ఏం కష్టం వచ్చిందో..! | Newly Married Couple Incident In Kukatpally | Sakshi
Sakshi News home page

ఏం కష్టం వచ్చిందో..!

May 3 2026 7:19 AM | Updated on May 3 2026 7:19 AM

Newly Married Couple Incident In Kukatpally

హైదరాబాద్: ఆ దంపతులకు ఏం కష్టం వచ్చిందో ఏమో బలవన్మరణానికి పాల్పడ్డారు. వివాహమైన 55 రోజులకే తనువు చాలించారు. మిస్టరీగా మారిన ఈ విషాద ఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు, బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుమ్మరి బస్తీకి చెందిన కార్తీక్‌ (28)కు గత మార్చి 8న ప్రశాంత్‌నగర్‌ రాజీవ్‌గాంధీ నగర్‌కు చెందిన మంజుల ఎలియాస్‌ జ్ఞాన్షిక (27)తో వివాహమైంది. 

కార్తీక్‌ ఐటీసీ కంపెనీలో మార్కెటింగ్‌ ఉద్యోగం చేస్తుండగా.. మంజుల  ఫ్యాబ్రిక్‌ పెయింటింగ్‌ చేస్తున్నారు. శుక్రవారం తెలిసినవారి ఇంటిలో జరిగిన సత్యనారాయణ స్వామి వ్రతానికి మంజుల వెళ్లి వచి్చంది. అనంతరం ప్రశాంత్‌నగర్‌లో తల్లి ఇంటికి భర్తతో కలిసి వెళ్లి వచి్చంది. రాత్రి భోజనాలనంతరం కార్తీక్, మంజుల వారి గదిలో నిద్రించారు. శనివారం ఉదయం 9.30 గంటలైనా ఇంటి తలుపులు తీయలేదు. 

 ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపులు పగులగొట్టి చూడగా.. కార్తీక్‌ తలుపుపై ఉన్న వెంటిలేటర్‌కు వైర్‌తో ఉరి వేసుకున్నాడు. మంజుల బెడ్‌పై నోట్లో నురగలతో కనిపించింది.  ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మంజుల తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు  కేసు దర్యాప్తు చేస్తున్నారు. దంపతులు ఆత్మహత్యకు కారణాలేమిటో తెలియడంలేదని కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement