సాక్షి, జూబ్లీహిల్స్: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ భార్య హత్యకు గురయ్యారు. జూబ్లీహిల్స్‌లోని ఐఏఎస్ క్వార్టర్స్‌లో శుక్రవారం ఉదయం ఈ హత్య జరిగింది. వినయ్ రంజన్ ఇంట్లో పనిచేసే పని మనిషే ఆమెను హత్య చేసినట్టు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


