స్నేహితురాలి పెళ్లికి వెళ్లి.. | Telugu Woman Dies After Drowning In A Swimming | Sakshi
Sakshi News home page

స్నేహితురాలి పెళ్లికి వెళ్లి..

May 10 2026 7:37 AM | Updated on May 10 2026 7:37 AM

Telugu Woman Dies After Drowning In A Swimming

హైదరాబాద్‌: అమెరికాలో స్విమ్మింగ్‌పూల్‌లో పడి నగర యువతి మృతి చెందిన ఘటన విషాదం నింపింది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగోజిగూడ డివిజన్‌ న్యూ శివపురి కాలనీకి చెందిన ముద్దసాని దేవేందర్‌ రెడ్డి, సునీత దంపతుల కూతురు శ్రీవీణ (28)కు 2023లో ప్రశాంత్‌ రెడ్డితో వివాహమైంది. అమెరికాలోని వర్జీనియా ప్రాంతంలో నివాసం ఉంటూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీవీణ స్నేహితురాలి వివాహం సందర్భంగా రెండు రోజుల క్రితం ఫ్లోరిడా వెళ్లారు. అక్కడ శ్రీవీణ స్విమ్మింగ్‌పూల్‌లో విగతజీవిగా కనిపించడంతో ఆస్పత్రికి తరలించారు.

అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. ఒక్కగానొక్క కూతురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో నగరంలోని దేవేందర్‌ రెడ్డి, సునీత దంపతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. శ్రీవీణ తల్లిదండ్రులను ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సు«దీర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్, టీపీసీసీ అధికార ప్రతినిధి ధర్పల్లి రాజశేఖర్‌రెడ్డి పరామర్శించారు. ఆమె భౌతిక కాయాన్ని అమెరికా నుంచి భారత్‌కు వీలైనంత తొందరగా తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement