హైదరాబాద్: ఓ వ్యక్తిపై భార్యతోపాటు ఆమె ప్రియుడు హత్యాయత్నం చేశారు. ఈ సంఘటనలో పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేశారు. పోచారం ఐటీ కారిడార్ పోలీసులు శనివారం తెలిపిన మేరకు.. చౌదరిగూడలోని విజయపురి కాలనీకి చెందిన రమావత్ సుజాత అదే కాలనీకి చెందిన జటోతు మంగిలాల్‌తో వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది.
ఈ విషయం భర్త రమావత్ బిక్కుకు తెలియకుండా ఇంట్లో నాలుగు స్పై కెమెరాలను అమర్చి, భర్త కదలికలు ప్రియుడికి తెలిసేలా ఏర్పాట్లు చేసింది. ఇది తెలుసుకున్న బిక్కు తన భార్య సుజాతను గట్టిగా మందలించాడు. ఈ క్రమంలో మంగిలాల్‌తో సుజాత కలిసి తన భర్తను చంపేందుకు కత్తితో దాడి చేసింది. దీంతో బిక్కు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. విచారణ చేసిన పోలీసులు సుజాత, మంగిలాల్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసి, ఇద్దరినీ అరెస్ట్ చేసి, రిమాండ్‌కు పంపారు.


