బాలికపై బాబాయి లైంగిక దాడి | Minor Girl Allegedly Assaulted By Uncle During Summer Vacation Visit In Tirupati, More Details Inside | Sakshi
Sakshi News home page

బాలికపై బాబాయి లైంగిక దాడి

May 16 2026 9:26 AM | Updated on May 16 2026 9:59 AM

tirupati 16 Years Minor Girl Incident With Babai

హైదరాబాద్‌: పరీక్షలు పూర్తి అయ్యాయి..వేసవి సెలవులు సరదాగా గడుపుదామని  బాబాయి ఇంటికి వెళ్లింది ఓ బాలిక..అయితే బాబాయి బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు.పోలీసులు తెలిపిన మేరకు.. జగద్గిరిగుట్టకు చెందిన బాలిక (16)  సెలవులకు తిరుపతిలోని పిన్ని ఇంటికి వెళ్లింది. 

జీఎస్‌టీ విభాగంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పసిచేస్తున్న  బాబాయి రామమూర్తి... తన భార్య ఉద్యోగానికి వెళ్లిన సమయంలో పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. కొద్ది రోజుల తరువాత నగరానికి వచి్చన బాలికను తల్లి ఆరా తీయగా విషయం వెలుగులోకి వచి్చంది. తల్లి ఫిర్యాదుతో జగద్గిరిగుట్ట పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, కేసును తిరుపతి ఈస్ట్‌ పోలీస్‌ స్టేష¯న్‌కు బదిలీ చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.   

Advertisement
 
Advertisement
Advertisement