ఒకే చితిపై నవ దంపతులకు దహన సంస్కారాలు | Kukatpally Karthik And Manjula Incident | Sakshi
Sakshi News home page

ఒకే చితిపై నవ దంపతులకు దహన సంస్కారాలు

May 4 2026 7:03 AM | Updated on May 4 2026 12:36 PM

Kukatpally Karthik And Manjula Incident

హైదరాబాద్

హైదరాబాద్: బలవన్మరణానికి పాల్పడిన నవ దంపతులు కార్తీక్, మంజుల (జ్ఞాన్సిక)లకు ఆదివారం కూకట్‌పల్లిలోని వెంకటరావునగర్‌ కాలనీలోని హిందూ శ్మశాన వాటికలో కుటుంబ సభ్యులు ఒకే చితిపై దహన సంస్కారాలు చేశారు. వివాహమై రెండు నెలలు గడవక ముందే దంపతులు ఆత్మహత్య చేసుకోవటం మిస్టరీగా మారింది. 

శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి సరదాగా ఉన్న కార్తీక్, మంజుల మరుసటి రోజు ఉదయం విగతజీవులుగా కనిపించటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆర్థిక సమస్యలు లేవని, ఆత్మహత్య చేసుకునేంత కష్టం ఏమొచ్చిందోనని స్థానికులు చర్చించుకుంటున్నారు.  

పోస్ట్‌మార్టం నివేదిక వస్తేనే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు. కాగా.. శుక్రవారం అర్ధరాత్రి తొలుత మంజుల పురుగుల మందు తాగి మృతి చెందడంతో కార్తీక్‌ ఉదయం ఉరి వేసుకున్నట్లు స్థానికులు భావిస్తున్నారు.

చ‌ద‌వండి: ఐఫోన్‌.. ఆవేశం.. విషాదం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement