సాక్షి హైదరాబాద్: ఈ నెల 12వ తేదీన కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. . ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వం, బలోపేతంపై అంతర్గతంగా చర్చించనున్నట్లు పేర్కొంది. త్వరలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతో పాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికలు సైతం జరిగే అవకాశం ఉండడంతో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
కాగా ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లోకి చేరిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో కేసీఆర్ ప్రసంగం సూపర్ హిట్ అయ్యింది. దీంతో బీర్ఎస్ శ్రేణులు జోరుమీదున్నాయి. ఈ నేపథ్యంలోనే గులాబీ బాస్ మరోసారి నాయకులకు దిశా నిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.


