కిమ్స్‌లో క్రీడా గాయాలు & ఆర్థ్రోస్కోపీపై ఫెలోషిప్ ప్రారంభం | Fellowship on Sports Injuries, Arthroscopy begins at KIMS | Sakshi
Sakshi News home page

కిమ్స్‌లో క్రీడా గాయాలు & ఆర్థ్రోస్కోపీపై ఫెలోషిప్ ప్రారంభం

May 6 2026 3:28 PM | Updated on May 6 2026 5:25 PM

Fellowship on Sports Injuries, Arthroscopy begins at KIMS

సాక్షి, హైదరాబాద్: కిమ్స్ హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ విద్యారంగం, స్పోర్ట్స్ మెడిసిన్‌లో కీలక మైలురాయిని సాధించింది. తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో క్రీడా గాయాలు ఆర్థ్రోస్కోపీపై అంతర్జాతీయ గుర్తింపు పొందిన తొలి ఫెలోషిప్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ప్రతిష్టాత్మక ఫెలోషిప్ సాధారణ ఆర్థోపెడిక్ శిక్షణ, క్రీడాకారులు, శారీరకంగా చురుకైన వ్యక్తులకు అవసరమైన ప్రత్యేక నైపుణ్యాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు రూపొందించబడింది. 

ఆర్థ్రోస్కోపీ అనే ఈ మినిమల్ ఇన్వేసివ్ శస్త్రచికిత్స పద్ధతి చిన్న జాయింట్ స్థలాల్లో అధునాతన పరికరాలు మరియు ఫైబర్ ఆప్టిక్ కెమెరా సహాయంతో పని చేసే నైపుణ్యాన్ని కోరుతుంది. ఏసీఎల్ (ACL) పునర్నిర్మాణం, లాబ్రల్ రిపేర్, కార్టిలేజ్ రీస్టోరేషన్ వంటి శస్త్రచికిత్సలు అత్యంత ఖచ్చితత్వంతో చేయాల్సి ఉంటుంది. ఈ ఫెలోషిప్ ద్వారా వైద్యులకు ఈ నైపుణ్యాలపై  సమగ్ర శిక్షణ అందుతుంది.

ఈ కార్యక్రమంలో మోకాలి, భుజం, నడుము జాయింట్ల రీకన్‌స్ట్రక్టివ్ ఆర్థ్రోస్కోపీతో పాటు స్పోర్ట్స్ మెడిసిన్, జాయింట్ ప్రిజర్వేషన్ సర్జరీలో ప్రత్యేక శిక్షణ అందింస్తారు. ప్రాక్టికల్ శస్త్రచికిత్స అనుభవంతో పాటు సైద్ధాంతిక బోధనను కలిపి, ఖచ్చితమైన శస్త్రచికిత్స, క్రీడలకు సంబంధించిన గాయాల అంచనా, పునరావాస విధానాలు మరియు ఆధారిత వైద్య విధానాలపై ప్రత్యేకమైన ఫోకస్‌ ఉంటుంది. 

కిమ్స్ హాస్పిటల్స్ మెుదటి నుంచే సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, మెరుగైన చికిత్స ఫలితాలతో పాటు నిపుణుల తయారీకి కట్టుబడి ఉంది. ఈ ఫెలోషిప్‌కు లభించిన అంతర్జాతీయ గుర్తింపు, సంస్థ యొక్క వైద్య నైపుణ్యం మరియు గ్లోబల్ ప్రమాణాలపై ఉన్న నిబద్ధతకు నిదర్శనం. ఈ ఫెలోషిప్ కార్యక్రమానికి డైరెక్టర్ ఆర్థ్రోస్కోపీ, స్పోర్ట్స్ మెడిసిన్ హెచ్ఓడి డా. ఆర్. ఎ. పూర్ణచంద్ర తేజస్వి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం దేశంలో ఆధునిక ఆర్థోపెడిక్ శిక్షణకు మార్గదర్శిగా నిలవనుంది.

ఈ సందర్భంగా డైరెక్టర్ మరియు ఆర్థ్రోస్కోపీ మరియు స్పోర్ట్స్ మెడిసిన్ హెచ్ఓడి  డా. ఆర్.ఎ. పూర్ణచంద్ర తేజస్వి మాట్లాడుతూ, ఈ ఫెలోషిప్ ద్వారా అత్యాధునిక ఆర్థ్రోస్కోపీ పద్ధతుల్లో వైద్యులను శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రాంతంలో క్రీడా గాయాల చికిత్స నాణ్యతను మరింత మెరుగుపరచగలమని తెలిపారు. ఈ కార్యక్రమంతో కిమ్స్ హాస్పిటల్స్ ఆధునిక వైద్య విద్య మరియు ప్రత్యేక శస్త్రచికిత్స సేవలలో తన నాయకత్వ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ, దేశవ్యాప్తంగా కొత్త ప్రమాణాలను స్థాపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement