అమ్మ ఆశీర్వాదం తీసుకున్నా.. డీజీపీ సీవీ ఆనంద్‌ | An emotional moment from Telangana DGP CV Anand | Sakshi
Sakshi News home page

అమ్మ ఆశీర్వాదం తీసుకున్నా.. డీజీపీ సీవీ ఆనంద్‌

May 4 2026 8:02 AM | Updated on May 4 2026 8:02 AM

An emotional moment from Telangana DGP CV Anand

సాక్షి, హైదరాబాద్‌: డీజీపీ బా ధ్యతలు చేపట్టిన తర్వాత తల్లిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నట్టు సీవీ ఆనంద్‌ ఆదివారం తన ఎక్స్‌ ఖాతాలో ట్వీట్‌ చేశారు. ‘మా అమ్మను పరామర్శించి ఆమె ఆశీర్వాదం తీసుకున్నాను. ఆమె నవంబర్‌ నుంచి జనవరి నెలల్లో అనా రోగ్యంతో ఉన్నారు. ఇప్పుడు మంచానికే పరిమితమైనప్పటికీ కోలుకున్నారు. తన కొడుకు ఈ రాష్ట్రానికి డీజీపీ కావాలన్న ఆమె ప్రగాఢ వాంఛే ఆమెను నిలబెట్టిందని నాకు అనిపించింది. ఆమె ఎంతో సంతోషించారు. నేను కూడా అంతే..’ అంటూ కొన్ని ఫొటోలను సీవీ ఆనంద్‌ పంచుకున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement