రిటైర్డ్ డీజీపీ భార్య కేసు.. వెలుగులోకి షాకింగ్‌ విషయాలు | Sensational Details In Retired Dgp Wife Case In Jubilee Hills | Sakshi
Sakshi News home page

రిటైర్డ్ డీజీపీ భార్య కేసు.. వెలుగులోకి షాకింగ్‌ విషయాలు

May 8 2026 4:35 PM | Updated on May 8 2026 6:42 PM

Sensational Details In Retired Dgp Wife Case In Jubilee Hills

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో రిటైర్డ్ డీజీపీ భార్య హత్య కేసులో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. పని మనిషే హత్య చేసినట్లు అనుమానిస్తున్నామని.. నేపాలీ పని మనుషులతో అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ డీజీపీ భార్య తనూజాను రాత్రి రెండు గంటలకు దుండగులు హత్య చేశారన్నారు. 

నేపాలి గ్యాంగ్ పనిగా ప్రాథమికంగా తాము ఒక అంచనాకు వచ్చామన్న సజ్జనార్‌.. కొన్ని క్లూస్ లభించాయని.. ఆ క్లూస్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ‘‘నేపాలి పని వాళ్ళ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. నేపాలి పని మనుషులు ఇంట్లో ఎవరూ లేనప్పుడు నేరాలకు పాల్పడతారు. రాత్రి మాజీ డీజీపీ ఇంట్లో లేనప్పుడు ఇంట్లో పని చేసే కల్పన అనే మహిళ మరికొందరితో కలిసి ఈ క్రైమ్ చేసింది. ఘటన సమయంలో తనూజ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నారు. ఇంట్లో ఉన్న కల్పనతో బయట వ్యక్తులు కాంటాక్ట్ పెట్టుకొని ఈ క్రైమ్ చేశారు. నిందితులను అతి త్వరలో ఖచ్చితంగా పట్టుకుంటాం’’ అని సజ్జనార్‌ పేర్కొన్నారు.

ఇంట్లో ఏడాది, రెండేళ్లు పనిచేసిన నేపాలి మనుషులపై కూడా నిఘా ఉండాలి. ఈ కేసును చాలా సీరియసగా తీసుకుంటున్నాం. చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి ఆమెను ఈ గ్యాంగ్ హత్య చేసింది. మాజీ డిజీపి వాళ్ల మదర్ కోసం ఆమె హైదరాబాద్ వచ్చారు. ఇటీవల మరణించారు. అప్పటినుండి మృతురాలు తనూజ ఇక్కడే ఉంటుంది. ఎంత బంగారం నగదు పోయింది అన్న అంశాలపై ఆరా తీస్తున్నాము. నిందితులు బ్యాక్ గేట్ నుండి ఇంట్లోకి ప్రవేశించారు. క్రైమ్ అనంతరం వెనక నుండి పారిపోయారు’’ అని సజ్జనార్‌ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement