తెలంగాణలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు | Telangana Scorches Under Record Heat | Sakshi
Sakshi News home page

తెలంగాణలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు

May 3 2026 12:25 AM | Updated on May 3 2026 12:56 AM

Telangana Scorches Under Record Heat

హైదరాబాద్‌: తెలంగాణలో భానుడు ప్రతాపం చూపుతున్నాడు. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం (మే 2) ఈ సీజన్లోనే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

నిజామాబాద్‌లో గరిష్ఠంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ, నిర్మల్, సిద్దిపేట జిల్లాలో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకాగా, ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాలో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల ప‍్రభావంతో మధ్యాహ్నం సమయంలో ప్రజలు బయట తిరగలేకపోతున్నారు. ఉదయం వేళల నుంచే ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో ఉంటున్నాయి. వేడి గాలులు మరింత ఇబ్బంది కలిగిస్తున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు మరిన్ని ఇబ్బందులు పడుతున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement