‘బండి సంజయ్‌ కుమారుడి ఎపిసోడ్‌.. 36 గంటలైనా కేసు లేదా?’ | BRS Harish Rao Serious Comments On Bandi Sanjay Episode | Sakshi
Sakshi News home page

‘బండి సంజయ్‌ కుమారుడి ఎపిసోడ్‌.. 36 గంటలైనా కేసు లేదా?’

May 10 2026 1:41 PM | Updated on May 10 2026 1:56 PM

BRS Harish Rao Serious Comments On Bandi Sanjay Episode

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కేంద్రమంత్రి బండి సంజయ్‌ కుమారుడిపై కేసు విషయంలో రాజకీయం హీటెక్కింది. బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై పోక్సో కేసు నమోదు చేయడంలో పోలీసుల జాప్యంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం కోసం బాధితురాలు పోలీస్ స్టేషన్‌కు వెళ్తే.. కేసు నమోదు చేయడానికి 8 గంటల సమయం ఎందుకు పట్టిందని ప్రశ్నించారు.

మాజీ మంత్రి హరీష్‌ రావు ఎక్స్‌ వేదికగా..‘బాధితురాలు న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కి వెళ్తే.. కేసు నమోదు చేయడానికి 8 గంటల సమయం ఎందుకు పట్టింది?. కేసు నమోదై 36 గంటలు గడుస్తున్నా నిందితులపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్ర హోంమంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య చీకటి ఒప్పందానికి, కుమ్మక్కు రాజకీయాలకు ఇంతకంటే నిదర్శనం వేరే ఏమైనా ఉంటుందా? పోలీసులు వెంటనే నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

 డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
బండి సంజయ్ కుమారుడిని అరెస్టు చేయాలని బీఆర్ఎస్‌వీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ కార్యాలయం ముందు ఆదివారం మెరుపు ధర్నా చేశారు. అలాగే కేంద్రమంత్రి బండి సంజయ్‌ను వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపైనా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌ను పలువురు మహిళలు ముట్టడించారు. బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement