ఎస్‌ఐఆర్‌పై ఎంపీ అనిల్‌ కుమార్‌ యాదవ్‌ సమీక్ష | MP Anil Kumar Yadav Holds Review Meeting In AP On Development And Public Issues, More Details Inside | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐఆర్‌పై ఎంపీ అనిల్‌ కుమార్‌ యాదవ్‌ సమీక్ష

May 3 2026 12:48 PM | Updated on May 3 2026 2:27 PM

MP Anil Kumar Yadav Review Meeting

హైదరాబాద్‌: గాంధీభవన్ లో మాజీ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ లు మరియు కోఆర్డినేటర్లు విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించబడింది. ఎన్నికల సంఘం చేపట్టిన “స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)” కార్యక్రమంపై లోతైన చర్చ జరిపి, భవిష్యత్ కార్యాచరణపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడుతూ, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అత్యంత కీలక అంశమని పేర్కొన్నారు. మల్కాజ్గిరి కార్పొరేషన్ లో ఎక్కడా దొంగ ఓట్లు, డబుల్ ఓట్లు ఉండకుండా ప్రతి బూత్ స్థాయిలో పర్యవేక్షణను బలోపేతం చేయాలని, అర్హత కలిగిన ప్రతి ఓటరు జాబితాలో ఉండేలా క్షేత్ర స్థాయిలో కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, సవరణలు వంటి ప్రక్రియలను వేగవంతం చేయాలని, యువత, మహిళలు మరియు కొత్తగా అర్హత పొందిన వారిని ప్రత్యేకంగా గుర్తించి నమోదు చేయించాలన్నారు. ఈ దిశగా పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు.

బూత్ స్థాయిలో సమర్థవంతమైన వ్యవస్థ కోసం వెంటనే “బూత్ లెవల్ అసిస్టెంట్స్ (BLA)” నియామకాన్ని పూర్తి చేసి, వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రతి కార్యకర్త ఈ బాధ్యతను కర్తవ్యంగా భావించి పనిచేస్తేనే భవిష్యత్ ఎన్నికల్లో విజయానికి బలమైన పునాది పడుతుందని స్పష్టం చేశారు,మరియు డివిజన్ అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ కూడా పూర్తి చేయాలని అన్నారుఈ కార్యక్రమంలో మధుయాష్కి గారు,జిల్లా అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ గారు,ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి గారు. ఉప్పల్ నియోజకవర్గం కోర్డినేటర్ శశికళ యాదవ్ గారు,బండి రమేష్ గారు,కోలన్ హనుమంత్ రెడ్డి గారు,తదితరులు పాల్గొన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement