండా ఇంట్లో నాలుగు స్పై కెమెరాలను అమర్చి, భర్త కదలికలు ప్రియుడికి తెలిసేలా ఏర్పాట్లు చేసింది. ఇది తెలుసుకున్న బిక్కు తన భార్య సుజాతను గట్టిగా మందలించాడు. ఈ క్రమంలో మంగిలాల్‌తో సుజాత కలిసి తన భర్తను చంపేందుకు కత్తితో దాడి చేసింది. దీంతో బిక్కు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. విచారణ చేసిన పోలీసులు సుజాత, మంగిలాల్పై హత్యాయత్నం కేసు నమోదు చేసి, ఇద్దరినీ అరెస్ట్ చేసి, రిమాండ్‌కు పంపారు. -
స్నేహితురాలి పెళ్లికి వెళ్లి..
హైదరాబాద్: అమెరికాలో స్విమ్మింగ్‌పూల్‌లో పడి నగర యువతి మృతి చెందిన ఘటన విషాదం నింపింది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగోజిగూడ డివిజన్ న్యూ శివపురి కాలనీకి చెందిన ముద్దసాని దేవేందర్ రెడ్డి, సునీత దంపతుల కూతురు శ్రీవీణ (28)కు 2023లో ప్రశాంత్ రెడ్డితో వివాహమైంది. అమెరికాలోని వర్జీనియా ప్రాంతంలో నివాసం ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీవీణ స్నేహితురాలి వివాహం సందర్భంగా రెండు రోజుల క్రితం ఫ్లోరిడా వెళ్లారు. అక్కడ శ్రీవీణ స్విమ్మింగ్‌పూల్‌లో విగతజీవిగా కనిపించడంతో ఆస్పత్రికి తరలించారు.అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. ఒక్కగానొక్క కూతురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో నగరంలోని దేవేందర్ రెడ్డి, సునీత దంపతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. శ్రీవీణ తల్లిదండ్రులను ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సు«దీర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్, టీపీసీసీ అధికార ప్రతినిధి ధర్పల్లి రాజశేఖర్‌రెడ్డి పరామర్శించారు. ఆమె భౌతిక కాయాన్ని అమెరికా నుంచి భారత్‌కు వీలైనంత తొందరగా తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
కుమారుడిపై ఆ కేసు.. బండి సంజయ్ రియాక్షన్
సాక్షి, కరీంనగర్: తన తనయుడిపై వచ్చిన ఆరోపణలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘ఇటీవల నిరాధారమైన ఆరోపణల దృష్ట్యా.. నా ప్రజా జీవితమంతటా నేను ఎల్లప్పుడూ చట్టాన్ని గౌరవించానని, రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నానని తెలియజేయాలనుకుంటున్నాను. నేను ఎలాంటి మచ్చ లేకుండా జీవించాను. న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసాన్ని కొనసాగిస్తున్నాను’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.‘‘పిల్లలను, కుటుంబ సభ్యులను రాజకీయ పోరాటాల్లోకి లాగడం అనేది.. నాతో రాజకీయంగా పోరాడే ధైర్యం లేని వారి నిస్సహాయతను మాత్రమే ప్రతిబింబిస్తుంది. క్షేత్రస్థాయి నుండి వచ్చి, కార్పొరేటర్‌గా పనిచేసి, కఠోర శ్రమ, ప్రజా మద్దతుతో అంచెలంచెలుగా కేంద్ర మంత్రి అయిన ఒక బీసీ నాయకుడి ఎదుగుదలను కొన్ని శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయి...రేపు ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు ముందు.. నన్ను వ్యక్తిగతంగా అప్రతిష్టపాలు చేయడానికి ఉద్దేశించిన రాజకీయ కుట్ర ఇది అని స్పష్టమవుతోంది. ఏది సరైనదో, ఏది తప్పో న్యాయవ్యవస్థే నిర్ణయిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. కాలమే ప్రతి ఆరోపణకు సమాధానం చెబుతుంది. ప్రతి కుట్రను బయటపెడుతుంది. సత్యమేవ జయతే’’ అంటూ ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు.నిరాధారమైన ఆరోపణలు వెలుగు చూసిన నేపథ్యంలో ఈ ప్రకటననాకు చట్టంపై గౌరవం, న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది. జీవితాంతం భారత రాజ్యాంగానికి కట్టుబడే ఉన్నాను. దశాబ్దాలుగా ప్రజలతోనే ఉన్న నేను మచ్చ లేని జీవితం గడిపానని గర్వంగా చెప్పగలను.నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక కొందరు నా…— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) May 9, 2026కాగా, కేంద్రమంత్రి బండి సంజయ్ తనయుడిపై హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని సుచిత్ర ప్రాంతంలో ఉండే ఓ బాలిక (17) పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి ఇబ్బందులకు గురి చేశారని ఆరోపిస్తూ శుక్రవారం రాత్రి ఫిర్యాదురాగా పేట్ బషీరాబాద్ సీఐ విజయవర్ధన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ (24) డిసెంబర్ 31న మొయినాబాద్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో స్నేహం పేరిట తిరుగుతూ పెళ్లి చేసుకుంటానని నమ్మించి అదే రోజు రాత్రి అసభ్యకరంగా ప్రవర్తించాడనేది ప్రధాన ఆరోపణ. భగీరథపై పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 74, 75తోపాటు సెక్షన్ 11 రెడ్‌విత్ 12 పోక్సో చట్టం కింద నమోదు చేశారు. భగీరథపై గతంలో బహదూర్‌పల్లిలో ఉన్న కళాశాలలో ర్యాగింగ్‌తోపాటు డ్రగ్స్ విషయంపై ఫిర్యాదులు రాగా దుండిగల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కాగా, ప్రధాని మోదీ నగరానికి విచ్చేస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కుమారుడిపై పోక్సో కేసు నమోదుకావడం చర్చనీయాంశమైంది. -
బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు
కుత్బుల్లాపూర్/సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కేంద్రమంత్రి బండి సంజయ్ తనయుడిపై హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని సుచిత్ర ప్రాంతంలో ఉండే ఓ మైనర్ బాలిక (17) పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి ఇబ్బందులకు గురి చేశారని ఆరోపిస్తూ శుక్రవారం రాత్రి ఫిర్యాదురాగా పేట్ బషీరాబాద్ సీఐ విజయవర్ధన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ (24) డిసెంబర్ 31న మొయినాబాద్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో స్నేహం పేరిట తిరుగుతూ పెళ్లి చేసుకుంటానని నమ్మించి అదే రోజు రాత్రి అసభ్యకరంగా ప్రవర్తించాడనేది ప్రధాన ఆరోపణ. భగీరథపై పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 74, 75తోపాటు సెక్షన్ 11 రెడ్‌విత్ 12 పోక్సో చట్టం కింద నమోదు చేశారు. భగీరథపై గతంలో బహదూర్‌పల్లిలో ఉన్న కళాశాలలో ర్యాగింగ్‌తోపాటు డ్రగ్స్ విషయంపై ఫిర్యాదులు రాగా దుండిగల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కాగా, ప్రధాని మోదీ నగరానికి విచ్చేస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కుమారుడిపై పోక్సో కేసు నమోదుకావడం చర్చనీయాంశమైంది. స్నేహం పేరుతో బ్లాక్మెయిల్ స్నేహం పేరుతో తనను బ్లాక్మెయిల్ చేస్తూ వివాహానికి ఒత్తిడి తెచ్చారని బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఒక యువతిపై కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రూ.5 కోట్లు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. సదరు యువతితో తన స్నేహితులకు కూడా ఇలాంటి సమస్యలు ఎదురయ్యాయని తెలిపారు. ఈ మేరకు సదరు యువతి కుటుంబంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
తెలంగాణ పర్యటనపై ప్రధాని మోదీ ట్వీట్
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రేపు(మే 10, ఆదివారం) హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ సందర్భంగా తన పర్యటనపై ఆయన ట్వీట్ చేశారు.‘‘రేపు మే 10వ తేదీన కర్ణాటక, తెలంగాణలో వివిధ కార్యక్రమాలు పాల్గొంటాను. ఉదయం 11 గంటలకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొంటాను. సమాజ సేవకు అంకితమైన ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వివిధ రంగాల్లో అద్భుత కార్యక్రమాలు చేస్తోంది. మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుని రూ.9500 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం,శంకుస్థాపన.. రోడ్లు, లాజిస్టిక్స్, టెక్స్టైల్స్, రైల్వేలు, ఇంధనం తదితర రంగాల్లో ప్రధాన ప్రాజెక్టులు....సింధు హాస్పిటల్‌ను దేశానికి అంకితం చేస్తాను. సాయంత్రం హైదరాబాద్‌లో బీజేపీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తాను. బీఆర్ఎస్, కాంగ్రెస్ తప్పుడు పాలనలతో విసిగిపోయిన తెలంగాణ బీజేపీ వైపు చూస్తోంది. బీజేపీకి తెలంగాణ ప్రజల ఆదరణ పెరుగుతోంది’’ అంటూ ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. ನಾಳೆ, ಮೇ 10 ರಂದು ನಾನು ಕರ್ನಾಟಕ ಮತ್ತು ತೆಲಂಗಾಣದಲ್ಲಿ ವಿವಿಧ ಕಾರ್ಯಕ್ರಮಗಳಲ್ಲಿ ಭಾಗವಹಿಸಲಿದ್ದೇನೆ.ನಾಳೆ ಬೆಳಗ್ಗೆ 11 ಗಂಟೆಗೆ, ‘ಆರ್ಟ್ ಆಫ್ ಲಿವಿಂಗ್’ ಸಂಸ್ಥೆಯ 45ನೇ ಸಂಸ್ಥಾಪನಾ ವರ್ಷದ ಸ್ಮರಣಾರ್ಥ ಹಮ್ಮಿಕೊಂಡಿರುವ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಪಾಲ್ಗೊಳ್ಳಲಿದ್ದೇನೆ. ಸಮಾಜ ಸೇವೆಯ ಸಂಸ್ಕೃತಿಗೆ ಅನುಗುಣವಾಗಿ, ಈ ಸಂಸ್ಥೆಯು ವಿವಿಧ…— Narendra Modi (@narendramodi) May 9, 2026 -
మీ నీడ మాయం.. భాగ్యనగరంలో అరుదైన వింత దృశ్యం
-
కూకట్‌పల్లిలో సందడి చేసిన మంచు మనోజ్,యాంకర్ సుమ (ఫొటోలు)
-
సర్.. నా భార్య మనీషా కనిపించడం లేదు!
హైదరాబాద్: వివాహిత అదృశ్యమైన సంఘటన స్థానిక పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్‌కి చెందిన కైలాష్ కుమార్ భార్యతో కలిసి బతుకుదెరువు కోసం వచ్చి ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం వచ్చాడు. ఇక్కడే ఉంటూ కార్పెంటర్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే తండ్రి ఆరోగ్యం బాగా లేకపోవడంతో వారం రోజుల క్రితం స్వగ్రామానికి వెళ్లి తిరిగి శుక్రవారం ఇంటికి వచ్చి చూసేసరికి భార్య మనీషా కనిపించలేదు. వెంటనే ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో సమీపంలో తెలిసిన వారి వద్ద, స్థానికంగా వెతికిన ఆచూకీ లభించలేదు. దీంతో బాధితుడి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 15 ఏళ్ల బాలుడు.. 26 ఏళ్ల యువతితో ప్రేమ..! -
నిందితులకు ఉరిశిక్ష వేయాలి యువన్ కుటుంబ సభ్యుల ఆవేదన
-
ఇళ్ల అమ్మకాలు.. కుదేలు!
పశ్చిమ ఆసియా సంక్షోభం నేపథ్యంలో జనవరి–మార్చి త్రైమాసికంలో తొమ్మిది ప్రధాన నగరాల్లో గృహాల అమ్మకాలు వార్షికంగా 13 శాతం తగ్గి 98,761 యూనిట్లకు పడిపోయాయని ప్రముఖ రియల్ ఎస్టేట్ పరిశోధన సంస్థ ప్రాప్ ఈక్విటీ వెల్లడించింది. ఇటీవలి కాలంలో 18 త్రైమాసికాల తర్వాత అమ్మకాలు లక్ష యూనిట్ల మార్కు కంటే దిగువకు పడిపోయాయని ప్రాప్ ఈక్విటీ తేల్చింది. దేశంలో అలాంటి అమ్మకాల తగ్గుదల చూసిన తొమ్మిది ప్రధాన నగరాలైన ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, నవీ ముంబై, థానే, బెంగళూరు, పుణె, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా ఉన్నట్లు తెలిపింది.నగరాల వ్యాప్తంగా పరిస్థితి ఇదీ.. ప్రాప్ ఈక్విటీ డేటా ప్రకారం.. చెన్నైలో గృహాల అమ్మకాలు 4 శాతం తగ్గాయి. హైదరాబాద్‌లో 16 శాతం పడిపోయాయి. ముంబైలో 20, నవీ ముంబైలో 14 శాతం, థానెలో 24 శాతం, పుణెలో 25 శాతం పడిపోయాయి. చివరగా కోల్‌కతాలో గృహాల విక్రయాలు 8 శాతం తగ్గాయి. బెంగళూరులో 3 శాతం కొనుగోళ్లు పెరిగాయి. ఢిల్లీ–ఎన్సీఆర్లో గృహ విక్రయాలు 13 శాతం పెరిగాయి. మొత్తంగా చూస్తే.. గత ఏడాది జనవరి–మార్చి కాలంలోని 1,13,602 యూనిట్లతో పోలిస్తే, ఈ ఏడాది నివాస గృహాల అమ్మకాలు 13 శాతం తగ్గి 98,761 యూనిట్లకు పడిపోయాయి. తొమ్మిది నగరాల్లో మొత్తం అమ్మకాలు గత త్రైమాసికంలోని(అక్టోబర్–డిసెంబర్ 2025) 1,05,527 యూనిట్లతో పోలిస్తే 6 శాతం తగ్గాయి. అయితే ఢిల్లీ–ఎన్సీఆర్, బెంగళూరు నగరాలు దీనికి మినహాయింపుగా నిలిచాయి.డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక.. గత ఏడాది జనవరి–మార్చి కాలంతో పోలిస్తే 2026 మొదటి త్రైమాసికంలో దాదాపు 22 వేల యూనిట్లు తక్కువగా సరఫరా అయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో 1,14,718 యూనిట్లతో పోలిస్తే, కొత్త గృహాల సరఫరా 19 శాతం తగ్గి 92,411 యూనిట్లకు పడిపోయింది. కొత్త ప్రాజెక్టుల ప్రారంభం తగ్గడానికి పశ్చిమ ఆసియా యుద్ధంతో ఏర్పడిన అనిశ్చితి కొనుగోలు సెంటిమెంట్‌ను ప్రభావితం చేసిందని పరిశ్రమ నిపుణులు అంటున్నారు. -
IPS భార్య హత్య కేసులో నిందితుల గాలింపు
-
మళ్లీ అదే రిలీఫ్! బంగారంపై గుడ్ న్యూస్
దేశంలో బంగారం ధరల తగ్గుదల కొనసాగుతోంది. వరుసగా రెండో రోజూ పుత్తడి ధరలు దిగివచ్చాయి. దీంతో నేడు కూడా పసిడి కొనుగోలుదారులకు కాస్త ఊరట కలుగుతోంది. ఇక వెండి ధరల విషయానికి వస్తే నేడు ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రస్తుతం బంగారం (Today Gold Rate), వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో ఈ కింద తెలుసుకుందాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
హైదరాబాద్ కు.. తమిళ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
-
హైదరాబాద్‌లో ఏరోస్పేస్ & డిఫెన్స్ ఎంఎస్ఎంఈ సదస్సు
తెలంగాణను 2030 నాటికి దేశీ విమానయాన, రక్షణ రంగాల రాజధానిగా మార్చడమే లక్ష్యంగా హైదరాబాద్‌లో 'ఎంఎస్ఎంఈ స్పార్క్ 3.0' (MSME Spark 3.0) సదస్సును ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌లోని తాజ్ డెక్కన్ వేదికగా ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FTCCI), తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమల శాఖ సంయుక్తంగా ఈ సదస్సును ఏర్పాటు చేశాయి.ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తన పూర్వపు ఫైటర్ పైలట్ అనుభవాలను గుర్తు చేసుకున్నారు. 2030 నాటికి తెలంగాణను విమానయాన, రక్షణ రంగాల్లో తిరుగులేని అగ్రగామిగా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో ఉన్న డీఆర్డీఓ (DRDO) ల్యాబ్‌లు, అత్యాధునిక తయారీ కేంద్రాలు, సుమారు 1,500 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఈ రంగానికి వెన్నెముకగా ఉన్నాయన్నారు.జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడు, డీఆర్డీఓ మాజీ ఛైర్మన్ డా. జి. సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఆధునిక యుద్ధ తంత్రాలలో డ్రోన్ టెక్నాలజీ ప్రాధాన్యత పెరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.3.5 లక్షల కోట్ల విలువైన రక్షణ కొనుగోళ్లకు ఆమోదం తెలిపిందని, 220 తేజస్ విమానాలకు ఆర్డర్లు లభించాయని వివరించారు. 2028 నాటికి రక్షణ రంగ ఎగుమతులు రూ.50,000 కోట్లకు చేరుకుంటాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.డీఆర్డీఓ డైరెక్టర్ జనరల్ డా. చంద్రికా కౌశిక్ మాట్లాడుతూ, రక్షణ రంగంలో ఆత్మనిర్భరత సాధించడంలో ఎంఎస్ఎంఈల పాత్ర కీలకమన్నారు. 'టెక్నాలజీ ట్రాన్స్ఫర్ పాలసీ 2025' ద్వారా డీఆర్డీఓ పేటెంట్లను రాయల్టీ లేకుండా ఎంఎస్ఎంఈలకు అందిస్తున్నట్లు తెలిపారు. 'ఆపరేషన్ సిందూర్' ద్వారా దేశీయ రక్షణ సామర్థ్యం నిరూపితమైందని, ఆకాశ్ క్షిపణి వంటి ప్రాజెక్టులలో ఎంఎస్ఎంఈలు గొప్పగా కృషి చేస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. -
రిటైర్డ్ డీజీపీ భార్య కేసు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో రిటైర్డ్ డీజీపీ భార్య హత్య కేసులో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. పని మనిషే హత్య చేసినట్లు అనుమానిస్తున్నామని.. నేపాలీ పని మనుషులతో అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ డీజీపీ భార్య తనూజాను రాత్రి రెండు గంటలకు దుండగులు హత్య చేశారన్నారు. నేపాలి గ్యాంగ్ పనిగా ప్రాథమికంగా తాము ఒక అంచనాకు వచ్చామన్న సజ్జనార్.. కొన్ని క్లూస్ లభించాయని.. ఆ క్లూస్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ‘‘నేపాలి పని వాళ్ళ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. నేపాలి పని మనుషులు ఇంట్లో ఎవరూ లేనప్పుడు నేరాలకు పాల్పడతారు. రాత్రి మాజీ డీజీపీ ఇంట్లో లేనప్పుడు ఇంట్లో పని చేసే కల్పన అనే మహిళ మరికొందరితో కలిసి ఈ క్రైమ్ చేసింది. ఘటన సమయంలో తనూజ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారు. ఇంట్లో ఉన్న కల్పనతో బయట వ్యక్తులు కాంటాక్ట్ పెట్టుకొని ఈ క్రైమ్ చేశారు. నిందితులను అతి త్వరలో ఖచ్చితంగా పట్టుకుంటాం’’ అని సజ్జనార్ పేర్కొన్నారు.ఇంట్లో ఏడాది, రెండేళ్లు పనిచేసిన నేపాలి మనుషులపై కూడా నిఘా ఉండాలి. ఈ కేసును చాలా సీరియసగా తీసుకుంటున్నాం. చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి ఆమెను ఈ గ్యాంగ్ హత్య చేసింది. మాజీ డిజీపి వాళ్ల మదర్ కోసం ఆమె హైదరాబాద్ వచ్చారు. ఇటీవల మరణించారు. అప్పటినుండి మృతురాలు తనూజ ఇక్కడే ఉంటుంది. ఎంత బంగారం నగదు పోయింది అన్న అంశాలపై ఆరా తీస్తున్నాము. నిందితులు బ్యాక్ గేట్ నుండి ఇంట్లోకి ప్రవేశించారు. క్రైమ్ అనంతరం వెనక నుండి పారిపోయారు’’ అని సజ్జనార్ వివరించారు. -
మా బావ ప్లాన్ .. యువన్ మర్డర్ కేసుపై పోలీసుల షాకింగ్ నిజాలు
-
డ్రగ్స్ సరఫరా.. కీలక నిందితుడి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ సరఫరా కేసులో షేక్ ఫైజల్ అనే కీలక నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతనితో పాటు మరో ముగ్గురు నేరస్థులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 4.62 గ్రాముల MDMA డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకొని కారు సీజ్ చేశారు. కాగా డ్రగ్స్ అమ్మకాల్లో ఫైజల్ కరుగుగట్టిన నేరస్థుడిగా చలామణీ అవుతున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో డ్రగ్స్ తీసుకొని అదేమత్తులో వేగంగా కారు నడిపి చేయి సైతం పోగొట్టుకున్నట్లు పేర్కొన్నారు. -
అన్నదమ్ములిద్దరు మామూలోళ్లు కాదు.. ఇన్ స్టా కేసులో కొత్త ట్విస్ట్
-
Telangana: కాపాడాల్సిన వారే హత్యలకు పాల్పడుతున్నారా?
సాక్షి, సిద్దిపేట: కొందరు పోలీసులు బెట్టింగ్‌లకు, చోరీలకు, హత్యలకు పాల్పడటం సర్వత్రా సంచలనంగా మారాయి. క్రమశిక్షణకు మారుపేరైన పోలీసులు పలువురు బలవన్మరణం, హత్యలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్యలు చేసుకోద్దు.. ఆన్లైన్లో బెట్టింగ్‌లు పెట్టవద్దని చెప్పేవారే తప్పుదోవ పడుతున్నారు. సమాజంలో శాంతిభద్రతలు కాపాడాల్సిన వారే తప్పుడు మార్గంలో పయనిస్తున్నారు. ఇందుకు జిల్లాలో ఇటీవల చోటుచేసుకుంటున్న ఘటనలే నిదర్శనం. సిద్దిపేటకు చెందిన గౌటే ప్రవీణ్ సీసీఎస్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్‌లకు బానిసై దాదాపు రూ.60లక్షలకుపైగా నష్టపోయారు. స్థిరాస్తి వ్యాపారి విశ్వనాథం.. బంధువు దగ్గర ప్రవీణ్ భూమిని తాకట్టు పెట్టి రూ.12లక్షల అప్పుగా ఇప్పించారు. డబ్బుల కోసం విశ్వనాథం ఒత్తిడి చేస్తుండటంతో ఈ నెల 2న కారులో కానిస్టేబుల్ ప్రవీణ్, భార్య రజిత కలిసి తీçసుకెళ్లారు. విశ్వనాథంను హత్య చేసి ఒంటిమీద ఉన్న 10తులాల బంగారు నగలను తీసుకుని.. మృతదేహాన్ని ఇమాంబాద్ వద్ద కాలువలో పడేశారు. ఇలా కానిస్టేబుల్ నేరానికి పాల్పడ్డాడు. ఇదే కానిస్టేబుల్ గత నెల 25న బొడ్డు నర్సవ్వను ఆస్పత్రికి తీసుకెళ్తామంటూ కారులో ఎక్కించుకుని ఏమార్చి బంగారు పుస్తెలతాడు దొంగిలించారు. ఏమీ తెలియనట్లుగా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు. దొంగతనాల కేసు రికవరీలో సైతం చేతి వాటం ప్రదర్శించినట్లు సమాచారం. మరో కానిస్టేబుల్ బెట్టింగ్‌లకు పాల్పడి.. ఆన్లైన్లో బెట్టింగ్‌లు పెట్టి డబ్బులు పోవడంతో కానిస్టేబుల్ నరేశ్ తుపాకితో కుటుంబాన్ని మట్టుబెట్టడమే కాకుండా తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్లలో 2024 డిసెంబర్ 15న భార్య ఇద్దరు పిల్లలను తుపాకీతో కాల్చి తాను బలవన్మరణానికి పాల్పడ్డాడు. కానిస్టేబుల్ నరేశ్(35), చైతన్య(30), రేవంత్(6), రిషిత(5) ఈ ఘటనలో మరణించారు.మరో ఘటనలో.. ఓ ప్రైవేట్ కంపెనీలో పలు విడతలలో రూ.25లక్షలు వరకు పెట్టుబడి పెట్టాడు. దీంతో ఆర్థిక ఇబ్బందులతో పాటు అప్పుపాలయ్యాడు. అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో, అప్పులు ఇచి్చన వారితో గోడవలు జరగకుండా ఉండాలంటే మరణం ఒక్కటే మార్గం అని నిర్ణయించుకున్నాడు. దీంతో 2024 డిసెంబర్ 28 రాత్రి ఎలకల మందును టీలో కలుపుకుని ఇద్దరు పిల్లలతో పాటు భార్యభర్తలు తాగి ఆత్మహత్యయాత్నానికి పాల్పడ్డారు. 29న ఉదయం చూసేసరికి అందరు స్పృహలోనే ఉండటంతో పాటు పక్కగదిలో రాజన్న సిరిసిల్ల 17వ బెటాలియన్ హెడ్‌కానిస్టేబుల్ బండారి బాలకృష్ణ(34) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య, ఇద్దరు పిల్లలు హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొంది బతికి బయటపడ్డారు. -
జూబ్లీహిల్స్.. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య దారుణ హత్య
సాక్షి, జూబ్లీహిల్స్: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ భార్య హత్యకు గురయ్యారు. జూబ్లీహిల్స్‌లోని ఐఏఎస్ క్వార్టర్స్‌లో శుక్రవారం ఉదయం ఈ హత్య జరిగింది. వినయ్ రంజన్ ఇంట్లో పనిచేసే పని మనిషే ఆమెను హత్య చేసినట్టు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
ఈసీఐఎల్‌లో పీఎఫ్ గోల్మాల్!
సాక్షి, కుషాయిగూడ: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లో కార్మికుల ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) నిధులు పక్కదారి పట్టాయి. పీఎఫ్ సెక్రటరీగా కొనసాగుతున్న ఉద్యోగే ఈ నిధులను కొల్లగొట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి బ్యాంకు నుంచి ఉద్యోగుల చెక్కులను డ్రా చేశారని పీఎఫ్ విభాగం సెక్రటరీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.కుషాయిగూడలోని ఈసీఐఎల్ సంస్థలో సుమారు 10 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌కు సంబంధించిన రూ.50 లక్షల చెక్కులు మాయమయ్యాయి. కంపెనీలో పని చేసే దినసరి కూలీ పేరుతో రూ.40 లక్షలు డ్రా చేశారు. ఒకే ఎకౌంట్ నంబర్‌తో పెద్ద మొత్తంలో నగదు డ్రా కావడాన్ని బ్యాంకు అధికారులు పసిగట్టి ఈసీఐఎల్ పీఎఫ్ విభాగానికి సమాచారం అందించారు. అప్రమత్తమైన అధికారులు మిగతా చెక్కులను నిలిపివేశారు. రోజూవారీ ఉద్యోగిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ భాస్కర్‌రెడ్డి తెలిపారు. కాగా, ఈ గోల్మాల్ వ్యవహారంలో పీఎఫ్ విభాగం సెక్రటరీపై∙ఉద్యోగులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
ప్రియురాలు పిలిచిందని వెళ్తే..
సాక్షి, హైదరాబాద్: నగరం నడిబొడ్డున దారుణం చోటు చేసుకుంది. ఫోన్లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్న ఓ యువకుడిపై కొందరు కత్తులతో దాడి చేశారు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. గురువారం రాత్రి సికింద్రాబాద్ చిలకలగూడలో జరిగిన ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఆల్వాల్‌లోని యాప్రాల్‌లో నివాసం ఉంటున్న యువన్.. నగర శివారులో ఓ కాలేజీలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. గురువారం రాత్రి చిలకలగూడకు వచ్చి స్నేహితులతో కలిసి రోడ్డు పక్కన ఫోన్లో మ్యాచ్ చూస్తూ మునిగిపోయాడు. ఈలోపు బైకులపై వచ్చిన ఏడుగురు యువన్‌ను పక్కకు లాక్కెళ్లి దాడి చేశారు. ఈ పరిణామంతో ఆ యువకులు చెల్లాచెదురుకాగా.. కత్తులతో దాడి చేయడంతో తీవ్రగాయాలతో యువన్ అక్కడికక్కడే ప్రాణం విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. తల, మెడ, చేతులు మొత్తం 15 కత్తిపోట్లు పడ్డాయని వైద్యులు తెలిపారు. హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తొలుత భావించగా.. తర్వాత అదే నిర్ధారణ అయ్యింది. యువన్ స్థానికంగా ఉండే ఓ అమ్మాయిని ఐదేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ విషయంలో పెద్దలకు తెలిసి గొడవ జరగడంతో పంచాయితీ పెట్టారు. అయితే కలుద్దామని యువతి గురువారం యువన్‌కు మెసేజ్ చేసింది. దీంతో యువన్ చిలకలగూడకు రాగా.. తట్టుకోలేకపోయిన యువతి సోదరుడు స్నేహితుల సాయంతో ఘాతుకానికి పాల్పడ్డాడు. చిలకలగూడలో ఉద్రిక్తతయువన్ హత్య నేపథ్యంలో శుక్రవారం ఉదయం చిలకలగూడలో తీవ్ర ఉద్రికత్త నెలకొంది. అతని తల్లిదండ్రులు, బంధువులు యువతి నివాసం ఎదుట రోడ్డు మీద బైఠాయించి న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. పోలీసులు వాళ్లకు సర్దిచెప్పే ప్రయత్నంలో తోపులాట జరిగింది. దీంతో లాఠీఛార్జ్ చేసి అందరినీ చెదరగొట్టారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో సీతాఫల్మండి, నామాలగుండు ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు.. ఘాతుకానికి పాల్పడ్డ వాళ్లలో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. అలాగే యువతి కుటుంబం కూడా పోలీసుల అదుపులోనే ఉన్నట్లు తెలుస్తోంది. వస్తే చంపేస్తారని చెప్పిందా?ఏడాది నుంచి యువన్ ఆ యువతితో మాట్లాడడం లేదని సోదరి మీడియా ముందు వాపోయింది. ‘‘పెద్దల అంగీకారంతో అప్పట్లో కాంప్రమైజ్ జరిగింది. ఇద్దరి మధ్య మాటలు లేకపోవడంతో అంతా సర్దుమణిగింది అనుకున్నాం. అయితే నిన్న మా తమ్ముడు ఆమె కోసం చిలకలగూడకు వచ్చాడు. వస్తే చంపేస్తారని కూడా యువతి ఫోన్లో చెప్పింది(అందుకు సంబంధించిన కాల్ సంభాషణను బయటపెట్టారు). ఆమె సోదరి, కుటుంబ సభ్యులకు నేర చరిత్ర ఉంది. మా తమ్ముడిని అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారు. వాళ్లందరినీ ఉరి తీసి మాకు న్యాయం చేయండి’’ అని వాపోయిందామె. -
హైదరాబాద్ : పార్క్ కి వచ్చే వాళ్ళు ఫలహారాలు వేయడం..(ఫొటోలు)
-
రవీంద్ర భారతి : నాటకం.. యువజన రంజకం (ఫొటోలు)
-
పదేళ్లలో గ్లోబల్ సిటీగా హైదరాబాద్
అంతర్జాతీయ పెట్టుబడులను భారీగా ఆకర్షించేలా.. పదేళ్లలో హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మహా నగరాల అభివృద్ధిలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా.. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యమిస్తోందని వివరించారు. గురువారం ముంబైలో నిర్వహించిన ‘నాస్కామ్ జీసీసీ సమ్మిట్ 2026’లో ‘బియాండ్ పాలసీ: డిజైన్డ్ టు విన్ ది గ్లోబల్ జీసీసీ రేస్’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచాలనే సంకల్పంతో ‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047’కు శ్రీకారం చుట్టామని వివరించారు. ప్రపంచంలోని అనేక నగరాలు అస్తవ్యస్త పట్టణీకరణ వల్ల ‘అర్బన్ కొలాప్స్’ కోరల్లో చిక్కుకున్నాయని, అలాంటి చారిత్రక తప్పిదాన్ని హైదరాబాద్ విషయంలో తాము చేయాలనుకోవడం లేదన్నారు.అందుకే.. భవిష్యత్తు కోసం ఎదురు చూడకుండా, దాన్ని నిర్మించే బాధ్యతను తీసుకున్నామన్నారు. ఆ దిశగానే భారత్ ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, మెట్రో విస్తరణ, కొత్త విమానాశ్రయాల అభివృద్ధి, ఆర్ఆర్ఆర్, మూసీ ప్రక్షాళన, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఐకం ఇన్నోవేషన్ హబ్ తదితర కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామన్నారు. కేవలం టెక్ కంపెనీలే కాకుండా.. బ్యాంకింగ్, లైఫ్ సైన్సెస్, సెమీ కండక్టర్లు, రక్షణ రంగం, ఎఫ్ఎంసీజీ, స్పేస్ టెక్, ఆతిథ్యం తదితర బహుళ రంగాలకు చెందిన దిగ్గజ సంస్థలు జీసీసీల ఏర్పాటుకు హైదరాబాద్ ను తమ మొదటి ప్రాధాన్యంగా ఎంచుకుంటున్నాయన్నారు.గతేడాది 70కి పైగా జీసీసీలు ప్రారంభమయ్యాయని, దేశంలో ఇదే అత్యధికమని వివరించారు. ఈ ఏడాది కొత్తగా 100 జీసీసీలను ప్రారంభించి... వాటిల్లో కొత్తగా లక్ష మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. జీసీసీలను కేవలం బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్లకే పరిమితం చేయకుండా.. వాటిని ‘గ్లోబల్ వాల్యూ సెంటర్లు’గా మార్చేలా ప్రత్యేక ‘కాంప్రహెన్సివ్ రోడ్డు మ్యాప్’ను సిద్ధం చేస్తున్నామన్నారు.పారిశ్రామికాభివృద్ధికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను మంత్రి శ్రీధర్ బాబు కోరారు. హైదరాబాద్‌లో ఉన్న ‘సిలికాన్ డెన్సిటీ (విభిన్న రంగాల నిపుణుల లభ్యత)’ని అందిపుచ్చుకుని ‘మేడిన్ తెలంగాణ’ బ్రాండ్ ను విశ్వవ్యాప్తం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో నాస్కాం ఛైర్మన్ శ్రీకాంత్, ప్రెసిడెంట్ రాజేష్ నంబియార్ తదితరులు పాల్గొన్నారు. -
వస్తావా? నీ రేట్ ఎంత? పోకిరీలకు మిడ్ నైట్ సినిమా చూపించిన లేడీ కమిషనర్
-
మైనర్ అమ్మాయిలే టార్గెట్.. వెలుగులోకి ఇన్ స్టాగ్రామ్ చీటర్ అర్జున్ అరాచకాలు
-
తెలంగాణలో ఇలా... ఆంధ్రప్రదేశ్‌లో అలా!
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవడం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రతిష్ట తెస్తుందా? లేక ఇందులో ఏమైనా రిస్క్ ను ఫేస్ చేయవలసి ఉంటుందా? రేవంత్ గురువుగా భావించే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేమో గత సీఎం జగన్ ప్రభుత్వ రంగంలో తీసుకువచ్చిన కొత్త మెడికల్ కాలేజీలను పీపీపీ పద్దతిలో ప్రైవేటు పరం చేయడానికి యత్నిస్తున్నారు. రేవంత్ మాత్రం ప్రైవేటు రంగంలో ఉన్న మెట్రో రైల్‌ను రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తూ ప్రభుత్వ పరిధిలోకి తీసుకు వస్తున్నారు. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం కేవలం రూ.ఐదు వేల కోట్లతో కోట్లాది ప్రజలకు మంచి చేయగల వైద్య కళాశాలల ప్రారంభానికి వెనుకాడుతోంది. ఈ మధ్యకాలంలో ప్రైవేటు సంస్థ నుంచి ప్రాజెక్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సందర్భం ఇదే కావచ్చు. దీనిని బట్టి ప్రైవేటు సంస్థలు ప్రభుత్వాల కన్నా బాగా పని చేస్తాయన్నది ఒక అపోహ మాత్రమే అన్నది స్పష్టమవుతోంది. రేవంత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎల్ అండ్ టీకి మేలు చేస్తోందన్న భావన కలిగినా, మెట్రో రైలు ఆస్తులు అన్ని ప్రభుత్వపరం అవుతాయి కనుక భవిష్యత్తులో వాటికి మంచి విలువ రావచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్రం అంతగా స్వాగతించడం లేదన్న వార్తలు కూడా వస్తున్నాయి. మెట్రో రైలు స్వాధీనం చేసుకోవడం కన్నా, ప్రత్యామ్నాయ మోడల్లో రాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్‌ను అమలు చేయవచ్చని కేంద్రం సూచిస్తోందంటూ ఒక ఆంగ్ల పత్రిక కథనాన్ని ఇచ్చింది. బహుశా ఇది భవిష్యత్తులో రాజకీయ వివాదంగా మారొచ్చు. మెట్రో రైల్ నష్టాలపై ఆందోళన వ్యక్తం చేసిన ఎల్ అండ్ టీ రెండో దశ విస్తరణకు కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సర్కారు చర్చోపచర్చల తరువాత ప్రాజెక్టును తన స్వాధీనంలోకి తెచ్చుకుంది. నష్టాల నుంచి గట్టెక్కడానికి ఇది మేలైన మార్గం కావడంతో ఎల్ అండ్ టీ కూడా అంగీకరించింది. ఇందుకోసం సుమారు రూ. 1461 కోట్ల విలువైన షేర్లను రాష్ట్ర ప్రభుత్వం బదలాయించుకుంటుంది. దాంతోపాటు ఈ ప్రాజెక్టుకు ఉన్న సుమారు రూ.13538 కోట్ల మొత్తాన్ని రీఫైనాన్స్ కు అంగీకారం కుదిరింది. అంటే ఈ అప్పు భారం అంతా తెలంగాణ ప్రభుత్వానిదే. రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న రూ.ఎనిమిది లక్షల కోట్ల అప్పుకు ఇది అదనమన్నమాట. అయితే ఈ అంశంపై ప్రతిపక్ష పార్టీలేవీ పెద్దగా విమర్శలు చేయకపోవడం గమనార్హం. అయితే... ప్రముఖ ఆంగ్ల పత్రిక హిందూకు కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు చూస్తే తెలంగాణ నిర్ణయం భవిష్యత్తులో వివాదమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్రం మెట్రో రైల్ ఫేజ్ 2, ఫేజ్ 2ఎ మ కింద సుమారు 162 కిలో మీటర్ల దూరం వరకు విస్తరించడానికి రాపిడ్ ట్రాన్సిట్ మోడల్ మంచిదని రాష్ట్రానికి సూచించిందట. దీనికి మెట్రో మోడల్ కన్నా తక్కువ వ్యయం అవుతుందని చెబతున్నారు. పటాన్ చెరు,ఆరామ్ఘఘర్, కోకాపేట, హయత్ నగర్, చాంద్రాయణగుట్ట, ఫ్యూచర్ సిటీ, రాజివ్ గాంధీ విమానాశ్రయం, మేడ్చల్, షామీర్ పేట ప్రాంతాలకు మెట్రో విస్తరించాలని తలపెట్టారు. ప్రస్తుతం భరిస్తున్న రుణంతో కలిపి ఈ రెండో దశకు 58 వేల కోట్ల రూపాయలు వ్యయం అవతుందని అంచనా వేస్తున్నారు.అదే కేంద్రం ప్రతిపాదిస్తున్న రాపిడ్ ట్రాన్సిట్ రైల్ వల్ల రూ.48 వేల కోట్లే ఖర్చు అవుతుందట.ఢిల్లీ-మీరట్ రూట్ లో ఈ తరహా విధానం అమలులో ఉందని చెబుతున్నారు.ఆరున్నర కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ రైల్ వస్తుందని అధికారులు అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం తన ఒరిజినల్ స్కీమ్ కే కట్టుబడి ఉంటే బీజేపీ, బీఆర్ఎస్లు అదనపు భారంపై విమర్శలు చేయవచ్చు. కొత్త ప్రాజెక్టుపై అధిక వ్యయం చేయబోతున్నారని ఆరోపణలు గుప్పించవచ్చు. అలాగని ఇంత జరిగాక మెట్రో రైల్ మోడల్ కాకుండా రాపిడ్ రైల్ కు వెళ్లడం కూడా కష్టం కావచ్చు. ఏపీలో ప్రభుత్వం మెడికల్ కాలేజీలను సొంతంగా నడపలేదని, అవసరమైన పెట్టుబడులు పెట్టలేదని చంద్రబాబు సర్కార్ చెబుతోంది.ఒక పక్క అమరావతి పేరుతో వేల కోట్ల అప్పులు చేసి భారీ వ్యయం చేస్తున్న ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరికి ఉపయోగపడే మెడికల్ కాలేజీలను నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.చంద్రబాబు ఎంతసేపు ప్రైవేటువారికి సంపద కట్టబెట్టాలని చూస్తారన్న విమర్శలను విపక్షం చేస్తోంది.అయినా ఆ ప్రైవేటు సంస్థలు ఎంతవరకు బాధ్యత తీసుకుని ఆ మెడికల్ కాలేజీలను సమర్ధంగా నిర్వహిస్తాయో చెప్పలేం.దానివల్ల ప్రజలపై అదనపు భారం పడదన్న గ్యారంటీ లేదు.తెలంగాణలో మాత్రం ప్రజల ప్రయోజనాల కోసమే ప్రైవేటు కంపెనీని తప్పించి ప్రభుత్వమే మెట్రోని చేపడుతోందని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. రేవంత్ సర్కార్ నిర్ణయం వల్ల భవిష్యత్తులో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున సంపద సమకూరవచ్చు.ఎందుకంటే ఇప్పటికే నిర్మాణం అయిన మెట్రోలో రియల్ ఎస్టేట్ మోడల్, మాల్స్ వంటివాటికి ఏర్పాట్లు, ప్రచార ప్రకటనల ద్వారా ఆదాయ ఆర్జన వంటివి ఉన్నాయి. ఇప్పటికైతే అవన్ని లాభసాటిగా ఉన్నాయని చెప్పలేం కాని, హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ది చెందినందున ఫ్యూచర్ లో ఇది మెరుగైన ఫలితాలు ఇవ్వవచ్చేమో!కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
నిలోఫర్‌లో రోగి సహాయకురాలిపై దాడి!
హైదరాబాద్: నిలోఫర్ ఆసుపత్రికి వచ్చిన ఓ రోగి సహాయకురాలిపై ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది మూకుమ్మడి దాడి చేశారు. ఈ దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు మంగళవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రోగి సహాయకురాలిపై ఓ మహిళ సెక్యూరిటీ పిడి గుద్దులు కురిపించింది. అంతటితో ఆగకుండా మరో ముగ్గురు మహిళా సెక్యూరిటీ సిబ్బంది అక్కడికి చేరుకొని రోగి సహాయకురాలిపై మూకుమ్మడి దాడి చేశారు. ఈ దాడి సద్దుమణిగాక అధికారులు, వైద్యులు బాధితురాలిపై సానిభూతిని ప్రదర్శించి సర్ది చెప్పి బయటికి పంపింనిట్లు తెలిసింది. ఈ దాడి ఎప్పుడు జరిగింది, ఏ విషయంలో జరిగిందనే విషయం తెలియాల్సి ఉంది. ఈ విషయమై సూపరిండెంట్‌ను వివరణ కోరే ప్రయత్నం చేయగా ఆయన స్పందించలేదు. స్థానిక పోలీస్ స్టేషన్లోనూ ఎవరూ ఫిర్యాదు చేయలేదని ఇన్స్పెక్టర్ తెలిపారు. -
వర్షాకాలానికి ముందే నాలా పనులు పూర్తి చేయాలి: ఆరెకపూడి గాంధీ
హైదరాబాద్: ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ధరణి నగర్ నాల విస్తరణ పనులలో భాగంగా పరికి చెరువు అలుగు నుండి ప్రేమ్ సరోవహర్ అపార్టుమెంట్స్ వరకు రూ. 8 కోట్ల 76 లక్షల రూపాయల అంచనావ్యయం తో చెవుడుతున్న నాల విస్తరణ పనులను SNDP ఇంజనీరింగ్ విభాగం మరియు టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో కలిసి పరిశీలించిన గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ గారు మాట్లాడుతూ నాలల విస్తరణ పనులు చేపట్టడం తో ఎన్నో ఏండ్ల వరద ముంపు సమస్య కు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నామని, ధరణి నగర్ కాలనీ లో నాల విస్తరణ పనులలో భాగంగా అసంపూర్తిగా మిగిలిపోయిన నాల విస్తరణ పనులను రూ. 8 కోట్ల 76 లక్షల రూపాయల అంచనావ్యయం తో నిర్మాణము పనులు చేపట్టడం జరుగుతుంది అని, నాల విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని , త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని . ఎన్నో ఏండ్ల సమస్య నేటి తో తిరనుంది అని, నాలా విస్తరణ పనులకు అందరూ సహకరించాలని , ఒక్కప్పుడు వరదలు వస్తే కంటి మీద కునుకు లేకుండా ప్రజలు తీవ్ర ఆందోళన తో ఇబ్బందులకు గురయ్యేవారు అని, కానీ నేడు సమస్య లేకుండా మళ్ళీ పునరావృతం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగినది అని,నాలల విస్తరణ పనులతో లోతట్టు, ముంపు ప్రాంతాలకు ఉపశమనం లభించింది అని ప్రజా అవసరాల దృష్ట్యా ప్రథమ ప్రధాన్యత లో విస్తరణ పనులు చేపట్టాలని రాబోయే రాబోయే వర్షాకాలం లోపు పనులు పూర్తి చేయాలని ,నాలల విస్తరణ పనులలో వేగం పెంచాలని ,యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అధికారులకు PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేశారు.ధరణి నగర్ నాల విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, నాల విస్తరణ పనులు పై అధికారులకు పలు సూచనలు ,సలహాలు ఇవ్వడం జరిగినది, ఏ చిన్న సమస్య ఎదురైన తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తామని PAC చైర్మన్ గాంధీ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగినది. నాలల విస్తరణ పనులు త్వరితగతిన చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, నాలల విస్తరణ పనులు సమయంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పనులు చేపట్టాలని, ప్రధాన రహదారుల పై పనులు జరుగుతున్న సమయంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సూచించాలని , నాలల నిర్మాణం సమయంలో నీటి ప్రవాహం సాఫీగా సాగేలా లెవల్స్ ను నిర్దారించుకొని పనులు చేపట్టాలని, వర్షాకాలంలోపు పనులు పూర్తయ్యేలా చూడలని , వరద ముంపు మళ్ళీ పునరావృతం కాకుండా నాలల విస్తరణ నిర్మాణం పనులు చేపట్టాలని PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేసారు. నాలల విస్తరణ పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని,నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని , పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని, నాల విస్తరణ పనులు పై అధికారులకు పలు సలహాలు ,సూచనలు ఇవ్వడం జరిగినది . ప్రతి వర్షానికి వరద నీరు కాలనీలు ముంచెత్తడం జరుగుతుంది అని, సమస్య శాశ్వత పరిష్కారం దిశగా పనులు చేపట్టడం జరుగుతుంది అని, భవిష్యత్తు లో వరద సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకొని నాల విస్తరణ పనులు చేపడుతున్నాం అని, నాల విస్తరణ మరియు ,RCC బాక్స్ డ్రైన్ నిర్మాణము వలన ప్రజలకు ఎంతగానో ఉపశమనం కలుగుతుంది అని, ప్రజలకు సాంత్వన చేకూరుతుంది అని, పనులు పూర్తిచేయాలని అధికారులకు PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేసారు. పనుల విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని, త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడలని, వర్షకాలంను దృష్టిలో పెట్టుకొని ప్రజా అవసరాల దృష్ట్యా అసంపూర్తిగా మిగిలిపోయిన నాలా విస్తరణ నిర్మాణ పనులను చేపట్టడం జరిగినది అని, యుద్ధప్రాతిపదికన పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని,నాల నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని,నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుడదని, పనుల లో వేగం పెంచాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడలని త్వరితగతిన నాల విస్తరణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని అధికారులకు PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేసారు. నాలల విస్తరణ పై ఏవైనా ఇబ్బందులు ఎదురైతే తప్పకుండా పరిష్కరిస్తామని, తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలో ఉంటాయి అని ఏ చిన్న సమస్య ఎదురైన తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తామని PAC చైర్మన్ గాంధీ గారు అధికారులకు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో SNDP ఇంజనీరింగ్ విభాగం DE ధీరజ్, AE అరుణ్ నాయకులు దొడ్ల రామ కృష్ణ గౌడ్,జిల్లా గణేష్, కాశినాథ్ యాదవ్, శివరాజ్ గౌడ్,రాజేష్ , సంతోష్, శ్రీధర్ ,ఉమేష్ , కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. -
లెక్కల్లోకి పెళ్లికాని కాపురాలు!
పెళ్లికాని కాపురాలు ఇక ‘లెక్కల్లోకి’ ఎక్కనున్నాయి. సహజీవనం చేస్తున్న జంటలు సరికొత్త తరహా కుటుంబాలుగా పరి‘గణన’ పొందనున్నాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణన మొదటి దశలో తొలి అడుగు పడనుంది. జన గణనలో భాగంగా ఇళ్ల వివరాలతో పాటు కుటుంబ సభ్యుల సంఖ్యను నమోదు చేసేందుకు కసరత్తు ప్రారంభమైంది. సహజీవనం చేస్తున్న జంటలను కూడా కుటుంబంగా గుర్తించాలని అధికారులు నిర్ణయించిన విషయం విదితమే. దీంతో ఈ లెక్కలు తమకు తెచి్చపెట్టే చిక్కులపై లివ్ ఇన్ కపుల్లో కొంత అటెన్షన్, మరికొంత టెన్షన్ మొదలైంది. హైదరాబాద్: నగరంలో దాదాపు 2 దశాబ్దాల క్రితమే ఊపిరి పోసుకున్న సహజీవన సంస్కృతి కార్పొరేట్ కల్చర్‌తో మమేకమైపోతూ విస్తరించింది. విభిన్న ప్రాంతాల నుంచి వృత్తి ఉద్యోగాలు, వ్యాపకాల రీత్యా తరలి వస్తున్న యువతీ యువకులు రకరకాల కారణాల రీత్యా పెళ్లికి దూరంగా ఉంటూ కలిసి జీవించేందుకు అనుకూలమైనదిగా లివ్ ఇన్ రిలేషన్ షిప్ మార్గాన్ని ఎంచుకోవడం సర్వసాధారణంగా మారింది. కెరీర్ కోసం పెళ్లిని వాయిదా వేయాలనుకునే యువత లక్ష్యాల వేటకు ఇది బాగా అనుకూలించింది. దాంతో తొలుత ఐటీ అనుబంధ కంపెనీలలోనే బాగా కనిపించిన ఈ సంస్కృతి అలా అలా హాస్పిటాలిటీ, సినిమా, టీవీ, మోడలింగ్ తదితర రంగాలకూ వేగంగా విస్తరించింది. శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, పోచారం, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో సహజీవనం చేస్తున్న జంటల సంఖ్య భారీగా ఉండవచ్చని అంచనా. ఈ కల్చ ర్ యువతకు కలిగించే సౌలభ్యాల సంగతి ఎలా ఉన్నా, దీని తాలూకు దుష్ప్రభావాలు పలు నేర ఘటనల రూపంలో తరచుగా వెలుగు చూస్తున్నాయి. లెక్కకు చిక్కుతారా? సాధారణంగా సహజీవనం చేసే జంటల్లో తమ వ్యవహారాన్ని పెద్దలకు తెలియనివ్వని వారే ఎక్కువగా ఉంటారు. జనగణనలో భాగంగా వీరికి సంబంధించిన వివరాలు అధికారికం అవుతాయని, అంటే ఇక తమ సంబంధం బహిరంగ రహస్యమే అవుతుందనే ఆందోళన వీరిలో ఉంది. వీరి వివరాలను తాము రహస్యంగా ఉంచుతామని అధికారులు ఇస్తున్న హామీని ఎంత వరకు విశ్వసిస్తారనేది చూడాలి. మరోవైపు ఇటీవల న్యాయ స్థానాలు వెల్లడించిన పలు తీర్పులు.. సహజీవనం చేస్తున్న జంటలకు కొన్ని రకాల హక్కులను కూడా కల్పిస్తున్నాయి. కాబట్టి అధికారిక నమోదు ప్రయోజనకారి కాగలదని కూడా కొందరు లివ్ ఇన్ కపుల్ భావిస్తున్నారు. కలిసి ఉంటున్నప్పటికీ పెళ్లి విషయంలో భవిష్యత్తులో తమ బంధం విచ్ఛిన్నమైతే ఎలా? అప్పుడు వేరే వ్యక్తులను పెళ్లి చేసుకునేందుకు తమ ప్రస్తుత వివరాల నమోదు ప్రక్రియ అడ్డంకిగా మారవచ్చునేమో కదా? అనే భయమూ కొందరిలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వీరిలో ఎందరు సహకరిస్తారు? అలా సహకరించేలా అధికారులు వారిలో ఎటువంటి విశ్వాసం కల్పిస్తారు? అనేది చూడాలి. పోచారం ఐటీ కారిడార్‌కు.. సహజీవనం చేస్తున్న జంటలు విబేధాలు వస్తే ఎవరి దారిన వారు విడిపోతారు. ఇతర దేశా ల నుంచి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌లోని పడమర ప్రాంతానికి విస్తరించిన లివింగ్ రిలేషన్షిప్ నెమ్మదిగా పోచారంలోని ఐటీ కారిడార్‌కు పాకింది. పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు రావడంతో ఈ కంపెనీలకు సమీపంలోని పలు భవనాల్లో సహజీవనం చేస్తు న్న జంటలు కనిపిస్తున్నాయి. జనగణనతో వీరిలో ఎలాంటి మార్పు వస్తుందో వేచి చూడాల్సిందే. పాత లెక్కల ప్రకారం పోచారం డివిజన్లో 60 వేల జనాభా ఉండగా, ఇప్పుడు లక్షన్నరకు చేరుకునే అవకాశం ఉంది. వీరిలో ఐటీ ఉద్యోగులే ఎక్కువని అంచనా. -
SRH vs PBKS : ఉప్పల్‌లో ఫుల్ జోష్.. తారల సందడి (ఫొటోలు)
-
రోగి కోలుకోవడంలో ట్రాన్సిషనల్ కేర్ కీలకం
హైదరాబాద్: శస్త్రచికిత్సలు, తీవ్ర అనారోగ్యం తర్వాత రోగులు పూర్తిస్థాయిలో కోలుకోవడానికి 'ట్రాన్సిషనల్ కేర్' (మధ్యంతర సంరక్షణ) ఎంతో కీలకమని యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి పేర్కొన్నారు. ఇవాళ (బుధవారం) హైదరాబాద్‌లో అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేసిన 'ఎవరెస్ట్ ట్రాన్సిషనల్ కేర్' సెంటర్‌ను ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి జగదీష్ గౌడ్, సిమ్స్ విద్యాసంస్థల డైరెక్టర్ భీమనాథం భరత్ రెడ్డి, ఎవరెస్ట్ ట్రాన్సిషనల్ కేర్ డైరెక్టర్ మౌనికా రెడ్డి అట్ల తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా డాక్టర్ పవన్ గోరుకంటి మాట్లాడుతూ.. "సాధారణంగా ఆసుపత్రులు రోగుల ప్రాణాలను కాపాడి నిలకడగా ఉంచుతాయి. కానీ, వారు తిరిగి సాధారణ జీవనశైలికి చేరుకోవడానికి ప్రత్యేక పునరావాస కేంద్రాల అవసరం ఉంది. మన దేశంలో ఇటువంటి ప్రత్యేక కేంద్రాల కొరత ఉంది. అమెరికా ప్రమాణాలతో ఎవరెస్ట్ కేర్ సెంటర్ అందుబాటులోకి రావడం అభినందనీయం" అని అన్నారు.ఎవరెస్ట్ ట్రాన్సిషనల్ కేర్ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డాక్టర్ కె. సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. అమెరికాలో 20 ఏళ్ల క్లినికల్ అనుభవం తర్వాత, స్వదేశంలో ప్రపంచస్థాయి వైద్య సేవలందించాలనే లక్ష్యంతో దీనిని ప్రారంభించినట్లు తెలిపారు. పక్షవాతం (స్ట్రోక్), వెన్నెముక గాయాలు, వృద్ధాప్య సమస్యలతో బాధపడే వారికి ఇక్కడ శాస్త్రీయ పద్ధతిలో చికిత్స అందిస్తామని వివరించారు. వైద్యులు, స్థానిక నేతలు ఈ కేంద్రాన్ని సందర్శించి, ఇక్కడి అత్యాధునిక వసతులను పరిశీలించారు. నగరం నడిబొడ్డున ఇలాంటి సమగ్ర పునరావాస కేంద్రం అందుబాటులోకి రావడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.కేంద్రం ప్రత్యేకతలు:అడ్వాన్స్డ్ రోబోటిక్స్ మరియు స్పెషలైజ్డ్ థెరపీ జోన్లుడిమెన్షియా (మతిమరుపు), పార్కిన్సన్స్ వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేక విభాగాలుఅమెరికా దేశపు ఎవిడెన్స్ బేస్డ్ రీహాబిలిటేషన్ ప్రోటోకాల్స్. -
హైదరాబాద్‌లో మోదీ పర్యటన షెడ్యూల్ ఇదే..
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన ఖరారైంది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. మే 10వ తేదీన మధ్యాహ్నం 1.10 గంటలకు మోదీ బెంగళూరు విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరతారు. మధ్యాహ్నం 2.20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. 2.30 గంటలకు అక్కడ ఏర్పాటు చేసిన స్టేజీపై నుంచే పలు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఆ తర్వాత హెలికాప్టర్లో హైటెక్ సిటీకి వెళ్తారు. 3.45-4.15 గంటల మధ్య అక్కడి సాయి సింధు ఆసుపత్రిని ప్రారంభిస్తారు. తిరిగి 4.40 గంటలకు హెలికాప్టర్లో బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. 4.40-5.25 గంటల మధ్య రిజర్వ్ సమయం ఉంటుంది. 5.30 గంటలకు మోదీ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. సాయంత్రం 6.30 వరకు బహిరంగ సభలో ఉంటారు. ఆ తర్వాత 6.45 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి జామ్ నగర్‌కు తిరిగి వెళ్తారు.ప్రధానమంత్రి మోదీ మే 10న హైదరాబాద్ పర్యటనకు రానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు ఇప్పటికే ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భద్రత, ట్రాఫిక్, బందోబస్తుపై పోలీసులకు సూచనలు చేశారు. కాన్వాయ్ మార్గాలను పరిశీలించి అవసరమైన రోడ్డు మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. -
కిమ్స్‌లో క్రీడా గాయాలు & ఆర్థ్రోస్కోపీపై ఫెలోషిప్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: కిమ్స్ హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ విద్యారంగం, స్పోర్ట్స్ మెడిసిన్‌లో కీలక మైలురాయిని సాధించింది. తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో క్రీడా గాయాలు ఆర్థ్రోస్కోపీపై అంతర్జాతీయ గుర్తింపు పొందిన తొలి ఫెలోషిప్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ప్రతిష్టాత్మక ఫెలోషిప్ సాధారణ ఆర్థోపెడిక్ శిక్షణ, క్రీడాకారులు, శారీరకంగా చురుకైన వ్యక్తులకు అవసరమైన ప్రత్యేక నైపుణ్యాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు రూపొందించబడింది. ఆర్థ్రోస్కోపీ అనే ఈ మినిమల్ ఇన్వేసివ్ శస్త్రచికిత్స పద్ధతి చిన్న జాయింట్ స్థలాల్లో అధునాతన పరికరాలు మరియు ఫైబర్ ఆప్టిక్ కెమెరా సహాయంతో పని చేసే నైపుణ్యాన్ని కోరుతుంది. ఏసీఎల్ (ACL) పునర్నిర్మాణం, లాబ్రల్ రిపేర్, కార్టిలేజ్ రీస్టోరేషన్ వంటి శస్త్రచికిత్సలు అత్యంత ఖచ్చితత్వంతో చేయాల్సి ఉంటుంది. ఈ ఫెలోషిప్ ద్వారా వైద్యులకు ఈ నైపుణ్యాలపై సమగ్ర శిక్షణ అందుతుంది.ఈ కార్యక్రమంలో మోకాలి, భుజం, నడుము జాయింట్ల రీకన్స్ట్రక్టివ్ ఆర్థ్రోస్కోపీతో పాటు స్పోర్ట్స్ మెడిసిన్, జాయింట్ ప్రిజర్వేషన్ సర్జరీలో ప్రత్యేక శిక్షణ అందింస్తారు. ప్రాక్టికల్ శస్త్రచికిత్స అనుభవంతో పాటు సైద్ధాంతిక బోధనను కలిపి, ఖచ్చితమైన శస్త్రచికిత్స, క్రీడలకు సంబంధించిన గాయాల అంచనా, పునరావాస విధానాలు మరియు ఆధారిత వైద్య విధానాలపై ప్రత్యేకమైన ఫోకస్ ఉంటుంది. కిమ్స్ హాస్పిటల్స్ మెుదటి నుంచే సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, మెరుగైన చికిత్స ఫలితాలతో పాటు నిపుణుల తయారీకి కట్టుబడి ఉంది. ఈ ఫెలోషిప్‌కు లభించిన అంతర్జాతీయ గుర్తింపు, సంస్థ యొక్క వైద్య నైపుణ్యం మరియు గ్లోబల్ ప్రమాణాలపై ఉన్న నిబద్ధతకు నిదర్శనం. ఈ ఫెలోషిప్ కార్యక్రమానికి డైరెక్టర్ ఆర్థ్రోస్కోపీ, స్పోర్ట్స్ మెడిసిన్ హెచ్ఓడి డా. ఆర్. ఎ. పూర్ణచంద్ర తేజస్వి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం దేశంలో ఆధునిక ఆర్థోపెడిక్ శిక్షణకు మార్గదర్శిగా నిలవనుంది.ఈ సందర్భంగా డైరెక్టర్ మరియు ఆర్థ్రోస్కోపీ మరియు స్పోర్ట్స్ మెడిసిన్ హెచ్ఓడి డా. ఆర్.ఎ. పూర్ణచంద్ర తేజస్వి మాట్లాడుతూ, ఈ ఫెలోషిప్ ద్వారా అత్యాధునిక ఆర్థ్రోస్కోపీ పద్ధతుల్లో వైద్యులను శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రాంతంలో క్రీడా గాయాల చికిత్స నాణ్యతను మరింత మెరుగుపరచగలమని తెలిపారు. ఈ కార్యక్రమంతో కిమ్స్ హాస్పిటల్స్ ఆధునిక వైద్య విద్య మరియు ప్రత్యేక శస్త్రచికిత్స సేవలలో తన నాయకత్వ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ, దేశవ్యాప్తంగా కొత్త ప్రమాణాలను స్థాపిస్తోంది. -
ఐపీఎస్ సుమతికి వేధింపులు.. పోకిరీలకు దిమ్మతిరిగే షాక్
సాక్షి, హైదరాబాద్: నగరంలో పోకిరీల ఆట కట్టించేందుకు మల్కాజ్గిరి సీపీ సుమతి సరికొత్త ప్రయోగం చేశారు. కామన్ లేడీలా అర్ధరాత్రి రోడ్డుపై నిల్చున్నారు. దీంతో, సుమతిని చుట్టుముట్టిన పోకిరీలు.. వేధింపులకు గురి చేశారు. వస్తావా? రేటెంత? అంటూ ఐపీఎస్‌నే వేధింపులకు గురిచేశారు. అనంతరం, దాదాపు 40 మంది పొకిరీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఐపీఎస్ అధికారిణినే ఇంత వేధించారు అంటే అత్యవరస పరిస్థితుల్లో అర్ధరాత్రి బయటకు వెళ్ళే సాధారణ మహిళల పరిస్థితి ఏంటి? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.మల్కాజ్గిరి సీపీ సుమతి తన మార్క్ చూపించారు. దిల్‌సుఖ్‌నగర్‌లో పోకిరీలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. సీపీ సుమతి మంగళవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము 3.30 వరకు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో భాగంగా కామన్ లేడీలా అర్ధరాత్రి రోడ్డుపై నిల్చున్నారు. ఈ సందర్భంగా అధికారి సుమతిని పోకిరీలు చుట్టుముట్టారు. ‘వస్తావా? రేటెంత?’ అంటూ అసభ్య పదజాలంతో వేధించారు. దీంతో, దాదాపు 40 మంది ఆకతాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, స్పెషల్ ఆపరేషన్‌లో పట్టుబడ్డ వారంతా విద్యార్థులు, ఉద్యోగార్థులు కావడం గమనార్హం. వీరిలో పలువురు గంజాయి మత్తులో ఉన్నట్లు సమాచారం. 40 మంది పోకిరీలకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు.వస్తావా? రేటెంత? అంటూ ఐపీఎస్ అధికారిణి సుమతికి వేధింపులుదిల్సుఖ్నగర్లో మంగళవారం అర్ధరాత్రి మల్కాజ్గిరి సీపీ సుమతి స్పెషల్ ఆపరేషన్కామన్ లేడీలా అర్ధరాత్రి రోడ్డుపై నిల్చున్న ఐపీఎస్ అధికారి సుమతిని చుట్టుముట్టిన పోకిరీలుఅర్ధరాత్రి 12 గంటల నుంచి 3.30 వరకు సాగిన స్పెషల్… pic.twitter.com/aKJcRbQxRK— Telugu Scribe (@TeluguScribe) May 6, 2026 -
మాములోడు కాదు..! ఈ స్కామ్ లో వాడి తల్లి కూడా ఉంది
-
బిల్లు కట్టమని అడిగినందుకు సిబ్బందిపై దాడి
-
తల్లి సహకారం.. కొడుకుల వలపు వల
హైదరాబాద్: సంపన్న బాలికలకు వలపు వల విసురుతూ అన్నదమ్ములు రూ.లక్షల్లో దండుకున్న కేసులో కొత్త విషయాలు వెలుగు చూశాయి. పోలీసుల విచారణలో వెల్లడైన మేరకు.. కూకట్‌పల్లికి చెందిన ఈవెంట్ మేనేజర్ కొడూరి చంద్రశేఖర్ ఆజాద్ (22) ఖరీదైన అద్దె కార్లలో తిరుగుతూ ఇన్‌స్ట్రాగామ్‌లో ఫొటోలు పెట్టి సంపన్న బాలికలు, యువతులతో పరిచయాలు పెంచుకున్నాడు. వెయ్యిమంది యువతులు ఫాలోవర్స్ ఉన్న అతడికి తల్లి మీనాకుమారి, మేనమామ ప్రశాంత్ ప్రోత్సాహం ఉంది. నిందితుడితో పాటు అతడి సోదరుడు రాజీవ్‌ను పొక్సో కింద అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించి 4 రోజుల కస్టడీకి తీసుకున్నారు. వీరి స్నేహితుడు కార్తీక్‌ను అరెస్టు చేశారు. మంగళవారం మీనాకుమారి, ఆమె స్నేహితుడు వినీల్‌చౌదరి, ప్రశాంత్, చంద్రశేఖర్ స్నేహితులు హేమంత్, జితిన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చంద్రశేఖర్ ముఠా నాయకుడిగా వ్యవహరిస్తూ అమ్మాయిలకు వల వేసేలా స్నేహితులను ప్రోత్సహించినట్లు తేలింది. వారి వీడియోలను అడ్డంపెట్టుకుని రూ.లక్షల్లో వసూలు చేసినట్లు గుర్తించారు. సీపీ రంగంలోకి దిగింది అందుకే.. కొంతమంది కొత్త తరహా వసూళ్లకు తెరలేపారని, నగరంలో ఇది చాపకింద నీరులా విస్తరిస్తోందని చంద్రశేఖర్ అరెస్టుతో పోలీసులు నిర్ధారిస్తున్నారు. అందమైన యువకులను, ఇన్‌స్టాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్నవారిని గుర్తించి డబ్బు సాయం చేస్తూ ఖరీదైన కార్లు ఇస్తున్నారు. పబ్‌లు, క్లబ్‌లలో జల్సాలకూ సాయం చేస్తున్నారు. అమ్మాయిలను ట్రాప్ చేసి సన్నిహితంగా ఉన్నప్పుడు ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు. తర్వాత వారి తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తూ రూ.లక్షలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీపీ సజ్జనార్ స్వయంగా కేసు విచారించినట్లు తెలుస్తోంది. ఆదిలోనే ఈ సంస్కృతికి చెక్ పెట్టాలని, వీరి వెనుక ఎవరున్నారో చూడాలని మహిళా భద్రతా విభాగం డీసీపీ లావణ్యను ఆదేశించినట్లు సమాచారం. -
పత్తి దిగుబడి పెంపుకోసం రూ.5,659 కోట్లు
న్యూఢిల్లీ: దేశంలో పత్తి పంట దిగుబడి పెంపుకోసం ఐదేళ్లపాటు అమలయ్యే మిషన్‌కు రూ.5,695.22 కోట్లు కేటాయించనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనపై కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది. ప్రధాని మోది సారథ్యంలో భేటీ అయిన కేబినెట్ 2026–27 నుంచి 2030–31 కాలంలో అమలయ్యే ‘మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ’కింద ఈ మొత్తం వెచి్చంచాలని నిర్ణయించింది. దేశంలో పండే పత్తిలో నాణ్యత తగ్గడంతోపాటు దిగబడి క్రమంగా తగ్గిపోతుండటం వంటి సమస్యల పరిష్కారానికి ఈ నిధులను వెచి్చస్తారంది. వ్యాధులు, చీడపీడలను తట్టుకునే, అధిక దిగుబడులనిచ్చే వంగడాలను అభివృద్ధి పర్చడం, ప్రస్తుతమున్న సాంకేతికతను మరింత విస్తృతం చేయడం ఈ మిషన్ లక్ష్యాలని ప్రభుత్వం తెలిపింది. దీనితో దేశంలోని 32 లక్షల మందికి లబ్ధి కలుగనుందని పేర్కొంది.చెరకు కనీస ధర పెంపు అక్టోబర్ నుంచి మొదలయ్యే 2026–27 సీజన్‌కుగాను చెరకు కనీస ధరను పెంచాలని కేంద్రం నిర్ణయించింది. న్యాయమైన, లాభదాయక ధర (ఎఫ్ఆర్పీ)ని క్వింటాలుకు రూ.10 చొప్పున రూ.365కి పెంచేందుకు మంగళవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు తెలిపారు. తాజాగా ఆమోదించిన ఎఫ్ఆర్పీ 2025–26 సీజన్ ధర క్వింటాల్‌కు రూ.355 కంటే 2.81 శాతం ఎక్కువని ఆయన వివరించారు. మిల్లులకు చెరకు సరఫరా చేసే రైతులకు రక్షణగా 10.25 శాతం రికవరీ రేటు ఆధారంగానే క్వింటాలకు ధర రూ.365 ఉంటుందని తెలిపారు. ఇది ప్రస్తుత 2025–26 సీజన్ ధర రూ.355 కంటే 2.81 శాతం అధికమని చెప్పారు. ఒకవేళ రికవరీ రేటు 10.25 శాతం కంటే ప్రతి 0.1 శాతం పెరిగితే, క్వింటాల్‌కు అదనంగా రూ.3.56 చెల్లిస్తారన్నారు. 9.5 శాతం కంటే తక్కువ రికవరీ ఉన్న మిల్లులకు చెరకు సరఫరా చేసే రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు, వారికి ఎటువంటి కోత విధించకుండా క్వింటాల్‌కు రూ. 338.30 చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పేర్కొన్నారు. 2026– 27లో చెరకు ఉత్పత్తి వ్యయం క్వింటాలుకు రూ.182 చొప్పున ఉంటుందన్న అంచనా ప్రాతిపదికన ఎఫ్ఆర్పీ100.5 శాతంగా నిర్ణయించామని చెప్పారు. దీనివల్ల రైతులకు అదనంగా రూ.లక్ష కోట్ల మేర లాభం చేకూరనుందని వివరించారు. -
హైదరాబాద్ : నెహ్రూ జూ పార్క్... ‘జూ’లకాలాటలలో పులి (ఫొటోలు)
-
మళ్లీ విజయం వేటలో..ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ క్రికెటర్లు ప్రాక్టీస్ (ఫొటోలు)
-
ఐపీఎల్ వీఐపీ టికెట్ల దందాలో టీడీపీ కార్యకర్తలు
కందుకూరు: హైదరాబాద్‌లో ఐపీఎల్ క్రికెట్ కాంప్లిమెంటరీ టికెట్లను బ్లాక్మార్కెట్లో విక్రయిస్తూ ప్రకాశం జిల్లాకు చెందిన తెలుగుదేశం కార్యకర్తలు పట్టుబడటం స్థానికంగా సంచలనం కలిగించింది. క్రికెట్ బెట్టింగ్, పేకాట, మోసాలు చేయడంలో ఆరితేరిన అశోక్‌చౌదరి బృందం ఈ టికెట్లు అమ్ముతుండగా పోలీసులు పట్టుకోవడంతో వారి ఆగడాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి ఘట్టమనేని అశోక్‌చౌదరి ప్రకాశం జిల్లా కందుకూరు మండలం పలుకూరు గ్రామానికి చెందిన టీడీపీ కీలక కార్యకర్త. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ల ఆసరాగా ఈ ముఠా భారీ మోసాలకు పాల్పడుతున్నట్లు సమాచారం.పలుకూరుకు చెందిన అశోక్‌చౌదరి, కంకణాల దినేష్, సింగమనేని వేణుమాధవ్ మిత్రులు. గ్రామంలో టీడీపీ కీలక కార్యకర్తలు. కందుకూరు ప్రాంతంలో టీడీపీకి సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా హడావుడి అంతా అశోక్చౌదరిదే. ప్రస్తుతం టీడీపీ అధికారంలో ఉండడంతో వీరు సంపాదనకు అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారు. తమకు ఎదురే లేదన్నట్లు క్రికెట్ బెట్టింగ్ దందాను నడిపించడంతోపాటు వీఐపీల పేరుతో భారీ మోసాలకు పాల్పడసాగారు. దీన్లో భాగంగా తమిళనాడుకు చెందిన ఆశిష్, సెంథిల్, తన్సిల్తో కలిసి వీరు ముఠాగా ఏర్పడ్డారు. ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించి వీఐపీ కాంప్లిమెంటరీ టికెట్లు సంపాదించి వాటిని బ్లాక్‌లో మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.దీనికిగాను గవర్నర్లు, మంత్రులు, న్యాయమూర్తుల పేరుతో వివిధ రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు నకిలీ లెటర్హెడ్లను పంపి అక్కడి నుంచి ఐపీఎల్ కాంప్లిమెంటరీ టికెట్లు పొందేవారు. అలా పొందిన టికెట్లను బ్లాక్మార్కెట్లో ఒక్కొక్కటి రూ.22 వేలకు అమ్ముకుని సొమ్ము చేసుకునేవారు. వీఐపీ లెటర్హెడ్లతో టికెట్లు పొందుతున్న ఈ ముఠా వ్యవహారంపై అనుమానం రావడంతో హెచ్‌సీఏ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఉప్పల్ పోలీసులు ఉప్పల్ స్టేడియం వద్ద బ్లాక్‌లో టికెట్లు విక్రయిస్తుండగా అశోక్‌చౌదరి, దినేష్, వేణుమాధవ్‌లను రెండు రోజుల కిందట అరెస్టు చేశారు. వీరంతా పలుకూరుకు చెందినవారు కావడంతో ప్రస్తుతం ఈ ప్రాంతంలో వీరి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.ఈ ముఠాలో కీలక సూత్రధారి అశోక్‌చౌదరి వ్యవహారం మొదటి నుంచి వివాదాస్పదమే. గ్రామంలో దురుసుగా ప్రవర్తించడం, టీడీపీ కార్యక్రమాల సందర్భంగా బైక్‌లతో హంగామా చేయడం పరిపాటి అని చెబుతున్నారు. ప్రజా ప్రతినిధులు, వీఐపీలతో ఫొటోలు దిగి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకుంటుంటాడు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్, పలువురు టీడీపీ ముఖ్యులు, ఐసీసీ చైర్మన్ జైషాతో దిగిన ఫొటోలను పెట్టుకున్నాడు. ఇలా ఫొటోలతో తననుతాను ప్రమోట్ చేసుకుంటూ క్రికెట్ బెట్టింగ్ దందా, టికెట్ల బ్లాక్‌మార్కెట్ ముఠా నడిపిస్తున్నాడు. -
మెట్ గాలాలో రూ. 142 కోట్ల నెక్లెస్‌తో మెరిసిన సుధా రెడ్డి..!
న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో మెట్‌గాలా 2026 వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో సెలబ్రెటీలు, ప్రముఖులు, ఇతరులు తమదైన శైలితో కళాత్మకంగా మెరిశారు. ఈసారి మన హైదరాబాద్ బిలియనీర్, MEIL(Megha Engineering and Infrastructures Limited) గ్రూప్ డైరెక్టర్లో ఒకరైన సుధారెడ్డి అద్భుతమైన లుక్‌లో అలరించారు. ఈ వేడుకలో ఆమె మనీష్ మల్హోత్రా దుస్తులను ఎంచుకున్నారు. ఆమె ఈ ఈవెంట్లో 'కాస్ట్యూమ్ ఆర్ట్' అనే థీమ్‌కు అనుగుణంగా ధరించిన మిలియన్ డాలర్ల నెక్లెస్ అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. ఈ నెక్లెస్ ఆమె వ్యక్తిగత ఆభరణాల కలెక్షన్లలో ఒకటి. దీని ఖరీదు వచ్చేసి దాదాపు 142 కోట్లు పైనే పలుకుతుందట. ఈ ఆభరణం త్రిభుజాకార రోజ్-కట్ వజ్రాలతో కూడిన విక్టోరియన్-ఫినిష్ చైన్‌తో రూపొందించారు. పూల గుత్తులలో పొదిగిన ఈ రత్నాలు, నెక్లెస్ మధ్యలో ఉన్న 550 క్యారెట్ల ముదురు ఊదా-నీలం రంగు టాంజనైట్ ఈ నెక్లెస్ అందాన్ని మరింత హైలెట్ చేశాయి. ఈ నెక్లెస్‌ని 'క్వీన్ ఆఫ్ మెరెలానీ' అని పిలుస్తారట. ఈ ఆభరణంతోపాటు 30 క్యారెట్ల రోజ్-కట్ పోల్కీ వజ్రపు ఉంగరం, 40 క్యారెట్ల అస్చెర్-కట్ కొలంబియన్ పచ్చ ఉంగరంతో సుధారెడ్డి తన ఆహార్యాన్ని పూర్తి చేశారు. ఇక మనీస్ మల్హోత్రా డిజైన్ చేసినా ఆమె డ్రెస్ 'జీవ వృక్షం', కాలం, జ్ఞాపకం, నిరంతర ఆవిష్కరణలకు కేంద్రంగా నిలిచింది. ఇందులోని ప్రతిదారం చరిత్రలో ఒక భాగాన్ని వివరించే అద్భుతమైన కళ. అన్నింటకంటే ఆ డిజైనర్‌వేర్‌లో ఏకంగా మూడువేల ఏళ్ల వస్త్ర సంప్రదాయాన్ని అల్లికలు, ఎంబ్రాయిడరీ ద్వారా చూపించినట్లు పేర్కొన్నారు మల్హోత్రా. అందులో పాలపిట్ట, జమ్మి చెట్టు, కల్పవృక్ష, టాంగేడు, సూర్య, చంద్ర తదితర మూలాంశాలన్నీ ఈ డ్రెస్‌ను మరింత అందంగా కనిపించేలా చేశాయి. కాగా సుధారెడ్డి ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో తన మెట్ గాలా లుక్ గురించి ఇలా షేర్ చేసుకున్నారు. "హైదరాబాద్ కేవలం తన పుట్టినిల్లు మాత్రమే కాదు, అది తనలో భాగమైన జీవన విధానం. తాను ఈ వేడుకలో ప్రపంచ వేదికపై దక్షిణ భారతీయతను కళ్లకు కట్టినట్లు చూపించేలా..అత్యంత ఆకర్షణీయంగా కనిపించాలని ఆకాంక్షించినట్లు వెల్లడించారు". కాగా, సుధా రెడ్డికి MEIL (Megha Engineering and Infrastructures Limited) మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణా రెడ్డితో వివాహం జరిగింది. ఆ దంపతులకు మానస్, ప్రణవ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. View this post on Instagram A post shared by Sudha Reddy (@sudhareddy.official)(చదవండి: ఎవరీ సుధారెడ్డి..? ఏకంగా 200 క్యారెట్లకు పైగా వజ్రాలు..) -
ప్రైవేట్ పాఠశాలల ఫీజులు.. మానవ హక్కుల సంఘం కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ పాఠశాలల ముందస్తు ఫీజు వసూలు విషయంలో రాష్ట్ర మానవహక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. పాఠశాలల్లో ముందస్తు ఫీజు వసూళ్లపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. ఇటువంటి చర్యలు అనుచితం, ఏకపక్షమైనవే కాకుండా వాణిజ్యపరంగా విద్యను మలచరాదనే న్యాయసూత్రాలకు పూర్తిగా విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ మేరకు మానవహక్కుల సంఘం ఛైర్మన్ షమీమ్ అక్తర్ అటువంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.వివరాల్లోకి వెళితే.. బోడుప్పల్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాల 2026–2027 విద్యా సంవత్సరానికి 50% ఫీజును ముందుగానే వసూలు చేయడం, అలాగే పుస్తకాలు మరియు యూనిఫాంల కోసం ముందస్తు చెల్లింపులు కోరడం వంటి అంశాలపై మానవహక్కుల సంఘంలో ఫిర్యాదు నమోదైంది. దీనిని విచారించిన హ్యుమన్ రైట్స్ కమిషన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం విద్య హక్కు ప్రాథమిక హక్కు కాగా, దానిని లాభాపేక్షతో నిర్వహించరాదని సంఘం పునరుద్ఘాటించింది.తల్లిదండ్రులపై పడుతున్న ఆర్థిక భారం, అలాగే నిర్దిష్ట విక్రేతల వద్ద నుంచే పుస్తకాలు, యూనిఫాంల కొనుగోలు చేయాల్సిందిగా ఒత్తిడి చేయడం వల్ల పారదర్శకత లోపిస్తున్న అంశాలను గమనించిన సంఘం, మెడ్చల్-మల్కాజిగిరి జిల్లా విద్యాధికారి తగిన చర్యలు తీసుకోవాలని, ఫీజు నియంత్రణ నిబంధనల ప్రకారం విడతలవారీగా ఫీజులు వసూలు చేసే విధానాన్ని అమలు చేయాలని సిఫార్సు చేసింది.ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ చట్టం, 1993 ప్రకారం నిర్ణీత గడువులోగా తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారిని సంఘం ఆదేశిస్తూ, ఈ వ్యవహారాన్ని ముగించింది. -
నడిరోడ్డుపై ఆటోడ్రైవర్ వీరోచిత పోరాటం.. ప్రాణాలకు తెగించి..
హైదరాబాద్: నేరం జరుగుతుంటే చూస్తూ ఉండిపోవడం కాదు.. ఆ నేరగాడిని పట్టుకోవడమే అసలైన పౌర ధర్మమని నిరూపించారు ఒక సామాన్య ఆటో డ్రైవర్. ఒక మహిళ మెడలోని బంగారు గొలుసును రౌడీ షీటర్ లాక్కేళ్లేందుకు ప్రయత్నిస్తే.. ప్రాణాలకు తెగించి, తన ఆటోనే ఆయుధంగా మలచుకొని సాహసోపేతంగా ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహెర్.. రౌడీ షీటర్‌ను అడ్డుకున్నారు. కర్రతో దాడి చేస్తున్నా బెదరకుండా ప్రతిఘటించారు.ఈ అసామాన్య ధైర్యాన్ని ప్రదర్శించిన ఆటో డ్రైవర్ జాహెర్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మంగళవారం బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీలోని తన ఛాంబర్ లో ప్రత్యేకంగా సన్మానించారు. మహమ్మద్ జాహెర్‌కు ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు.బేగం బజార్ జిన్సీ చౌరాహా ప్రాంతంలో మార్చి 4వ తేదీ తెల్లవారుజామున మంజు ఓమ్లతా తన కోడలితో కలిసి మార్నింగ్ వాక్కు వెళ్లారు. హిందీ మర్వాడీ విద్యాలయ స్కూల్ వద్దకు చేరుకోగానే, డబీర్‌పురకు చెందిన రౌడీ షీటర్ మహ్మద్ సోహేల్ ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆ క్రమంలో నిందితుడి స్కూటీ అదుపుతప్పి కిందపడిపోయింది. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో, అదే సమయంలో అటుగా వెళ్తున్న ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహెర్ ఈ దృశ్యాన్ని సైడ్ వ్యూ మిర్రర్ ద్వారా గమనించారు.జాహెర్ వెంటనే స్పందించి తన ఆటోను వేగంగా వెనక్కి తిప్పారు. పారిపోవడానికి ప్రయత్నిస్తున్న రౌడీ షీటర్ బైక్‌ను తన ఆటోతో ఢీకొట్టి అతడిని కిందపడేశారు. ఆ సమయంలో నిందితుడు కర్రతో దాడి చేసినా భయపడకుండా ప్రతిఘటించి అడ్డుకున్నారు. ఆ సమయంలో పారిపోతుండగా వెంటనే గస్తీ తిరుగుతున్న పోలీసులు రౌడీ షీటర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత జాహెర్ ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా అక్కడి నుండి వెళ్లిపోయారు. ఆటో డ్రైవర్ సాహసం గురించి గోషామహల్ పోలీసులకు బాధితురాలు తెలియజేశారు. కాగా, ఈ వీరోచిత దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. రౌడీ షీటర్‌ను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించి, నిస్వార్థంగా వెళ్లిపోయిన ఆ అజ్ఞాత వీరుడి కోసం గోషామహల్ పోలీసులు గాలింపు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలో ఆటో నంబర్‌ను చూసి, సాంకేతిక పరిజ్ఞానంతో జాహెర్‌ను గుర్తించారు.ఈ సందర్భంగా సీపీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహెర్ చూపిన సాహసం సమాజానికి ఆదర్శమన్నారు. “కళ్లముందే నేరాలు జరుగుతున్నా పట్టించుకోని ఈ రోజుల్లో, ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న జాహెర్ సమాజానికి నిజమైన రోల్ మోడల్. ఆయనలో ఒక అద్భుతమైన ప్రజా పోలీస్ ఉన్నారు. ఎలాంటి ప్రతిఫలం కూడా ఆశించలేదు. ఇలాంటి బాధ్యతాయుతమైన పౌరులు ఉన్నప్పుడే నేరస్తులకు భయం పుడుతుంది" అని ప్రశంసించారు.నేరం జరుగుతున్నప్పుడు భయపడకుండా, మహమ్మద్ జాహెర్లా ధైర్యంగా స్పందించి వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని నగరవాసులకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కాగా, డబిర్ పూరకు చెందిన రౌడీ షీటర్ పై గోషా మహల్ పీఎస్‌లో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అతడిపై పలు పోలీస్ స్టేషన్లలో 16 కేసులున్నాయి. ✅ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్✅ఆటోతో ఢీకొట్టి ‘నిలువరించిన’ తీరు.. సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం✅సన్మానించిన నగర సీపీ సజ్జనర్.. నగదు పురస్కారం, ప్రశంసా పత్రం అందజేతనేరం జరుగుతుంటే చూస్తూ ఉండిపోవడం కాదు.. ఆ నేరగాడిని పట్టుకోవడమే అసలైన పౌర ధర్మమని… pic.twitter.com/IyGunUWQyB— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) May 5, 2026 -
హైదరాబాద్ బాచుపల్లి లో భారీ అగ్నిప్రమాదం
-
కొత్వాల్‌గూడలో ‘హైడ్రా’మా!
సాక్షి, హైదరాబాద్: కొత్వాల్గూడ్లో హైడ్రా హడావిడి చేస్తోంది. స్థానికంగా ఓ క్రషర్స్ మిషన్స్‌ను కూల్చివేస్తోంది. ఇది ఓ మంత్రికి సంబంధించిందంటూ విపరీతంగా ప్రచారం జరిగింది. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు కూడా దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాటకీయ పరిణామాల నడుమ హైడ్రా కూల్చివేతలు కొనసాగుతుండడం గమనార్హం. వట్టినాగులపల్లిలో అనుమతి లేని క్రషర్లను హైడ్రా సిబ్బంది తొలగిస్తున్నారు. మొత్తం ఐదు ప్రాంతాల్లో అక్రమ క్రషింగ్ యూనిట్ల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని కొత్వాల్‌గూడలో ఉన్న ఈ క్రషర్ల చుట్టూ ఉన్న వివాదాలు నెలకొన్నాయి. జీవో నెంబర్ 111 నిబంధనలను అతిక్రమిస్తూ.. అక్రమంగా ఓ మంత్రికి చెందిన కన్స్ట్రక్షన్స్ కంపెనీ క్రషర్లను నడుపుతోందని ఆరోపణలు వచ్చాయి. హిమాయత్‌సాగర్ క్యాచ్మెంట్ ఏరియా (111 జీవో పరిధి)లో ఈ క్రషర్లు పనిచేస్తున్నాయని, గుట్టలను పిండి చేస్తూ పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయని స్థానికులు, ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. అయితే..తీవ్ర ఆరోపణల నేపథ్యంలో అధికారులు కొన్ని క్రషర్లు, రెడీమిక్స్ ప్లాంట్లను సీజ్ చేశారు. 15 స్టోన్ క్రషర్లకు (పరిధిలోని వివిధ ప్రాంతాలు) జరిమానాలు కూడా విధించినట్లు సమాచారం. అయితే సదరు మంత్రికి చెందిన కంపెనీ ఆ లిస్ట్‌లో లేదని స్థానిక అధికారులు తెలియజేశారు. ఆ వెంటనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధంతో రాజకీయ దుమారం రేగింది. ఈ నేపథ్యంలో తాజా కూల్చివేతలపై హైడ్రా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. -
హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: బాచుపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బాచుపల్లి-మియాపూర్ ప్రధాన రహదారిలో ఉన్న ఫర్నీచర్ షాపులు అగ్నికి ఆహుతి అయ్యాయి.. ఈ ఘటన సోమవారం రాత్రి 11 గంటల సమయంలో జరిగింది. సుమారు 20 కుటంబాలు రోడ్డున పడ్డాయి. షాపుల్లోని ఫర్నిచర్ సోఫా సెట్టులు, ఇంటి సామగ్రి, టేబుల్స్ దగ్ధమయ్యాయి.ఒక్కో షాప్‌లో సుమారు రూ. 3 లక్షల రూపాయల విలువైన సామగ్రి ఉంది. సంఘటన స్థలానికి ఆరు ఫైర్ ఇంజన్లు చేరుకుని మంటలను అదుపు చేశాయి.. అయితే ఈ ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా? గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా చేశారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
చెన్నైలో పసిడి ప్రియులకు ఊరట..
దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. రెండు రోజుల క్రితం భారీగా పెరిగిన పుత్తడి ధరలు వరుసగా నిలకడగా కొనసాగడం పసిడి ప్రియులకు ఊరట కలిగించే విషయం. ఇక వెండి ధరలు సైతం వరుసగా రెండో రోజూ ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రస్తుతం బంగారం (Today Gold Rate), వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో ఈ కింద తెలుసుకుందాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
అమ్మ ఆశీర్వాదం తీసుకున్నా.. డీజీపీ సీవీ ఆనంద్
సాక్షి, హైదరాబాద్: డీజీపీ బా ధ్యతలు చేపట్టిన తర్వాత తల్లిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నట్టు సీవీ ఆనంద్ ఆదివారం తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ‘మా అమ్మను పరామర్శించి ఆమె ఆశీర్వాదం తీసుకున్నాను. ఆమె నవంబర్ నుంచి జనవరి నెలల్లో అనా రోగ్యంతో ఉన్నారు. ఇప్పుడు మంచానికే పరిమితమైనప్పటికీ కోలుకున్నారు. తన కొడుకు ఈ రాష్ట్రానికి డీజీపీ కావాలన్న ఆమె ప్రగాఢ వాంఛే ఆమెను నిలబెట్టిందని నాకు అనిపించింది. ఆమె ఎంతో సంతోషించారు. నేను కూడా అంతే..’ అంటూ కొన్ని ఫొటోలను సీవీ ఆనంద్ పంచుకున్నారు. -
ఆరేళ్ల నాటి సాయానికి కేటీఆర్‌కు ఓ బాలిక కృతజ్ఞత
హైదరాబాద్: ఆరేళ్ల క్రితం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమి ట్టాడుతున్న ఓ బాలిక నాటి మంత్రి కె. తారక రామారావు అందించిన సాయంతో కోలు కొని ప్రస్తుతం కొత్త జీవితం అనుభవిస్తోంది. హైదరాబాద్‌లోని ప్యారడైజ్ బాలంరాయ్ ప్రాంతానికి చెందిన నారాయణ, రాజేశ్వరి దంపతుల కుమార్తె శరణ్య ప్రాణాంతక బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడగా ప్రైవేటు ఉద్యోగులైన ఆమె తల్లిదండ్రులకు రూ. లక్షల వైద్య ఖర్చు భరించడం సాధ్యంకాలేదు. ఆ కష్ట సమయంలో శరణ్య చిన్నమ్మ చేసిన ట్వీట్‌కు స్పందించిన కేటీఆర్.. వెంటనే అధికారులను అప్రమత్తం చేసి శరణ్యకు ఖరీదైన చికిత్సను ఉచితంగా అందేలా చర్యలు తీసుకున్నారు. కాలక్రమంలో శరణ్య పూర్తిగా కోలుకొని ఇటీవల పదో తరగతి పరీక్షల్లో 384 మార్కులతో ఉత్తీర్ణురాలైంది. ఈ నేపథ్యంలో తన ప్రాణాలను కాపాడిన కేటీఆర్‌ను తల్లిదండ్రులతో కలిసి కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ‘‘ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి వినియోగించగలగడం నా అదృష్టం. శరణ్య ఆరోగ్యంగా ఉండటం ఎంతో ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు. తమ చిన్నారి ప్రాణాలు కాపాడినందుకు.. కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన కుటుంబంఆరేళ్ల క్రితం ఎక్స్ వేదికగా.. బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న తమ కుమార్తె శరణ్యను కాపాడాలని కేటీఆర్‌ను కోరిన ఫ్యామిలీఈ ట్వీట్‌కు వెంటనే స్పందించడమే కాదు.. ఆపరేషన్‌కు కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందించిన… pic.twitter.com/KHdO3ONe2I— PulseNewsBreaking (@pulsenewsbreak) May 3, 2026 -
ఐఫోన్.. ఆవేశం.. విషాదం
హైదరాబాద్: ఐఫోన్ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో తీవ్ర మనస్థాపానికి గురైన భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కుద్భిగూడ ప్రాంతానికి చెందిన బక్కి ప్రియ (42)కు 20 ఏళ్ల క్రితం మల్లికార్జున్ ముస్తాపూర్ తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. కొత్తగా తీసుకొచ్చిన ఐ ఫోన్‌ను తన కజిన్‌కు భర్త ఇచ్చాడు. ఈ విషయంపై ఆదివారం ఉదయం భార్యాభర్తులు గొడవపడ్డారు. ఆవేశంలో ప్రియ ఇంట్లో ఉన్న చెదల మందు తాగింది. ఇది గమనించిన భర్త వెంటనే ఆమెను కాచిగూడలోని సీసీ ష్రాఫ్ ఆస్పత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రియ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ రాజశేఖర్ తెలిపారు. -
ఒకే చితిపై నవ దంపతులకు దహన సంస్కారాలు
హైదరాబాద్: బలవన్మరణానికి పాల్పడిన నవ దంపతులు కార్తీక్, మంజుల (జ్ఞాన్సిక)లకు ఆదివారం కూకట్‌పల్లిలోని వెంకటరావునగర్ కాలనీలోని హిందూ శ్మశాన వాటికలో కుటుంబ సభ్యులు ఒకే చితిపై దహన సంస్కారాలు చేశారు. వివాహమై రెండు నెలలు గడవక ముందే దంపతులు ఆత్మహత్య చేసుకోవటం మిస్టరీగా మారింది. శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి సరదాగా ఉన్న కార్తీక్, మంజుల మరుసటి రోజు ఉదయం విగతజీవులుగా కనిపించటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆర్థిక సమస్యలు లేవని, ఆత్మహత్య చేసుకునేంత కష్టం ఏమొచ్చిందోనని స్థానికులు చర్చించుకుంటున్నారు. పోస్ట్‌మార్టం నివేదిక వస్తేనే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు. కాగా.. శుక్రవారం అర్ధరాత్రి తొలుత మంజుల పురుగుల మందు తాగి మృతి చెందడంతో కార్తీక్ ఉదయం ఉరి వేసుకున్నట్లు స్థానికులు భావిస్తున్నారు.చదవండి: ఐఫోన్.. ఆవేశం.. విషాదం -
హర్టయ్యినట్లున్నాడు..క్యాబ్ డ్రైవర్ నోట్ వైరల్!
ఏదైనా మనసుకు గాయమైతే అది ఏదొక సందర్భంలో ఏదొక రూపంలో బయటకొచ్చేయడం ఖాయం. ఇక్కడ ధనిక, బీద అనే తేడా ఉండదు. ‘నేను నా బత్రుకు.. బ్రతుకుతున్నా.. మీకు బానిసను కాదు’’ అనే భావన మనిషిలో ఉండటంలో తప్పులేదు. ఉంటుంది కూడా. ‘నీ పనిని నువ్వు గౌరవించు.. అవతలి వాడికి సలాం కొట్టక్కర్లేదు’ అనే పెద్దలు చెప్పే మాటను చాలామంది పాటిస్తుంటారు. ఉద్యోగం చేసే చోట సలాం కొట్టే పరిస్థితి వచ్చినా అది కొంతవరకే ఉంటుంది కానీ, ఏదో మనం సుపీరియర్ అందుకే అవతల వ్యక్తి సలాం కొడుతున్నాడని అనుకోవద్దు. మరి స్వేచ్ఛా జీవులుగా బ్రతికే వ్యక్తులకు సలాం కొట్టడమన్నా, అవతల వాళ్లు అటిట్యూడ్ చూపెడుతున్నప్పుడు అది భరించడమన్నా చాలా కష్టం. ఇక్కడ ఓ క్యాబ్ డ్రైవర్ కూడా అదే చేశాడు. ఇంతకీ విషయం ఏంటంటే.. క్యాబ్ డ్రైవర్ తన కారులో పెట్టిన నోట్ గురించి. ఎక్కడో ఏదో జరిగే ఆ నోట్ పెట్టడానికి కూడా కారణం అయ్యి ఉండొచ్చు. తన క్యాబ్‌లో ఎక్కే వారు ఎలా ఉండాలి అనే దానిపై ఓ నోట్‌ను పెట్టుకున్నాడు. ముందుగా ‘ ‘ క్యాబ్ ఎక్కేవారు యజమానిగా ఫీలవ్వద్దు’ అంటూ మొదలు పెట్టి సుమారు 10 నియమాలను పొందుపరిచాడు. డ్రైవర్లు- ప్రయాణికులు ఒకరితో ఒకరు ఎలా ప్రవర్తించాలనే దానిపై పెట్టిన ఓ నోట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెట్టింట ఇది విస్తృత చర్చకు కూడా దారి తీసింది. ప్రయాణికుడు క్యాబ్ యజమాని కాదని, దానిని నడిపే వ్యక్తే యజమాని అని పేర్కొంటూ ఆ నోట్‌ను ప్రారంభించి. ఆ తర్వాత, ప్రయాణికులను మర్యాదగా మాట్లాడాలని, గౌరవంగా ఉండాలని, కారు డోర్‌ను నెమ్మదిగా మూయాలని కోరాడు. మీరు(ప్రయాణికులు) డబ్బు చెల్లించినంత మాత్రాన అమర్యాదగా ప్రవర్తించే హక్కు వారికి లేదన్నాడు. మీకు ఏమైనా అహంకారం ఉంటే దానిని జేబులో పెట్టుకుని ఉండాలని కూడా సూచించాడు. ఇది హైదరాబాద్‌కు చెందిన క్యాబ్ డ్రైవర్ నోట్‌గా తెలుస్తోంది. హైదరాబాద్ క్యాబ్‌లు వెనుకాడవు అనే క్యాప్షన్‌తో అమన్ అనే సోషల్ మీడియా యూజర్ ‘ఎక్స్’లో ఆ నోట్‌ను ఫోట్ తీసి పోస్ట్ చేశాడు. ఇది వైరల్‌గా మారిన వైనంలో వార్త అయ్యింది. Hyderabad cabs do not hesitate pic.twitter.com/oWuJUtwRkB— Aman (@AmanHasNoName_2) May 2, 2026 -
ఎస్ఐఆర్పై ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ సమీక్ష
హైదరాబాద్: గాంధీభవన్ లో మాజీ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ లు మరియు కోఆర్డినేటర్లు విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించబడింది. ఎన్నికల సంఘం చేపట్టిన “స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)” కార్యక్రమంపై లోతైన చర్చ జరిపి, భవిష్యత్ కార్యాచరణపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడుతూ, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అత్యంత కీలక అంశమని పేర్కొన్నారు. మల్కాజ్గిరి కార్పొరేషన్ లో ఎక్కడా దొంగ ఓట్లు, డబుల్ ఓట్లు ఉండకుండా ప్రతి బూత్ స్థాయిలో పర్యవేక్షణను బలోపేతం చేయాలని, అర్హత కలిగిన ప్రతి ఓటరు జాబితాలో ఉండేలా క్షేత్ర స్థాయిలో కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, సవరణలు వంటి ప్రక్రియలను వేగవంతం చేయాలని, యువత, మహిళలు మరియు కొత్తగా అర్హత పొందిన వారిని ప్రత్యేకంగా గుర్తించి నమోదు చేయించాలన్నారు. ఈ దిశగా పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు.బూత్ స్థాయిలో సమర్థవంతమైన వ్యవస్థ కోసం వెంటనే “బూత్ లెవల్ అసిస్టెంట్స్ (BLA)” నియామకాన్ని పూర్తి చేసి, వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రతి కార్యకర్త ఈ బాధ్యతను కర్తవ్యంగా భావించి పనిచేస్తేనే భవిష్యత్ ఎన్నికల్లో విజయానికి బలమైన పునాది పడుతుందని స్పష్టం చేశారు,మరియు డివిజన్ అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ కూడా పూర్తి చేయాలని అన్నారుఈ కార్యక్రమంలో మధుయాష్కి గారు,జిల్లా అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ గారు,ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి గారు. ఉప్పల్ నియోజకవర్గం కోర్డినేటర్ శశికళ యాదవ్ గారు,బండి రమేష్ గారు,కోలన్ హనుమంత్ రెడ్డి గారు,తదితరులు పాల్గొన్నారు -
అక్షర యోధులకు అరుదైన గుర్తింపు
హైదరాబాద్: పగలూ రాత్రీ తేడా లేకుండా కాలంతో పరుగులు పెడుతూ పనిచేయాల్సి వచ్చే కఠోరశ్రమతో కూడుకున్న రంగం జర్నలిజం అని.. విశ్వవిద్యాలయాల్లో చదువుకొని, ఆదర్శాలు, విలువలతో వచ్చి, ఆచరణలో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు.‘హైబిజ్ టీవీ’ మీడియా అవార్డ్స్-2026 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన నేను కూడా ఒకప్పుడు అలా కష్టాలు అనుభవించినవాణ్ణే. అయితే, ప్రగాఢమైన అభిరుచితో వదలకుండా కృషి చేస్తే గుర్తింపు తప్పక వస్తుందన్నారు. ఇవాళ మీడియా ఎంతో ఉత్సాహంగా, క్రియాశీలంగా ఉందన్నారు.జర్నలిజంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), కొత్త టెక్నాలజీల ప్రభావంపై సీనియర్ జర్నలిస్టులు లోతుగా ఆలోచించి, మీడియా అభివృద్ధికి తగిన సూచనలు ఇవ్వాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు. అందుకు ప్రభుత్వం ఓ వేదిక కల్పించడానికి సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. అలాగే ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు మరింత సమర్థంగా చేరవేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.కాంగ్రెస్ నేత, భారత మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు దశాబ్దాల క్రితమే చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, తెచ్చిన విప్లవాత్మక మార్పులను ప్రస్తావిస్తూ, “1992లో హైదరాబాద్‌లో హైటెక్ సిటీకి అంకురార్పణ చేసిందే... మా కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే, అప్పుడైనా ఇప్పుడైనా ప్రజలకు మేము చేస్తున్న మంచి పనులను సమర్థంగా చెప్పుకోలేక పోతున్నాం. అంతెందుకు... మా ప్రభుత్వం చేపట్టిన పారిశ్రామిక అనుకూల, క్రియాశీలక విధానాల వల్ల గత రెండేళ్ళలో రాష్ట్రంలోని కమర్షియల్ స్పేస్ నూటికి నూరుపాళ్ళు నిండిపోయింది.అలాగే, గత రెండేళ్ళలో ప్రతి 3 రోజులకు ఒక ‘గ్లోబల్ కేపబిలిటీ సెంటర్’ (‘జీసీసీ’ - ఐటీ, ఫైనాన్స్ తదితర రంగాల్లో విదేశీ సంస్థల తాలూకు అనుబంధ సంస్థలు భారత్‌లో రావడం) హైదరాబాద్‌లో నెలకొనడం జరిగింది. ఒక్క గత ఏడాదిలోనే 70 జీసీసీలు వచ్చాయి. అలాగే, మరే రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలోని ప్రతి గ్రామం ఆప్టికల్ ఫైబర్ నెట్ కేబుల్‌తో అనుసంధానమైంది. ఎక్కడికైనా సెకనులో వెయ్యో వంతులో సమాచారాన్ని పంపే వీలు కలిగింది. ఇది డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పరాకాష్ఠ” అని శ్రీధర్ బాబు వివరించారు.శనివారం అట్టహాసంగా సాగిన ఈ మీడియా అవార్డుల ప్రదానోత్సవానికి ప్రధాన అతిథులుగా రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ‘ఇండియన్ న్యూస్ పేపర్స్ సొసైటీ’ అధ్యక్షుడు – రాజ్యసభ మాజీ సభ్యుడు వివేక్ గుప్తా హాజరయ్యారు. గౌరవ అతిథులుగా ‘భారతీ సిమెంట్’ మార్కెటింగ్ డైరెక్టర్ ఎం. రవీందర్ రెడ్డి, ‘లైఫ్ స్పాన్’ అధినేత నరేంద్ర రామ్ నంబుల, ‘క్రెడాయ్ - హైదరాబాద్’ ప్రెసిడెంట్ ఎన్. జైదీప్ రెడ్డి, అలాగే ఎం. రాజ్ గోపాల్ (మేనేజింగ్ డైరెక్టర్ - హైబిజ్ టీవీ, తెలుగు నౌ), డాక్టర్ జె. సంధ్యారాణి (మేనేజింగ్ డైరెక్టర్ - హైబిజ్ టీవీ ఎల్.ఎల్.పి) తదితరులు పాల్గొన్నారు.2026కు గాను నిర్వహించిన తాజా అవార్డుల ప్రదానోత్సవంలో మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టుల కుటుంబాలలోని ప్రతిభావంతులైన పిల్లల చదువులకు ఒక్కో కుటుంబానికి పాతిక వేల రూపాయల చొప్పున హైబిజ్ టీవీ - లైఫ్ స్పాన్ సంస్థలు ఆర్థికంగా చేయూత అందించడం విశేషం. అలా తమ ప్రతిభతో స్కాలర్ షిప్ అందుకున్న విద్యార్థినీ విద్యార్థుల్లో ఏ. వికాస్ గౌడ్ (97.02% మార్కులతో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఉత్తీర్ణుడు), ఏ. స్రవంతి (ఎం.బి.బి.ఎస్. విద్యార్థిని), ఎన్. సమీక్ష (97.10% మార్కులతో ఇంటర్మీడియట్ పూర్తి)..ఎస్. అనుశ్రిజ (బీకామ్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని), ఎస్. అశ్వంత్ కుమార్ (97% మార్కులతో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పూర్తి), టి. తరళశ్రీ (97% మార్కులతో ఇంటర్మీడియట్ తొలి సంవత్సరం పూర్తి), ఎస్. సిరి (97.1% మార్కులతో ఇంటర్మీడియట్ పూర్తి), ఇ. వినీత్ (98% మార్కులతో ఇంటర్మీడియట్ పూర్తి), సహస్ర (ఇంటర్మీడియట్ పూర్తి), హెచ్. సాయి కిరణ్ (పదో తరగతి పూర్తి) తదితరులున్నారు. ఉపకార వేతనాల చెక్కును మంత్రివర్యుల చేతుల మీదుగా అందుకుంటున్నప్పుడు ఆ పిల్లల ముఖంలో వెల్లివిరిసిన ఆనందం, ఆ కుటుంబాల సంతోషంతో సభావేదిక కళకళలాడింది.‘హైబిజ్ టీవీ - మీడియా అవార్డ్స్ 2026’లో భాగంగా మీడియా రంగంలో విశేష సేవలు అందిస్తున్న ఐదుగురికి ‘లెజెండరీ పురస్కారాలు’ అందజేశారు. ఈ ‘లెజండరీ పురస్కారాలు’ అందుకున్న వారిలో... జాతీయ జర్నలిస్టు భూపేంద్ర చౌబే (మాజీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, సీఎన్ఎన్ - న్యూస్18, ఇండియా ఎహెడ్, ఎన్డీ టీవీ), తెలుగువారైన వెటరన్ జర్నలిస్ట్ భండారు శ్రీనివాసరావు (ఆలిండియా రేడియో), ఆంగ్ల పత్రికా ప్రపంచంలో సుప్రసిద్ధ జర్నలిస్ట్ సీహెచ్. సుశీల్ రావు (టైమ్స్ ఆఫ్ ఇండియా - దక్కన్ క్రానికల్), పలు మీడియాల్లో ప్రసిద్ధురాలైన సి. మృణాళిని, ప్రకటనల రంగంలో విస్తృత సేవలు అందించిన శ్రీనాథ్ అయ్యర్ (హిందూ, హిందుస్థాన్ టైమ్స్) ఉన్నారు.ఈ సందర్భంగా భూపేంద్ర చౌబే మాట్లాడుతూ, “ఒక రకంగా ఇవాళ జాతీయ మీడియా కన్నా ప్రాంతీయ భాషల్లోని మీడియాయే చాలా శక్తిమంతంగా ఉంది. అదే సమయంలో, రానున్న రోజుల్లో మీడియా సంస్థల నిర్వహణలో కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావం ఎక్కువ కానుంది” అని అభిప్రాయపడ్డారు. “హైదరాబాద్ నగరంలో ఓ తెలియని ఆత్మీయత ఉంది. నేను యూపీకి చెందినవాడిని అయినప్పటికీ, తెలుగు భాష, తెలుగు సినిమా, తెలుగు సంగీతం అంటే మక్కువ ఎక్కువ” అని ఆయన వ్యాఖ్యానించారు.ఈ అవార్డుల ఉత్సవానికి అతిథిగా హాజరైన పార్లమెంట్ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, “టెస్ట్ మ్యాచ్‌ల నుంచి వన్డేలు, 50 ఓవర్లు, ఇప్పుడు టీ20లకు క్రికెట్ మారినట్టే... కాలంతో పాటు మీడియా సైతం ఎంతో మార్పులు వచ్చాయి. అయితే, ఎన్ని మార్పులు వచ్చినా... ఏ రంగంలోనైనా గుర్తింపు అనేది మరింత శ్రమించడానికి ప్రేరణనిస్తుంది. దాదాపు 20 ఏళ్ళు యూత్ లీడర్‌గా ఎన్.ఎస్.యు.ఐ లాంటి వాటిలో నిరంతరం పనిచేయడం వల్లే కాంగ్రెస్ పార్టీ నాకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది. అదే విధంగా మీడియా మిత్రులు తమ రంగంలో మరింత కృషి చేయడానికి ఈ అవార్డులు ఉపకరిస్తాయి” అని అభిప్రాయపడ్డారు.అందుకు తగ్గట్టే, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కేటగిరీలో కలిపి 60 మందికి పైగా సీనియర్ జర్నలిస్టులను ‘హైబిజ్ టీవీ’ మీడియా పురస్కారాలతో సత్కరించింది. లోతైన పరిశోధనతో ఎన్నో విశేషాలను వెలికితీసి, తెలుగు సినీ రంగ చరిత్రను అక్షరబద్ధం చేయడంలో సుదీర్ఘకాలంగా కృషి చేస్తూ, గతంలో ప్రభుత్వ నంది, గద్దర్ అవార్డులను అందుకున్న సీనియర్ జర్నలిస్ట్ – రచయిత డాక్టర్ రెంటాల జయదేవను “తెలుగు సినీ చరిత్రకు ఉత్తమ డాక్యుమెంటేషన్ చేస్తున్న అరుదైన జర్నలిస్టు”గా గుర్తించి, అవార్డుతో గౌరవించింది. జయదేవను మంత్రి శ్రీధర్ బాబు ఆప్యాయంగా పలకరించి, ఉత్తమ ‘తెలుగు సినిమాపై ఉత్తమ గ్రంథం’గా తెలంగాణ ప్రభుత్వ గద్దర్ ఫిల్మ్ అవార్డు అందుకున్న ఆయన రచన ‘మన సినిమా... ఫస్ట్ రీల్’ పుస్తకం గురించి తెలుసుకున్నారు.‘సాక్షి’ మీడియా గ్రూపు నుంచే మంత్రి చేతుల మీదుగా అవార్డులు అందుకున్న విజేతలలో బొంబాయికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ గుండాల శ్రీనివాసరావు (ప్రింట్ స్పెషల్ జ్యూరీ- అప్ కంట్రీ), అలాగే ప్రకటన, మార్కెటింగ్ రంగాలకు చెందిన శ్రీనివాస్ (ఎడ్యుకేషన్ స్పెషల్స్), వెంకటేశ్ (రిటైల్ యాడ్స్), వేణు (ఇంజనీరింగ్ కాలేజెస్) ఉన్నారు.ఇక, వ్యవసాయ రంగంపై విశేష కృషి చేస్తున్న అంకితభావం గల జర్నలిస్ట్ వలేటి గోపీచంద్ (ఆకాశవాణి), సినీ రంగ పాత్రికేయానికి చెందిన సీనియర్ జర్నలిస్టు చల్లా శ్రీనివాస్ (జ్యోతి), ఎడిటోరియల్ విభాగంలో సీనియరైన భాస్కర్ తాటికొండ (హన్స్ ఇండియా), పొలిటికల్ రిపోర్టింగ్‌లో సీనియరైన గూడ ఆంజనేయులు గౌడ్, టీవీ రంగంలో పాపులరైన కాట్రగడ్డ అజిత (99 టీవీ), న్యూస్ యాంకర్లు స్వర్ణ రోజా (రాజ్ టీవీ), అపర్ణ (వి6), వినోదరంగంలో పేరు తెచ్చుకున్న టీవీ జర్నలిస్ట్ తారక్ (ఎన్టీవీ), టీవీ రిపోర్టర్ సత్యనారాయణ, ప్రింట్ జర్నలిస్ట్ పి. జగదీశ్వర్ (నవ తెలంగాణ), అలాగే మంగుమూరి శ్రీనివాస్, వి. సురేశ్ తదితరులు అవార్డు గ్రహీతల్లో ఉన్నారు.విసుగూ, విరామం లేకుండా విజేతలందరికీ మంత్రే స్వయంగా అవార్డులు అందించడం గమనార్హం. అవార్డు అందుకున్న విజేతలందరూ తమ సంతోషం వ్యక్తం చేశారు. మీడియా రంగంలో తాము చేస్తున్న కృషికి ‘హైబిజ్ టీవీ’ తగిన గుర్తింపునిచ్చిందనీ, ఇది తమకెంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తోందనీ అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లోనూ ఇలాంటి మరిన్ని మంచి కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు.ఈ సందర్భంగా వచ్చే ఏడాది నుంచి మీడియా అవార్డ్స్ విజేతలకు ప్రోత్సాహకంగా నగదు పురస్కారాలు సైతం అందించేందుకు ‘క్రెడాయ్’ ముందుంటుందని ‘క్రెడాయ్ - హైదరాబాద్’ ప్రెసిడెంట్ జైదీప్ రెడ్డి ప్రకటించడం విశేషం. “హైదరాబాద్ నగరంలోని ఈ ప్రాంతం (హైటెక్ సిటీ)లో స్థిరాస్తి విలువ గత పాతికేళ్ళలో వంద రెట్లు పెరిగింది. కేవలం క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, అదీ అతి తక్కువగా కేవలం 12.5 శాతమే ఉన్నది స్థిరాస్తి రంగమే. అందుకే, దేశ ఆర్థిక ప్రగతికి తోడ్పడే స్థిరాస్తుల రంగంపై ప్రజలకు మరింత అవగాహన కలిగించేలా మీడియా మరిన్ని కథనాలు అందించా”లని జైదీప్ రెడ్డి అభ్యర్థించారు.విజేతలను ఎంపిక చేసిన విశేష అనుభవజ్ఞుల బృందం పక్షాన సీనియర్ బిజినెస్ జర్నలిస్ట్ ములుగు సోమశేఖర్ గత ఆరేళ్ళ అవార్డుల ప్రస్థానాన్ని వివరించారు. “మీడియా రంగంలో అందరికీ తెలిసేది జర్నలిస్టులే. కానీ, అడ్వర్టయిజింగ్, సర్క్యులేషన్ వారు ఈ పరిశ్రమలో అన్ సంగ్ హీరోస్” అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ‘భారతీ సిమెంట్’ మార్కెటింగ్ డైరెక్టర్ ఎం. రవీందర్ రెడ్డి, ‘సాక్షి’ మీడియా గ్రూప్ కు చెందిన సీనియర్ డైరెక్టర్ కె.ఆర్.పి. రెడ్డి, మార్కెటింగ్ విభాగంలో ఉన్నత పదవి నిర్వహించిన రమణకుమార్, సీనియర్ జర్నలిస్టులు సాయి శేఖర్, ‘మిసిమి’ సంపాదకులు వల్లభనేని అశ్వినీకుమార్, ‘రైతు నేస్తం’ వ్యవసాయ మాసపత్రిక అధిపతి – ‘పద్మశ్రీ’ అవార్డు గ్రహీత యడ్లపల్లి వెంకటేశ్వరరావు, ‘ఆలిండియా రేడియో’ విశ్రాంత ఉన్నతోద్యోగి సి.ఎస్. రాంబాబు, వివిధ రంగాలకు చెందిన ఇతర ప్రముఖులు, జర్నలిస్టుల కుటుంబ సభ్యులు, ‘హైబిజ్ టీవీ’కి చెందిన సుశిక్షితులైన సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
ఆర్ఆర్టీఎస్.. మెట్రో రైలా?
సాక్షి, హైదరాబాద్: ర్యాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్టీఎస్).. మెట్రో రెండో దశకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్న ప్రస్తుత తరుణంలో అనూహ్యంగా తెరపైకి వచ్చింది. తక్కువ నిర్మాణ వ్యయంతో వేగవంతమైన రవాణా సదుపాయాన్ని అందజేసే ఆర్ఆర్టీఎస్ ప్రాజెక్టును హైదరాబాద్‌లో చేపట్టాలని కేంద్రం ప్రతిపాదించింది. ప్రస్తుతం నగరంలో నడుస్తున్న మెట్రో కంటే ఆర్ఆర్టీఎస్ ఎక్కువ వేగంతో పరుగులు తీస్తోంది. ప్రయాణికులకు హైస్పీడ్ రైల్ అనుభూతిని అందజేస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధిమంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది. మెట్రో రెండోదశ నిర్మాణంలో భాగంగానే ప్రభుత్వం మొదటి దశ ప్రాజెక్టును ఎల్అండ్టీ నుంచి కొనుగోలు చేసింది. కానీ.. ప్రస్తుత మెట్రో కంటే ఢిల్లీ నుంచి మీరట్‌కు కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఆర్ఆర్టీఎస్ తరహాలో హైదరాబాద్‌లో నిర్మించాలని పేర్కొనడం గమనార్హం. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి కేంద్రం అనుమతి కోసం పంపించిన రెండో దశ డీపీఆర్‌లకు అనుమతి లభిస్తుందా లేక, ఆర్ఆర్టీఎస్కే కేంద్రం కట్టుబడి ఉంటుందా అనేది చర్చనీయాంశంగా మారింది. మెట్రో రెండో దశకు భారీ వ్యయం.. రెండో దశలో మొత్తం 8 కారిడార్లలో మెట్రో విస్తరణకు ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించింది. నాగోల్ నుంచి ఎయిర్పోర్ట్,(36,8 కి.మీ.) రాయదుర్గం నుంచి కోకాపేట్ నియోపోలిస్ (11.6 కి.మీ, ) ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట (7.5 కి.మీ.), మియూపూర్–పటాన్చెరు (13.4 కి.మీ.),ఎల్బీనగర్–హయత్‌నగర్ (7.1 కి.మీ.) చొప్పున మొత్తం 76.4 కి.మీ వరకు.. ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్‌సిటీ (39.6 కి.మీ.), జేబీఎస్–మేడ్చల్ (22 కి.మీ.), జేబీఎస్– శామీపేర్‌పేట్ (22కి.మీ,) కారిడార్లలో మరో 86.1 కి.మీ మెట్రో నిర్మాణం చేపట్టాలనేది ప్రతిపాదన. ప్రాజెక్టు వ్యయం మొత్తం రూ.48 వేల కోట్లు.. ఈ మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.48 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. మొదటి దశ కొనుగోలు కోసం వెచి్చంచే సుమారు రూ.15000 కోట్ల వ్యయంతో కలిపి రూ.63000 కోట్లకు చేరనుంది. మెట్రో రెండో దశకు అవసరమైన నిధులను జైకా,ఏడీబీ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి కేవలం 2 శాతం వడ్డీకి నిధులను సేకరించాలనేది ప్రభుత్వ ప్రణాళిక. ఈ మేరకు ఇప్పటికే ప్రాథమికంగా జైకాతో ఒప్పందం కూడా ఏర్పడింది. కేవలం రూ.48000 కోట్లతో 192.2 కి.మీ వరకు ఆర్ఆర్టీఎస్ ప్రాజెక్టును చేపట్టవచ్చని కేంద్రం ప్రతిపాదిస్తోంది. నిర్మాణ వ్యయం తగ్గుతుందని.. పటాన్చెరు–లక్డీకాపూల్– ఆరాంఘర్, రాయదుర్గం–కోకాపేట్, ఎల్బీనగర్– హయత్‌నగర్, ఎంజీబీఎస్– చాంద్రాయణగుట్ట, ఎయిర్పోర్ట్–ఫ్యూచర్‌సిటీ, జేబీఎస్–మేడ్చల్, జేబీఎస్– శామీర్‌పేట్ రూట్లలో ఆర్ఆర్టీఎస్ చేపట్టాలని మెట్రోరైల్ సంస్థకు కేంద్రం ప్రతిపాదనలు చేసింది. కానీ.. ప్రతిపాదిత ప్రాంతాల్లో ఫ్లై ఓవర్ల వల్ల నిర్మాణ వ్యయం భారీగా పెరిగే అవకాశం ఉంటుందని హెచ్ఎంఆర్ఎల్ పేర్కొంది. అయితే.. భూగర్భ కారిడార్లను నిర్మించి వ్యయాన్ని తగ్గించుకోవచ్చని కేంద్రం సూచించినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలకు భిన్నంగా మెట్రో నిర్మాణ దిశగానే రాష్ట్రం ముందుకువెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వేగం ఎక్కువే.. ప్రస్తుతం మెట్రో రైళ్లు గంటకు గరిష్టంగా 80 కి.మీ వేగంతో నడుస్తున్నాయి. ఆర్ఆర్టీఎస్ రైళ్లు గరిష్టంగా 160 కి.మీ వేగంతో పరుగులు తీస్తాయి. ఈ రైళ్లు యూరోపియన్ ట్రైన్ కంట్రోల్ సిస్టమ్ (ఈటీఎస్సీ) సిగ్నలింగ్ వ్యవస్థతో నడుస్తాయి. ఇది మెట్రో రైళ్లలో వినియోగించే సిగ్నలింగ్ వ్యవస్థ కంటే అత్యాధునికమైనది. ఢిల్లీ నుంచి మీరట్ వరకు 82.15 కి.మీ మార్గంలో ఆర్ఆర్టీఎస్ నడుస్తోంది.‘నమో భారత్’ పేరుతో ఈ రైళ్లను నడుపుతున్నారు. -
ఏం కష్టం వచ్చిందో..!
హైదరాబాద్: ఆ దంపతులకు ఏం కష్టం వచ్చిందో ఏమో బలవన్మరణానికి పాల్పడ్డారు. వివాహమైన 55 రోజులకే తనువు చాలించారు. మిస్టరీగా మారిన ఈ విషాద ఘటన కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు, బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుమ్మరి బస్తీకి చెందిన కార్తీక్ (28)కు గత మార్చి 8న ప్రశాంత్‌నగర్ రాజీవ్‌గాంధీ నగర్‌కు చెందిన మంజుల ఎలియాస్ జ్ఞాన్షిక (27)తో వివాహమైంది. కార్తీక్ ఐటీసీ కంపెనీలో మార్కెటింగ్ ఉద్యోగం చేస్తుండగా.. మంజుల ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేస్తున్నారు. శుక్రవారం తెలిసినవారి ఇంటిలో జరిగిన సత్యనారాయణ స్వామి వ్రతానికి మంజుల వెళ్లి వచి్చంది. అనంతరం ప్రశాంత్‌నగర్‌లో తల్లి ఇంటికి భర్తతో కలిసి వెళ్లి వచి్చంది. రాత్రి భోజనాలనంతరం కార్తీక్, మంజుల వారి గదిలో నిద్రించారు. శనివారం ఉదయం 9.30 గంటలైనా ఇంటి తలుపులు తీయలేదు. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపులు పగులగొట్టి చూడగా.. కార్తీక్ తలుపుపై ఉన్న వెంటిలేటర్‌కు వైర్‌తో ఉరి వేసుకున్నాడు. మంజుల బెడ్‌పై నోట్లో నురగలతో కనిపించింది. ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మంజుల తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. దంపతులు ఆత్మహత్యకు కారణాలేమిటో తెలియడంలేదని కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. -
తెలంగాణలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
హైదరాబాద్: తెలంగాణలో భానుడు ప్రతాపం చూపుతున్నాడు. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం (మే 2) ఈ సీజన్లోనే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్‌లో గరిష్ఠంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ, నిర్మల్, సిద్దిపేట జిల్లాలో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకాగా, ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాలో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల ప్రభావంతో మధ్యాహ్నం సమయంలో ప్రజలు బయట తిరగలేకపోతున్నారు. ఉదయం వేళల నుంచే ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో ఉంటున్నాయి. వేడి గాలులు మరింత ఇబ్బంది కలిగిస్తున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు మరిన్ని ఇబ్బందులు పడుతున్నారు. -
"ఔషధి ఎక్స్‌ప్రెస్".. దక్షిణ మధ్య రైల్వే కొత్త సేవలు ప్రారంభం
సాక్షి,హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే ప్రజలకోసం మరో కొత్తరకం సేవలు ప్రారంభించింది. శీతలీకరించిన కాన్కోర్ కంటైనర్ రేక్ ' ఔషధి ఎక్స్‌ప్రెస్' సేవలను త దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ (కాన్కోర్) చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సంజయ్ స్వరూప్ ఈ రోజు (శనివారం) సనత్‌నగర్‌లోని ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపో (ఐ.సి.డి) నుండి జెండా ఊపి ప్రారంభించారు."ఔషధి ఎక్స్‌ప్రెస్" అనే బ్రాండ్‌తో ఉన్న ఈ శీతలీకరించిన (రీఫర్) కంటైనర్‌ను, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ (జె.ఎన్.పి.టి)కు కాన్కోర్ సంస్థ నడుపుతోంది. ఈ సేవ ప్రత్యేకంగా ప్రాణ రక్షక ఔషధాలు మరియు ఇతర ఉష్ణోగ్రతకు సున్నితమైన సరుకులను సురక్షితంగా రవాణా చేయడానికి రూపొందించబడింది. అధునాతన రీఫర్ కంటైనర్లలో డీజిల్ పవర్ ప్యాక్‌లు అమర్చబడి ఉండటం వలన, ప్రయాణమంతా నిరంతర శీతలీకరణ కొనసాగుతుంది.ఈ శీతలీకరించిన కంటైనర్ సేవ, కోల్డ్-చైన్ అనుసంధానాన్ని బలోపేతం చేయడానికి మరియు భారతదేశ ఫార్మాస్యూటికల్ సరఫరా గొలుసు సామర్థ్యాన్ని పెంచడానికి ఒక ప్రధాన ముందడుగుగా నిలుస్తోంది . అధిక నాణ్యత గల రీఫర్ కంటైనర్లను అందిస్తున్న మెర్స్క్ లైన్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం, ఐసిడి సనత్‌నగర్ యొక్క కోల్డ్-చైన్ లాజిస్టిక్స్ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుంది.హైదరాబాద్ భారతదేశంలోని అతిపెద్ద ఫార్మాస్యూటికల్ కేంద్రాలలో ఒకటి మరియు దీనిని తరచుగా " భారతదేశ ఫార్మా రాజధాని" అని పిలుస్తారు. హైదరాబాద్‌లోని కీలక ఫార్మా ప్రాంతాలలో జీనోమ్ వ్యాలీ (తుర్క పల్లిలో ఉన్న ఒక ప్రధాన ఆర్&డి కేంద్రం ), జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతం, పటాన్చెరు (ఒక పారిశ్రామిక ఫార్మా జోన్), మరియు ముచర్ల ఉన్నాయి . హైదరాబాద్–జేఎన్పీటీ కారిడార్, తెలంగాణ పారిశ్రామిక ప్రాంతాలకు మరియు భారతదేశంలోని అత్యంత రద్దీగా ఉండే ఓడరేవులలో ఒకటైన జేఎన్‌పీటీతో అనుసంధానించే కీలక మార్గంగా పనిచేస్తూ, ఈ ప్రాంత సామాజిక-ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతోంది.. ఇండియన్ రైల్వేలు ప్రత్యేకంగా ప్రారంభిస్తున్న రీఫర్ రేక్ సేవలు ఎగుమతిదారులు మరియు దేశీయ పంపిణీదారులకు ప్రయోజనకరంగా నిలుస్తాయి. ఇవి ప్రయాణ సమయాన్ని తగ్గించి, లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించి, సరఫరా గొలుసు విశ్వసనీయతను పెంచుతాయి. ఫార్మాస్యూటికల్ ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో, నాణ్యత పరిరక్షణ అవసరాలు పెరగడంతో భారతదేశంలో విశ్వసనీయమైన కోల్డ్-చైన్ పరిష్కారాల కోసం పెరుగుతున్న డిమాండ్‌ను ఈ రీఫర్ రేక్ వినియోగం ప్రతిబింబిస్తుంది. ఇది ఎగుమతిదారులకు నూతన అవకాశాలను సృష్టిస్తుందని, ధరల సాధన మెరుగుపడుతుందని, అలాగే వృథాను తగ్గిస్తుందని భావిస్తున్నారు. ఈ చొరవ, సమర్థవంతమైన, సుస్థిరమైన, మరియు పర్యావరణ అనుకూలమైన సరుకు రవాణా వ్యవస్థలను ప్రోత్సహించే ప్రధానమంత్రి గతి శక్తి పథకం కింద భారత ప్రభుత్వ దార్శనికతకు ఈ పథకం అనుసంధానంగా ఉంది. -
నిరూపిస్తే శిక్షకు సిద్ధం.. డాగ్ బ్లడ్ కేసులో డాక్టర్ సవాల్
-
హైదరాబాద్ లో విషాదం నవదంపతుల ఆత్మహత్య
-
పెళ్లయి ఇద్దరు పిల్లలున్నా అనేక మందితో రేణుక ఎఫైర్.. సీతారాం కేసులో విస్తుపోయే నిజాలు
-
ORR: నిలిపి ఉంచిన వాహనాలే మృత్యు శకటాలు
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై వాహనం రకం, వేగాన్ని బట్టి లేన్ (వరుస) డ్రైవింగ్‌ను నిర్ణయించారు. కానీ.. చాలా మంది వాహనదారులు లేన్ డ్రైవింగ్ నిబంధన పాటించకపోవడంతో ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. ఔటర్‌పై అతి వేగంగా వస్తున్న వాహనాలు ముందు ఆగి ఉన్న వాహనాలను అంచనా వేయకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికి తోడు అతివేగం, నిర్లక్ష్యం కూడా ఔటర్‌పై రోడ్డు ప్రమాదాలలో కారణమేనని నిపుణులు చెబుతున్నారు. శుక్రవారం తుక్కుగూడ నుంచి శంషాబాద్ వస్తున్న కారు పెద్దగోల్కొండ ఔటర్‌పై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొని.. కుటుంబంలోని ఆరుగురు సభ్యులు అక్కడికక్కడే అసువులు బాశారు. లేన్ డ్రైవింగ్ పాటించకపోవడమే ఈ ప్రమాదానికి కారణమైంది. ఔటర్‌పై అతివేగంగా వెళ్తూ తరచూ ప్రమాదాలు జరిగి మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా రహదారి భద్రతా నిపుణులు జాగ్రత్తలు సూచిస్తున్నారు. నిబంధనలు పాటిస్తే సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు. దారుణాలకు ఇవీ కారణాలే.. 158 కిలోమీటర్ల ఔటర్‌పై రోజూ 15 లక్షకు పైగా వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఎక్కువ మంది వాహనదారులకు ఏయే లేన్లలో ప్రయాణించాలనే విషయంపైనే అవగాహన ఉండదు. సగటున 65 శాతం వాహనాలు లేన్ డ్రైవింగ్ (వరుస క్రమం) పాటించడంలేదని ట్రాఫిక్ పోలీసుల అధ్యయనంలో తేలింది. ఓఆర్ఆర్పై రాత్రి దాటాక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భారీ వాహన డ్రైవర్లు అవగాహన లోపంతో పక్కన నిలిపేస్తుంటారు. అతివేగంతో ముందు ప్రాంతాన్ని అంచనా వేయలేని కొందరు వీటిని ఢీకొట్టి.. మృత్యువాతపడుతున్నారు. కొన్నిసార్లు వెనుక నుంచి వచ్చే వాహనాలు వేగాన్ని అదుపుచేయలేక.. నెమ్మదిగా వెళ్లే ముందున్న వాహనాలను ఢీకొడుతున్నాయి. ఇంకొన్నిసార్లు వాహనాలు అదుపుతప్పి డివైడర్లను ఢీకొట్టుకుంటున్నాయి. ఇలా వెళ్తే సేఫ్ జర్నీ.. ఔటర్ రింగురోడ్డుపై ఒక్కోవైపు నాలుగు వరుసల చొప్పున రహదారులున్నాయి. నిబంధనల ప్రకారం 1,2 లేన్లలో కార్లు, 3,4 వరుసల్లో లారీలు, ఇతర భారీ వాహనాలు మాత్రమే ప్రయాణించాలి. ఈ నిబంధన అతిక్రమించిన సందర్భాల్లోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. 1, 2 లేన్లలో ప్రయాణించే వాహనాలు కనిష్ఠంగా 100 నుంచి గరిష్టంగా 120 కిలోమీటర్లు, 3, 4 వరుసల్లో కనిష్ఠంగా 80 నుంచి గరిష్టంగా 100 కి.మీ. వేగంతో ప్రయాణించాలి. లేన్లపై వాహనాలు అడ్డదిడ్డంగా ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకూడదు. ఒకవేళ వాహనాలు లేన్లు మారాలనుకుంటే ఆకస్మాత్తుగా తీసుకోకుండా.. కచ్చితంగా ఇరువైపులా, వెనుక గమనించాలి. వెనుక నుంచి వచ్చే వాహనదారులు అప్రమత్తమయ్యేలా ఇండికేటర్లు, ఇతర సంజ్ఞలు వేయాలి. ఇవేవీ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో పక్కలేన్లలోకి దూసుకెళ్లకూడదు. ఔటర్‌పై జరిగే 50 శాతం ప్రమాదాలకు అడ్డదిడ్డంగా లేన్లు మారడమే కారణం. అదుపుతప్పిన అతివేగంతోనూ.. ఔటర్‌పై వేగం పెరిగే కొద్దీ ప్రమాదశాతం పెరుగుతున్నట్లు వాహనదారులు గుర్తించాలి. సాధారణంగా ఔటర్ చూసేందుకు ఖాళీగా వేగంగా దూసుకెళ్లేందుకు అనువుగా ఉన్నట్లు కనిపిస్తుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సమయంలో ఒక్కసారిగా వాహనాన్ని అదుపుచేసే అవకాశాలు 90 శాతం తక్కువగా ఉంటాయి. ఈ పరిస్థితుల్లో ముందు వెళ్తున్న వాహనం వేగం తగ్గితే అదుపు చేయలేక ఒక్కసారిగా ఢీకొడతాయి. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో వాహనం నిలపాలనుకుంటే పూర్తిగా ఎడమవైపున సర్వీసు లేన్పైనే ఆపాలి. ఇందుకు కొన్ని ప్రత్యేక ప్రాంతాలున్నాయి. పార్కింగ్ లైట్లు ఆన్‌లోనే ఉంచాలి. రాత్రివేళ ఎక్కువ సమయం వాహనాన్ని నిలపకూడదు. అలాగే ఓఆర్ఆర్ ప్రవేశం, నిష్కమణ మార్గాల్లో రాంగ్ రూట్లో ప్రయాణించకూడదు. -
హైదరాబాద్ : వైద్య విద్యార్థుల ఆనందం చెట్ట‘పట్టా’ల్ (ఫొటోలు)
-
చెత్త లారీ ఢీ.. ర్యాపిడో డ్రైవర్ మృతి
హైదరాబాద్: చెత్త లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టడంతో ర్యాపిడో రైడర్ మృతి చెందాడు. వెనుక కూర్చున్న వ్యక్తి తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. లాలాగూడ ఇన్స్పెక్టర్ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లాకు చెందిన ఎన్న లక్ష్మారెడ్డి (35) ర్యాపిడో రైడర్. కొంతకాలంగా హయత్‌నగర్‌లోని కుంట్లూరులో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ర్యాపిడో రైడ్ రావడంతో తుర్కపల్లికి చెందిన కె.పౌల్ అనే వ్యక్తిని తన బైక్ ఎక్కించుకొని మహేంద్రాహిల్స్‌లో డ్రాప్ చేయడానికి బయలుదేరాడు. లాలాపేట మీదుగా వెళ్తుండగా చెత్తలోడ్‌తో జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌కు వెళ్తున్న లారీ ఎదురుగా వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. లక్ష్మారెడ్డి తలపై నుంచి లారీ టైరు వెళ్లడంతో అతడు ధరించిన హెల్మెట్ సైతం ముక్కలై, తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న కస్టమర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. -
సీఓఈ శిబిరానికి అనన్య ఎంపిక
సాక్షి, హైదరాబాద్: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో నిర్వహించే హై పెర్ఫార్మెన్స్ క్యాంప్‌కు హైదరాబాద్ స్పిన్ బౌలర్ అనన్య దుండు ఎంపికైంది. అండర్–15 బాలికల విభాగంలో ఆమెకు ఈ అవకాశం దక్కింది. బెంగళూరులోని బీసీసీఐ–సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)లో ఈ నెల 18 నుంచి 11 జూన్ వరకు ఈ క్యాంప్ జరుగుతుంది. ఇటీవల జరిగిన బీసీసీఐ అండర్–15 వన్డే ట్రోఫీ (ఎలైట్)లో అనన్య 6 మ్యాచ్‌లలో 16 వికెట్లు పడగొట్టి టోర్నీ టాపర్‌గా నిలిచింది. బోర్డు అపెక్స్ కౌన్సిల్ మెంబర్ వి.చాముండేశ్వరనాథ్ పర్యవేక్షణలో నగరంలోని రామానాయుడు క్రికెట్ అకాడమీలో ప్రస్తుతం అనన్య శిక్షణ పొందుతోంది. -
అతివేగం.. 6 ప్రాణాలు బలి
శంషాబాద్ రూరల్/ సిరిసిల్ల: దైవ దర్శనానికి వెళ్లి.. తిరుగు ప్రయాణంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. శంషాబాద్ శివారులో ఔటర్ రింగు రోడ్డుపై శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. చేవెళ్ల డీసీపీ యోగేశ్‌గౌతం తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్లలోని సర్దార్‌నగర్‌కు చెందిన కొడెం శ్రీనివాస్ (40), సనత్‌నగర్‌లో నివాసముండే బొల్లి శివకుమార్(37) వరుసకు బావబామ్మర్దులు.శుక్రవారం తెల్లవారుజామున రెండు కుటుంబాలకు చెందిన ఏడుగురు కలిసి సనత్‌నగర్ నుంచి శివకుమార్‌కు చెందిన వ్యాగనార్ కారులో యాదగిరిగుట్ట దైవ దర్శనానికి వెళ్లారు. ఆ తర్వాత స్వర్ణగిరి ఆలయానికి వచ్చి సనత్‌నగర్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు. మార్గ మధ్యలో ఔటర్ రింగు రోడ్డుపై పెద్దగోల్కొండ–తొండుపల్లి మధ్యలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వీరు ప్రయాణిస్తున్న కారు ఢీకొంది.లారీ కిందకు దూసుకెళ్లిన కారు..అతి వేగంతో ఉన్న కారు లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనతో కారులో ఉన్న ఏడుగురికి తీవ్ర గాయాలు కాగా, ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. లారీ కిందకు దూసుకెళ్లిన కారును అతి కష్టం మీద వెనక్కి తీసి అందులోని ఉన్న మృతదేహాలను బయటకు తీశారు. తీవ్ర గాయాలైన కొడెం శ్వేతను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారును శివకుమార్ నడుపుతున్నట్టు గుర్తించారు.లారీ ఆగిన ఐదు నిమిషాల్లోనేచౌటుప్పల్లోని రైస్‌మిల్లు నుంచి నూకల లోడుతో నంద్యాలలోని లిక్కర్ ఫ్యాక్టరీకి లారీ బయలుదేరింది. ఔటర్ మీద పెద్దగోల్కొండ–తొండుపల్లి మధ్యలోకి రాగానే లారీ బ్రేక్‌లైనర్లు మొరాయించడంతో డ్రైవర్ శ్రీనివాస్ గమనించి రోడ్డు పక్కన నిలిపాడు. డ్రైవర్ బ్రేక్‌లను పరిశీలిస్తుండగా.. క్లీనర్ లారీపై ఉన్న తాడును సరి చేస్తున్నాడు. సాయంత్రం 4 గంటలకు లారీని నిలపగా, ఐదు నిమిషాల తర్వాత కారు వెనుక నుంచి వచ్చి ఢీకొన్నట్టు లారీ డ్రైవర్ శ్రీనివాస్ తెలిపాడు.మృతులు వీరే..బొల్లి శివకుమార్ (37), బొల్లి లాస్య అలియాస్ రెనికిండి రాజేశ్వరి (30) దంపతులు, వీరి కూతురు బొల్లి రిషిత (7)తో పాటు కొడెం శ్రీనివాస్(40), ఆయన కుమారులు కొడెం కృష్ణచంద్ర (13), కొడెం మాధవ్ (10) దుర్మరణం చెందగా, శ్రీనివాస్ భార్య శ్వేత (35) తీవ్ర గాయాలతో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగానే ఉంది. శివకుమార్‌కు శ్వేత సోదరి అవుతారు.⇒ బొల్లి శివకుమార్ కామారెడ్డికి చెందిన లాస్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. లాస్య హైదరాబాద్‌లోని పౌర సరఫరాల శాఖ ప్రధాన కార్యాలయంలో ప్రధాన ఫుడ్ ఇన్స్పెక్టర్.⇒ కోడం శ్రీనివాస్ వేములవాడలోని ఓ ఫైనాన్స్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన కాలు విరిగింది.ప్రమాద కారణాలు విశ్లేలిస్తున్నాం: డీసీపీ యోగేశ్గౌతంఘటనా స్థలాన్ని చేవెళ్ల డీసీపీ యోగేశ్‌గౌతం పరిశీలించారు. డ్రైవర్ అలసిపోవడంతో నిద్రలోకి జారి ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. కారులో మరైదేనా సాంకేతిక సమస్యతో ప్రమాదం జరిగిందా అనే కోణంలో పరిశీలన చేస్తున్నామన్నారు. ప్రమాదానికి గురైన కారుపై అతి వేగంతో కారు నడిపినట్టు రెండు చలాన్లు ఉన్నాయి.ఇదే ఆఖరి సెల్ఫీ..రోడ్డు ప్రమాదానికి గురైన కుటుంబ సభ్యులంతా కలిసి చివరిసారిగా స్వర్ణగిరి దేవాలయం వద్ద సెల్ఫీ దిగారు. ఇప్పుడు ఈ సెల్ఫీ వారి జీవితంలో చివరి ఫొటోగా మిగిలింది.కేటీఆర్ దిగ్భ్రాంతిఆరుగురు సిరిసిల్లవాసుల మృతిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. తాము అన్నివిధాలా అండగా ఉంటామని భరోసా కల్పించారు. -
టిఫిన్ తినలేం.. కాఫీ తాగలేం
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు ముగిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం వ్యాపారుల ‘పొయ్యి’పై నీళ్లు చల్లింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల అస్థిరతను సాకుగా చూపిస్తూ సామాన్యుడి నడ్డి సైతం విరిచే నిర్ణయం తీసుకుంది. 19 కేజీల వాణిజ్య (కమర్షియల్) సిలిండర్ ధరను ఏకంగా రూ.993 పెంచడంతో హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్ ధర రికార్డు స్థాయిలో రూ.3,315కి చేరుకుంది. హైదరాబాద్‌లో 19 కేజీల సిలిండర్ ధర యుద్ధానికి ముందు రూ. 2,217 ఉంటే.. మార్చి 1న (మొదటి పెంపు) రూ.2,322కు, మే 1న (తాజా పెంపు) రూ.3,315కు చేరింది.అంటే కేవలం 60 రోజుల వ్యవధిలోనే రూ.1,098 అదనపు భారం పడిందన్న మాట. ముఖ్యంగా పెరిగిన సిలిండర్ రేటు హోటళ్లపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం కన్పిస్తోంది. మార్కెట్లో నెలకొన్న గ్యాస్ కొరతను ఆసరాగా చేసుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ప్రైవేట్ గ్యాస్ కంపెనీలు, కొందరు డీలర్లు..ఇప్పటికే ఒక కమర్షియల్ సిలిండర్‌కు బ్లాక్‌లో రూ.5,000 వరకు వసూలు చేస్తున్నారు.ఇప్పుడు భారీగా ధర పెరగడంతో, ఈ సాకుతో బ్లాక్‌లో అమ్మే రేటు కూడా భారీగా పెంచే అవకాశం ఉండటంతో పెద్ద, చిన్న హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు, చిరు వ్యాపారులు, కేటరర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. రోజుకు 2 సిలిండర్లు వాడే టీ బంకులు, చిన్న హోటళ్ల యజమానులపై రోజుకు రూ.3,000 నుంచి రూ.4,000 అదనపు భారం పడుతుందని అంచనా.ఇప్పటికే మెనూలో కోత..మూతగ్యాస్ కొరత, పెరిగిన ధరతో ఇప్పటికే నగరంలోని అనేక హోటళ్లలో వంటకాల్లో కోత విధించారు. గ్యాస్ ఆదా కోసం కొన్ని వంటకాలు తగ్గించేశారు. కొన్ని హోటళ్లు మూతపడ్డాయి. కొత్తగా పెరిగిన గ్యాస్ ధర హోటళ్లు, రెస్టారెంట్లు, కేటరింగ్ రంగాలను అతలాకుతలం చేసే అవకాశం కన్పిస్తోంది.రోజువారీ వినియోగం 65 వేల సిలిండర్లపైనేహైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలో ప్రధాన చమురు సంస్ధలతో పాటు ప్రైవేటు సంస్ధలకు సంబంధించి సుమారు 8.15 లక్షల వాణిజ్య కనెక్షన్లు ఉన్నట్లు పౌర సరఫరాల శాఖ, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. రోజుకు సుమారు 65 వేల సిలిండర్లు వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారు.15%–20% వరకు ధరల పెరుగుదలప్రస్తుతం ఒక్కో సిలిండర్ రీఫిల్ ధరపై రూ. 994 పెంపుతో రోజుకు రూ.6.46 కోట్ల అదనపు భారం పడుతోంది. ఈ లెక్కన నెలకు రూ.193.8 కోట్ల భారం పడుతుందన్నమాట. ఇది హోటళ్లలో ఆహారం ధరలపై ప్రభావం చూపించడం ఖాయం. హోటళ్ల యజమానులు ఈ భారాన్ని వినియోగదారులపైనే వేస్తారు. దీంతో హోటళ్లలో ఇడ్లీ మొదలుకుని బిరియానీ వంటి ఆహార పదార్థాల ధరలు 15% నుంచి 20% వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా.మహా హైదరాబాద్ పరిధిలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల వినియోగం ఇలా..జిల్లా వాణిజ్య కనెక్షన్లు (సుమారు) రోజువారీ డిమాండ్ రోజువారీ అదనపు భారంహైదరాబాద్ 4,20,000 35,000 రూ. 3,47,90,000రంగారెడి 2,10,000 18,000 రూ. 1,78,92,000మేడ్చల్–మల్కాజిగిరి 1,85,000 12,000 రూ. 1,19,28,000 -
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌గా ఐపీఎస్ బీ.సుమతి.. కొత్త రికార్డు
సాక్షి, హైదరాబాద్: మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌గా ఐపీఎస్ బీ.సుమతి ఈ రోజు ( శుక్రవారం) బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెకు పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ లోని సిటిజన్స్ యొక్క ప్రయాణ సేఫ్టీని ఇంప్రూవ్ చేయడమే తమ ప్రధాన ప్రయారిటీ అని తెలిపారు. టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్ తో నేరాలకు చెక్.. క్వాలిటీ ఆఫ్ పోలీసింగ్ పై దృష్టిపెడతామని స్పష్టం చేశారు. .ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..మల్కాజ్‌గిరికి మొదటి మహిళ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రజలకు అత్యంత పారదర్శకమైన, సమర్థవంతమైన సేవలు అందించడమే తన ప్రథమ కర్తవ్యమని సీపీ సుమతి పేర్కొన్నారు. మల్కాజిగిరి కమిషనరేట్‌కు ప్రశాంతమైన ప్రాంతంగా మంచి పేరుంది. ఆ ఖ్యాతిని కాపాడుతూ, శాంతిభద్రతల పరిరక్షణలో ఎక్కడా రాజీ పడకుండా పనిచేస్తామని ధీమా వ్యక్తం చేశారు.సాంకేతికతతో నేరాలకు చెక్నేరాల నియంత్రణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తామని సీపీ తెలిపారు. AI ఆధారిత “TG QUEST” వినియోగిస్తమన్నారు. ముఖ్యంగా మారుతున్న కాలానికి అనుగుణంగా పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల కఠినంగా ప్రాసెస్ ఓరియెంటెడ్ & రిజల్ట్ ఓరియెంటెడ్ అప్రోచ్ తో వ్యవహరిస్తామని, బాధితులకు సమాచార పూరిత త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నేరాల పట్ల ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.మాదకద్రవ్యాల కట్టడి.. ట్రాఫిక్ క్రమబద్ధీకరణసమాజానికి పెను సవాలుగా మారిన "మాదకద్రవ్యాల (Drugs)" అక్రమ రవాణా, వినియోగంపై ప్రివెన్షన్, డిటెక్షన్ ఎఫెక్టివ్ ఇన్వెస్టిగేషన్ పై దృష్టి పెడతామనీ ఆమె హెచ్చరించారు. యువత మత్తుకు బానిస కాకుండా AI ఆధారిత నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే, కమిషనరేట్ పరిధిలో పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ట్రాఫిక్ నియంత్రణ పై ప్రత్యేక దృష్టి సారిస్తామని, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు."మహిళా పోలీస్ కమిషనర్‌గా నన్ను నియమించిన ప్రభుత్వానికి, సహకరించిన డీజీపీకి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకతతో మా టీమ్ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని ఆమె అన్నారు. -
శంషాబాద్ ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి
సాక్షి,హైదరాబాద్: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓఆర్ఆర్-16 ఎగ్జిట్ వద్ద ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా మారింది. మృతులు సిరిసిల్ల పట్టణానికి చెందినవారు.పోలీసుల వివరాల ప్రకారం.. ఒకే కుటుంబసభ్యులు యాదగిరి గుట్ట నుంచి వస్తుండగా శంషాబాద్ వైపు వెళ్తున్న కారు (నంబర్ TS 23 F 2298) అతివేగంగా లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టింది. ఢీకొట్టిన తీవ్రతతో కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. లారీ వెనుక భాగంలో కారు ఇరుక్కుపోయింది.కారులో మొత్తం ఏడుగురు ప్రయాణికులున్నారు. ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ప్రయాణికుడి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు ప్రారంభించారు. -
ఆరుగురితో కాదు 36 మందితో చాటింగ్.. సీతారాం పెన్ డ్రైవ్ లో సంచలనాలు..
-
డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయానికి చేరుకున్న సీవీ ఆనంద్‌కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య, పండితుల ఆశీర్వచనాలతో ఆయనను కుర్చీలో కూర్చోబెట్టారు. అనంతరం ఇతర ఐపీఎస్ అధికారులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమానికి సీవీ ఆనంద్ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల భద్రతకు పెద్దపీట వేస్తానన్నారు.సీవీ ఆనంద్ నేపథ్యంఐపీఎస్ 1991 బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్.. నక్సలైట్ ప్రాంతాల్లో పనిచేసిన అనుభవం, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా, ట్రాఫిక్ కమిషనర్‌గా, సైబరాబాద్ కమిషనర్‌గా, అలాగే హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విస్తృతమైన సేవా అనుభవం ఉంది.తన సర్వీస్ ఆరంభంలోనే వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఏఎస్పీ, ఎస్పీగా పనిచేసిన ఆయన నక్సలైట్ మావోయిస్టు సమస్యను ఎదుర్కొన్నారు. ఆయుధ సరఫరా గొలుసును అడ్డుకోవడంలో, యువతను నక్సలైట్ ప్రభావం నుంచి దూరం చేయడంలో కీలక పాత్ర పోషించారు. దానితో పాటు పోలీసుశాఖలో మరెన్నో కీలక పదవులు అధిరోహించారు.ప్రముఖ పదవులుకమిషనర్ ఆఫ్ పోలీస్, హైదరాబాద్కమిషనర్ ఆఫ్ పోలీస్, సైబరాబాద్ట్రాఫిక్ కమిషనర్, హైదరాబాద్ (ఇక్కడే డ్రంక్ డ్రైవింగ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రారంభించారు)డైరెక్టర్ జనరల్, యాంటీ-కరప్షన్ బ్యూరోస్పెషల్ చీఫ్ సెక్రటరీ, హోం శాఖ సంస్కరణలు-ఆవిష్కరణలుఈ-చలాన్, స్పీడ్ గన్స్, రివర్సిబుల్ లేన్లు, "ఫ్రీ లెఫ్ట్" వంటి పద్ధతులు ప్రవేశపెట్టారు.సైబరాబాద్‌లో సీసీటీవీ, ఐటీ ఆధారిత పోలీసింగ్, షీ టీమ్స్, షీ షటిల్స్ వంటి మహిళా భద్రతా కార్యక్రమాలు ప్రారంభించారు.పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (PDS): ఆధార్ ఆధారిత రేషన్ వ్యవస్థ, GPS ట్రాకింగ్, ఆన్లైన్ చెల్లింపులు ప్రవేశపెట్టి రాష్ట్రానికి ₹2000 కోట్లు ఆదా చేశారు.అవార్డులుపోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్తెలంగాణ స్టేట్ ఎక్సలెన్స్ అవార్డు -
హైదరాబాద్ లో మంచు వర్షం.. భారీ విపత్తు రాబోతోందా..!
-
దారి తప్పిన భార్య.. ముగ్గురితో వివాహేతర సంబంధం
-
గిగ్ వర్కర్లకు తెలంగాణ సర్కార్ శుభవార్త
కార్మికుల దినోత్సవం సందర్భంగా.. గిగ్ వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించబోతోంది. గిగ్ సెక్టార్లో ఉద్యోగ భద్రత కోసం తెచ్చిన తెలంగాణ ఫ్లాట్‌ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ (ప్రొటెక్షన్ ఆఫ్ లేబర్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్) బిల్లు 2026 చట్టరూపం దాల్చింది. గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ఈ చారిత్రక బిల్లుకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. మే 1న తెలంగాణ గిగ్ వర్కర్ల చట్టం గెజిట్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే చట్టానికి సంబంధించిన గైడ్‌లైన్స్‌పై స్పష్టతకు మరో రెండు వారాల టైం పట్టొచ్చు. తాజా పరిణామంతో గిగ్ వర్కర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గిగ్ వర్కర్ అసోషియేషన్లు రేవంత్ సర్కార్‌కు కృతజ్ఞతలు తెలియజేశాయి. ఒక అంచనా ప్రకారం.. తెలంగాణలో డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు.. ఇలా సుమారు ఐదు లక్షల మంది గిగ్ వర్కర్లు ఉన్నారు. ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టం వాళ్లందరికీ పని భద్రత(గిగ్ వర్కర్లను రిజిస్టర్ చేయడం, వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు), ప్రమాద, ఆరోగ్య బీమా, ఇతర సామాజిక భద్రతా పథకాలు వర్తింపు ఇలా సమగ్ర రక్షణ కల్పిస్తుంది. అయితే.. ఈ చట్టంలో కొన్ని అంశాలపై ప్లాట్‌ఫారమ్ కంపెనీల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం లేకపోలేదు. గిగ్ వర్కర్ల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కేలా కనీస వేతనాన్ని నిర్ణయించడం, ప్లాట్‌ఫామ్ కంపెనీలు వచ్చే ఆదాయంలో కనీసం 50% వాటాను వర్కర్లకు ఇవ్వాలని నిబంధనలతో పాటు ఇక మీదట సరైన కారణం లేకుండా వర్కర్లను పనిలో నుంచి తొలగించడం కుదరదని తెలంగాణ గిగ్ వర్కర్ల చట్టం చెబుతోంది. అలాగే గిగ్ వర్కర్లను కూడా గ్రాట్యుటీ, కాంట్రాక్ట్ రక్షణ కల్పించేలా నిబంధనలు రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే ఈ నిబంధనలకు కంపెనీలు ఎలా స్పందిస్తాయో చూడాలి. దేశంలో గిగ్ వర్కర్ల కోసం చట్టం చేసిన రెండో రాష్ట్రం తెలంగాణ నిలవనుంది. గతంలో రాజస్థాన్ గిగ్ వర్కర్ల కోసం ఈ తరహా చట్టం(రాజస్థాన్ ఫ్లాట్‌ఫారమ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ (Registration and Welfare) యాక్ట్ 2023 తెచ్చింది. ఈ చట్టానికి అదే ఏడాది జులైలో శాసనసభ ఆమోదం కూడా తెలిపింది. అయితే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేసినా.. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఫలితం లేకపోయింది. ఇప్పటికీ ఆ చట్టం అమల్లోకి రాకపోవడంతో అక్కడ లక్షలాది మంది గిగ్ వర్కర్లు ఆర్థిక, సామాజిక భద్రతా ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. -
మెట్రో రెండోదశకు లైన్ క్లియర్
సాక్షి, హైదరాబాద్: మెట్రోరైల్ మొదటిదశ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో రెండోదశ విస్తరణకు లైన్ క్లియర్ అయింది. ఏడాది క్రితమే రెండోదశ కోసం ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్టు నివేదికలను రూపొందించి కేంద్రానికి అందజేసింది. అయితే సాంకేతిక చిక్కుముళ్లను దృష్టిలో ఉంచుకొని కేంద్రం అనుమతిని నిరాకరించింది. మొదటిదశ ప్రాజెక్టు ఎల్అండ్ టీ సంస్థ నిర్వహణలో ఉండగా, రెండోదశను ప్రభుత్వం నిరి్మస్తే మొదటి, రెండోదశ రైళ్ల నిర్వహణల మధ్య సమన్వయం కొరవడుతుందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం..ఎల్అండ్ టీ సంస్థ నుంచి మెట్రో మొదటి దశను టేకోవర్ చేసింది. దీంతో రెండో దశకు కేంద్రం నుంచి త్వరలోనే ఆమోదం లభించే అవకాశం ఉందన్నారు.దశలవారీగా విస్తరణ..రెండో దశలో మొత్తం 8 కారిడార్లలో మెట్రో విస్తరణకు ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించింది. మొదటి దశలో నాగోల్ నుంచి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు (36.8 కి.మీ.) రాయదుర్గం నుంచి కోకాపేట్ నియోపోలిస్ వరకు(11.6 కి.మీ.), ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు (7.5 కి.మీ.), మియూపూర్–పటాన్చెరు(13.4 కి.మీ.), ఎల్బీనగర్–హయత్‌నగర్ (7.1 కి.మీ.) చొప్పున మొత్తం 76.4 కి.మీ. వరకు నిర్మించనున్నారు. ఆ తరువాత రెండోదశలో ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్‌సిటీ వరకు (39.6 కి.మీ.), జేబీఎస్–మేడ్చల్ వరకు (22 కి.మీ.), జేబీఎస్–శామీపేర్‌పేట్ వరకు(22 కి.మీ.) చొప్పున మరో 86.1 కి.మీ., నిర్మాణానికి ప్రణాళికలను సిద్ధం చేశారు.పాతబస్తీలో మొదటగా... మెట్రో రెండోదశకు వివిధ కారిడార్లలో భూసేకరణ, ఇతర మౌలిక సదుపాయాలపై హెచ్ఎంఆర్ఎల్ ఇప్పటికే దృష్టి సారించింది. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు ప్రతిపాదిత 7.5 కి.మీ. మార్గంలో రహదారుల విస్తరణతోపాటు ఆస్తుల సేకరణ చేపట్టింది. ప్రస్తుతం ఇది తుదిదశలో ఉంది. కేంద్రం నుంచి అనుమతి లభించిన వెంటనే మొదట ఈ మార్గంలో నిర్మాణం చేపడతారు. -
హైదరాబాద్‌లోని 2 ప్రాంతాల్లో భారీ అగ్నిప్రమాదాలు
హైదరాబాద్: నగరంలోని 2 ప్రాంతాల్లో భారీ అగ్నిప్రమాదాలు జరిగాయి. నారాయణగూడ వైఎంసీఏ దగ్గర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద రెండు ఆటోలు దగ్ధమయ్యాయి. ఆటోలో గ్యాస్ ఫిల్ చేస్తుండగా మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న మరో ఆటోకు కూడా మంటలు అంటుకుని అది దగ్ధమైంది. మంటలను సిబ్బంది అదుపు చేశారు. పెట్రోల్ బంక్ సిబ్బంది ఒకరికి గాయాలు కావడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు.మరోవైపు, పాతబస్తీ బహదూర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని జూ పార్క్ సమీపంలో ఉన్న తాడ్‌బన్‌లోని స్క్రాప్ గోదాములో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. పరిసర ప్రాంతాల ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తోంది.


