breaking news
High Performance Committee
-
భారత అథ్లెటిక్స్ హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ వోల్కర్ రాజీనామా
న్యూఢిల్లీ: భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ వోల్కర్ హెర్మన్ తన పదవి నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని వోల్కర్ స్వయంగా తన ఫేస్బుక్ పేజీ ద్వారా పంచుకున్నారు. అత్యున్నతమైన ఈ పదవి కోసం విధించుకున్న స్వీయ అంచనాలను ఇక అందుకోలేనని పేర్కొంటూ తన నిర్ణయాన్ని ప్రకటించారు. 2019లో వోల్కర్ ఈ బాధ్యతను స్వీకరించారు. టోక్యో ఒలింపిక్స్‌తో ఆయన పదవీకాలం ముగియనుండగా... సెప్టెంబర్‌లో భారత క్రీడా మంత్రిత్వ శాఖ 2024 వరకు ఆయనకు పొడిగింపునిచ్చింది. అయితే దీన్ని తిరస్కరించిన వోల్కర్ కొన్ని వారాల కిందటే రాజీనామా పత్రాన్ని సమర్పించారని ఏఎఫ్ఐ వర్గాలు వెల్లడించాయి. ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని ఏఎఫ్ఐ విజ్ఞప్తి చేసినప్పటికీ ఆయన జర్మనీకి వెళ్లేందుకే సిద్ధపడ్డారని సమాఖ్య అధ్యక్షుడు ఆదిల్ సుమరివాలా తెలిపారు. -
యూఏఈలో మినీ ఐపీఎల్!
ముంబై: విదేశాల్లో మినీ ఐపీఎల్‌ను నిర్వహించేందుకు బీసీసీఐ తమ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. యూఏఈ లేదా ఉత్తర అమెరికాలో ఏదో ఓచోట ఈ లీగ్‌ను నిర్వహిస్తారని వార్తలు వస్తున్నా ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. అయితే యూఏఈ సమయం భారత్‌కు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతం ఇక్కడే జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ ప్రారంభంలో ఈ లీగ్‌ను జరపాలని భావిస్తున్నారు. అప్పటికి భారత జట్టు విండీస్ టూర్ ముగుస్తుంది. క్రికెట్ సలహా కమిటీ విస్తరణ విస్తరణలో భాగంగా గంగూలీ నేతృత్వంలోని క్రికెట్ సలహా కమిటీ త్వరలో హై పెర్ఫార్మెన్స్ కమిటీ (హెచ్పీసీ)గా మారే అవకాశాలున్నాయి. సెప్టెం బర్లో జరిగే బోర్డు వార్షిక సమావేశంలో ఈ విషయమై చర్చించనున్నారు. హెచ్‌పీసీలో క్రికెట్ సలహా కమిటీయే కాకుండా సాంకేతిక కమిటీని కూడా విలీనం చేయనున్నారు. దీంట్లో ఆరుగురు సభ్యుల వరకు ఉంటారు.