హర్టయ్యినట్లున్నాడు..క్యాబ్‌ డ్రైవర్‌ నోట్‌ వైరల్‌! | Cab Driver Listing Rules For Passengers Sparks Debate | Sakshi
Sakshi News home page

బాగా హర్టయ్యినట్లున్నాడు..క్యాబ్‌ డ్రైవర్‌ నోట్‌ వైరల్‌!

May 3 2026 9:39 PM | Updated on May 3 2026 10:17 PM

Cab Driver Listing Rules For Passengers Sparks Debate

ఏదైనా మనసుకు గాయమైతే అది ఏదొక సందర్భంలో ఏదొక రూపంలో బయటకొచ్చేయడం ఖాయం. ఇక్కడ ధనిక, బీద అనే తేడా ఉండదు. ‘నేను నా బత్రుకు.. బ్రతుకుతున్నా.. మీకు బానిసను కాదు’’ అనే భావన మనిషిలో ఉండటంలో తప్పులేదు. ఉంటుంది కూడా.  ‘నీ పనిని నువ్వు గౌరవించు.. అవతలి వాడికి సలాం కొట్టక్కర్లేదు’ అనే పెద్దలు చెప్పే మాటను చాలామంది పాటిస్తుంటారు.  

ఉద్యోగం చేసే చోట  సలాం కొట్టే పరిస్థితి వచ్చినా అది కొంతవరకే ఉంటుంది కానీ, ఏదో మనం సుపీరియర్‌ అందుకే అవతల వ్యక్తి సలాం కొడుతున్నాడని అనుకోవద్దు.  మరి  స్వే‍చ్ఛా జీవులుగా బ్రతికే వ్యక్తులకు సలాం కొట్టడమన్నా, అవతల వాళ్లు అటిట్యూడ్‌ చూపెడుతున్నప్పుడు  అది భరించడమన్నా చాలా కష్టం. ఇక్కడ ఓ క్యాబ్‌ డ్రైవర్‌ కూడా అదే చేశాడు.  

ఇంతకీ విషయం ఏంటంటే.. క్యాబ్‌ డ్రైవర్‌ తన కారులో పెట్టిన నోట్‌ గురించి. ఎక్కడో ఏదో జరిగే ఆ నోట్‌ పెట్టడానికి కూడా కారణం అయ్యి ఉండొచ్చు. తన క్యాబ్‌లో ఎక్కే వారు ఎలా ఉండాలి అనే దానిపై ఓ నోట్‌ను పెట్టుకున్నాడు. ముందుగా ‘ ‘ క్యాబ్‌ ఎక్కేవారు యజమానిగా ఫీలవ్వద్దు’ అంటూ మొదలు పెట్టి సుమారు 10 నియమాలను పొం​దుపరిచాడు. 

డ్రైవర్లు- ప్రయాణికులు ఒకరితో ఒకరు ఎలా ప్రవర్తించాలనే దానిపై పెట్టిన ఓ నోట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నెట్టింట ఇది విస్తృత చర్చకు కూడా దారి తీసింది. 

ప్రయాణికుడు క్యాబ్ యజమాని కాదని, దానిని నడిపే వ్యక్తే యజమాని అని పేర్కొంటూ ఆ నోట్‌ను ప్రారంభించి. ఆ తర్వాత, ప్రయాణికులను మర్యాదగా మాట్లాడాలని, గౌరవంగా ఉండాలని,  కారు డోర్‌ను నెమ్మదిగా మూయాలని కోరాడు.  మీరు(ప్రయాణికులు) డబ్బు చెల్లించినంత మాత్రాన అమర్యాదగా ప్రవర్తించే హక్కు వారికి లేదన్నాడు. మీకు ఏమైనా అహంకారం ఉంటే దానిని జేబులో పెట్టుకుని ఉండాలని కూడా సూచించాడు.  ఇది హైదరాబాద్‌కు చెందిన క్యాబ్‌ డ్రైవర్‌ నోట్‌గా తెలుస్తోంది. 

హైదరాబాద్ క్యాబ్‌లు వెనుకాడవు అనే క్యాప్షన్‌తో అమన్ అనే సోషల్ మీడియా యూజర్ ‘ఎక్స్‌’లో ఆ నోట్‌ను ఫోట్‌ తీసి పోస్ట్‌ చేశాడు.  ఇది వైరల్‌గా మారిన వైనంలో వార్త అయ్యింది. 

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement