సీఓఈ శిబిరానికి అనన్య ఎంపిక  | Ananya Dundu Selected to BCCI-Centre of Excellence | Sakshi
Sakshi News home page

సీఓఈ శిబిరానికి అనన్య ఎంపిక 

May 2 2026 6:07 AM | Updated on May 2 2026 6:07 AM

Ananya Dundu Selected to BCCI-Centre of Excellence

సాక్షి, హైదరాబాద్‌: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో నిర్వహించే హై పెర్ఫార్మెన్స్‌ క్యాంప్‌కు హైదరాబాద్‌ స్పిన్‌ బౌలర్‌ అనన్య దుండు ఎంపికైంది. అండర్‌–15 బాలికల విభాగంలో ఆమెకు ఈ అవకాశం దక్కింది.

 బెంగళూరులోని బీసీసీఐ–సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (సీఓఈ)లో ఈ నెల 18 నుంచి 11 జూన్‌ వరకు ఈ క్యాంప్‌ జరుగుతుంది. ఇటీవల జరిగిన బీసీసీఐ అండర్‌–15 వన్డే ట్రోఫీ (ఎలైట్‌)లో అనన్య 6 మ్యాచ్‌లలో 16 వికెట్లు పడగొట్టి టోర్నీ టాపర్‌గా నిలిచింది. బోర్డు అపెక్స్‌ కౌన్సిల్‌ మెంబర్‌ వి.చాముండేశ్వరనాథ్‌ పర్యవేక్షణలో నగరంలోని రామానాయుడు క్రికెట్‌ అకాడమీలో ప్రస్తుతం అనన్య శిక్షణ పొందుతోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement