హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం | Major Fire Accident In Bachupally, Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం

May 5 2026 6:58 AM | Updated on May 5 2026 11:24 AM

Major Fire Accident In Bachupally, Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: బాచుపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బాచుపల్లి-మియాపూర్ ప్రధాన రహదారిలో ఉన్న ఫర్నీచర్  షాపులు అగ్నికి ఆహుతి అయ్యాయి.. ఈ ఘటన సోమవారం రాత్రి 11 గంటల సమయంలో జరిగింది. సుమారు 20 కుటంబాలు రోడ్డున పడ్డాయి. షాపుల్లోని ఫర్నిచర్ సోఫా సెట్టులు, ఇంటి సామగ్రి, టేబుల్స్ దగ్ధమయ్యాయి.

ఒక్కో షాప్‌లో సుమారు రూ. 3 లక్షల రూపాయల విలువైన సామగ్రి ఉంది. సంఘటన స్థలానికి ఆరు ఫైర్ ఇంజన్లు చేరుకుని మంటలను అదుపు చేశాయి.. అయితే ఈ ప్రమాదం విద్యుత్ షార్ట్‌ సర్క్యూట్ కారణంగా జరిగిందా? గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా చేశారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

హైదరాబాద్ బాచుపల్లి లో భారీ అగ్నిప్రమాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement