Jayashankar
-
పుష్పగిరి పీఠాధిపతికి పూర్ణకుంభ స్వాగతం
పుష్పగిరి పీఠాధిపతి అభివఉద్దండ విద్యాభారతిస్వామి ఆదివారం ముందుగా త్రివేణి సంగమంలోని అంతర్వాహిని సరస్వతినదిలో పుష్కర స్నానాలు చేశారు. నదికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం రాజగోపురం వద్దకు రాగా స్వామికి ఆలయ అర్చకులు, అధికారులు మంగళవాయిద్యాలు, వేదపండితుల మంత్రోచ్చరణలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకుని అభిషేక పూజలు చేశారు. నేడు సోమవారం కావడంతో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. భూపాలపల్లి/కాళేశ్వరం: సరస్వతి నదికి భక్తుల ప్రవాహం భారీగా పెరిగింది. ఆదివారం సెలవురోజు కావడంతో నాలుగవ రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక నుంచి భక్తులు కాళేశ్వరానికి పోటెత్తారు. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతినదిలో పుష్కర పుణ్యస్నానాలు ఆచరించారు. నదీమాతకు పూజలు చేశారు. పిండ ప్రదాన పూజలు చేశారు. పితృదేవతలకు తర్పనాలు నిర్వహించారు. నదీమాతకు చీరె, సారె సమర్పించారు. ముత్తయిదువలు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. భక్తులతో పుష్కరిని నిండిపోయి దర్శమిచ్చింది. స్టాళ్లలో ఏర్పాటుచేసిన ఫుడ్‌కోర్డు, ఖాదీవస్త్రాలు, చిల్డ్రన్స్ ఆటలు, టెంట్సిటీలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. పార్కింగ్ స్థలాల నుంచి భక్తులు ఆటోలలో కాళేశ్వరాలయానికి, బస్టాండ్ నుంచి కొంతమంది కాలినడకన, కొంతమంది ఆటోల్లో తరలివస్తున్నారు. -
నేటి ప్రజావాణి రద్దు
భూపాలపల్లి అర్బన్: కాళేశ్వరం సరస్వతి పుష్కరాల నేపథ్యంలో నేడు(సోమవారం) జరగాల్సిన ప్రజావాణిని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు కలెక్టర్ రాహుల్‌శర్మ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని.. ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు ఇవ్వడానికి కలెక్టరేట్‌కు రావొద్దని సూచించారు. ఆధ్యాత్మిక ప్రవచనం ప్రారంభం కాళేశ్వరం: కాళేశ్వరంలో శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో పుష్కరాల సందర్భంగా ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు ప్రసిద్ధ ఆధ్యాత్మిక ప్రవచనకర్త, టీవీ జ్యోతిష్య శాస్త్ర ఆధ్యాత్మిక పండితులు పాలేపు చంద్రశేఖర శర్మ ప్రవచనాలు ప్రారంభమయ్యాయి. ‘భాగవత భక్తి రసం’ అనే అంశంపై ఆయన ప్రసంగిస్తూ, భక్తి మార్గం, ధర్మం, నైతిక విలువల ప్రాధాన్యతలపై శ్రద్ధాజనులకు లోతైన సందేశాలు అందించారు. దేవస్థాన ప్రాంగణంలో పెద్దసంఖ్యలో భక్తులు హాజరై ఈ ప్రవచనాన్ని ఆస్వాదించారు. అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రజలు సుభిక్షంగా ఉండాలి కాటారం: కాళేశ్వర ముక్తీశ్వరుడి ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రతి ఒక్కరు సరస్వతి నది పుష్కర స్నానం ఆచరించాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. తీన్మార్ మల్లన్న ఆదివారం కుటుంబ సమేతంగా సరస్వతి ఘాట్‌లో పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఈఓ మహేశ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను శాలువాతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా కాళేశ్వరం పుణ్యక్షేత్రంకు ఎనలేని చరిత్ర ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటి సారిగా సరస్వతి పుష్కరాలను నిర్వహిస్తుందన్నారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామి వారిని కోరుకున్నట్లు మల్లన్న తెలిపారు. మల్లన్న వెంట తీన్మార్ మల్లన్న టీం జిల్లా అద్యక్షుడు రవిపటేల్, బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ హరిశంకర్, తదితరులు ఉన్నారు. ‘చెన్నయ్య ఆరోపణలు సరికాదు’ కాళేశ్వరం: మంత్రి శ్రీధర్‌బాబు దళితులను చిన్నచూపు చూస్తున్నారని అవగాహన రాహిత్యంతో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య ఆరోపణలు చేయడం సరికాదని నేతకాని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సెగ్గం రాజేష్ అన్నారు. ఆదివారం మహదేవపూర్ మండలకేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాజేష్ మాట్లాడారు. సరస్వతి పుష్కరాల ప్రారంభోత్సవ కార్యక్రమ ఆహ్వాన పత్రిక పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు కూడా అందించారని, ప్రొటోకాల్‌కు దేవాదాయ శాఖ కమిషనర్‌కు సంబంధం ఉండదని, అది జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (జీఏడీ) చూసుకుంటుందని సూచించారు. మంథని నియోజకవర్గంలో బీఆర్ఎస్ హయాంలో అనేక దళితుల హత్యలు జరిగినప్పుడు స్పందించని చెన్నయ్య మంత్రి శ్రీధర్‌బాబు దళితులను చిన్నచూపు చూస్తున్నాడని విమర్శించడం సిగ్గుచేటని అన్నారు. ఈ కార్యక్రమంలో నేతకాని సంఘం మహదేవపూర్ మండల యూత్ అధ్యక్షుడు కొండగొర్ల సంతోష్, పూతల శ్యామ్ సుందర్, జాడి రాజసడవల్లి, దుర్గయ్య, నరేష్, రాజబాపు, జనార్దన్, బానేష్, నవీన్ పాల్గొన్నారు. తునికాకు కూలీకి పాముకాటు వాజేడు: తునికాకు సేకరణ కోసం అడవికి వెళ్లిన కార్మికురాలు పాముకాటుకు గురైంది. స్థానికులు, ఆమె భర్త లోహమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని శ్రీరామ్ నగర్ గ్రామానికి చెందిన పూనెం శ్రీలత తునికాకు సేకరణ కోసం సమీపంలోని ములుకనపల్లి గ్రామం అవతల ఉన్న అడవిలోకి వెళ్లింది. తునికాకు సేకరిస్తుండగా చేతిపై పాము కాటు వేసింది. వాజేడు వైద్యశాలకు తరలించగా ప్రథమ చికిత్స నిర్వహించి ఏటూరునాగారం అక్కడి నుంచి ములుగు తరలించారు. అక్కడ చికిత్స అనంతరం మరింత మెరుగైన వైద్యం కోసం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తీసుకువెళ్లాలని వైద్యులు సూచించినట్లు లోహ మూర్తి తెలిపాడు. -
నిలుపుతున్న ఆర్టీసీ బస్సులు
కాటారం: కాళేశ్వరం సరస్వతి నది పుష్కరాల సందర్భంగా మొదటి రెండు రోజులు కాటారంలో ఆర్టీసీ బస్సులు నిలపకపోవడంతో భక్తులు, సాధారణ ప్రయాణికులు మహదేవపూర్, కాళేశ్వరం వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో సాక్షిలో శనివారం ‘ఆర్టీసీ అత్యుత్సాహం’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. ఆర్టీసీ ఉన్నతాధికారులు కథనంపై ఆరా తీసి వివరాలు సేకరించారు. బస్సులు కాటారంలో నిలపాలని డ్రైవర్లు, కండక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కాటారం ప్రధాన కూడలిలో ఆదివారం బస్సులు నిలిపారు. కానీ వరంగల్, హనుమకొండ డిపోలకు చెందిన కొన్ని బస్సులు మాత్రం ఆపడం లేదు. భక్తులు, ప్రయాణికులు రోడ్డుపైకి వచ్చి చేతులు అడ్డుపెట్టినప్పటికీ ఫలితం లేదు. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పరిశీలిస్తూ.. సూచనలు చేస్తూ..
● పుష్కర ప్రాంతాల్లో కలెక్టర్ విస్తృత పర్యటన భూపాలపల్లి/కాళేశ్వరం: కాళేశ్వరం పుష్కర ప్రాంతాల్లో ఆదివారం కలెక్టర్ రాహుల్ శర్మ విస్తృతంగా పర్యటించారు. సరస్వతి ఘాట్, భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే త్రివేణి సంగమం, వైద్యారోగ్య శిబిరాలు, కాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవాలయం, పుష్కర విధులు నిర్వహించే సిబ్బందికి ఏర్పాటు చేసిన భోజనశాల తదితర ప్రాంతాలల్లో పర్యటించారు. భక్తులతో ముచ్చటించి, సమస్యలు అడిగి తెలుసుకొని వెంటనే సంబంధిత శాఖల అధికారులతో వాకీటాకీలో మాట్లాడి పలు సమస్యలు పరిష్కారం అయ్యేలా చూశారు. రేపు భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నందున నది తీరంలో అదనంగా చలువ పందిళ్లు ఏర్పాటు చేయించాలని పీఆర్ అధికారులను ఆదేశించారు. సంగమ ప్రాంతంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని, అదనపు సిబ్బందిని ఏర్పాటుచేసి తొలగింపజేయించాలని, తాను మళ్లీ వస్తానని, మార్పు లేకపోతే చర్యలు తప్పవని పంచాయతీ అధికారులను హెచ్చరించారు. దేవస్థానంలో దర్శనానికి ఎంత సమయం పడుతుందని భక్తులను అడిగి తెలుసుకున్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తులకు తాగునీరు అందించాలని సూచించారు. -
మేడారంలో భక్తుల కోలాహలం
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల రద్దీతో మేడారం అమ్మవార్ల గద్దెల ప్రాంగణం కోలాహలంగా మారింది. మేడారం పరిసరాలు భక్తులతో సందడిగా కనిపించాయి. మేడారానికి వచ్చిన భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నాలు ఆచరించారు. అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, గాజులు, పూలు, పండ్లు, ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. యాటలు, కోళ్లతో మొక్కు సమర్పించారు. మొక్కుల అనంతరం భక్తులు మేడారం పరిసరాల్లోని చెట్ల కింద వంటావార్పు చేసుకుని సహాపంక్తి భోజనాలు చేశారు. సుమారుగా 20వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచన వేశారు. దేవాదాయశాఖ జూనియర్ అసిస్టెంట్ జగదీశ్వర్ గద్దెల ప్రాంగణంలో దొంగలు చేతివాటం ప్రదర్శించకుండా మైకు అనౌన్స్మెంట్ ద్వారా భక్తులను అప్రమత్తం చేశారు. కాళేశ్వరం టు మేడారం మేడారానికి వచ్చిన భక్తులు.. కాళేశ్వరానికి వెళ్లడం.. అక్కడకు వెళ్లిన భక్తులు ఇక్కడకు వస్తుండడంతో సందడి వాతావరణం నెలకొంది. మేడారానికి వచ్చిన భక్తులను పలకరించగా అమ్మవార్లను దర్శించుకుని కాళేశ్వరం పుష్కరాలకు వెళ్తామని చెప్పారు. కొందరు భక్తులు కాళేశ్వరం సరస్వతి నదిలో పుష్కర స్నానాలు ఆచరించి పూజలు నిర్వహించి మేడారానికి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చినట్లు సాక్షికి తెలిపారు. కాళేశ్వరం సరస్వతి నది పుష్కరాల సందర్భంగా ఆదివారం మేడారంలో మినీ జాతర కళ సంతరించుకుంది. భారీగా తరలివచ్చిన భక్తులు సరస్వతి పుష్కరాల నేపథ్యంలో పెరిగిన భక్తుల సంఖ్య -
నేటి నుంచి జాయ్‌రైడ్స్
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో జాయ్‌రైడ్స్‌కు ఆదివారం నుంచి హెలికాప్టర్ చక్కర్లు కొట్టనుంది. కన్నెపల్లిలోని లక్ష్మీ పంపుహౌస్ వద్ద భక్తులు విహంగ వీక్షణం చేయడానికి ఏవియేషన్ అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. యాత్రధామ్.ఓఆర్జీ యాప్‌లో ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని, జాయ్‌రైడ్స్, టెంట్‌సిటీ, దేవస్థానం పూజలను ఈ యాప్‌లో పొందుపర్చినట్లు వివరించారు. జాయ్‌రైడ్స్ బుకింగ్ కోసం ఒక్కరికి రూ.4,500తో 6 – 7 నిమిషాల పాటు గాలిలో చక్కర్లు కొట్టనున్నారు. కన్నెపల్లి హెలిపాడ్ వద్ద హెలికాప్టర్ సిద్ధంగా ఉంది. టెంట్‌సిటీకి ఒక రోజుకు రూ.3వేల వరకు తీసుకుంటున్నట్లు ప్రతినిధులు పేర్కొన్నారు. -
పితృ దేవతలకు పిండ ప్రదానాలు
కాటారం: కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతి పుష్కరాల్లో భక్తులు పుష్కర స్నానం, ప్రత్యేక పూజలతో పాటు పిండ ప్రదానాలు, పితృ తర్పణాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పన్నెండేళ్లకు ఒకసారి ఒక్కో నదికి వచ్చే పుష్కరంలో పితృదేవతలకు సమర్పణ ఆనవాయితీగా వస్తోంది. ఒక్కో రాశి బృహస్పతి (గురువు)లో ప్రవేశించడంతో ఒక్కో నదికి ఒక్కో ఏడాది పుష్కరం వస్తుంది. ఇలా 12 నదులకు 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు వస్తుంటాయి. ఈ పుష్కరాల్లో స్నానం ఆచరిస్తే సకల రోగపీడలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. అంతేకాకుండా, తమ కుటుంబంలో కాలం చేసిన పితృదేవతలకు పిండ ప్రదానాలు, పితృ తర్పణాలు సమర్పిస్తే వారి ఆత్మకు శాంతి కలిగి మోక్షం చేకూరుతుందని భక్తులు నమ్ముతారు. ఈ ఏడాది మిథునరాశి బృహస్పతిలో ప్రవేశించడంతో కాళేశ్వరంలో అంతర్వాహినిగా కొనసాగుతున్న సరస్వతి నదికి పుష్కరాలు వచ్చాయి. పన్నెండు రోజుల పాటు కొనసాగనున్న పుష్కర వేడుకలకు తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. త్రివేణి సంగమంలో పుష్కర స్నానం ఆచరించడంతో పాటు పురోహితుల సమక్షంలో పితృదేవతలకు పిండ ప్రదానాలు, పితృ తర్పణాలు చేసి నదిలో సంకల్పాలు చేస్తున్నారు. ప్రతీ పుష్కరంలో నది తీరాన ముప్పై మూడు కోట్ల దేవతలతో పాటు పితృదేవతలు మచ్చ రూపంలో కొలువై ఉంటారని పురోహితులు, వేద బ్రహ్మణులు చెబుతున్నారు. ప్రతీ నది పుష్కరంలో పితృదేవతలకు పిండ ప్రదానాలు, పితృ తర్పణాలు చేయడం వల్ల వారికి మోక్షం కలుగుతుందని పేర్కొంటున్నారు. సరస్వతి నది పుష్కరాల్లో సమర్పణ పుష్కరాల్లో పెద్దలకు సమర్పిస్తే మోక్షం వారి ఆత్మలు శాంతిస్తాయని భక్తుల నమ్మకం -
ప్రపంచంతో పోటీపడేలా ప్రభుత్వ పాలన
కాటారం/కాళేశ్వరం: సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో రాష్ట్రం ప్రపంచంతో పోటీపడేలా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందని, ముక్తీశ్వర స్వామి ఆశీర్వాదం ఉంటే మరింత ముందుకు వెళ్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ, చేనేత, జౌళి, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతి నది పుష్కరాల్లో భాగంగా ఉప ముఖ్యమంత్రి, మంత్రి, ఖమ్మం ఎంపీ రఘురామిరెడ్డి వేర్వేగా శనివారం పుష్కర స్నానం ఆచరించి సరస్వతి అమ్మవారు, కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రి తుమ్మల వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా పుష్కరాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలు ఎంతో పవిత్రమైనవని, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పుష్కర స్నానాలు ఆచరించాలని సూచించారు. రాష్ట్రంలో గోదావరి పుష్కరాలు భారీగా నిర్వహించడానికి ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ రావు, మక్కాన్‌సింగ్, కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ కిరణ్‌ఖరే, అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, భూపాలపల్లి ఆర్డీఓ రవి, దేవాదాయశాఖ ఆర్జేసి రామకృష్ణారావు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. సరస్వతి పుష్కరాల నిర్వహణ భేష్ ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రి తుమ్మల -
ఎడ్ల బండ్లకు పెరిగిన గిరాకీ
భూపాలపల్లి అర్బన్: కాళేశ్వరం పుష్కరాల్లో భాగంగా సరస్వతి ఘాట్ వద్ద ఎడ్ల బండ్లకు గిరాకీ పెరిగింది. శుక్రవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ బురదమయంగా మారాయి. దాంతో బురద రోడ్లపై వాహనాలు ముందుకు సాగక భక్తులు ఇబ్బందులు పడ్డారు. కార్లు, వాహనాలను దూరంగా పార్కింగ్ చేసి కాలినడకన వెళ్లలేక ఎడ్ల బండ్లను ఆశ్రయించారు. ఎడ్లబండ్ల యజమానులు ఒక్కరికి రూ.50 చొప్పున చార్జీ వసూలు చేస్తున్నారు. పట్టణాల నుంచి వచ్చిన భక్తులు ఎడ్ల బండ్లపై ప్రయాణం చేస్తూ సంబురపడుతూ, సెల్ఫీలు తీసుకుంటున్నారు. -
ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించిన కలెక్టర్ రాహుల్, ఎస్పీ కిరణ్
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాల సందర్భంగా మూడో రోజు కాళేశ్వరానికి భక్తుల రద్దీ పెరిగింది. శనివారం వివిధ ప్రాంతాల నుంచి వాహనాల్లో కాళేశ్వరం బయలుదేరగా మహదేవపూర్ – కాళేశ్వరం రహదారిలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈక్రమంలో వాహనాలను క్రమబద్ధీకరించేందుకు కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ బైక్‌పై తిరుగుతూ వాహనాలను పంపించి రూట్ క్లియర్ చేశారు. కాగా, శని, ఆది వారాల్లో భక్తుల రద్దీ తీవ్రంగా ఉంటుందని అంచనా వేసి యంత్రాంగాన్ని వారు అప్రమత్తం చేశారు. -
ఈదురుగాలులతో వర్ష బీభత్సం
భూపాలపల్లి/కాళేశ్వరం: సరస్వతి పుష్కరాలకు లక్షలాది మంది భక్తులు వస్తున్న సమయంలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. కాళేశ్వరంలో శుక్రవారం రాత్రి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో త్రివేణి సంగమం పుష్కర ఘాట్ తీరాన ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు నేలకూలాయి. పలుగుల బైపాస్ రోడ్, బస్టాండ్, వీఐపీ ఘాట్ రోడ్, టెంట్ సిటీ, సరస్వతి మాత విగ్రహం వెనుక, సాధారణ ఘాట్ వద్ద గల భారీ హోర్డింగ్‌లు, ఫ్లెక్సీ కటౌట్లు కూలిపోయాయి. రాత్రివేళ ఈదురుగాలులు వీయడంతో ఎటువంటి ప్రమాదమూ వాటిళ్లలేదు. 120 ఎకరాల్లో ఉన్న పార్కింగ్ స్థలాలు రేగడి భూముల్లో ఉండటంతో వాహనాలను శుక్రవారం ఉదయం వరకు బయటకు తీయలేని పరిస్థితి నెలకొంది. వర్ష బీభత్సం జరిగిన వెంటనే రాత్రి కలెక్టర్ రాహుల్ శర్మ పలు ప్రాంతాలను సందర్శించారు. శనివారం ఉదయం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ, మరమ్మతు పనులు చేపట్టారు. ఫాస్ట్ –5 ఫైనల్లో గెలుపొందిన మేడ్చల్ బాలికల టీం -
రైల్వే లోకోపైలెట్ల గైర్హాజరుతో పది రైళ్లు రద్దు
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్ కేంద్రంగా ప్రయాణిస్తున్న పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు, పుష్పుల్ ప్యాసింజర్ రైళ్లను లోకోపైలెట్ల గైర్హాజరుతో రద్దు చేసినట్లు రైల్వే అధికారులు శనివారం తెలిపారు. లోకో పైలెట్లు డిపార్ట్మెంటల్ పరీక్షలు రాస్తున్నందున ప్యాసింజర్ రైళ్లను నడిపించే వారి కొరత ఏర్పడిందని, దాంతో పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను సికింద్రాబాద్ అధికారులు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. కాగా, పలు రైళ్ల రద్దుతో పాటు వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీ వ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పుష్ పుల్ ప్యాసింజర్ రైళ్లు రద్దు కావడంతో ఎక్స్‌ప్రెస్ రై ళ్లలో వెళ్లలేక సామాన్యులు ఇక్కట్లు పడుతున్నారు. రద్దయిన ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఈనెల 16 నుంచి 19వ తేదీ వరకు కాజీపేట – బల్లార్షా (17035) వెళ్లే ఎక్స్‌ప్రెస్, ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు బల్లార్షా – కాజీపేట (17036) వెళ్లే ఎక్స్‌ప్రెస్, కాజీపేట – సిర్పూర్ కాగజ్‌నగర్ (17003) వెళ్లే ఎక్స్‌ప్రెస్, బల్లార్షా – కాజీపేట (17004) వెళ్లే ఎక్స్‌ప్రెస్‌లు. నిలిచిన పుష్పుల్ ట్రైన్స్ ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు సికింద్రాబాద్ – వరంగల్ (67761) వెళ్లే పుష్పుల్, వరంగల్ – సికింద్రాబాద్ (67762) పుష్పుల్, సికింద్రాబాద్ – కా జీపేట (67763) పుష్పుల్, కాజీపేట – సికింద్రాబాద్ (67764) పుష్పుల్, డోర్నకల్ – కాజీపేట (67766) పుష్పుల్, కాజీపేట డోర్నకల్ (67765) పుష్పుల్ రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వివరించారు. క్రైం ఏసీపీగా కిరణ్‌కుమార్ బాధ్యతల స్వీకరణ రామన్నపేట: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ క్రైం విభాగం నూతన ఏసీపీగా కిరణ్‌కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కిరణ్‌కుమార్‌ను అధికారులు, సిబ్బంది కలిసి అభినందనలు తెలిపారు. -
డిప్యూటీ సీఎం కాలసర్ప పూజలు
హోరాహోరీగా నెట్‌బాల్ పోటీలుకాటారం/కాళేశ్వరం: సరస్వతి పుష్కరాల్లో భాగంగా సరస్వతి ఘాట్ వద్ద రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తన సోదరుడు మల్లు ప్రసాద్‌తో కలిసి శనివారం తమ పితృదేవతలకు పిండప్రదానం చేశారు. అనంతరం పుష్కర స్నానం ఆచరించి కాళేశ్వర ముక్తీశ్వర ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భట్టికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కుటుంబ సమేతంగా స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కాలసర్ప నివారణ పూజలు, స్వామి వారికి క్షీరాభిషేకం చేశారు. ఆలయ పురోహితులు వేద మంత్రోచ్ఛరణల మధ్య డిప్యూటీ సీఎం దంపతులకు ఆశీర్వచనం చేసి స్వామి వారి ప్రసాదం అందజేశారు. -
సరస్వతి నదిలో మూడోరోజు లక్షన్నర మంది స్నానాలు
నదీహారతికి భక్తుల తాకిడి.. సరస్వతి ఘాట్‌లో రాత్రి కాశీపండితులు ఏర్పాటు చేసిన నవరత్నమాలిక (నదీహారతి) హారతికి భక్తులు భారీగా వచ్చారు. ఏడు గద్దెలపై ఏర్పాటు చేసిన విద్యుత్ వెలుగుల్లో ప్రత్యేకంగా తొమ్మిది హారతులు ఇచ్చారు.భూపాలపల్లి/కాళేశ్వరం: సరస్వతి నదికి జనం పుష్కర హారతి పట్టారు. సరస్వతి నది పుష్కరాల్లో భాగంగా శనివారం మూడో రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి భారీగా భక్తులు కాళేశ్వరానికి పోటెత్తారు. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతి నదిలో పుష్కర పుణ్యస్నానాలు ఆచరించారు. పిండప్రదాన పూజలు చేశారు. పితృ దేవతలకు తర్పనాలు నిర్వహించారు. నదీమాతకు చీర, సారెను సమర్పించారు. ముత్తయిదువలు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ట్రాఫిక్‌తో ఇబ్బందులు.. శుక్రవారం రాత్రి గాలి దుమారం, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం రెండు గంటలపాటు దంచి కొట్టింది. దీంతో కాళేశ్వరంలోని పుష్కరాల ఫ్లెక్సీ బోర్డులు, భారీ హోర్డింగ్‌లు నేలమట్టమయ్యాయి. సరస్వతి ఘాట్‌లో ఏర్పాటు చేసిన స్టాళ్లు, చలువ పందిళ్లు, డార్మెటరీ హౌస్ టెంట్లు కూలిపోయాయి. 120 ఎకరాల నల్లరేగడి భూముల్లో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలు బురదగా మారి వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఇప్పలబోరు, బస్టాండ్ సమీపంలో పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. మంత్రి శ్రీధర్‌బాబు పరిస్థితులను పర్యవేక్షించి వెంటనే అధికారులతో మరమ్మతులు చేయించారు. శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామికి పూజలు.. తెల్లవారుజామునుంచి భారీగా భక్తులు త్రివేణి సంగమంలోని సరస్వతి నదిలో పుష్కర స్నానాలు ఆచరించారు. శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయంలో క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. గంటల తరబడి నిలబడి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. శనివారం ఒక్కరోజు లక్షన్నర మంది వరకు భక్తులు పుష్కర స్నానాలు చేసి, దర్శనాలు చేసుకున్నట్లు అంచనా. క్యూలైన్లో మంచిర్యాలకు చెందిన భక్తుడు సొమ్మసిల్లిపోయాడు. అతడిని అక్కడే ఉన్న వ్యక్తులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. – పుష్కరాల మరిన్ని వార్తలు, ఫొటోలు 8, 9లోuప్రముఖుల పూజలు.. పుష్కరాలకు ప్రముఖుల తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శుక్రవారమే పుష్కరస్నానం ఆచరించగా శనివారం పితృదేవతలకు పిండప్రదానం చేశారు. అదేవిధంగా రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్, తుని తపోవనం పీఠాధిపతి సచ్చిదానందసరస్వతిస్వామి పుష్కర స్నానాలు చేశారు. స్వామివారి ఆలయంలో అభిషేకాలు, పూజలు చేశారు. -
భక్తులకు ట్రాఫిక్ కష్టాలు..
భూపాలపల్లి అర్బన్: కాళేశ్వరం సరస్వతి నది పుష్కరాల నేపథ్యంలో భాగంగా మూడో రోజు శనివారం ఉదయం నుంచే వాహనాల రద్దీ పెరిగింది. దీంతో ఉదయం 9గంటల నుంచి భక్తులకు ట్రాఫిక్ కష్టాలు మొదలయ్యాయి. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు కార్లు, ఆటోలు, బస్సులలో భక్తులు కాళేశ్వరం వస్తున్నారు. కాళేశ్వరం నుంచి మహదేవపూర్ మండలం కూదురువెళ్లి వరకు సుమారు 11 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. ట్రాఫిక్ అంతరాయం కలగడం వలన ఎండ వేడిమికి అల్లాడిపోయారు. ఉక్కపోత భరించలేక వాహనాలు దిగి అడివిలో చెట్ల కింద కూర్చొని కొందరు సేదదీరగా.. మరికొందరు చేసేదేమీ లేక భక్తులు కాలినడకన రోడ్డువెంట బారులుదీరారు. మార్గమధ్యలో అధికారులు భక్తుల సౌకర్యార్థం తాగునీటి సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. గంటల తరబడి రోడ్డుపై పడిగాపులు కాచిన మహిళలు, చిన్నారులు నిరసించిపోయారు. 11 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు అడవిలో తాగునీరులేక ఇబ్బందులు కాలినడకన సరస్వతి ఘాట్‌కు.. -
సర్టిఫికెట్ల ప్రదానం
భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని సింగరేణి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు శనివారం సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఏరియా జీఎం రాజేశ్వర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అందించారు. సోలార్ 24మంది, డ్రోన్ 29మంది శిక్షణ తీసుకున్నారు. వృత్తి శిక్షణ పూర్తిచేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందించి జీఎం మాట్లాడారు. నిరుద్యోగ యువతి, యువకులకు ఉపయోగపడుతుందన్నారు. భవిష్యత్‌కు బాటలువేసే విధంగా ఉంటుందన్నారు. స్వయంగా వారే ఉపాధి పొందే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు కవీంద్ర, మారుతి, రామన్ పాల్గొన్నారు. -
తాగునీరు లేక కష్టాలు..
గంటల తరబడి వాహనాలు ఇరుక్కుపోయి ఎండ వేడిలో ఇబ్బంది పడ్డాం. అధికారులు మార్గమధ్యలో తాగునీటి సౌకర్యాలు కల్పించాలి. వెంట తీసుకువచ్చిన తాగునీరు అయిపోయాయి. సకాలంలో దర్శనం చేసుకొని భోజనం చేయాల్సి ఉండగా ట్రాఫిక్ జామ్ కావడంతో ఆకలితో అలమటించాం. – సురేందర్‌రెడ్డి, సిరిసిల్ల 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాం.. ఉదయం 11.30గంటలకు ఆర్టీసీ బస్సులో వచ్చి ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయాం. ట్రాఫిక్ జామ్ నుంచి బస్సు కాళేశ్వరానికి రావడానికి రెండు, మూడు గంటల సమయం పడుతుందనడంతో ఐదు కిలోమీటర్ల దూరం నుంచి నడుకుంటూ వచ్చాం. అధికారులు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలి. – చందు, భద్రాచలం -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
భూపాలపల్లి అర్బన్: సరస్వతి పుష్కరాలకు నేడు(ఆదివారం) భక్తులు కాళేశ్వరం అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్‌శర్మ అధికారులను ఆదేశించారు. పుష్కర ఘాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, ఆరోగ్య సేవలు, తాగునీరు, పారిశుద్ధ్యం ఏర్పాట్లపై శనివారం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ.. అవసరమైన చోట అదనపు సిబ్బందిని నియమించాలని సూచించారు. శని వారం వచ్చిన వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని అలాంటి సమస్య రాకుండా పకడ్బందీ గా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించా రు. తెల్ల వారుజాము నుంచే భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. అధికారులు వారికి కేటా యించిన విధుల్లో నిమగ్నం కావాలన్నారు. ఆర్టీసీ బస్సుల్లో 10వేల మంది తరలింపు భూపాలపల్లి అర్బన్: సరస్వతి పుష్కరాల్లో భాగంగా మూడో రోజు శనివారం వివిధ ప్రాంతాల నుంచి కాళేశ్వరానికి 183 ఆర్టీసీ బస్సుల్లో 10,500మందిని తరలించినట్లు అధికారులు తెలిపారు. కాళేశ్వరం నుంచి సాయంత్రం 6గంటల వరకు 170 బస్సులో 7,500మంది తిరిగి వెళ్లినట్లు తెలిపారు. మూడో రోజు అన్నదానం భూపాలపల్లి రూరల్: సరస్వతి పుష్కరాల సందర్భంగా కాళేశ్వరం వచ్చే భక్తులకు భూపాలపల్లి మండలం కమలాపూర్ క్రాస్ వద్ద జాతీయ రహదారి పక్కన భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు ఆధ్వర్యంలో మూడోరోజు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే భక్తులకు భోజనం వడ్డించారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో కమలాపూర్ మాజీ సర్పంచ్ తోట సంతోష్, భూపాలపల్లి మాజీ కౌన్సిలర్ సిరుప అనిల్, అప్పం కిషన్, తోట రంజిత్, మహేందర్, చరణ్, కోటి, హఫీజ్, సాయితేజ పాల్గొన్నారు. విద్యుదాఘాతంతో ఐదు పాడిగేదెల మృతి భూపాలపల్లి రూరల్: విద్యుదాఘాతంతో ఐదు పాడిగేదెలు మృతి చెందిన ఘటన శనివారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని భాస్కర్‌గడ్డలో చోటుచేసుకొంది. గ్రామస్తులు, కాపరి సాగర్ల సమ్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. భాస్కర్గడ్డకు చెందిన కొడారి ఓదెలుకు, బోయిని రమేష్‌కు చెందిన గేదెలను గ్రామ శివారు పొలాల్లోకి మేతకు తీసుకువెళ్లాడు శుక్రవారం కురిసిన వర్షానికి 11 కేవీ లైన్విద్యుత్ తీగలు తెగి పొలాల్లో పడి ఉన్నాయి. కొడారి ఓదెలుకు చెందిన నాలుగు గేదెలు, బోయిని రమేష్‌కు చెందిన ఒక గేదె తీగలకు తగిలి అక్కడికక్కడే మృతిచెందాయి. దీంతో అప్రమత్తమైన కాపరి మిగతా గేదెలను అటు వెళ్లకుండా అడ్డుకున్నాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. పాడి వృత్తినే జీవనోపాధిగా జీవించే బాధిత కుటుంబాల సభ్యులు మృతిచెందిన గేదెల వద్ద రోదించిన తీరు పలువురికి కన్నీరు తెప్పించింది. మృతిచెందిన గేదెల విలువ రూ.4.50లక్షలు ఉంటుందని, ప్రభుత్వం విద్యుత్‌శాఖ అధికారులు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. టోల్ వసూళ్ల నిలిపివేత కాటారం: కాళేశ్వరం వచ్చే వాహనాలకు గ్రామపంచాయతీ టెండర్ ద్వారా వసూలు చేస్తున్న టోల్ ఫీజును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్‌శర్మ శనివారం తెలిపారు. సరస్వతి పుష్కరాల నేపథ్యంలో శనివారం నుంచి భక్తుల వాహనాల రాక విపరీతంగా పెరిగిపోయింది. కాళేశ్వరం ప్రారంభంలోని ముక్తివనం వద్ద టెండర్‌దారులు వాహనాలను నిలిపి టోల్‌ఫీజు వసూలు చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పరిస్థితిని పరిశీలించిన కలెక్టర్ వాహనాలను నిలిపి టోల్‌ఫీజు వసూలు చేయవద్దని టెండర్‌దారులను ఆదేశించారు. వాహనదారులు టోల్‌ఫీజు చెల్లించవద్దని సూచించారు. -
ఎండలో ఇబ్బంది పడ్డాం..
శనివారం తెల్లవారు జామున యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నుంచి భార్యభర్తలిద్దరం కాళేశ్వరం పుష్కర స్నానానికి బయలుదేరాం. ఉదయం 10.30గంటల నుంచి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాం. బస్సులో ఎండ వేడి బరించలేకుండా ఉంది. తాగునీరు, భోజనం లేక ఇబ్బంది పడ్డాం. – లత, ఆలేరు, యాదాద్రి భువనగిరి ట్రాఫిక్‌ను నియంత్రించాలి.. పోలీస్, అధికార యంత్రాంగం ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలి. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వలనే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. రహదారి వెంట పోలీసులను ఏర్పాటు చేయాలి. రోడ్డుపై వాహనాలు ఒకే వరుసగా వెళ్లే విధంగా చూడాలి. – సతీష్, డ్రైవర్, కరీంనగర్ -
ఉమ్మడి జిల్లా రైల్వే ప్రాజెక్ట్‌ల సర్వేకు నిధులు
కాజీపేట రూరల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు రైల్వే ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి సంబంధించిన ఫైనల్ లొకేషన్ సర్వేకు 2025–26 ఆర్థిక సంవత్సరం సంబంధించిన కన్సాలిడేటెడ్ బడ్జెట్లో కెటాయింపు చేసినట్లు శనివారం రైల్వే అధికారులు తెలిపారు. ఏ ప్రాజెక్టుకు ఎంత అంటే.. ● పెండ్యాల్–హసన్‌పర్తి బైపాస్‌లైన్ పైనల్ లొకేషన్ సర్వేకు రూ.64 లక్షలు, డోర్నకల్–మణుగూర్ డబ్లింగ్ 104 కి.మీ థర్డ్‌లైన్ సర్వే కోసం రూ.2.08 కోట్లు, సికింద్రాబాద్–కాజీపేట మధ్య మూడవ లైన్ సర్వేకు రూ.1.56 కోట్లు కేటాయించారు. ● సికింద్రాబాద్–కాజీపేట వరకు 85,48 కి.మీ డబ్లింగ్ లైన్ సర్వే కోసం రూ.1.71 కోట్లు, కాజీపేట–విజయవాడ క్వార్డర్ అఫ్లింగ్ 220 కి.మీ సర్వేకు రూ.4.40 కోట్లు, కాజీపేట–బల్లార్షా క్వార్డర్ అప్ లింగ్ 234 కి.మీ సర్వేకు రూ.4.68 కోట్లు, కాజీపేట–సికింద్రాబాద్ క్వార్డర్ అఫ్లింగ్ 120 కి.మీ రూ.2.40 కోట్లు, భూపాలపల్లి–కాజీపేట (హసన్‌పర్తి) కొత్తలైన్ 64 కి.మీ ఫైనల్ సర్వేకు రూ.1.60 కోట్లు ఇచ్చారు. ● ఘన్పూర్–రఘునాథ్‌పల్లి 17,2 కి .మీ మూడవ, నాల్గవ లైన్ సర్వేకు రూ.0.34 లక్షలు, మణుగూరు–రామగుండం కొత్త లైన్ సర్వేకు రూ.5 కోట్లు, కాజీపేట–ఘన్పూర్ మధ్య 21.25 కి.మీ మూడవ రైల్వే లైన్ సర్వేకు రూ.43 లక్షలు కేటాయింపులు చేశారు. ● వరంగల్ స్టేషన్ సమీపంలో కి.మీ. రైల్ ఓవర్ రైల్ (ఆర్వోఆర్) మంజూరుకు రూ.10 లక్షలు, కాజీపేట–వరంగల్ రూట్లో బైపాస్లైన్లో రైల్ ఓవర్ రైల్ (ఆర్వోఆర్)కు రూ. 75లక్షలు, డోర్నకల్‌లో 15 కి.మీ. ఆర్వోఆర్ సర్వేకు రూ.30 లక్షలు మంజూరు చేశారు. ● సికింద్రాబాద్–కాజీపేట మధ్య ప్రిలిమినరీ ఇంజనీరింగ్ కమ్ ట్రాఫిక్ 134 కి.మీ మూడవ లైన్ సర్వేకు రూ.52 లక్షలు, బల్లార్షా–కాజీపేట ప్రిలిమినరీ ఇంజనీరింగ్ కమ్ ట్రాఫిక్ 234 కి.మీ బల్లార్షా–కాజీపేట మధ్య నాల్గవ లైన్ సర్వేకు రూ.1.17 కోట్లు, కాజీపేట–విజయవాడ మధ్య నాల్గవ లైన్ 219 కి.మీ ప్రిలిమినరీ ఇంజనీరింగ్ కమ్ ట్రాఫిక్ రూ.1.10 కోట్లు నిధులు కేటాయించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ● కాజీపేట రైల్వే వ్యాగన్ షెడ్‌కు సంబంఽధించిన ఈ ఏడాది కావాల్సిన నిధులు కన్సాలిడేటెడ్ బడ్జెట్ కేటాయింపుల్లో పేర్కొనలేదని అధికారులు పేర్కొన్నారు. 2025–26 కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్లో స్పష్టత -
భక్తులకు ఇబ్బందులు కలగొద్దు
కాళేశ్వరం: కాళ్వేరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆయా శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్‌శర్మ అధికారులను అదేశించారు. స్టాళ్లు, టెంట్‌సిటీ, సరస్వతి ఘాట్ వద్ద భక్తులను పుష్కర ఏర్పాట్లు, సౌకర్యాలు, మరుగుదొడ్లు, షవర్స్, ఘాట్స్, వైద్యశిబిరాలు, చలివేంద్రంను అధికారులతో కలిసి కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. కాలినడకన తిరుగుతూ సౌకర్యాల ఏర్పాట్లపై భక్తులతో ఆరాతీశారు. ఈ సందర్భంగా జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఖైదీలు తయారుచేసిన హ్యాండ్ మేడ్ వస్తువుల స్టాల్‌ను కలెక్టర్ ప్రారంభించారు. వివిధ స్టాళ్లు పరిశీలించి వ్యాపారాల గురించి అడిగి తెలుసుకున్నారు. చలివేంద్రాలలో తాగునీటి సరఫరాను పరిశీలించారు. త్రివేణి సంగమం వద్ద భక్తులకు తాగునీటి సరఫరాకు చలివేంద్రం ఏర్పాటుచేయాలని తక్షణమే వాకీటాకీ ద్వారా ఆర్డబ్ల్యూఎస్ ఈఈని ఆదేశించారు. ఈ సందర్భంగా భక్తుల అభిప్రాయాలను తెలుసుకొని అధికారులకు తగిన సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ రాహుల్‌శర్మ మాట్లాడుతూ త్రివేణి సంగమంలో భక్తులు స్నానాలకు వెళ్లే మార్గంలో పిండ ప్రదానం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, దానివల్ల భక్తులు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారన్నారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాటుచేసిన మార్గంలో పిండప్రదానం కార్యక్రమాలు నిర్వహించొద్దని సూచించారు. పిండ ప్రదాన నిర్వహణకు కేటాయించిన ప్రాంతంలో మాత్రమే పిండ ప్రదానాలు చేయాలని సూచించారు. వ్యర్థాలు గ్రామ పంచాయతీ వారు ఏర్పాటుచేసిన డస్ట్ బిన్లలో వేయాలని, త్రివేణి సంగమంలో వేయొద్దని చెప్పారు. భక్తులు నది పవిత్రను కాపాడాలని సూచించారు. జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సరస్వతి ఘాట్ వద్ద ఏర్పాటుచేసిన సెల్ఫీ స్టాల్లో భక్తులతో కలిసి సరదాగా ఫొటోలు దిగారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, పరిశ్రమల శాఖ జీఎం సిద్ధార్థ, డీఆర్డీఓ నరేష్, డీటీ కృష్ణ పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ -
స్టాళ్లను పరిశీలించిన మంత్రి శ్రీధర్‌బాబు
కాళేశ్వరం: సరస్వతినది పుష్కరాల నేపథ్యంలో పుష్కర ఘాట్ల వద్ద భక్తులకు అందుబాటులో ఉండే సదుపాయాలను, సేవలను సమీక్షించేందుకు మంత్రి శ్రీధర్‌బాబు విస్తృతంగా పర్యటించారు. శుక్రవారం ఘాట్ల వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లు, భక్తులకు సరఫరా చేసే తాగునీరు, ఆరోగ్య సదుపాయాలు, భద్రత ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పుష్కరాలకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. రోజురోజుకూ భక్తుల రద్దీ పెరుగుతుందని.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. స్వచ్ఛత, ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, మక్కన్ సింగ్ రాజ్‌ఠాకూర్, పరిశ్రమల శాఖ జీఎం సిద్దార్థ, డీఆర్డీఓ నరేష్ పాల్గొన్నారు.భట్టి విక్రమార్కకు ఘనస్వాగతం భూపాలపల్లి రూరల్: సరస్వతి పుష్కరాల సందర్భంగా కాళేశ్వరం వెళ్తున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఘనస్వాగతం పలికారు. ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాశ్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి శాలువాతో సన్మానించారు. ఎమ్మెల్యే వెంట పార్టీ నాయకులు దాట్ల శ్రీనివాస్, రాజేందర్, టీపీసీసీ సభ్యుడు సల్లూరి మధు, అంబాల శ్రీనివాస్, అప్పం కిషన్, ఉడుత మహేందర్ ఉన్నారుసర్వీస్ బస్సులతో ఊరట భూపాలపల్లి అర్బన్: కాళేశ్వరంలోని తాత్కాలిక బస్టాండ్ ఆవరణ నుంచి సరస్వతి పుష్కరఘాట్ వరకు ఏర్పాటుచేసిన ఉచిత షటిల్ బస్సు సర్వీస్‌లతో భక్తులకు ఊరట కలిగింది. ప్రత్యేక తాత్కాలిక బస్టాండ్ నుంచి సరస్వతి ఘాట్ వరకు సుమారు రెండు కిలోమీటర్ల దూరభారం ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని అధికారులు ముందస్తుగా సింగరేణి సహకారంతో స్కూల్ బస్సులు ఏర్పాటు చేసి భక్తులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. రెండో రోజు అన్నదానం భూపాలపల్లి రూరల్: సరస్వతి పుష్కరాలకు వస్తున్న భక్తుల కోసం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆధ్వర్యంలో భూపాలపల్లి మండలం కమలాపూర్ క్రాస్ జాతీయ రహదారి పక్కన ఏర్పాటుచేసిన ఉచిత అన్నదానం కార్యక్రమం రెండవరోజు భూపాలపల్లి సీఐ నరేష్‌గౌడ్‌తో కలిసి భూపాలపల్లి ఏరియా జీఎం రాజేశ్వర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులకు భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎస్సై రమేష్ పాల్గొన్నారు. స్కావెంజర్ల వేతనాలు విడుదల చేయాలి భూపాలపల్లి అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న స్కావెంజర్ల వేతనాలు విడుదల చేయాలని డెమెక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చిలువేరు అశోక్, ఐత తిరుపతి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించిందన్నారు. గడిచిన విద్యా సంవత్సరంలో ఏడు నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. అతి తక్కువ వేతనంతో పాఠశాలలను శుభ్రం చేసినా ప్రతి నెలా వేతనాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. -
పుష్కర స్నానం.. సకల పాప హరణం
రెండో రోజు సరస్వతి పుష్కరాలకు తరలివచ్చిన భక్తులు భూపాలపల్లి/కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతినది పుష్కరాలకు రెండో రోజు శుక్రవారం భక్తులు పోటెత్తారు. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతినదిలో పుష్కర స్నానాలు ఆచరించారు. నదీమాతకు పండ్లు, పూలు, పాటు, పసుపు, కుంకుమ, చీరె, సారెను సమర్పించారు. దీపాలు వదిలారు. సైకత లింగాలు చేసి ఆరాధన చేశారు. పితృతర్పనాలు, పిండప్రదానాలు చేశారు. బ్రాహ్మణ ముత్తయిదువులు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. భక్తుల కష్టాలు, ఇబ్బందులు తొలగిపోవాలని కోరుతూ కాళేశ్వరాలయంలో సంకష్టహర గణపతి హోమం నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో వేదపండితులు రెండోరోజు హోమాలు, విశేష పూజలు చేశారు. రాత్రి కాశీపండితుల ఆధ్వర్యంలో నదికి నవరత్నమాల హారతి ఇచ్చారు. గోదావరి, ఆలయ పరిసరాల్లో కిటకిట.. శుక్రవారం తెల్లవారుజామునుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లనుంచి తరలివచ్చిన భక్తజనంతో గోదావరి తీరం, ఆలయం కిక్కిరిసింది. ఉదయంనుంచి 10గంటలలోపు భక్తులు పలుచగా ఉండగా, మధ్యాహ్నం వరకు రద్దీ పెరిగింది. నిండిన పార్కింగ్ స్థలాలు, చలువ పందిళ్లు.. ఆర్టీసీ బస్సులు, ట్రావెల్స్, ప్రైవేటు వాహనాల్లో భక్తులు తరలిరావడంతో పార్కింగ్ స్థలాలు కిటకిటలాడాయి. వరంగల్, భూపాలపల్లి మీదుగా తరలి వస్తున్న భక్తులు, వాహనాలను వీఐపీఘాట్, ఇప్పలబోరు వైపు పార్కింగ్‌లకు పోలీసులు తరలించారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మంచిర్యాల వైపునుంచి వచ్చే వాహనాలను బస్టాండ్ సమీపంలోని పార్కింగ్ స్థలం వద్ద నిలిపివేస్తున్నారు. అక్కడినుంచి ఘాట్ వరకు భక్తుల సౌకర్యార్థం ఉచిత ఆర్టీసీ షెటిల్ బస్సులు ఏర్పాటు చేశారు. స్థానిక ఆటోలకు కూడా అనుమతివ్వడంతో భక్తులను పార్కింగ్ స్థలాలనుంచి సరస్వతి ఘాట్, అక్కడినుంచి ఆలయానికి తరలిస్తున్నారు. ఎండ వేడిమి అధికంగా ఉండడంతో భక్తులు చలువ పందిళ్లకింద సేదదీరడం కనిపించింది. వీకెండ్స్‌లో పెరగనున్న భక్తుల తాకిడి.. శని, ఆదివారాల్లో భక్తుల తాకిడి రెట్టింపుస్థాయిలో ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం గోదావరి తీరం వద్ద ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు శుక్రవారం వచ్చిన భక్తులతోనే నిండాయి. శని, ఆదివారాల్లో లక్షమందికిపైగా భక్తులు రానున్నట్లు అంచనా. ఈ మేరకు అధికారులు మరిన్ని ఏర్పాట్లు చేస్తే ఇబ్బందులు ఉండవని, లేనిపక్షంలో ఎండకు మాడిపోవాల్సిందేనని భక్తులు అంటున్నారు. వీఐపీల రాక.. రెండవ రోజు సరస్వతినదిలో పలువురు ప్రముఖులు పుష్కర స్నానం ఆచరించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, జైళ్లశాఖ డీజీ సౌమ్యమిశ్రా, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, భూపాలపల్లి ఇన్చార్జ్ జడ్జి పట్టాభిరాంలు వేర్వేరుగా పుష్కర స్నానాలు చేసి, శ్రీకాళేశ్వరముక్తీశ్వరున్ని దర్శించుకున్నారు. ● పుష్కర స్నానం చేసిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వీఐపీలుపుష్కరాల మరిన్ని వార్తలు, ఫొటోలు II, IIIలో.. సుమారు 80వేల మంది వరకు పుణ్యస్నానాలు ఆచరణ కిటకిటలాడిన సరస్వతి ఘాట్, దేవస్థానం -
భక్తుల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు
కాళేశ్వరం: సరస్వతి పుష్కరాల నేపథ్యంలో కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు పెద్దఎత్తున దర్శనానికి వస్తున్న సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ కిరణ్‌ఖరే సిబ్బందికి సూచించారు. దేవాలయంలో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి శుక్రవారం ఆయన మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ కిరణ్ ఖరే మాట్లాడుతూ భక్తులతో మర్యాదగా వ్యవహరించాలని, ఓపికగా విధులు నిర్వహించాలని, తొక్కిసలాట జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్పీ కిరణ్ ఖరే -
ఆర్టీసీ అత్యుత్సాహం
కాటారం: కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతి పుష్కరాల నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు, డ్రైవర్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఐదు మండలాలకు ప్రధాన కూడలి అయిన కాటారం మండలకేంద్రంలో పలు డిపోలకు చెందిన ఆర్టీసీ బస్సులను ఆపకుండా డ్రైవర్లు ప్రయాణికులను, భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కాళేశ్వరం పుష్కరాల కోసం కరీంనగర్ నుంచి వచ్చే భక్తులు డైరెక్ట్ బస్సులు లేకపోతే కాటారంలో బస్సు దిగి కాళేశ్వరం వైపుగా వెళ్లే బస్సు ఎక్కాల్సి వస్తుంది. కాటారం, మహాముత్తారం, మల్హర్ మండలాలకు చెందిన ప్రయాణికులు, భక్తులు సైతం కాటారం ప్రధాన కూడలిలో బస్సు ఎక్కి మహదేవపూర్, కాళేశ్వరం వెళ్లాల్సి ఉంటుంది. భూపాలపల్లి, మంథని, కరీంనగర్, వరంగల్, గోదావరిఖని డిపోలకు చెందిన ఆర్టీసీ బస్సులు కాటారంలో నిలపడం లేదని భక్తులు, ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పుష్కరాల స్పెషల్ అని బోర్డు పెట్టుకున్న బస్సులతో పాటు సాధారణ పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులు సైతం స్టాఫ్ లేదంటున్నారని భక్తులు తెలుపుతున్నారు. దీంతో గంటల తరబడి ఎర్రటి ఎండలో రహదారిపై నిల్చొని బస్సుల కోసం చేతులు అడ్డుపెట్టాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు ప్రైవేట్ వాహనాల్లో అధిక ధర చెల్లించి వెళ్లాల్సి వస్తుందని వారు పేర్కొన్నారు. సాధారణ సమయంలో నిత్యం కాటారంలో ఆర్టీసీ బస్సులు నిలిపే అధికారులు ఇప్పుడు ఎందుకు ఆపడం లేదని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. మహదేవపూర్, కాళేశ్వరం వెళ్లే ప్రయాణికులు ఎలా వెళ్తారని వారు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. భూపాలపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ హిందును సాక్షి వివరణ కోరడానికి ప్రయత్నించగా స్పందించలేదు. కాటారంలో నిలపని ఆర్టీసీ బస్సులు భక్తులు, ప్రయాణికుల ఇబ్బందులు -
పుష్కరాల నిధులు ఏమయ్యాయి..?
కాళేశ్వరం: సర్వసతి పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసినప్పటికీ అభివృద్ధి పనులన్నీ అసంపూర్తిగా ఉండి భక్తులు ఇబ్బందులు పడుతున్నారని.. అసలు ప్రభుత్వం మంజూరు చేసి న నిధులు ఏమైయ్యాయో తెలిపాలని బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని, అధికారులను ప్రశ్నించారు. శుక్రవారం కాళేశ్వరంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడారు. నాలుగు రాష్ట్రాల నుంచి లక్షల్లో భక్తులు వస్తారని అంచనా వేసిన అధికారులు సామాన్య భక్తుల కోసం పుష్కరఘాట్ల వద్ద భక్తులకు డ్రెస్సింగ్ రూమ్స్ కూడా ఏర్పాటు చేయలేకపోవడం సిగ్గుచేటన్నారు. వీఐపీ ఘాట్‌లో మాత్రం సౌకర్యవంతమైన డ్రెస్సింగ్ రూమ్‌లు, గుడారాలు ఏర్పాటు చేసుకున్నారన్నారు. ఎండాకాలం నేపథ్యంలో భక్తులు కొంతసేపు సేదదీరడానికి టెంట్లు కూడా వేయలేదని చెప్పారు. కనీసం తాగునీరు కూడా లేని పరిస్థితి ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకే కాంట్రాక్టులు ఇచ్చి అరకొరగా పనులు చేయించారని, నిధులు ఫుల్, పనులు మాత్రం నిల్ అన్న చందంగా పుష్కరాల్లో పనులు కనిపిస్తున్నాయన్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్, కాళేశ్వరం ఈఓలను కలిసి కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి, బీజేపీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు నిశిధర్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి చంద్రుపట్ల కీర్తిరెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు చల్ల నారాయణరెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు రాంశెట్టి మనోజ్, పగే రంజిత్, పూర్ణచందర్, శ్రీకాంత్, జిల్లా కౌన్సిల్ నెంబర్ ఆకుల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి సురేఖ వ్యాఖ్యల కలకలం!
సాక్షి, వరంగల్: వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారాన్ని లేపాయి. ‘మంత్రుల వద్దకు క్లియరెన్స్ కోసం కొన్ని ఫైల్స్ వస్తాయి. మామూలుగా మంత్రులు డబ్బులు తీసుకొని వాటిని క్లియరెన్స్ చేస్తుంటారు. మేం మాత్రం మాకు నయాపైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. సామాజిక బాధ్యతగా స్కూల్‌ను అభివృద్ధి చేయాలని కోరాం’ అని ఆమె వరంగల్‌లోని కృష్ణా కాలనీ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో గురువారం జరిగిన నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొండా సురేఖ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆమెకు థ్యాంక్స్ అని చెప్పి, మొత్తానికి కొండా సురేఖ నిజాలు బయటపెట్టారని, కాంగ్రెస్ కమీషన్ సర్కార్ నడుపుతోందని ఎక్స్ వేదికగా పోస్టు చేయడంతో మరోసారి ఓరుగల్లు కేంద్రంగా రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. ‘వరంగల్‌లో తాను చేసిన వ్యాఖ్యలపై కొంతమంది పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ పనిచేయడానికి అయినా అప్పటి మంత్రులు పైసలు తీసుకునేవారని నేను మాట్లాడినా. అవి అక్షర సత్యం కూడా. ఆ మాటలకి నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నా. మా ప్రభుత్వం అద్భుతంగా పరిపాలన చేస్తుంటే ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు తమ పెయిడ్ సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం చేసే కుట్ర చేస్తున్నారు. అందులో భాగంగానే ఆ వీడియోలో నా వ్యాఖ్యల్ని ముందు వెనుక కొంత తీసేసి, మిగతా కొంత పార్ట్‌ను కావాలనే హైలెట్ చేయడం వెనుక ఉన్న కుట్ర ఇది’ అని ఆమె మీడియాతో మాట్లాడి వివాదానికి ఫుల్స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. గతంలోనూ పలు వివాదాలు.. ● గతంలోనూ నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు చేసి పరువు నష్టం దావాలు మంత్రి కొండా సురేఖ ఎదుర్కొంటున్నారు. ● గతేడాది దసరాకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో మొదలైన వివాదంలో ముగ్గురు కొండా వర్గీయులను పోలీసులు అరెస్టు చేయగా.. మంత్రి కొండా సురేఖ నేరుగా గీసుకొండ పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం అప్పుడు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ● వేములవాడ రాజన్న కోడెల విషయంలోనూ మంత్రి అనుచరుడికి అప్పనంగా కట్టబెట్టారని గీసుకొండ ఠాణాలో కేసు నమోదు కావడం కూడా గతేడాది డిసెంబర్లో వివాదమైంది. ● తాజాగా మంత్రులపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఏకంగా రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్ అయ్యాయి. పైసలిస్తేనే మంత్రుల వద్ద ఫైల్స్ క్లియరవుతాయని కామెంట్ ఇదీ కమీషన్ల సర్కార్ అని మాజీ మంత్రి కేటీఆర్ కౌంటర్ కావాలనే తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారన్న మంత్రి సురేఖ గత బీఆర్ఎస్ మంత్రులనుద్దేశించి అన్నానని స్పష్టత -
కాళేశ్వరం కమిషన్ నిర్ణయం.. వారిని బహిరంగ విచారణకు పిలవొద్దు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది. బహిరంగ విచారణకు పొలిటికల్ లీడర్లను విచారణకు పిలువొద్దని కమిషన్ సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో కేసీఆర్, హరీష్‌రావు, ఈటల రాజేందర్‌కు ఊరట లభించినట్లైంది. లీగల్ సమస్యలు రాకూడదనే ఉద్దేశ్యంతో వారిని విచారణకు పిలవకూడదని నిర్ణయం తీసుకుంది. డాక్యుమెంట్ ఆధారాలతో కమిషన్ ఫైనల్ రిపోర్ట్ ఇవ్వనుంది. దాదాపు 4వందల పేజీల రిపోర్ట్‌ను కమిషన్ తయారు చేసింది. ఈ నెల 20వ తేదీ తర్వాత ప్రభుత్వానికి కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ రిపోర్ట్ ఇవ్వనుంది.కాగా, కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కోసం కమిషన్ గడువును ఈ నెల 31 వరకు తెలంగాణ ప్రభుత్వం పొడిగించిన సంగతి తెలిసిందే. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణంలో లోపాలపై విచారణ కోసం ప్రభుత్వం గత ఫిబ్రవరిలో కమిషన్‌ను నియమించగా, 100 రోజుల్లో నివేదిక సమర్పించాలని సూచించింది. ఆ తర్వాత క్రమంగా కమిషన్ గడువును పొడిగిస్తూ వచ్చింది. రిపోర్ట్ రెడీ కాకపోవడంతో గడువును మే 31 వరకు ప్రభుత్వం పొడిగించింది. -
నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి
భూపాలపల్లి అర్బన్: 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా విభజించి కార్మిక హక్కులను బీజేపీ ప్రభుత్వం హరించి వేస్తుందని, నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దుచేయాలని సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఏరియాలోని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు–3లో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, టీబీజీకేఎస్, ఐఎఫ్టీయూ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన గేట్‌మీటింగ్‌లో ఆయా సంఘాల నాయకులు రాజ్‌కుమార్, మంద నర్సింగరావు, పసునూటి రాజేందర్, బడితెల సమ్మయ్య ముఖ్యఅతిథులు పాల్గొని మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నో సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను విభజించి కార్మిక సంఘాలు ఉండవదనే ధోరణిలో బీజేపీ చట్టం చేసిందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. సింగరేణిలో నూతన గనులు ఏర్పాటు చేయకుండా తల్లిలాంటి సింగరేణిని బీజేపీ ప్రభుత్వం మోసంచేస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ నెల 20న బీఎంఎస్ మినహా ఐదు జాతీయ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే దేశవ్యాప్త సమ్మెను అన్ని వర్గాల కార్మికులు, మేధావులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాతీయ సంఘాల నాయకులు మోటపలుకుల రమేష్, మధుకర్‌రెడ్డి, రాజయ్య, రాంచందర్, సుధాకర్‌రెడ్డి, మధుకర్‌రెడ్డి, సమ్మిరెడ్డి, విజేందర్, శంకర్, పాశం పాల్గొన్నారు. -
కాళేశ్వరం శాశ్వత అభివృద్ధికి తోడ్పాటు : సీఎం రేవంత్‌రెడ్డి
మంత్రి శ్రీధర్‌బాబు కోరినట్లుగా కాళేశ్వరం శాశ్వత అభివృద్ధికి తోడ్పాటును అందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మాస్టర్ ప్లాన్ తయారు చేసి నివేదించాలని మంత్రి కొండా సురేఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్‌ను సీఎం కోరారు. పుష్కర ఏర్పాట్లపై సీఎం సంతృప్తి వ్యక్తం చేసి మంత్రి శ్రీధర్‌బాబును, అధికారులను అభినందించారు. మంత్రులు ఏమన్నారంటే.. ● మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ రాబోయే గోదావరి పుష్కరాల్లోగా కాళేశ్వర అభివృద్ధికి రూ.100 కోట్ల నిధుల మంజూరుతోపాటు పర్యాటక క్షేత్రంగా ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. ఇప్పటికే రూ.35కోట్లు మంజూరు చేశారని సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ● దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి సీఎం ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. రానున్న గోదావరి, కృష్ణ ఫు ష్కరాలతో పాటు సమ్మక్క–సారలమ్మ జాతరను విజయవంతం చేస్తామని అన్నారు. ● రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీని వాస్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్థిక లోటుపాట్లతో ఉన్నప్పటికి పుష్కర ఏర్పాట్లు ఘనంగా చేశామన్నారు. ● రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పన్నెండేళ్లకు ఓసారి వచ్చే సరస్వతిమాత పుష్కర స్నానాలను భక్తులు ఆచరించాలని సూచించారు. – మరిన్ని పుష్కర వార్తలు, ఫొటోలు 8,9లోu -
ముహూర్తం ప్రకారం 5.44 గంటలకు..
జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో సరస్వతినది పుష్కరాలను వేదపండితులు శాస్త్రోకంగా గణపతిపూజతో ప్రారంభించారు. గురువారం తెల్లవారుజామున 5.44గంటలకు కాళేశ్వరంలోని సరస్వతిఘాటుకు చేరుకొని ముహూర్తం ప్రకారం గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతి నదికి విశేష పూజలు నిర్వహించారు. మెదక్ జిల్లా రంగంపేటకు చెందిన పీఠాధిపతి మాధవానందసరస్వతిస్వామి ముందుగా పుష్కరునికి ఆహ్వాన పూజ చేశారు. పండితులు సరస్వతిమాతకు పూలు, పండ్లు, పాలు, చీరసారెతో నైవేద్యం సమర్పించారు. మాధవా నందసరస్వతిస్వామి పుష్కరినిలో స్నానం ఆచరించి ప్రారంభించారు. అదేవిధంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఆయన సతీమణి, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, దేవాదాయ కమిషనర్ వెంకట్రావు, కలెక్టర్ రాహుల్‌శర్మ, ఆర్జేసీ రామకృష్ణారావు, ఈఓ మహేశ పుష్కర ప్రారంభ స్నానాలు ఆచరించారు. అనంతరం వేదపండితులు ఐదు కలశాలలో గోదావరి జలాలను తీసుకుచ్చి శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామికి అభిషేక పూజలు చేశారు. -
Saraswati Pushkaralu 2025: సరస్వతీదేవి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం పుష్కర శోభ సంతరించుకుంది. ఉదయం 5 గంటల 44 నిమిషాలకు మాధవానంద సరస్వతీ చేతుల మీదుగా మొదటి పుష్కర స్నానం లాంఛనంగా ప్రారంభమైంది. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలు మొదటిసారిగా జరుగుతున్నాయి. నేటి నుంచి మే 26 వరకు 12 రోజుల పాటు పుష్కరాలు జరుగనున్నాయి.ఇవాళ కాళేశ్వరంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు పర్యటించారు. 17 అడుగుల సరస్వతీదేవి ఏకశిలా విగ్రహాన్ని నదీ తీరంలో సీఎం ఆవిష్కరించారు. అనంతరం సీఎంతో పాటు మంత్రుల పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సరస్వతీ నది పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం కాళేశ్వర-ముక్తీశ్వరుణ్ని దర్శించుకున్నారు. అనంతరం సరస్వతీ హారతి కార్యక్రమానికి హాజరయ్యారు.పుష్కరాల నిర్వహణ కోసం రూ.35 కోట్లతో ఏర్పాట్లు చేశారు. తెలంగాణా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. పుష్కర ఘాట్లు, మంచినీటి వసతి, రోడ్ల మరమ్మతులు, పార్కింగ్, పారిశుధ్యానికి ప్రాధాన్యతనిచ్చిన దేవాదాయశాఖ.. ఎండల తీవ్రత ఉన్నందున టెంట్లు, పందిర్లతో భక్తులకు సకల ఏర్పాట్లు చేసింది. సరస్వతీ పుష్కరాలతో కాళేశ్వరం త్రివేణి సంగమ శోభ సంతరించుకుంది. -
సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభం..
సాక్షి, కాళేశ్వరం: తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. గురువారం తెల్లవారుజామున మాధవానంద సరస్వతీ స్వామి పుష్కరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సరస్వతీ నది వద్ద మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేక పూజలు చేశారు. త్రివేణి సంగమం వద్ద పుష్కర్ స్థానం ఆచరించి కుటుంబ సమేతంగా ప్రత్యేక అర్చనలు చేసిన మంత్రి శ్రీధర్ బాబు దంపతులు.ఇక, కాళేశ్వరాలయం నుంచి మంగళ వాయిద్యాలతో నదికి వెళ్లి గణపతి పూజతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. నదిలో నీటికి పంచ కలశాలలో ఆవాహన పూజ నిర్వహిస్తారు. పుష్కరునికి చీర, సారెతో ఒడి బియ్యం, పూలు, పండ్లు సమర్పించారు. తర్వాత భక్తులందరూ పుష్కర సంకల్ప స్నానం చేస్తారు. నేటి నుంచి ఈ నెల 26 వరకు సరస్వతీ నది పుష్కరాలు కొనసాగనున్నాయి. ఇక్కడికి వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ తొలిసారి సరస్వతీ పుష్కరాలు జరుగుతున్నాయి. రోజుకు లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. పుష్కరాలకు సీఎం రేవంత్‌రెడ్డి సరస్వతీ పుష్కరాల్లో కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సరస్వతీ ఘాట్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం సీఎం రేవంత్ పుణ్యస్నానం ఆచరిస్తారు. సీఎంతోపాటు పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పుష్కరాలకోసం దేవాదాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది.పుష్కరాల పవిత్రతను కాపాడాలిసరస్వతీ నది పుష్కరాల పవిత్రతను కాపాడుకోవడా నికి అందరూ చేతులు కలపాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. గురువారం నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరగను న్న సరస్వతీ నది పుష్కరాలను పురస్కరించుకుని కాలుష్య నియంత్రణ బోర్డు రూపొందించిన పోస్టర్‌ను బుధవారం మంత్రి ఆవిష్కరించారు. -
కాకతీయుల గడ్డపై మెరిసిన ప్రపంచ సుందరీమణులు
● తెలుగింటి ఆడపడుచుల్లా ముస్తాబు ● ఫ్యాన్సీ డ్రెస్‌లు వదిలి అంచుల చీరలు, పట్టుపరికిణీలు కట్టిన భామలు ● హైదరాబాద్ నుంచి నేరుగా హరిత కాకతీయకు.. ● వేయిస్తంభాలు, రామప్ప ఆలయంలో సంప్రదాయబద్ధంగా పూజలు ● అందరికీ అభివాదం చేస్తూ ఆకట్టుకున్న ముద్దుగుమ్మలు ● సుందరీమణులకు ప్రత్యేక బహుమతుల అందజేతసాక్షిప్రతినిధి, వరంగల్/సాక్షి, వరంగల్/హన్మకొండ చౌరస్తా/వెంకటాపురం(ఎం) : మిస్ వరల్డ్–2025 పోటీదారులు బుధవారం వరంగల్ నగరంలో సందడి చేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల ద్వారా హనుమకొండకు చేరుకున్న వారు హరిత కాకతీయలో దిగారు. హోటల్ వద్ద వారికి హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద, సీపీ సన్‌ప్రీత్ సింగ్, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, ఇతర అధికారులు స్వాగతం పలికారు. హోటల్లో సుమారు గంటకుపైగా గడిపిన వారు వేయిస్తంభాల ఆలయానికి వెళ్లే ముందు చీర కట్టుకొని తిలకం దిద్దుకొని అచ్చం తెలుగు అమ్మాయిల్లా తయారయ్యారు. సుందరీమణుల రాకతో చారిత్రక ఆలయ ప్రాంగణం మెరిసిపోయింది. ముందుగా తూర్పు ద్వారం వద్ద గల ఆలయ విశిష్టత, చారిత్రక నేపథ్యాన్ని వివరించే ఏకశిలాశాసనాన్ని టూరిజం గైడ్ సూర్యకిరణ్ క్లుప్తంగా వివరించారు. చారిత్రక ఆలయాన్ని చూసి మురిసిపోయారు.నందీశ్వరుడి ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కుర్చీల్లో పాదాలను శుభ్రం చేసుకున్నారు. నందీశ్వరుడి వద్ద ఫొటోలు దిగిన సుందరీమణులకు కల్యాణమంటపం విశిష్టతను గైడ్ వివరించారు. మంటపం వద్ద మరోసారి ఫొటోషూట్‌తో సందడి చేసి, ఆలయం చుట్టూ ప్ర దక్షిణలు చేశారు. ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్రశర్మ సుందరీమణులకు సన్నాయి మేళాలు, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భగుడిలో రుద్రేశ్వరుడికి అభిషేకం చేసిన అనంతరం పట్టువస్త్రాలు, ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు ఇచ్చారు. అనంతరం ఖిలావరంగల్‌కు బయలుదేరి వెళ్లారు. కోట చారిత్రక అందాలకు ఫిదా విశ్వసుందరి పోటీదారులు ఖిలావరంగల్ కోటకు రాత్రి 7.20గంటలకు చేరుకొని కాకతీయ కళా వైభవాన్ని తెలుసుకొని మంత్రముగ్ధులయ్యారు. కోటలో ఏర్పాటు చేసిన ఫ్లియా మార్కెట్‌ను సందర్శించి చేనేత కలంకారి దర్రీస్, జీఐ ట్యాగ్ పొందిన చపాట మిర్చి, పసుపు, హ్యాండ్ బ్యాగులు, బంగారు వర్ణంలో మెరిసిన హ్యాండ్ క్రాఫ్ట్ ప్రత్యేకతల గురించి అధికారులు వివరించడంతో ఆసక్తిగా విన్నారు. కాకతీయుల నాలుగు కీర్తితోరణాల నడు మ నళ్ల రాతిలోని శిల్ప కళ సంపదను అందాల భా మలు మరింత ఆసక్తిగా తిలకించారు. కాకతీయుల చరిత్ర, విశిష్టతను పర్యాటక శాఖ అధికారులు వివరించారు. టీజీ టీడీసీ ఆధ్వర్యంలో 45 నిమిషాల నిడివిగల సౌండ్ అండ్ లైటింగ్ షోను ఇంగ్లిష్‌లో ప్రదర్శించగా... ఆసక్తిగా వీక్షించారు. అంతకుముందు కాకతీయుల తోరణం ఎదుట గ్రూపు ఫొటో దిగారు. అనంతరం శిల్పాల ప్రాంగణంలో పేరిణి నృత్య కళాకారుడు గంజల రంజిత్ శిష్య బృందం ప్రదర్శించిన శివతాండవం ఆకట్టుకుంది. చివరగా సుందరీమణులకు చేనేత కలంకారి దర్రీస్, చపాట మిర్చి, పాకాల, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా రూపొందించిన సావనీర్‌తో కూడిన బహుమతులు అందించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి కొండా సురేఖ, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రామప్ప అందాలు వీక్షించి.. రామప్ప సరస్సుకట్టపై ఉన్న హరితహోటల్ వద్దకు సాయంత్రం 4:30 గంటలకు చేరుకున్న మిస్‌వరల్డ్ పోటీదారులు సంప్రదాయ దుస్తులు ధరించారు. 5:50గంటలకు రామప్ప ప్రధాన గేట్ వద్దకు చేరుకున్న వారికి కొమ్ముకోయ నృత్యంతో కళాకారులు స్వాగతం పలికారు. కలెక్టర్ దివాకర టీఎస్‌తో పాటు అధికార యంత్రాంగం వారికి పుష్పగుచ్ఛాలు అందించారు. ఆలయానికి చేరుకున్న తరువాత రెండు బృందాలుగా విడిపోయారు. 18 మంది, 15 మంది వేర్వేరుగా రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ విశిష్టతను ప్రొఫెసర్ పాండురంగారావుతో పాటు టూరిజం గైడ్లు విజయ్‌కుమార్, వెంకటేష్ వారికి వివరించగా శిల్పకళ సంపదను తమ సెల్ఫోన్లో బంధించుకున్నారు. ముఖ్య అతి థిగా వచ్చిన మంత్రి ధనసరి సీతక్కతో కలిసి ఆల య ఆవరణలో గ్రూప్ ఫొటో దిగారు. అనంతరం గార్డెన్లో పేరిణి నృత్యం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా ఆసక్తిగా తిలకించారు. -
సాదాబైనామాలే అధికం
రేగొండ: భూభారతి చట్టాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో రేగొండ మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసిన విషయం విధితమే. ఇందులో భాగంగా ఈ నెల 5 నుంచి ప్రారంభమైన రెవెన్యూ సదస్సులు 19వ తేదీ వరకు కొనసాగనున్నాయి. భూసమస్యలు పరిష్కరించడానికి రైతుల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇప్పటి వరకు 11 రెవెన్యూ గ్రామాల్లో 4,083 దరఖాస్తులు స్వీకరించినట్లు తహసీల్దార్ శ్వేత తెలిపారు. ఇందులో ఎక్కువగా సాదాబైనామాల సమస్యలతోనే రైతులు దరఖాస్తులు చేస్తున్నారని తెలిపారు.దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలిభూపాలపల్లి అర్బన్: లేబర్కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఏరియాలోని స్థానిక కొమురయ్య భవన్లో బుధవారం క ర్మిక సంఘాల జేఏసీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఐ టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నర్సింగరావు, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మో టపలుకుల రమేష్, ఐఎన్టీయూసీ బ్రాంచ్ ఉ పాధ్యక్షుడు బేతేల్లి మధుకర్ రెడ్డి, టీబీజీకేఎస్ బ్రాంచి ఉపాధ్యక్షుడు బడితెల సమ్మయ్యలు పాల్గొని ఈనెల 20న చేపట్టబోయే దేశవ్యాప్త సమ్మె వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కా ర్మికులకు పిలుపునిచ్చారు. సమావేశంలో ఏఐ టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాత రాజు సతీష్, సీఐటీయూ బ్రాంచ్ కంపేటి రాజయ్య, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.కార్మికులు విధులకు హాజరుకావాలిభూపాలపల్లి అర్బన్: సింగరేణిలో పని చేస్తున్న కార్మికులు ఏడాదికి కనీసం 100 నుంచి 191 రోజుల పాటు విధులకు హాజరుకావాలని 5వ గని మేనేజర్ జాకీర్ హుస్సేన్ సూచించారు. ఏరియాలోని కేటీకే 5వ గనిలో గని మేజర్ జాకీర్ హుస్సేన్ ఆధ్వర్యంలో గైర్హాజరు కార్మికులకు బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతంలో ఏడాదికి కనీసం 100 పని దినాలైన విధులకు హాజరు కావాలనే నిబంధన ఉండేదన్నారు. దానిని 191 రోజులకు పెంచారని, వంద మాస్టర్ల ప్రామాణికతను మానుకొని వి ధిగా హాజరయ్యే అలవాటు పెంపొందించుకోవా లని సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతి ఉ ద్యోగి ప్రతిరోజూ 8 గంటల పని సమయాన్ని పాటిస్తూ 100 శాతం ఉత్పత్తి సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. 40 మంది ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులతో కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ ఆఫీసర్ సందీప్ కుమార్, కార్మిక సంఘాల నాయకులు దోర్నాల తిరుపతి, రాజు తదితరులు పాల్గొన్నారు.భక్తుల సందడిమంగపేట: మండల పరిధిలోని శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులు బుధవారం స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. చింతామణి జలపాతం వద్ద నీటిని తాగి ఆహ్లాదంగా గడిపారు. కొబ్బరికాయలను కొట్టి పూజలు చేశారు. శిఖాంజనేయస్వామిని దర్శించుకున్నారు. దీంతో ఆలయం, షాపుల వద్ద భక్తులతో సందడి వాతావరణం నెలకొంది. -
పండుగలా జరుపుకోవాలి
కాళేశ్వరం:సరస్వతీ నది పుష్కరాలను ప్రపంచానికి తెలిసేలా పండుగలా జరుపుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అ న్నారు. బుధవారం రాత్రి సరస్వతీ ఘాట్ తదితర ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం రూ.12 కోట్లలతో నిర్మించిన వందగదుల సత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సరస్వతీ ఘాట్ ఆవరణలో కాశిదీక్షిత్ పండితులు, స్థానిక బ్రాహ్మనోత్తముల చేతులమీదుగా హారతి కార్యక్రమాన్ని వైభవంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందన్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ వెంకట్రావు పర్యవేక్షణలో భక్తుల కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రా హుల్ శర్మ, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు, ఈఓ మహేష్ పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వందగదుల గెస్ట్‌హౌస్ ప్రారంభం -
అకాల వర్షాలతో జాగ్రత్త
మల్హర్: అకాల వర్షాలతో రైతులు జాగ్రత్తలు పాటించాలని డీసీఓ వాల్యనాయక్ అన్నారు. బుధవారం తాడిచర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మండలంలోని కొండంపేట, కొయ్యూ రు, వల్లెంకుంట గ్రామాల్లో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా సహకార అధికారి పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీఓ మాట్లాడుతూ అకాల వర్షాలు వస్తున్నందున జాగ్రత్తలు వహించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొనుగోలు చేసి సంబంధిత రైస్ మిల్లులకు పంపించాలని సెంటర్ నిర్వాహకులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య. అయిత రాజిరెడ్డి, పీఏసీఎస్ సీఈఓ సంతోష్, రైతులు, హమాలీలు పాల్గొన్నారు. -
సరస్వతీనది పుష్కరాలకు వేళాయె..
నేటినుంచి 26వ తేదీ వరకు నిర్వహణ సరస్వతి ఘాట్ వద్ద ఏర్పాటుచేసిన విద్యుత్ వెలుగులు, వేదిక ● సరస్వతిఘాట్‌లో పుణ్యస్నానం ఆచరించనున్న సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు ● లక్షలాదిగా తరలిరానున్న భక్తజనంజయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిణి సరస్వతీనది పుష్కరాలు నేటినుంచి (గురువారం) ప్రారంభం కానున్నాయి. 12 రోజుల పాటు నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం ఉద యం 5.44 గంటలకు వేదపండితులు ముహూర్తం ఖరారు చేశారు. నదికి విశేష పూజాకార్యక్రమాలతో వేదపండితులు పుష్కరుడిని ఆహ్వానిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు సరస్వతి ఘాట్‌లో పుణ్య స్నానం ఆచ రించనున్నారు. సీఎంతో పాటు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ముఖ్యులు పాల్గొననున్నారు. – కాళేశ్వరం – వివరాలు 8లోu -
‘మోడల్’లో ఇంటర్ ప్రవేశాలు
మొగుళ్లపల్లి: ఇంటర్మీడియట్ ఆంగ్లమాధ్యమంలో చదవాలనుకునే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆద ర్శ పాఠశాలలు ఓ వరంలా మారాయి. మెరుగైన విద్య, సౌకర్యాలు కల్పిస్తుండటంతో మోడల్ స్కూ ళ్లకు ఆదరణ పెరిగింది. 2025–26 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియట్లో ప్రవేశాల కోసం అధికా రులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 20వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. జిల్లాలో 6 ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. ప్రతీ పాఠశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపులు ఉన్నాయి. ఒక్కో గ్రూపులో 40 సీట్ల చొప్పున 160 సీట్లు భర్తీ చేస్తారు. జిల్లాలో మొగుళ్లపల్లి, చిట్యాల, గణపురం, కాటారం, మల్హర్, మహముత్తారం మండలాల్లో ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. ఎంపిక ప్రక్రియ ఇలా.. పదో తరగతిలో వచ్చిన మార్కులతో పాటు రిజర్వేషన్ ఆధారంగా విద్యార్థుల ప్రవేశాలకు ఎంపిక చే యనున్నారు. అల్పాదాయ వర్గాల వారికి మొదటి ప్రాధాన్యం ఇస్తారు. ఈ నెల 26న దరఖాస్తులను పరిశీలించి ఎంపికై న విద్యార్థుల జాబితాను పాఠశాలల్లో ప్రదర్శిస్తారు. ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు ఎంపికై న విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించి ప్రవేశాలు కల్పించనున్నారు. జూన్ 2వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. బాలికలకు హాస్టల్ సౌకర్యం.... ఆదర్శ పాఠశాలలో చదివే బాలికలకు హాస్టల్ వస తి కూడా ఉంది. 9, 10 తరగతులతో పాటు ఇంటర్మీ డియట్ చదువుతున్న 100 మందికే ఈ అవకాశం కల్పించారు. సద్వినియోగం చేసుకోవాలి మోడల్ పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి ఫీజు లేకుండా ప్రభుత్వమే ఉచితంగా విద్యనిందిస్తుంది. క్రమశిక్షణతో పాటు అనుభవం కలిగిన అధ్యాపకులతో నాణ్యమైన బోధన ఉంటుంది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – రాకేశ్, ప్రిన్సిపాల్, ఆదర్శ పాఠశాల, కోర్కిశాల ఈనెల 20 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ జిల్లాలో 6 ఆదర్శ పాఠశాలలు, 960 సీట్లు -
అర్హత ఉన్నవారికే పదవులు
మొగుళ్లపల్లి: కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే తగిన గుర్తింపు లభిస్తుందని, అర్హతలు ఉన్న వారికే పదవులు వస్తాయని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని అమ్మగార్డెన్‌లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆకుతోట కుమారస్వామి అధ్యక్షతన అన్ని గ్రామాల ముఖ్యనేతలతో సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ ప్రక్షాళనలో పీసీసీ పరిశీలకుల బాధ్యత అత్యంత కీలకమైందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలన్నారు. పేదలకు సీఎం సహాయ నిధి అండగా నిలుస్తుందన్నారు. ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, అర్హులైన ప్రతీఒక్కరు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అంతకుముందు వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 38 మందికి సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు రూ.12,60,000 విలువైన చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, సంస్థాగత ఎన్నికల జిల్లా పరిశీలకులు ఇనగాల వెంకట్రామ్రెడ్డి, మాసంపెల్లి లింగాజి, రాష్ట్ర నాయకుడు కటంగూరి రాంనరసింహారెడ్డి, అన్ని గ్రామాల ముఖ్య నేతలు, కార్యకర్తలు, పాల్గొన్నారు. పుష్కరాల భక్తులకు అన్నదానం భూపాలపల్లి రూరల్: కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్నదానం కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. బుధవారం భూపాలపల్లి మండలం కమలాపూర్ క్రాస్ జాతీయ రహదారి పక్కన అన్నదానం కోసం ఏర్పాటు చేసిన స్థలాన్ని అధికారులు, స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 15వ తేదీ (గురువారం) నుంచి భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్నదానం నిర్వహించాలని, పార్కింగ్తో పాటు ఇతర సౌకర్యాలు కూడా కల్పించాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట కమలాపూర్ మాజీ సర్పంచ్ తోటసంతోష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దేవన్, యువజన నాయకులు పిప్పాల రాజేందర్, జిల్లా నాయకులు అప్పం కిషన్, తోట రంజిత్ తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
రేపట్నుంచి కాళేశ్వరం సరస్వతీ నది పుష్కరాలు
హైదరాబాద్: సరస్వతీ నది పుష్కరాలకు సమయం ఆసన్నమైంది. రేపటి నుంచి తెలంగాణలోని కాళేశ్వరం దేవస్థానం చెంత గోదావరి–ప్రాణహిత సంగమ ప్రాంతంలో పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. రేపు(గురువారం) పుష్కరాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ పుష్కరాలు ఈనెల 26వ తేదీ వరకూ జరుగనున్నాయి.పుష్కరాల వేళ.. సరిగ్గా పుష్కరాల వేళ, అడుగంటిన నది.. మళ్లీ ప్రవాహ స్థాయికి చేరుకుంది. దీంతో పుష్కరాల్లో భక్తుల స్నానాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తప్పదన్న భయాందోళనలు దూరమయ్యాయి. గోదావరి–ప్రాణహిత నదులు సంగమించే చోట అంతర్వాహినిగా ఉందని భక్తులు విశ్వసించే సరస్వతి నదికి ఈనెల 15 నుంచి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. పుష్కరాలు నిర్వహించే కాళేశ్వరం దేవస్థానం చెంత గోదావరి–ప్రాణహిత సంగమ ప్రాంతంలో గత నెలలోనే నీళ్లు పూర్తిగా అడుగంటాయి.పుష్కరాలకు నెల ముందు నుంచి నీటి సమస్య బాగా పెరుగుతూ వచ్చింది. దీంతో పుష్కరాల నాటికి నీళ్లు మరీ తగ్గి భక్తులు పుణ్య స్నానాలు చేయలేని దుస్థితి ఏర్పడుతుందన్న ఆందోళన వ్యక్తమైంది. ఇదే విషయాన్ని దేవాదాయ శాఖ ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. దీంతో మంత్రి శ్రీధర్ బాబు స్పందించి, నీటి పారుదల శాఖ అధికారులతో చర్చించారు. ఎల్లంపల్లి శ్రీపాదసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయటం తప్ప ప్రత్యామ్నాయం లేదన్న అభిప్రాయం వ్యక్తం కావటంతో, ఆమేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను అప్పట్లో ఆదేశించారు.ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలన్న విషయంలో ప్రభుత్వం తల పట్టుకున్న తరుణంలో అకాల వానలు ఆదుకున్నాయి. ప్రాణహిత బేసిన్ అయిన మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాంతాల్లో ఇటీవల అకాల వర్షాలు భారీగా కురిశాయి. దీంతో ఒక్కసారిగా ప్రాణహిత నదిలో నీటి ప్రవాహం పెరిగింది. నెల రోజుల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం కాళేశ్వరం దేవాలయం వద్ద నదిలో నీటి మట్టం ఏకంగా 30 సెం.మీ. మేర పెరిగింది. ప్రస్తుతం 3,500 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. నదీ గర్భంలో గరిష్టంగా 30 అడుగుల మేర నీళ్లు ఉండటం విశేషం. -
భక్తులకు ఏర్పాట్లు చేశాం
కాళేశ్వరం: కాళేశ్వరంలో ఈనెల 15నుంచి జరుగనున్న సరస్వతినది పుష్కరాలకు భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ రాహుల్‌శర్మ అన్నారు. మంగళవారం రాత్రి కలెక్టర్ స్వయంగా తాత్కాలిక బస్టాండ్, సరస్వతి విగ్రహం, వీఐపీ ఘాట్, భక్తులు పుష్కర స్నానాలు చేసే త్రివేణి సంగమ ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మిగిలిన అన్ని పనులను బుధవారం వరకు పెండింగ్ లేకుండా పూర్తిచేయాలని ఆదేశించారు. భక్తులు సురక్షితంగా స్నానాలు చేయగలిగేలా ఘాట్ వద్ద విద్యుత్ ఏర్పాట్లు త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. అన్ని విభాగాల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించాలని అన్నారు. స్వచ్ఛ పుష్కరాలు కావాలని భక్తులు వినియోగించిన వ్యర్థాలను డస్ట్ ఎక్కడ పడితే అక్కడ వేయొద్దని.. గ్రామ పంచాయతీ సిబ్బందికి అప్పగించాలని సూచించారు. వివిధ పనులకు ఉపయోగించిన తదుపరి మిగిలిన పనికిరాని వస్తువులను గ్రామ పంచాయతీ నిర్దేశించిన ప్రాంతాల్లో వేసి పరిశుభ్రతకు సహకరించాలని కలెక్టర్ రాహుల్‌శర్మ సూచించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, డీపీఓ వీరభద్రయ్య, భూపాలపల్లి ఆర్డీఓ రవి, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, అడిషనల్ ఎస్పీ కిషన్ తదితరులు పాల్గొన్నారు. పకడ్బందీగా సేవలు నిర్వర్తించాలి పుష్కరాల్లో భక్తులకు ఇబ్బంది కలుగకుండా పోలీసులు పకడ్బందీగా సేవలు నిర్వర్తించాలని ఎస్పీ కిరణ్‌ఖరే పోలీస్ అధికారులు, సిబ్బందికి సూచించారు. సరస్వతి పుష్కరాల బందోబస్తుకు వివిధ జిల్లాల నుంచి కాళేశ్వరం వచ్చిన పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఆయన దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ కిరణ్‌ఖరే మాట్లాడుతూ పుష్కరాలకు వచ్చే భక్తులతో పోలీసులు మర్యాదగా వ్యవహరించాలని, భక్తులసేవే భగవంతుడి సేవగా భావించి విధులు నిర్వర్తించాలని సూచించారు. సెక్టార్ల ఇన్‌చార్జ్‌లు తమ పరిధిలోని సిబ్బందికి మార్గనిర్దేశం చేస్తూ రద్దీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ సమన్వయంతో విధులు నిర్వర్తించాలని తెలిపారు. పుష్కరాలకు పెద్దఎత్తున భక్తులు వస్తారని.. అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎండాకాలం నేపథ్యంలో పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భక్తులకు మెరుగైన సేవలు అందించి పోలీస్‌శాఖకు మంచిపేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ బోనాల కిషన్, డీఎస్పీలు రామ్మోహన్‌రెడ్డి, సంపత్‌రావు, మోహన్, ప్రతాప్, మల్లారెడ్డి, మహదేవపూర్ సీఐ రాంచందర్‌రావు, పోలీ స్ అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్‌శర్మ -
రామప్పలో సందడి చేయనున్న అందాలభామలు
సుందరీమణుల రాక సందర్భంగా రామప్ప ఆలయం జిగేల్‌మంటోంది. విదేశీ వనితలు భారతీయ సంప్రదాయాలను గౌరవిస్తూ రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆలయం చుట్టూ గ్రీన్ మ్యాట్ వేశారు. ప్రత్యేక విద్యుత్‌దీపాలు ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల కోసం గార్డెన్లో స్టేజీ నిర్మించారు. సరస్సు కట్టపై ఉన్న హరి త కాటేజీలను ముస్తాబు చేశా రు. వెయ్యి మంది సిబ్బందితో మూడంచెల భద్రత ఏర్పాటు చేసి మంగళవారం రాత్రి నుంచే పోలీసులు విధుల్లో చేరారు. పర్యాటకులకు బుధవారం రామప్ప సందర్శనకు అనుమతి లేదు.● 4గంటలకు రామప్పకు చేరుకుంటారు. 4:40 గంటలకు రామప్ప సరస్సు అందాల వద్ద ఫొటో సెషన్లో పాల్గొంటారు.● 4:55 గంటలకు రామప్ప ఆలయానికి చేరుకుంటారు. 5 గంటలకు రామప్ప ఎంట్రెన్స్ గేట్ వద్ద కొమ్ముకోయ నృత్యంతో కళాకారులు వారికి స్వాగతం పలుకుతారు.● 5:10 నుంచి 6 గంటల వరకు సంప్రదాయ దుస్తుల్లో రామప్ప రామలింగేశ్వరస్వామిని దర్శించుకొని శిల్పకళాసంపదను తిలకిస్తారు.● 6.10 గంటల నుంచి రాత్రి 7.00 గంటల వరకు రామప్ప గార్డెన్లో అలేఖ్య శాసీ్త్రయ నృత్యం, పేరిణి ప్రదర్శన వీక్షించిన అనంతరం ప్రముఖులు అతిథులను సన్మానిస్తారు.● రాత్రి 7.20 గంటలకు ఇంటర్‌ప్రిటిషన్ సెంటర్‌కు చేరుకుంటారు. 7.30 గంటలకు డిన్నర్ చేసి 8:15 గంటలకు హైదరాబాద్‌కు ప్రయాణమవుతారు.● హైదరాబాద్ నుంచి రెండు బృందాలుగా ప్రత్యేక బస్సుల్లో బయలుదేరుతారు.● ఒక బృందం హనుమకొండలోని హరిత కాకతీయకు సాయంత్రం 4.35 గంటలకు చేరుకుంటుంది.● సుమారు గంటపాటు హోటల్లోనే గడిపి సాయంత్రం 5.45 గంటలకు వేయిస్తంభాల గుడికి చేరుకుంటారు.ఏయే దేశాల సుందరీమణులంటే..ప్రపంచంలోని 19 దేశాలకు చెందిన సుందరీమణులు గ్రేటర్ వరంగల్ నగరానికి, 32 దేశాల వారు రామప్ప ఆలయానికి రానున్నట్లు సమాచారం. వారిలో అర్జెంటీనా, బొలివియా, బ్రెజిల్, కెనడా, చీలి, కొలంబో, ఈక్వెడార్, ఈ సాల్వడార్, గౌతమాల, మెక్సికో, పనామా, పరాగ్వే, పెరు, యునైటెడ్ స్టేట్స్, వెనిజులా, హైతీ, హోందురాస్, నికరగ్వా, సురినామే తదితర దేశాల సుందరీమణులు ఉన్నారు.● 40 నిమిషాలు పాటు అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.● సాయంత్రం 6.25 వరంగల్ కోటకు చేరుకుంటారు. 7.30 గంటలకు వరకు అక్కడే పేరిణి శివతాండవం, ఇతర సంప్రదాయ నృత్యాలను తిలకించి తిరిగి హరిత హోటల్‌కు చేరుకుంటారు.● 8 గంటల నుంచి 9 గంటల వరకు పర్యాటక శాఖ విందులో పాల్గొని 9.15 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరుతారు.డిన్నర్లో ఇవే..సుందరీమణులకు హనుమకొండ నక్కలగుట్టలోని టూరిజం హోటల్ హరిత కాకతీయ ముస్తాబైంది. హోటల్‌కు చేరుకున్న బృందానికి స్వాగత పలకరింపుగా నారింజ జ్యూస్ అందిస్తారు. స్టాటర్‌గా ప్రెలూడే ప్లేట్–స్టార్టర్ ట్రియో, గోల్డెన్ కోస్ట్ ఫిష్ బైట్స్ లేదా చీజ్ అండ్ హెర్బ్ మిలాంజ్ క్రాక్వెట్స్, సీసర్స్ గార్డెన్, మెయిన్ ఆఫెయిర్– సిగ్నేచర్ ప్లేట్స్గా నాన్ వెజిటేరియన్‌గా హర్బ్ గ్రిల్డ్ చికెన్ సుప్రీం, వెజిటేరియన్‌గా గ్రిల్డ్ కాటేజ్ చీస్ స్టీక్, మెడిటెర్రానీన్ వెజిటబుల్ గ్రాటిన్, టస్కాన్ పెన్న అర్రాబిటా, గోల్డెన్ చిప్స్, స్వీట్ ఇప్రెషన్గా చాక్లెట్ మౌసెస్, సాఫ్రాన్ ఫిర్ని, సీసన్స్ బౌంటి అందిస్తారు. -
ప్రశాంతంగా పాలీసెట్ ప్రవేశ పరీక్ష
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలో మంగళవారం నిర్వహించిన పాలీసెట్ అర్హత ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించినట్లు పాలీసెట్ జిల్లా కన్వీనర్, స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.రమణారావు తెలిపారు. జిల్లాకేంద్రంలో ఏర్పాటుచేసిన మూడు పరీక్ష కేంద్రాల్లో 864మంది విద్యార్థులకు 824మంది హాజరుకాగా 40మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1.30గంట వరకు పరీక్ష నిర్వహించారు. క్షుణంగా పరిశీలించిన తరువాత విద్యార్థులను 10గంటల నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. -
పుష్కరాలకు ప్రత్యేక రవాణా సౌకర్యం
భూపాలపల్లి: ఈ నెల 15వ తేదీ నుంచి 26వరకు కాళేశ్వరంలో జరుగనున్న సరస్వతి పుష్కరాలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు భూపాలపల్లి డిపో మేనేజర్ ఎ.ఇందు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా డీఎం మాట్లాడుతూ.. సరస్వతి పుష్కరాల సందర్భంగా భూపాలపల్లి బస్‌స్టేషన్ నుంచి కాళేశ్వరం వరకు రోజూ 47 రెగ్యులర్ సర్వీసులతో పాటు అదనంగా 70 ప్రత్యేక బస్సులతో మొత్తం 130 ట్రిప్పులు నడపనున్నట్లు చెప్పారు. ప్రయాణికులు ఈ ప్రత్యేక అవకాశాన్ని వినియోగించుకొని, కాళేశ్వరుడి దివ్యదర్శనం చేసుకోవాలని ఆమె సూచించారు. మహాలక్ష్మి పథకం కూడా ఈ సేవలకు వర్తించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. -
ఓరుగల్లుకు నేడు ‘ప్రపంచ సుందరీమణులు’
సాక్షిప్రతినిధి, వరంగల్/వెంకటాపురం(ఎం): చారిత్రక నేపథ్యమున్న ఓరుగల్లులో వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు బుధవారం సందడి చేయనున్నారు. కళలు, దేవాలయాలు, చారిత్రక కట్టడాలు.. సాంస్కృతిక వేదికలు.. సంస్కృతీసంప్రదాయాలకు పెద్దపీట వేసిన కాకతీయుల కాలంనాటి కట్టడాలను తిలకించనున్నారు. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు రెండు బృందాలుగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు రానున్నారు. ఈ మేరకు వేయిస్తంభాల ఆలయం, వరంగల్ కోట, రామప్పలో సకల ఏర్పాట్లు చేశారు. ఐదు రోజులుగా హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్యశారద, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్, వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. రామప్పలో ములుగు కలెక్టర్ టీఎస్ దివాకర, ఎస్పీ శబరీష్ రెవె న్యూ, పర్యాటక తదితర శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ పనులు చేయించారు. ముస్తాబైన నగరం.. వరంగల్ నగరంలో మూడుచోట్ల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేశారు. వేయిస్తంభాల దేవాలయం, ఫోర్ట్ వరంగల్ వద్ద సౌండ్ అండ్ లైట్, ఫ్లియా మార్కెట్, సాంస్కృతిక ప్రదర్శనల వేదిక, మీడియా పాయింట్లు ఏర్పాటు చేశారు. హరిత కాకతీయ, వేయిస్తంభాల ఆలయం, వరంగల్ కోట, పలు ముఖ్య కూడళ్లు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో జిగేల్మంటున్నాయి. సుందరీమణుల పర్యటనను పర్యవేక్షించేందుకు వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో ప్రస్తుతమున్న సీసీ కెమెరాలతోపాటు అదనంగా మరికొన్ని అమర్చారు. మూడంచెల భద్రత కోసం కమిషనరేట్ పరిధిలో సుమారు రెండు వేల మందికిపైగా పోలీసులను వినియోగిస్తున్నారు. హరిత హోటల్ చుట్టూ 200 మంది సిబ్బంది పహారా కాస్తున్నారు. విద్యుత్ వెలుగుల్లో వేయిస్తంభాల గుడి -
సౌకర్యాలు అక్కర్లేదా?●
● మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ కాళేశ్వరం: సరస్వతి నది పుష్కరాల్లో పుణ్యస్నానాలకు వచ్చే సామాన్యులకు కనీసం సౌకర్యాలు కల్పించకపోవడం సిగ్గుచేటని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అసహనం వ్యక్తంచేశారు. ఈ నెల 15నుంచి మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని గోదావరినదిలో ప్రారంభం కానున్న సరస్వతి పుష్కరాల నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన పుష్కర పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో రెండు రోజుల్లో సరస్వతి పుష్కరాలు ప్రారంభం కానుండగా ఎక్కడ కూడా పనులు పూర్తి కాలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు ఇద్దరూ కలిసి సరస్వతి పుష్కరాలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. సరస్వతి అమ్మవారి మండపాన్ని చూస్తే పుష్కర పనులు ఎలా చేస్తున్నారో అర్థం అవుతుందన్నారు. మంథని ఎమ్మెల్యే మంత్రిగా ఉండగా ఆయన సతీమణి ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉందని, వీరిద్దరు సరస్వతి పుష్కరాలను ఘనంగా నిర్వహించేలా చూడాల్సిన బాధ్యత ఉన్నా.. ఆ విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. పుష్కర పనులను ఎలాంటి నైపుణ్యంలేని కాంగ్రెస్ వాళ్లకు అప్పగించారని, అధికారులు క్వాలిటీ కంట్రోల్ పరీక్షలు చేయాలన్నారు. ఈ క్రమంలోనే నాణ్యతలేని పనులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. సరస్వతి పుష్కరాల్లో జరిగిన పనులపై క్వాలిటీ పరీక్షలు నిర్వహించాలని, సమగ్ర విచారణ జరిపించడంతో పాటు పనులకు సంబంధించిన నిధులు, పనులు, టెండర్ల జారీ ప్రక్రియపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పుష్కరాల్లో సామాన్యులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించాలని, లేనిపక్షంలో తాము బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టంచేశారు. ఆయన వెంట శ్రీనివాసరావు, అడప సమ్మయ్య, శ్రీపతి బాపు, మోహన్‌రెడ్డి, శ్రీహరి, జక్కు రాకేష్, జవ్వాజీ తిరుపతి, అలీంఖాన్, సుజాత, పోత వెంకట్‌స్వామి ఉన్నారు. -
వైభవంగా పుష్కరాల నిర్వహణ
● కలెక్టర్ రాహుల్‌శర్మ కాళేశ్వరం: కాళేశ్వరంలో రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా సరస్వతినది పుష్కరాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్‌శర్మ అన్నారు. కాళేశ్వరంలో పుష్కర పనులను సోమవారం ఎస్పీ కిరణ్‌ఖరేతో కలిసి కలెక్టర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాలలో ఏకై క త్రివేణి సంగమమని, దేశంలో రెండో ప్రాంతం అయిన కాళేశ్వర క్షేత్రం అద్భుతమైన ఘట్టానికి వేదిక కాబోతుందన్నారు. సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహించే త్రివేణి సంగమంలో ఈ నెల 15న అట్టహాసంగా ప్రారంభం కానున్న సరస్వతి నది పుష్కరాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రానున్న సందర్భంగా ఏర్పాట్లు పరిశీలించారు. ప్రతిరోజు కాశీ పీఠాధిపతిపతులతో నది హారతి కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ప్రతి రోజు ప్రముఖులు, భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈనెల 15న సీఎం సరస్వతి మాత విగ్రహం ఆవిష్కరించడంతో పాటు గోదావరి హరతి, త్రిలింగ క్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ సరస్వతి పుష్కరాలకు అత్యంత అరుదైన చరిత్ర ఉందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో అన్ని సౌకర్యాలు కల్పించాలన్న లక్ష్యంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పనులు సకాలంలో పూర్తి చేయించేందుకు ప్రత్యేక అధికారులను నియమించి పర్యవేక్షణ చేస్తున్నామని, అధికారులు కాళేశ్వరంలో ఉండి కేటాయించిన విధుల్లో నిమగ్నం కావాలని తెలిపారు. 15న సీఎం పర్యటనను పురస్కరించుకుని జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా కాళేశ్వరం ఏర్పాట్లలో నిమగ్నం కావాలని సూచించారు. పుష్కరాల్లో భక్తులకు సేవలు అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం అంతా అందుబాటులో ఉండే విధంగా ప్రణాళికలు చేశామన్నారు. ఎస్పీ కిరణ్ ఖరే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వారివెంట అడిషనల్ ఎస్పీ కిషన్, సీఐ రామచందర్‌రావు ఉన్నారు. -
ప్రొఫెసర్ మల్లారెడ్డికి ఫెల్లోషిప్ ప్రదానం
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ గణితశాస్త్ర విభాగం ప్రొఫెసర్ పి.మల్లారెడ్డిని అకాడమీ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ అండ్కమ్యూనికేషన్ హానరీ ఫెల్లోషిప్ ప్రదానం చేసింది. ఈ నెల 11న హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, పద్మ గ్రహీత డాక్టర్ దువ్వారు నాగేశ్వర్‌రెడ్డి చేతుల మీదుగా మల్లారెడ్డి హానరీ ఫెల్లోషిప్ అందుకున్నారు. ఈ మేరకు మల్లారెడ్డిని సోమవారం యూనివర్సిటీలో వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం అభినందించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు కె.రాజేందర్, నాగరాజు, ఎల్పీ రాజ్‌కుమార్ పాల్గొన్నారు. యూత్ కాన్ఫరెన్స్‌కు ఎంపిక కేయూ క్యాంపస్ : ఇంటర్నేషనల్ యూత్ కాన్ఫరెన్స్‌కు ఎన్ఎస్ఎస్ వలంటీర్లు ఎంపికయ్యారని కాకతీయ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ సోమవారం తెలిపారు. కర్ణాటకలోని మంగళూరులో ఈనెల 15, 16 తేదీల్లో నిర్వహించనున్న ఐకాన్ యూత్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్–2025కు కేయూ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన జాతీయ సేవాపథకం (ఎన్ఎస్ఎస్) వలంటీర్లు శ్రీజ జాదవ్, గుజ్జర వికాస్ ఎంపికయ్యారని పేర్కొన్నారు. వలంటీర్లను బయోటెక్నాలజీ విభాగం అధిపతి డాక్టర్ శాస్త్రి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ టి.రాధిక అభినందించారు. -
హామీలు నెరవేరుస్తున్నాం
భూపాలపల్లి అర్బన్: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులకు ఇచ్చిన హమీలను నెరవేరుస్తున్నామని కనీస వేతనాల సలహా సభ్యులు, ఐఎన్టీయూసీ సీనియర్ ఉపాధ్యక్షుడు ఎస్.నర్సింహరెడ్డి తెలిపారు. ఏరియాలోని సింగరేణి గెస్ట్‌హౌజ్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల హమీలను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 8, 9వ తేదీల్లో హైదరాబాద్‌లోని ఐఎన్టీయూసీ భవనంలో జరిగిన కోర్ కమిటీ సమావేశంలో అన్ని ఏరియాల ఉపాధ్యక్షులతో సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న క్లరికల్ ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేసి, కారుణ్య నియామకాల వయో పరిమితిని 35నుంచి 40ఏళ్లకు పెంచినట్లు చెప్పారు. నైనీ బ్లాక్‌లో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించినట్లు తెలిపారు. ఒడిశాలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు, బొగ్గు గనులను సింగరేణికే కేటాయించే విధంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిని కలిసినట్లు తెలిపారు. సమావేశంలో నాయకులు రాజేందర్, బుచ్చయ్య, సమ్మిరెడ్డి, వేణు పాల్గొన్నారు. -
గోదావరికి పౌర్ణమి హారతి
కాళేశ్వరం: పౌర్ణమి సందర్భంగా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో గోదావరికి హారతి కార్యక్రమాన్ని దేవస్థానం అర్చకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సోమవారం శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం నుంచి కాలినడకన మంగళవాయిద్యాలతో తరలి వెళ్లారు. గోదావరిమాతకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేదపండితులు ప్రత్యేక పూజలతో హారతిని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అర్చకులు భైకుంఠపాండా, రామాచారి, సుబ్రహ్మణ్యశర్మ, రామకృష్ణ, రాముశర్మ, శరత్చంద్ర, శ్రావణ్ పాల్గొన్నారు.గోదావరికి హారతి ఇస్తున్న అర్చకులు -
సమ్మెను విజయవంతం చేయాలి
భూపాలపల్లి అర్బన్: ఈ నెల 20వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య పిలుపునిచ్చారు. ఏరియాలోని కేటీకే 5వ గనిలో సోమవారం గేట్మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా బొగ్గు గనులను అమ్మకానికి పెట్టి బొగ్గు పరిశ్రమను సజీవంగా సమాధి చేస్తుందన్నారు. సింగరేణిలో కొత్త బావులను అనుమతించకుండా కట్టడిచేస్తూ బొగ్గురేటును పెంచుకోకుండా అడ్డుపడుతుందన్నారు. బొగ్గు పరిశ్రమ రక్షణ కోసం సింగరేణి బొగ్గు గనులను కాపాడుకునేందుకు దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో సింగరేణి గని కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సార్వత్రిక సమ్మె పిలుపులో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ భాగస్వాములుగా ఉన్నందున సింగరేణి గని కార్మికులను భాగస్వాములను చేసేందుకు సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ, ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసీ ముందుకు రావాలని అన్నికార్మిక సంఘాలను కలుపుకొని సమ్మెను విజయవంతం చేసేందుకు పూనుకోవాలన్నారు. సమావేశంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు దయాకర్, శంకర్, జనార్దన్, ప్రసాదరెడ్డి, మల్లేష్ పాల్గొన్నారు. -
సీఎం దృష్టికి కార్మికుల సమస్యలు
భూపాపల్లి అర్బన్: సింగరేణిలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి పసునూటి రాజేందర్ తెలిపారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కనీస వేతనాల సలహా మండలి చైర్మన్, యూనియన్ ప్రధాన కార్యదర్శి జనక్‌ప్రసాద్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎండీ బలరాం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. మంత్రులు సైతం సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా చూస్తున్నట్లు తెలిపారు. సింగరేణి ఐటీ పార్కు ఏర్పాటు చేయాలని, కార్మికులకు సొంతింటి పథకం, పెర్క్స్‌పై ఆదాయ పన్ను మాఫీ, కార్పొరేట్ మెడికల్ బోర్డు మార్పు, మెడికల్ అటెండెన్స్ నిబంధనలలో మార్పులు, డిస్మిస్ కార్మికులను ఉద్యోగంలోకి తీసుకోవాలని, హైదరాబాద్‌లో సూపర్ స్పెషలాటీ ఆస్పత్రి ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కేంద్రం, రాష్ట్ర నాయకులు శేష రత్నం, జోగు బుచ్చయ్య, మధుకర్‌రెడ్డి, సమ్మిరెడ్డి, రాజేష్, ఆశోక్, రమేష్, రవికిరణ్, అలీం, అశోక్, రాంబాబు పాల్గొన్నారు. -
పీఆర్ రోడ్లకు మహర్దశ
సాక్షిప్రతినిధి, వరంగల్ : ● వరంగల్ జిల్లా గీసుకొండ నుంచి మొగిలిచర్ల ఎక్స్‌రోడ్డు వరకు రోడ్డు స్పెషల్ రిపేర్స్ కోసం రూ.1.57 కోట్లతో అంచనా వేశారు. రూ.1,22,93,509లకు ఆన్లైన్ టెండర్ పిలువగా ఈనెల 17న గడువు ముగుస్తుంది. ● హనుమకొండ జిల్లా పరకాల మండలం పోచారం జెడ్పీ రోడ్డు నుంచి అలియాబాద్ ద్వారా కామారెడ్డిపల్లి వరకు రోడ్డు ప్రత్యేక మరమ్మతులకు రూ.2 కోట్లతో అంచనాలు పంపారు. ప్రభుత్వం రూ.158,09,702లకు పరిపాలన అనుమతి ఇవ్వగా ఆన్లైన్ టెండర్ ద్వారా ఈనెల 17 తర్వాత పనులు ఖరారు చేయనున్నారు. ● మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండ నుంచి బేరువాడ పీఆర్ రోడ్డు (మంచతండా) వరకు కొత్త రోడ్డు నిర్మాణానికి రూ.1,25,48,271లతో టెండర్లు పిలువగా, ఈనెల 15 వరకు ఆన్లైన్లో దాఖలుకు అవకాశం ఉంది. .. ఇలా ఉమ్మడి వరంగల్‌లో రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఐదు జిల్లాల్లో పాత రోడ్లకు స్పెషల్ రిపేర్స్, అత్యవసర మరమ్మతులు, మట్టి రోడ్లపై తారు వేయడంతో పాటు రోడ్డులేని గ్రామం లేకుండా కొత్తరోడ్లు నిర్మించేందుకు ఈ నిధులు మంజూరు చేసింది. మొదటి విడతగా హనుమకొండ, వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో రూ.69.33 కోట్లతో 62 రోడ్లకు గత నెలాఖరులో నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు అర్హులైన కాంట్రాక్టర్లకు పనులు అప్పగించేందుకు పంచాయతీరాజ్ శాఖ వరంగల్ పర్యవేక్షక ఇంజినీరు కార్యాలయం నుంచి టెండర్లు పిలిచారు. ఈనెల 8 నుంచి 17 తేదీ వరకు టెండర్ షెడ్యూల్ దాఖలు చేయడానికి అవకాశం ఇచ్చారు. మానుకోటకు పెద్దపీట గత వర్షాకాలంలో దెబ్బతిన్న రోడ్లు పలు ప్రాంతాల్లో మరమ్మతులకు నోచుకోకపోగా.. మళ్లీ వర్షాకాలం సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులతో పాటు స్పిల్ఓవర్ పనులకు ఎమ్మెల్యేలు పంచాయతీరాజ్ శాఖ ద్వారా ప్రతిపాదనలు పంపారు. 62 రోడ్లపై సుమారు రూ.75 కోట్ల మేరకు అవసరం ఉంటుందని ఎస్టిమేట్స్ రూపొందించగా, రూ.69.33 కోట్లు విడుదలయ్యాయి. హనుమకొండ జిల్లాలో 15 రోడ్లకు రూ.5.92 కోట్లు కేటాయించగా, ములుగు 11 రోడ్లకు రూ.17.10 కోట్లు, జయశంకర్ భూపాలపల్లికి ఐదు రోడ్లకు రూ.7.61 కోట్లు, వరంగల్ 10 రోడ్లకు రూ.9.20 కోట్లు కాగా, మహబూబాబాద్ జిల్లాలో 21 రోడ్లకు రూ.27.50 కోట్లు నిధులు మంజూరు చేశారు. మొత్తంగా విడుదలైన సుమారు రూ.69.33 కోట్లలో మానుకోటకు పెద్దపీట లభించింది. స్పెషల్ రిపేర్స్, బీటీ, నిర్మాణాలకు పెద్దపీట మరమ్మతులు, కొత్త రోడ్లపై తారుకు నిధులు ఐదు జిల్లాల్లో 62 రోడ్లకు రూ.69.33 కోట్లు... ఆన్లైన్లో టెండర్లు పిలిచిన పంచాయతీరాజ్ శాఖ ఈనెల 17తో ముగియనున్న ప్రక్రియ -
ఉద్యోగ అవకాశాల కల్పనకే ప్రాధాన్యం
భూపాలపల్లి అర్బన్: యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసమే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. భూపాలపల్లి ఏరియాలో సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్‌ను సింగరేణి సీఎండీ బలరాం నాయక్‌తో కలిసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోపే నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిరుద్యోగ యువతకు ఈ ట్రైనింగ్ సెంటర్ ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ ట్రైనింగ్ సెంటర్లో 38 రకాల కోర్సుల్లో అభ్యర్థులకు శిక్షణ ఉంటుందని, శిక్షణ సమయంలో ఉచిత మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ అందించనున్నట్లు చెప్పారు. నిరుద్యోగ సమస్యను ఎదుర్కొనేందుకు యువతకు వివిధ రంగాల్లో స్కిల్ యూనివర్సిటీ శిక్షణ ఇస్తుందని తెలిపారు. దేశంలో నిరుద్యోగమే పెద్ద సమస్యగా మారిందని, ఉద్యోగాలు లేక యువత మాదక ద్రవ్యాలకు బానిస అవుతుందన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో కష్టపడి చదివి డిగ్రీ పట్టాలు పొంది బయటకు వచ్చిన యువతకు సరైన స్కిల్స్ ఉండటం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. దీనిద్వారా యువత అవసరమైన నైపుణ్యాలను నేర్చుకొని ఉద్యోగాల్లో స్థిరపడాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్లు సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు, ఏరియా జీఎం రాజేశ్వర్‌రెడ్డి, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు రాజ్‌కుమార్, రాజేందర్, సింగరేణి అధికార ప్రతినిధి మారుతీ, అధికారులు నరసింహులు, రఘుపతి, కవీంద్ర, జోతి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
లక్ష్మీనరసింహస్వామి కల్యాణం
రేగొండ: మండలంలోని కోటంచ ఆలయంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణం ఆది వారం ఘనంగా నిర్వహించారు. స్వామి వారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రతి నెలలో కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కల్యాణం నిర్వహిస్తారు. ఆది వారం అభిషేకంతో ప్రారంభమై, సుదర్శన నారసింహ హోమం కొనసాగించారు. అనంత రం కల్యాణాన్ని నిర్వహించారు. ఆరగింపుతో కల్యాణ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో అర్చకులు బుచ్చమాచార్యులు, శ్రీనా ధచార్యులు, ఆలయ సిబ్బంది శ్రావణ్, సుధాకర్, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.పాలిసెట్‌కు ఏర్పాట్లు పూర్తిభూపాలపల్లి అర్బన్: ఈ నెల 13వ తేదీన జరిగే పాలిసెట్–2025 నిర్వహణకు జిల్లాలో ఏర్పాట్లు పూర్తయినట్లు పాలిసెట్ జిల్లా కన్వీనర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.రమణారావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలో మూడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 864మంది పాలిసెట్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 384, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 240, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 240 విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్ష ప్రారంభానికి గంట ముందు నుంచే పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులను అనుమతించనున్నట్లు తెలిపారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉండదని చెప్పారు. విద్యార్థులు తమవెంట పెన్సిల్, బ్లాక్ బాల్‌పెన్ మాత్రమే తీసుకొని పరీక్షకు హాజరు కావాలని సూచించారు. ఏ రకమైన ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదన్నారు.నేటి ప్రజావాణి రద్దుభూపాలపల్లి అర్బన్: నేడు(సోమవారం) కలెక్టరేట్లో జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ రాహుల్‌శర్మ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం కాళేశ్వరంలో జరిగే సరస్వతి పుష్కరాల విధుల నిర్వహణలో నిమగ్నమై ఉన్నందున ప్రజా వాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలిపారు. ప్రజలు గమనించి ఫిర్యాదులు ఇవ్వడానికి రావొద్దని సూచించారు.మృతుడి కుటుంబానికి మంత్రి పరామర్శకాటారం: కాటారం మండలం ధన్వాడలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన తుల్సెగారి రాజలింగు కుటుంబాన్ని ఆదివారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. అధైర్యపడవద్దని న్యాయం జరిగేలా చూస్తామని మృతుడి కుటుంబానికి మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి వెంట నాయకులు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. -
ఆశయానికి ‘అమ్మ’ అండ..
జనగామ: ‘నేను సైనికున్నవుతా.. దేశ శుత్రువులను కాల్చి చంపేస్తా’ అంటూ చదువుకునే రోజుల నుంచి దేశ భక్తి కలిగిన జనగామ పట్టణానికి చెందిన మాదాసు అన్నపూర్ణ, ఎల్లయ్య దంపతుల కుమారుడు శ్రీనాథ్ సైన్యంలో చేరి చిన్న నాటి కోర్కెను తీర్చుకున్నాడు. కొడుకు ఆశయానికి తల్లి అండగా నిలిచి కొండంత భరోసా ఇచ్చింది. 13 సంవత్సరాల క్రితం సైన్యంలో చేరి మెటాలజికల్(వాతావరణ శాఖ) కేటగిరి ఎయిర్ ఫోర్స్ వింగ్‌లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అత్యంత ప్రమాదకరమైన సియాచిన్‌లో మొదట బాధ్యతలు స్వీకరించాడు. ప్రస్తుతం సింధూర్–2 యుద్ధంలో సేవలు అందిస్తున్నాడు. ఆడపిల్లల నొదుటి బొట్టు తుడిచేసిన ఉగ్రమూకలను తుదముట్టించే విధుల్లో తన కొడుకు భాగస్వామిగా ఉండడం పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నామని తల్లి అన్నపూర్ణ గర్వంగా చెబుతున్నారు. -
యునెస్కో ఆదేశాలు బేఖాతర్!
● రామప్ప ఆలయానికి సిమెంట్ కాంక్రీట్‌తో మరమ్మతులు వెంకటాపురం(ఎం): ప్రపంచ వారసత్వ సంపదగా రామప్ప ఆలయానికి గుర్తింపు వచ్చినప్పటికీ పురావస్తుశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పర్యాటకులు ఆరోపిస్తున్నారు. కాకతీయుల కట్టడమైన రామప్ప ఆలయాన్ని కేవలం ఇసుకనే పునాదిగా చేసి రాళ్లను పేర్చి ఆలయాన్ని నిర్మించారు. రామప్ప ఆలయ గోపురాన్ని సైతం నీటిలో తేలాడే ఇటుకలతో నిర్మించారు. యునెస్కో గుర్తింపు ఇచ్చే సమయంలో సాండ్ బాక్స్ టెక్నాలజీ, ఒకే రాతిలో రెండు రంగులు, పురాతన కట్టడాన్ని పరిగణలోకి తీసుకొని యునెస్కో గుర్తింపు ప్రకటించింది. యునెస్కో గుర్తింపు వచ్చాక సిమెంటు కాంక్రీట్‌తో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. ఆలయానికి ఎలాంటి మరమ్మతులు చేపట్టాలన్నా సున్నం, ఇటుక పొడి, కరక్కాయ, బెల్లం, ఇసుకను ఉపయోగించి మిశ్రమంగా తయారు చేసి మరమ్మతులు చేపట్టాలి. రామప్ప ఆలయం వర్షానికి కురిసినపుడు పైకప్పుకు సైతం ఇదే విధంగా మిశ్రమాన్ని తయారు చేసి మరమ్మతులు చేపట్టారు. రామప్ప ఆలయం చుట్టూ ఏర్పడిన సందులను (గ్యాప్‌ను) రెండు రోజులుగా సిమెంట్ కాంక్రీటుతో పనులు చేపడుతున్నారు. పురావస్తుశాఖ చేపట్టే పనులతో గుర్తింపునకు ఆటంకం కలిగే ప్రమాదం ఉంటుందని పర్యాటకులు ఆరోపిస్తున్నారు. -
మత్తుపానీయాలకు దూరంగా ఉండాలి
భూపాలపల్లి అర్బన్: యువత క్రీడా మైదానాలకు అలవాటు పడాలని, మత్తుపానీయాలకు దూరంగా ఉండాలని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రా జేశ్వర్‌రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. స్థానిక అంబేడ్కర్ స్టేడియంలో జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సురిమిళ్ల శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి జీఎం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడా రు. క్రీడలు యువకులకు మానసిక ఉల్లాసమే కాక శారీరక ధృడత్వాన్ని కలిగిస్తుందన్నారు. సింగరేణి యాజమాన్యం క్రీడాకారులను ప్రోత్సహిస్తుందన్నా రు. ఈ కార్యక్రమంలో స్థానిక సీఐ నరేష్కుమార్, అధికార ప్రతినిధి మారుతి, సీనియర్ పీఓ శ్రావణ్ కుమార్, స్పోర్ట్స్ సూపర్వైజర్ శ్రీనివాస్, హెచ్‌సీ యూ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్, కోచ్‌లు రాజ్‌కుమార్, తిరుపతి, క్రీడాకారులు పాల్గొన్నారు. జీఎం రాజేశ్వర్‌రెడ్డి ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభం -
ఆర్మీలో ఉద్యోగం నా కల
మహబూబాబాద్ అర్బన్: నా చిన్నతనం నుంచే పోలీస్, ఆర్మీలో చేరాలన్నది నా కల. 2012లో ఆర్మీ ఉద్యోగానికి ఎంపికయ్యాను. ఆడపిల్లవు, ఆర్మీ అంటే ప్రాణాలతో చెలగాటం.. అని అమ్మ భయపడింది. కానీ, ఈరోజుల్లో ఆడపిల్లలు విమానాలు, రాకెట్లు నడపుతున్నారు.. దేశాలు దాటి అమ్మాయిలు ఉద్యోగాలు చేస్తున్నారు.. నేను దేశంలోనే ఉంటూ దేశంకోసం పనిచేస్తానని అమ్మకు నచ్చజెప్పా. గుజరాత్, జమ్మూకాశ్మీ ర్, న్యూఢిల్లీలో పనిచేశా. ప్రస్తుతం హైదరాబాద్‌లో రాపిడ్యాక్షన్ ఫోర్స్‌లో విధులు నిర్వహిస్తున్నాను. – ఎడ్ల ఝాన్సీ, మానుకోట -
కొడుకు చెప్పగానే ఒప్పేసుకున్న తల్లి..
ఖానాపురం: దేశంపై ఎనలేని ప్రేమ.. వ్యవసాయం చేస్తూ ఇరువురు కుమారులను పెంచింది.. డిగ్రీ వరకు చదివించింది.. కుమారుడు సైన్యంలోకి వెళ్తానంటే ఒప్పుకుంది.. వెన్నంటి ప్రోత్సహిస్తూ ఆదర్శంగా నిలిచింది వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని అశోక్‌నగర్ గ్రామానికి చెందిన ఎల్ది పద్మ. దేశరక్షణలో భాగస్వామి కావాలని కుమారుడు ఎలేందర్‌గౌడ్‌కు సూచించింది. మొదటి ప్రయత్నంలో రాకపోవడంతో కొంత నిరుత్సాహపడ్డాడు. మళ్లీ ఎలేందర్‌గౌడ్‌ను తల్లి పద్మతోపాటు అన్న మురళి ప్రోత్సహించారు. రెండో ప్రయత్నంలో ఆర్మీలో ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం దేశరక్షణలో భాగంగా రాజస్థాన్‌లో విధులు నిర్వరిస్తున్నాడు. పాకిస్థాన్‌తో శనివారం వరకు జరిగిన యుద్ధంలో పాల్గొన్నాడు. శత్రువులతో పోరాడాడని తల్లి సంతోషం వ్యక్తం చేసింది. -
క్రీడల్లో గెలుపోటములు సహజం
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుచిట్యాల: క్రీడాకారులకు క్రీడల్లో గెలుపోటములు సహజమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శనివారం మండల కేంద్రంలో జీఎస్ఆర్ సీసీపీఎల్ క్రికెట్ క్రీడోత్సవాల్లో గెలుపొందిన క్రీడాకారులకు నగదు బహుమతులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఆడాలన్నారు. ఓటమి చెందిన క్రీడాకారులు రేపటి గెలుపు కోసం పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి–సత్యం, జిల్లా, మండల నాయకులు అప్పం కిషన్, ముకిరాల మధువంశీకృష్ణ, కామిడి రత్నాకర్‌రెడ్డి, దబ్బెట అనిల్, చిలుకల రాయకొంరు, పుల్లూరి సతీష్, కట్కూరి నరేందర్, సర్వ శరత్, తదితరులు పాల్గొన్నారు. -
మన సంస్కృతీసంప్రదాయాలు ఉట్టిపడేలా..
వెంకటాపురం(ఎం)/ఖిలావరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ నెల14న పర్యటించనున్న ప్రపంచ అందాలభామలకు మన సంస్కృతీసంప్రదాయాలు తెలిసేలా సాంస్కృతిక కార్యక్రమాలకు అధికారులు రూపకల్పన చేశారు. మొత్తంగా 116 దేశాల సుందరీమణులు ముందుగా హనుమకొండలోని హరిత హోటల్లో కొద్దిసేపు సేదదీరాక.. వేయిస్తంభా ల దేవాలయం చేరుకుని రుద్రేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అక్కడినుంచి రెండు బృందాలుగా విడిపోయి.. ఒక బృందం నేరుగా ములుగు జిల్లా రామప్ప చేరుకోనుంది. మరోబృందం కాకతీయు రాజధాని ఖిలా వరంగల్ మధ్యకో టకు వెళ్తుంది. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవా లయాన్ని సుందరీమణులు హిందూ సంప్రదాయ దుస్తుల్లోనే సందర్శించనున్నట్లు సమాచారం. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో రామప్ప ఆలయం వద్దకు చేరుకున్న వా రికి గిరిజన నృత్యంతో కళాకారులు స్వాగతం పలుకుతారు. కొమ్ముకోయ నృత్యాన్ని ప్రదర్శిస్తూ అలరిస్తారు. వివిధ పూ జా, ఇతరత్రా కార్యక్రమాల తరువాత గార్డెన్లో ఏర్పాటు చేసిన వేదిక వద్ద సాంస్కృతిక ప్రదర్శనలు ఉండనున్నాయి. అలేఖ్య పుంజాల బృందంతో క్లాసికల్ డ్యాన్స్, పేరిణి నృత్య ప్రదర్శన ఉంటుందని అధికారులు వెల్లడించారు. కాకతీయుల కళా సంస్కృతిని చాటేలా.. ఖిలావరంగల్ కోటలోని శిల్పాల ప్రాంగణంలో పర్యాటకశాఖ ఆధ్వర్యంలో గజ్జల రంజిత్‌కుమార్ నేతృత్వంలో 5 నిమిషాల నిడివిగల పేరిణి శివ తాండవ నృత్యాన్ని ప్రదర్శించనున్నారు. కాకతీయుల కళా సంస్కృతిని ప్రపంచానికి చాటే విధంగా అద్భుతమైన ప్రదర్శన చేయనున్నారు. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.అందాలభామలను అబ్బురపర్చేలా ప్రదర్శనలు రామప్ప వద్ద గిరిజన, కొమ్ముకోయ నృత్యాలు ఖిలావరంగల్ కోటలో పేరిణి శివతాండవం ఏర్పాట్లు చేస్తున్న టూరిజం, జిల్లాల అధికారులు సంప్రదాయ దుస్తుల్లో రామప్పకు సుందరీమణులు -
నేడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలో సింగరేణి యాజమాన్యం ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను నేడు (ఆదివారం) ప్రారంభించనున్నట్లు ఏరియా అధికార ప్రతినిధి మారుతి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సింగరేణి గెస్ట్‌హౌస్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, సింగరేణి సీఎండీ బలరాంనాయక్‌లు ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నట్లు తెలిపారు.రైతు సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఎన్నికభూపాలపల్లి రూరల్: భూమాత రైతు సంక్షేమ సంఘం జిల్లా కమిటీని ఎన్నుకున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మేకల దశరథం తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమిటీ ప్రకటించారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా వేశాల సాంబయ్య, ఉపాధ్యక్షులుగా దానవేన రాజయ్య, గుండ రవీందర్, బండ రవీందర్, సహాయ కార్యదర్శులుగా చేపూరి దేవరాజ్, మన్మధ రావు, కోశాధికారిగా బిల్లా సుధాకర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా గంపల రామన్న, తూటి దేవేందర్, పంతకాని సడవలి పుప్పాల రాజులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.సీఎం రాకను అడ్డుకుంటాం..కాటారం: గత ప్రభుత్వ హయాంలో ఎంపికై న లబ్ధిదారుల దళితబంధు మంజూరు విషయంలో ప్రభుత్వం నుంచి స్పందన లేనందున ఈ నెల 15న కాళేశ్వరానికి రానున్న సీఎం రేవంత్‌రెడ్డిని అడ్డుకుంటామని దళితబంధు సాధన సమితి జిల్లా అధ్యక్షుడు నమూండ్ల సంపత్మహారాజ్ అన్నారు. కాటారం మండల కేంద్రంలో సబ్ డివిజన్ పరిధిలోని దళితబంధు లబ్ధిదారులతో శనివారం సమావేశం నిర్వహించారు. అనంతరం సంపత్మహారాజ్ మాట్లాడుతూ పద్దెనిమిది నెలలుగా దళితబంధు నిధులను ఫ్రీజింగ్ నుంచి తీయాలని పలుమార్లు రాష్ట్ర సచివాలయం ప్రజావాణి, మంత్రులు, జిల్లా అధికారులకు విన్నవించినప్పటికీ స్పందన లేదన్నారు. దళిత కుటుంబాలకు దళితబంధు లేదా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు అంబేడ్కర్ అభయహస్తం అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. తమ ఆవేదనను నేరుగా సీఎం ఎదుట నిరసన రూపంలో తెలియజేసేలా కార్యచరణ చేపడుతామన్నారు. ఈ సమావేశంలో బొబ్బిలి వెంకన్న, పులి రామన్న, రాజేందర్, ముత్తన్న, సడువలి, తదితరులు పాల్గొన్నారు.సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలికాటారం: కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ, రాష్ట్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, సంఘాల పిలుపు మేరకు ఈ నెల 20న నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బందు సాయిలు పిలుపునిచ్చారు. కాటారం మండల కేంద్రంలో శనివారం సమ్మె పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్కోడ్లను కేంద్రం తీసుకొచ్చిందన్నారు. సార్వత్రిక సమ్మెకు సంయుక్త కిసాన్ మోర్చా సంపూర్ణ మద్దతు ప్రకటించిందన్నారు. సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికులు, ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆత్కూరి శ్రీకాంత్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పోలం చిన్న రాజేందర్, నాయకులు రాజయ్య, బొడ్డు స్మరణ్, ఆదివాసి గిరిజన సంఘం నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. -
మనకంటూ ఓ బ్రాండ్ వచ్చేలా..
నిర్మల్, పోచంపల్లి వంటి ప్రాంతాలకు వచ్చిన ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని ములుగు జిల్లాకు ప్రత్యేక బ్రాండ్ తీసుకొచ్చేలా వెదురు బొంగులతో ప్రత్యేక అందాలను ఇచ్చే విధంగా బొమ్మలను తయారు చేయిస్తున్నాం. రామప్ప దేవాలయ సందర్శనకు వచ్చే అందాల తారలకు బహుమతులుగా ఇవ్వాలా.. స్టాల్ ఏర్పాటు చేసి విక్రయించాలా అనేది ఆలోచిస్తున్నాం. ఇప్పటికే 30 మంది మహిళలకు 20 రోజులపాటు శిక్షణ ఇచ్చాం. వారు చేసిన బొమ్మలు చూడముచ్చటగా, సహజసిద్ధంగా ఉన్నాయి. అందరినీ ఆకర్షిస్తాయి. – రాహుల్ కిషన్ జాదవ్, డీఎఫ్ఓ, ములుగు ● -
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
మొగుళ్లపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి ముద్దమల్ల రాజేందర్ అన్నారు. శుక్రవారం మండలంలోని పిడిసిల్ల పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు మహ్మద్ సాధిక్ ఆధ్వర్యంలో నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రతి సబ్జెక్టులో తగిన అర్హతలతో మంచి అనుభవం గల ఉపాధ్యాయులతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బోధన అందిస్తున్నామన్నారు. రానున్న విద్యా సంవత్సరంలో ఏఐ (కృత్రిమ మేధ)తో కూడా విద్యాబోధన అందించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విశాలమైన తరగతి గదులు, ఆటస్థలం, మధ్యాహ్న భోజన పథకంలో పౌష్టికాహారం, ఉదయం రాగి జావ, ఉచిత పాఠ్యపుస్తకాలు, రాత పుస్తకాలు, రెండు జతల ఏకరూప దుస్తులు, 10వ తరగతి విద్యార్థులకు ప్రణాళిక ప్రకారం ప్రత్యేక తరగతుల బోధన, ఆ సమయంలో విద్యార్థులకు స్నాక్స్ కూడా అందిస్తున్నామన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు విశాలమైన ఆటస్థలంలో వారి ఆసక్తికి అనుగుణంగా వ్యాయామ ఉపాధ్యాయులతో వివిధ రకాల ఆటలు ఆడిస్తూ వారి మానసిక, శారీరక పెరుగుదలకు కృషి చేస్తున్నామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని కోరారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎండీ సాధిక్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోటేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి లింగాల కుమారస్వామి, జిల్లా కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి సామల రమేష్, జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ దుప్పటి రాజగోపాల్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షురాలు శోభ, అంగన్వాడీ సిబ్బంది, తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.డీఈఓ రాజేందర్ -
కాళేశ్వరంలో పెరిగిన నీటిమట్టం
జ్ఞానదీపం ఏర్పాటుకాళేశ్వరం: మహారాష్ట్రలో కురిసిన వర్షాల కారణంగా కాళేశ్వరం వద్ద నీటిమట్టం పెరిగింది. నాలుగు రోజులుగా మహారాష్ట్రలో అక్కడక్కడా కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నది ద్వారా గోదావరికి స్వల్ప వరద పెరిగింది. ప్రస్తుతం 2,350 క్యూసెక్కుల నీరు దిగువకు తరలిపోతోంది. నాలుగు రోజుల క్రితం వరకు ఎండల తీవ్రత నేపథ్యంలో 1,800 క్యూసెక్కులు తరలిపోయినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. కాగా, ఈనెల 15 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న సరస్వతినది పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం నీరు పెరిగిందని అధికారులు పేర్కొంటున్నారు. టెంట్‌సిటీ రెడీ.. పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం టెంట్‌సిటీ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. 30వరకు టెంట్లు, ఏసీలతో సిద్ధం చేసి, ఫర్నిచర్, ఇతర సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తున్నారు. కాళేశ్వరంలో సరస్వతినది పుష్కరాల కోసం ఏర్పాటు చేసిన సరస్వతిమాత విగ్రహం ఎదుట రెండు వైపులా జ్ఞానదీపం ఏర్పాటు చేశారు. రెండు చేతులు జోడించి తాళపత్ర గ్రంథాల్లో జ్యోతి వెలిగినట్లు కనిపించే సీఆర్సీతో తయారు చేసిన మెటల్‌ను ఏర్పాటు చేశారు. దీన్ని తమిళనాడులోని మహాబలిపురంలో తయారు చేయించారు. -
అక్రమ సోదాలు సరికాదు..
భూపాలపల్లి అర్బన్: సాక్షి తెలుగు దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంటిపై పోలీసుల అక్రమ సోదాలను నిరసిస్తూ శుక్రవారం జిల్లాకేంద్రంలోని స్థానిక ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. కాకతీయ ప్రెస్‌క్లబ్ నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఏపీ ప్రభుత్వం జర్నలిస్టుపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని, ప్రజా సమస్యలను వెలికితీస్తే ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడటం సరికాదని జర్నలిస్టులు మండిపడ్డారు. కార్యక్రమంలో జర్నలిస్టులు సామంతులు శ్యామ్, ఎడ్ల సంతోష్, దొమ్మటి రవీందర్, తిక్క ప్రవీణ్, సుధాకర్, రవీందర్, పసుపుల రాజు, వెంకటస్వామి, శేఖర్, పవన్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జోసఫ్ పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన
మొగుళ్లపల్లి: మండలంలోని ఇస్సిపేట, మొగుళ్లపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను శుక్రవారం జిల్లా వ్యవసాయాధికారి వీరునాయక్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేసేటప్పుడు నిబంధనలు పాటించాలని.. తేమశాతం 17 దాటకూడదని సూచించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఫార్మర్ రిజిస్ట్రీ గురించి రైతులకు వివరించి ప్రతి ఒక్క రైతు ఫార్మర్ రిజిస్ట్రీలో రిజిస్ట్రేషన్ చేసుకునేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సురేందర్‌రెడ్డి, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. -
విజయం దక్కాలని ప్రత్యేక పూజలు
కాళేశ్వరం/రేగొండ: పాకిస్తాన్‌తో జరుగుతున్న యుద్ధంలో భారతదేశానికి విజయం లభించాలని, ఆపరేషన్ సిందూర్‌లో ధైర్యంగా పోరాడుతున్న భారత సైన్యానికి, త్రివిధ దళాలకు సంఘీభావం తెలియజేస్తూ కాళేశ్వరాలయం, రేగొండ మండలం కోటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. కాళేశ్వరం ముక్తీశ్వరస్వామి ఆలయంలో ఉప ప్రధాన అర్చకులు ఫణీంద్రశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాళేశ్వరాలయం దేవస్థాన ఈఓ ఎస్.మహేష్, స్థపతి వల్లినాయగం, ఎస్ఈ దుర్గాప్రసాద్, సూపరింటెండెంట్ బుర్రి శ్రీనివాస్, కోటంచ ఆలయ చైర్మన్ ముల్కనూరి భిక్షపతి, అర్చకులు బుచ్చమచార్యులు, శ్రీనాధచార్యులు, ఆలయ ధర్మకర్తలు బండి మల్లయ్య, మల్లెబోయిన శ్రీధర్, మూల ఓంకార్ పాల్గొన్నారు. -
అధికారులు కాళేశ్వరంలోనే ఉండాలి
కాళేశ్వరం: కాళేశ్వరంలో ఈనెల 15 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న సరస్వతి నది పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా శనివారం నుంచి అధికారులు కాళేశ్వరంలోనే మకాం వేసి, అన్ని ఏర్పాట్లను సమీక్షించి పర్యవేక్షించాలని కలెక్టర్ రాహుల్‌శర్మ ఆదేశించారు. కాళేశ్వరం దేవస్థానం ఈఓ కార్యాలయంలో జిల్లా అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని విభాగాలు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆరోగ్య శిబిరాల ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాలకు అవసరమైన స్టేజీ, మైక్ ఇతర ఏర్పాట్లు, పారిశుద్ధ్య చర్యలు, సిబ్బందికి ఆహార ఏర్పాట్లపై పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు. ఈఓ కార్యాలయంలో వైద్య సిబ్బందితో వైద్య సేవలు నిర్వహణపై సమావేశం నిర్వహించారు. మూడు షిఫ్ట్‌ల్లో విధులు నిర్వహించాలని ఆదేశించారు. అత్యవసర మందులు, ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉండాలని తెలిపారు. అత్యవసర సేవలకు మహాదేవపూర్‌లో 30 బెడ్లు అందుబాటులో ఉంచాలని అన్నారు. అంబులెన్స్, 108 సేవలు నిత్యం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అనంతరం వీవీఐపీ ఘాట్‌లోని త్రివేణి సంగమం వద్ద గోదావరిలో నీటిమట్టాన్ని పరిశీలించారు. సీఎం రానున్న నేపథ్యంలో ముందస్తుగా రక్షణ చర్యలను పర్యవేక్షించారు. వర్షం వచ్చినా టెంట్ సిటీ వద్ద బురద కాకుండా భక్తులకు ఇబ్బంది లేకుండా గ్రావెల్ వేయాలని పీఆర్ ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అడిషనల్ ఎస్పీ కిషన్, సీఐ రామచందర్‌రావు, వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, డీఎల్పీఓ వీర భద్రయ్య, ఎస్పీడీసీఎల్ ఎస్ఈ మల్చూర్‌నాయక్, డీఈఈ పాపిరెడ్డి, ఏడీఈ నాగరాజు ఉన్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలి కలెక్టర్ రాహుల్‌శర్మ -
అకాల వర్షం.. తడిసిన ధాన్యం
ఏటూరునాగారం/మంగపేట: జిల్లాలో గురువారం అకాల వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల కల్లాల్లో ఆరబోసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. ఏటూరునాగారంలో గురువారం సాయంత్రం కురిసిన వర్షానికి మండల కేంద్రంలోని జీసీసీ కొనుగోలు కేంద్రంలోని ధాన్యం తడిసిపోయింది. ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది గానీ సరైన రక్షణ, టార్పాలిన్లు ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటాలు కాక రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియక ధాన్యం రాశుల వద్దనే నిరీక్షించాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. మంగపేట మండలంలో గురువారం ఉదయం, రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీవర్షం కురిసింది. -
చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి
ఏటూరునాగారం: గిరిజన విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ పోచం అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో గోల్డ్‌మెడల్ సాధించిన లావణ్యను డీడీ పోచం గురువారం సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ములుగు జిల్లా సూర్య తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కరాటే పోటీల్లో కొమురం లావణ్య మాస్టర్ పర్యవేక్షణలో శిక్షణ పొందిందని తెలిపారు. మార్చిలో నిర్వహించిన ఇండియా, నేపాల్ అంతర్జాతీయ చాంపియన్ షిప్ పోటీల్లో 49 కిలోల కేటగిరిలో స్వారింగ్లో పాల్గొని గోల్డ్‌మెడల్ సాధించినట్లు వివరించారు. ఈ సందర్భంగా ఆమెను సన్మానించినట్లు పేర్కొన్నారు. -
రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు రేగొండ: భూభారతి రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. గురువారం మండలంలోని తిరుమలగిరి గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పైలట్ ప్రాజెక్ట్ కింద నిర్వహిస్తున్న రెవె న్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దరఖాస్తులను వెంటవెంటనే పరిశీలిస్తూ సమస్యలకు పరిష్కారం లభించేలా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ఈ సదస్సులో దరఖాస్తులను పరిశీలించి జూన్ 2న పట్టా పాస్ పుస్తకాలు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్వేత, కాంగ్రెస్ నాయకులు గంగుల రమణారెడ్డి, గంట గోపాల్, వెంకటస్వామి, పన్నాటి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
రేగొండ: రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. గురువారం మండలంలోని దమ్మన్నపేట, తిరుమలగిరి గ్రామాలలో జరుగుతున్న రెవెన్యూ సదస్సులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూభారతి రెవెన్యూ చట్టంపై పైలట్ ప్రాజెక్ట్‌గా రేగొండ మండలాన్ని ఎంపిక చేసి రైతుల నుంచి భూసమస్యల దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ప్రజల దరఖాస్తులను పరిశీలించిన కలెక్టర్, రైతులు ఇచ్చిన దరఖాస్తులను తప్పనిసరిగా రిజిస్టర్లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. హెల్ప్‌డెస్క్‌ను పరిశీలించి రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాలని సూచించారు. సదస్సులో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా నోటీసులు జారీ చేసి, ప్రజలకు త్వరితగతిన న్యాయం చేకూరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రవి, తహసీల్దార్లు సత్యనారాయణ స్వామి, శ్వేత, అధికారులు, రైతులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్‌శర్మ -
పోస్టుమార్టం అంతా గోప్యం!
ఎంజీఎం/మామునూరు: తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహరిద్దులోని పేరూరు–లంకపల్లి అడవుల్లో గురువారం తెల్లవారు జామున జరిగిన పరస్పర కాల్పుల్లో ముగ్గురు గ్రేహౌండ్ కమాండర్లు మందుపాతర పేలి చనిపోయారని పోలీసులు ప్రకటించారు. వారి మృతదేహాలను ప్రత్యేక హెలికాప్టర్లో గురువారం మధ్యాహ్నం వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు తీసుకువచ్చారు. అక్కడినుంచి మామునూరు ఏసీపీ తిరుపతి పర్యవేక్షణలో పటిష్ట బందోబస్తు నడుమ ప్రత్యేక అంబులెన్స్‌లో ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు ఏసీపీ స్థాయి అధికారులు, ముగ్గురు తహసీల్దార్లు, గ్రేహౌండ్స్ అధికారులు నాలుగు గంటలపాటు రహస్యంగా పోస్టుమార్టం చేయించారు. కనీసం మార్చురీ వద్ద మృతి చెందిన పోలీసుల పేర్లు వెల్లడించలేదు. సాయంత్రం 6 గంటలకు పోస్టుమార్టం పూర్తయ్యింది. ఆ తర్వాత డీజీపీ జితేందర్, ఏడీజీ గ్రే హౌండ్స్ స్టీపెన్ రవీంద్ర ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. నక్సలైట్ల దాడిలో గ్రే హౌండ్స్‌కు చెందిన కమాండర్లు వడ్ల శ్రీధర్, ఎన్.పవన్ కళ్యాణ్, టి.సందీప్ చనిపోయినట్లు సాయంత్రం మీడియాకు అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశారు. అనంతరం మృతదేహాలను చాపల్లో చుట్టి ప్రత్యేక బందోబస్తు నడుమ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు తరలించారు. అక్కడ కమాండర్ల మృతదేహాలకు మంత్రి ధనసరి సీతక్క, డీజీపీ జితేందర్, ఏడీజీ గ్రే హౌండ్స్ స్టీపెన్ రవీంద్ర, ఎమ్మెల్యేలు నాగరాజు, రాజేందర్‌రెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, సీపీ సన్ ప్రీత్ సింగ్, ములుగు ఎస్పీ డాక్టర్ శబరీష్ నివాళులర్పించారు. ముగ్గురు జవాన్లలో ఇద్దరు హైదరాబాద్, మరొకరు కామారెడ్డి ప్రాంతానికి చెందిన వారు. బుల్లెట్ గాయాలతోనే మృతి.. బుల్లెట్ గాయాలతోనే జవాన్లు మృతిచెందినట్లు పోస్టుమార్టం ద్వారా స్పష్టంగా వెల్లడైంది. ల్యాండ్‌మైన్ పేలడంతోనే జవాన్లు చనిపోయి ఉంటే మృతదేహాలు చెల్లాచెదురయ్యేవి. కాగా, ముగ్గురు జవాన్లకు ఐదు బుల్లెట్లు దిగినట్లు తెలుస్తోంది. మెడ, పక్కటెముకలు, కడుపులోకి బుల్లెట్లు వెళ్లడంతో వారు మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనలో మరో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. పైడిపల్లికి చెందిన ఆర్ఎస్సై రణధీర్‌ను అత్యవసర వైద్యసేవల కోసం హైదరాబాద్ ఏఐజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. మార్చురీ వద్ద కనిపించని కుటుంబ సభ్యులు.. సాధారణంగా మార్చురీ వద్ద మృతదేహాలకు పోస్టుమార్టం చేస్తుండగా వారి కుటుంబ సభ్యులు ఉంటారు. కానీ, పోలీస్ సిబ్బంది, గ్రేహౌండ్స్ ఉన్నతాధికారులు ముగ్గురు జవాన్ల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను పోస్టుమార్టం వద్దకు రానివ్వకుండా పోలీసు హెడ్‌క్వార్టర్స్‌కు తరలించారు. ఎంజీఎం మార్చురీ వద్ద కమాండర్ల పేర్లు వెల్లడించని అధికారులు డీజీపీ వచ్చాక సాయంత్రం అధికారిక ప్రకటన విడుదల ప్రత్యేక బందోబస్తుతో హెడ్‌క్వార్టర్స్‌కు మృతదేహాల తరలింపు -
పత్రికా స్వేచ్ఛను హరిస్తే పతనం తప్పదు
ములుగు: పత్రిక స్వేచ్ఛను హరిస్తే పసుపు రంగు ప్రభుత్వానికి పతనం తప్పదని టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు ఎండీ.షఫీ అహ్మద్ అన్నారు. ఏపీలోని విజయవాడలో ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డి నివాసంలో గురువారం పోలీసులు సోదాలు చేసి భయభ్రాంతులకు గురిచేసినందుకు నిరసనగా ములుగు సాక్షి ఆర్సీ ఇన్చార్జ్ భూక్య సునిల్ ఆధ్వర్యంలో జర్నలిస్టు సంఘాల నాయకులు ములుగు జాతీయ రహదారిపై నల్లా బ్యాడ్జీలు ధరించి ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాల నాయకులు షఫీ అహ్మద్, రామిడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ కార్డెన్ సెర్చ్ పేరుతో సాక్షి ఎడిటర్ ఇంట్లో సోదాలు నిర్వహించడం సిగ్గుమాలిన చర్య అన్నారు. రాజకీయ కుట్రలో భాగంగా ‘సాక్షి’పై కక్షపూరితంగానే ఎడిటర్ ఇంటికి వెళ్లి పోలీసులతో ఏపీ ప్రభుత్వం డ్రామా ప్లే చేయించిందని మండిపడ్డారు. పోలీసులను అడ్డుపెట్టుకొని ఎడిటర్లు, జర్నలిస్టులను నియంత్రించాలనుకోవడం అవివేకమన్నారు. పత్రిక స్వేచ్ఛను అడ్డుకున్న ప్రతీ రాజకీయ పార్టీకి తగిన గుణపాఠం తప్పదవి వారు హెచ్చరించారు. టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఎండీ.షఫీ అహ్మద్ -
సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ..
రోస్టర్ పద్ధతిలో పుష్కర విధులు సరస్వతి పుష్కరాల విధుల నిర్వహణకు డ్యూటీ రోస్టర్ తయారు చేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.– 10లోuకాళేశ్వరంతో పాటు చుట్టుప్రక్కల శివారుల్లో సుమారు 200కుపైగా సీసీ కెమెరాలు పోలీసులు అమర్చుతున్నారు. కాళేశ్వరం దేవస్థానానికి సంబంధించిన కెమెరాలు 60, ఇప్పటికే పోలీసులు ఏర్పాటు చేసినవి 11, ప్రధాన రహదారిలో 30కిపైగా ఉన్నాయి. మొత్తం 25 లొకేషన్లలో సీసీ కెమరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో లొకేషన్లో మూడు నుంచి నాలుగు వరకు కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. కెమెరాలు 4 మెగా ఫిక్సల్ సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తు తం పుష్కరాల నేపథ్యంలో మజీదుపల్లి రోడ్డు, వీఐపీఘాటు, అక్కడే ఉన్న పార్కింగ్ స్థలాలు, ప్ర ధానఘాటు నుంచి వీఐపీ ఘాటు వరకు ఉన్న గ్రావెల్ రోడ్డు, అక్కడే ఉన్న హెలిపాడ్ వద్ద, ప్రధానఘాటు, శ్రాద్ద మండపాలు, గోదావరి నుంచి బస్టాండ్ వరకు, ఆలయం చుట్ట పరిసరాలు, మహా రాష్ట్ర రోడ్డు అంతర్రాష్ట్ర వంతెన నుంచి కాళేశ్వరం బస్టాండ్ వరకు, అక్కడే ఉన్న పార్కింగ్, హరిత హోటల్ సమీపంలో, సబ్‌స్టేషన్ నుంచి పలుగుల బైపాస్ రోడ్డు వరకు, అక్కడే ఉన్న పార్కింగ్ స్థలం, ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటు స్థలం వద్ద సీసీ కెమెరాలు మరో 300 వరకు ఏర్పాటు చేస్తున్నారు. -
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
భూపాలపల్లి: పోలీసు అధికారులు, సిబ్బంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ఎస్పీ కిరణ్ ఖరే సూచించారు. హైదరాబాద్ యశోద హాస్పిటల్ సౌజన్యంతో గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు మెగా వైద్యశిబిరం నిర్వహించారు. ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ.. పోలీసులు రాత్రింబవళ్లు పనిచేయడంతో పాటు, ప్రతీరోజు ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటూ అధిక ఒత్తిడికి లోనవుతారని అన్నారు. ఫలితంగా ఆరోగ్య సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 650 మంది పోలీసు అధికారులు, సిబ్బంది, పోలీసుల కుటుంబసభ్యులకు కార్డియాలజీ, ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్ మెడిసిన్, ఆప్తమాలజీతో పాటు పలు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని గుర్తించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బోనాల కిషన్, ఏఆర్ అదనపు ఎస్పీ వేముల శ్రీనివాస్, భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, సీఐలు డి.నరేష్కుమార్, మల్లేష్, యశోద ఆస్పత్రి వైద్యులు పాల్గొన్నారు.ఎస్పీ కిరణ్ ఖరే -
నిలిచిన దేవాదుల పంపింగ్
కన్నాయిగూడెం: మండల పరిధిలోని తుపాకులగూడెం సమీపంలోని దేవాదుల మోటార్ల పంపింగ్‌ను నిలిపివేశారు. గత కొద్ది రోజుల నుంచి ఒక మోటార్ ద్వారా పంపింగ్‌ను కొనసాగించిన అధికారులు గోదావరిలో నీటి ప్రవాహం తగ్గడంతో బుధవారం పంపింగ్‌ను పూర్తిగా నిలిపి వేశారు. పంపింగ్ వద్ద 10మోటార్లు ఉండగా గతంలో కొన్ని మోటార్లతో పంపింగ్‌ను కొనసాగించి వారం క్రితం బంద్‌చేసి ఒక మోటార్‌ను మాత్రమే పంపింగ్‌లో ఉంచారు. మంగళవారం వరకు ఒక మోటారు ద్వారా 247 క్యూసెక్కుల నీటిని దిగువకు పంపింగ్ చేసిన అధికారులు బుధవారం ఒక మోటారు పంపింగ్‌ను కూడా పూర్తిగా నిలిపివేసినట్లు వెల్లడించారు. ఎగువ నుంచి నీటి ప్రవాహం పూర్తిగా తగ్గడంతో పూర్తిగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పంపింగ్ వద్ద 71.65 మీటర్ల నీటి మట్టం ఉంది. సమ్మక్కసాగర్ బ్యారేజీ వద్ద.. తుపాకులగూడెం గోదావరిపై ఉన్న సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరుకుంది. కొన్ని రోజులుగా ఎగువ నుంచి నీటి ప్రవాహం తగ్గడంతో బ్యారేజీలో నీటి నిల్వలు తగ్గాయి. దీంతో బ్యారేజీ వద్ద నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరింది. బ్యారేజీ సామర్థ్యం 6.94 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.727టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. పూర్తిలెవల్ 83మీటర్లు కాగా 72.10 మీటర్లకు చేరుకుంది. బ్యారేజీలో 59గేట్లు ఉండగా అందులో 58 గేట్లను మూసి ఒక గేటు ఓపెన్ చేసి దిగువకు 200క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. గోదావరిలో తగ్గిన నీటిమట్టం సమ్మక్క బ్యారేజీ వద్ద డెడ్ స్టోరేజీ -
ఖాళీ సీట్లకు లక్కీడ్రా
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని మైనారిటీ గురుకులంలో ఖాళీగా ఉన్న సీట్లకు నేడు(గురువారం) లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు గురుకుల ప్రిన్సిపల్ రవి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నాన్ మైనారిటీ విద్యార్థుల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న వారు అర్హులని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో డ్రా నిర్వహించనున్నట్లు చెప్పారు.హానికర రసాయనాలు వాడొద్దుమల్హర్: మామిడికాయలు మాగబెట్టే ప్రక్రియలో హానికారక రసాయనాలు వాడొద్దని జిల్లా ఉద్యాన అధికారి సునీల్ అన్నారు. మామిడికాయలు మాగబెట్టే విధానంపై సేవా స్ఫూర్తి ఫౌండేషన్, ఉద్యాన శాఖ జిల్లా అధికారి సునీల్ ఆధ్వర్యంలో బుధవారం తాడిచర్ల గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాయల పక్వత, కాయలు నిల్వచేసే పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సేవా స్ఫూర్తి ఫౌండేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ రత్నాకర్‌రావు, డివిజన్ ఉద్యాన అధికారి మణి, మండల వ్యవసాయ అధికారి శ్రీజ, రైతులు సుద్దతి రాజేశ్వర్‌రావు, గంగుల రవి, నరేష్, బండి రాజేందర్, ఓదెలు, కుమార్ పాల్గొన్నారు.విశ్రాంతి గది ప్రారంభంభూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 5వ గనిలో మహిళా ఉద్యోగుల సౌకర్యార్థం ఏర్పాటుచేసిన విశ్రాంతి గదిని బుధవారం ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి ప్రారంభించారు. కేటీకే 5వ గనిలో మహిళా ఉద్యోగులు 35మంది పని చేస్తున్నారని, మహిళల భాగస్వామ్యం పెరిగిన దృష్ట్యా విశ్రాంతి గదిని ఏర్పాటు చేసినట్లు జీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు కవీంద్ర, వెంకటరమణ, జాకీర్‌హుస్సేన్, కార్మిక సంఘాల నాయకులు తిరుపతి, గట్టు రాజు పాల్గొన్నారు.పుష్కరాల పనులను పరిశీలించిన సీఎండీకాళేశ్వరం: కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులను టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. అనంతరం సబ్‌స్టేషన్‌లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఐదు ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మన్‌ను ప్రారంభించారు. ఆయనతో రాజుచౌహాన్, ఎస్ఈ మల్చూరు నాయక్, డీఈ పాపిరెడ్డి, ఏడీఈ నాగరాజు, ఏఈ శ్రీకాంత్ ఉన్నారు.కాళేశ్వరంలో దేవాదాయశాఖ కమిషనర్ పూజలుకాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ వెంకట్రావు బుధవారం దర్శించుకున్నారు. ఆయన రాజగోపురం వద్దకు రాగా అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. గర్భగుడిలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ శుభానందదేవి అమ్మవారి దర్శనం అనంతరం కమిషనర్‌ను అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ ఈఓ శనిగెల మహేష్ స్వామి వారిని శేష వస్త్రాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్జేసీ రామకృష్ణారావు, డీసీ సంధ్యారాణి, ఏసీ సునీత, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ కవిత, సూపరింటెండెంట్ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. -
విధి నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలి
ములుగు: విధి నిర్వహణలో ఉద్యోగులు తగిన జాగ్రత్తలు పాటించాలని టీజీఎన్పీడీసీఎల్ ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల డీఈలు పులుసం నాగేశ్వరరావు, వెంకటేశం అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సబ్ డివిజన్ల విద్యుత్ సిబ్బందితో బుధవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎల్సీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం భద్రతా వారోత్సవాల వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. నిబంధనలు పాటించాలని సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. -
కల్యాణలక్ష్మి నిరుపేదలకు వరం
చిట్యాల: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం నిరుపేదలకు ఓ వరం లాంటిదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బుధవారం మండలకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చిట్యాల, టేకుమట్ల మండలాలకు చెందిన 52మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. ఈ మేరకు నిరుపేదలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి–సత్యం, టేకుమట్ల మాజీ జెడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ముకిరాల మధువంశీ కృష్ణ, మండల నాయకులు మూల శంకర్‌గౌడ్, చిలుకల రాయకొంరు, కిష్టయ్య, కుమార్, లక్ష్మన్, అనిల్, శ్రీనివాస్ పాల్గొన్నారు.భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
రైతులకు భూధార్ కార్డులు
రేగొండ(కొత్తపల్లిగోరి): ఆధార్ తరహాలో కేంద్ర ప్రభుత్వం ప్రతీ రైతుకు 11 అంకెలతో కూడిన యూనిక్ కోడ్ (భూధార్ కార్డు)ను కేటాయిస్తుందని జిల్లా వ్యవసాయాధికారి వీరునాయక్ తెలిపారు. బుధవారం కొత్తపల్లిగోరి మండలంలోని చిన్నకొడేపాక రైతువేదికలో ఫార్మర్ రిజిస్ట్రీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను చేపడుతోందన్నారు. రైతు యూనిక్ కోడ్ పొందాలంటే ఆధార్‌కార్డుతో పాటు లింక్ చేసిన సెల్‌ఫోన్ నంబరు, పట్టాదారు పాసుపుస్తకం కలిగి ఉండాలన్నారు. ఫార్మర్ రిజిస్ట్రీలో రైతులు తమ వివరాలు నమోదు చేస్తేనే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే పీఎం కిసాన్ నిధులు వస్తాయన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి ప్రశాంత్, రైతులుపాల్గొన్నారు.జిల్లా వ్యవసాయాధికారి వీరునాయక్ -
భూ సమస్యల పరిష్కారం కోసమే భూభారతి
● అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ రేగొండ: భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసమే భూభారతి చట్టాన్ని అమలు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. మంగళవారం మండలంలోని మడ్తపల్లి, పొనగండ్ల గ్రామాలలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దరఖాస్తులను వెంటవెంటనే పరిశీలిస్తూ సమస్యలకు పరిష్కారం లభించేలా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు సత్యనారాయణ స్వామి, శ్వేత, డిప్యూటీ తహసీల్దార్ రజాక్, కాంగ్రెస్ నాయకులు నాయినేని సంపత్‌రావు, భిక్షపతి, వినోద్, నరేందర్ పాల్గొన్నారు. -
ఉపాధి పనులపై ఎండల ప్రభావం
కాటారం: ఉపాధి హామీ పథకంలో కూలీలకు కూలి గిట్టుబాటు కావడం లేదు. ప్రభుత్వం రోజుకు రూ.307 ప్రకటించినప్పటికీ జిల్లాలో మాత్రం సగటు కూలి కేవలం రూ.224 మాత్రమే అందుతోంది. సిబ్బంది కూలీలకు నిర్దేశిత కొలతలు (మార్కింగ్) ఇస్తున్నప్పటికీ ఆ దిశగా పనులు చేయకపోవడంతోనే గిట్టుబాటు కూలి దక్కడం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేయడం, పనుల ప్రగతిపై పకడ్బందీగా ఆడిట్ నిర్వహిస్తుండటంతో క్షేత్రస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్లు పక్కాగా కొలతలు నమోదు చేస్తున్నారు. దీంతో కూలీలకు గిట్టుబాటు కూలి అందకపోవడానికి ఓ కారణంగా చెప్పొచ్చు. మరోవైపు ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో కూలీలు పనుల్లో త్వరగా అలసిపోతున్నారు. ఫలితంగా ప్రభుత్వం ప్రకటించిన కూలి దక్కించుకోవడంలో విఫలమవుతున్నారని అధికారులు తెలుపుతున్నారు.జిల్లాలో ఉపాధి హామీ వివరాలు..ఉపాధి హామీ అమలయ్యే మండలాలు 11గ్రామపంచాయతీలు 244గ్రామాలు 391జాబ్‌కార్డులు 1,09,843కూలీల సంఖ్య 2,41,667 -
ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి
చిట్యాల: కొనుగోలు కేంద్రాలలో మ్యాచర్ వచ్చిన వరి ధాన్యాన్ని సెంటర్ ఇన్‌చార్జ్‌లు త్వరితగతిన మిల్లులకు తరలించాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎన్.వీరునాయక్ కోరారు. మండలకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. అక్కడి రైతులతో మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సెంటర్ సిబ్బందికి సూచనలు చేశారు. రైతులు వర్షానికి ధాన్యం తడవకుండా జాగ్రత్త పడాలని కోరారు. అనంతరం మండలకేంద్రంలోని రైతువేదికలో జరిగిన రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మా ర్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి–సత్యం, ఏఓ శ్రీనివాస్‌రెడ్డి, ఎఈఓ సన్నీ, రైతులు పాల్గొన్నారు. ఫార్మర్ ఐడీ తీసుకోవాలి టేకుమట్ల: రైతులందరూ ఫార్మర్ ఐడీ తీసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరునాయక్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల వ్యవసాయాధికారి కల్యాణి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధార్ కార్డు వలే రైతులందరికీ ఫార్మర్ ఐడీ తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు రాహుల్, భరత్, అరుణ్, యోగిత పాల్గొన్నారు. -
ఆరోగ్య కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
● డీఎంహెచ్ఓ గోపాల్‌రావు ఎస్‌ఎస్‌తాడ్వాయి: జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను ఆశ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ గోపాల్‌రావు అన్నారు. ఆశ డేను పురస్కరించుకుని మంగళవారం మండల పరిధిలోని కొడిశాల పీహెచ్‌సీని సందర్శించి ఆశ కార్యకర్తలతో మాట్లాడారు. రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ లాంటి పరీక్షల ప్రాముఖ్యతను వివరించి నాలుగో విడత స్క్రీనింగ్ పరీక్షలకు ప్రజలు ముందుకు వచ్చేలా చూడాలన్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున ప్రజలు వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేయాలని తెలిపారు. జాతీయ టీబీ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా, ప్రతీ ఆశ కార్యకర్త విధిగా తెమడ పరీక్షలు చేయించాలన్నారు. -
హేమాచలుడి బ్రహ్మోత్సవాలు
మంగపేట: మల్లూరుగుట్టపై స్వయంభుగా వెలిసిన లక్ష్మీనర్సింహస్వామి ఆలయ క్షేత్రంలో స్వామివారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు(జాతర) రేపటి(గురువారం) నుంచి పది రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 10 రోజుల పాటు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల కార్యక్రమాలను ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రావణం సత్యనారాయణ పర్యవేక్షణలో భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు (వేదపండితులు) అమరవాది మురళీకృష్ణమాచార్యుల బృందం బ్రహ్మోత్సవాల కార్యక్రమాలను ఆగమశాస్త్ర ప్రకారం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలకు లక్షల సంఖ్యలో తరలివచ్చే భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈఓ సత్యనారాయణ తెలిపారు. జాతరలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఎస్పీ శబరీశ్, ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ పర్యవేక్షణలో ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. వైభవంగా దేవతామూర్తుల కల్యాణం బ్రహ్మోత్సవాల్లో ప్రధానఘట్టం 12వ తేదీ ఉదయం 9గంటలకు ఆలయంలోని లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి ధృవమూర్తుల కల్యాణం, మధ్యాహ్నం 12.23 గంటలకు లభిజిన్ లగ్నంలో ఉత్సవ మూర్తులకు కల్యాణ మండపంలో తిరుకల్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి గర్భాలయం, ఆలయ ప్రాంగణంలోని వేణుగోపాలస్వామి ఆలయం, అభయాంజనేయస్వామి, దైత అమ్మవారి ఆలయంతో పాటు తదితర ఆలయాలు, ప్రధాన ఆర్చీలను వివిధ రాకల రంగులతో అలంకరించారు. జాతర ప్రాంగణంలో విద్యుత్ లైట్లను ఏర్పాటు చేశారు. భారీగా తరలిరానున్న భక్తులు జాతరకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారనే అంచనాతో దేవాదాయశాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా తాగునీటి సమస్య తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. కల్యాణ మహోత్సవాన్ని కూర్చోని తిలకించే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నేటినుంచి 10 రోజుల పాటు జాతర ఏర్పాట్లు చేస్తున్న అధికారులు -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా చేపట్టాలి
కాటారం: రైతులు ఇబ్బందులకు గురికాకుండా ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా చేపట్టాలని జిల్లా సహకార అధికారి వాల్యనాయక్ అన్నారు. కాటా రం మండలంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గారెపల్లి, ధన్వాడ, శంకరాంపల్లి, రేగులగూడెం ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం డీసీఓ పరిశీలించారు. ధాన్యం నిల్వలు, కొనుగోళ్లు సాగుతున్న ప్రక్రియ, రవాణా తదితర అంశాలపై ఆరాతీశారు. ధాన్యం నాణ్యత, తేమశాతం పరిశీలించారు. కొనుగోళ్లు త్వరితగతిన పూర్తిచేయాలని పీఏసీఎస్ అధికారులు, నిర్వాహకులను ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని, కాంటా పూర్తయిన ధాన్యాన్ని వెను వెంటనే తరలించాలని సూచించారు. సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. డీసీఓ వెంట మానిటరింగ్ ఆఫీసర్ రిలీఫ్రెడ్డి, పీఏసీఎస్ సీఈఓ ఎడ్ల సతీశ్, సిబ్బంది ఉన్నారు. -
డిగ్రీ పరీక్షలపై అయోమయం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ ఒకేషనల్, బీసీఏ తదితర కోర్సులకు సంబంధించి 2, 4,6 సెమిస్టర్లు, బ్యాక్లాగ్ మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ల పరీక్షలు ఈ నెల 14వ తేదీనుంచి నిర్వహిస్తామని పరీక్షల విభాగం అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 6వ తేదీ వరకు పరీక్ష ఫీజులు చెల్లించేందుకు గడువు విధించారు. అయినప్పటికీ ఎక్కువశాతం ప్రైవేట్ కాలేజీలు పరీక్షల విభాగానికి చెల్లించలేదు. దీంతో పరీక్షల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. అధికారులు మాత్రం ఫీజులు చెల్లించిన కళాశాలల విద్యార్థులకు మాత్రం ఈనెల 14నుంచి పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటివరకు 107 కాలేజీలు ఫీజుల చెల్లింపు.. కేయూ పరిధిలోని మూడు ఉమ్మడి జిల్లాల్లో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, అటానమస్, గురుకులాలు కలిపి 292 డిగ్రీకాలేజీలు ఉన్నాయి. అందులో 217 ప్రైవేటు డిగ్రీ కాలేజీలున్నాయి. డిగ్రీ సెమిస్టర్ల పరీక్షల నిర్వహణకు రెండు సార్లు టైంటేబుల్‌ను ప్రకటించి ఫీజులు చెల్లించాలని కోరారు. ఎక్కువశాతం ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు తమకు ప్రభుత్వంనుంచి ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదని, అందువల్ల పరీక్షల నిర్వహణకు సహకరించబోమని బహిష్కరించారు. దీంతో యూనివర్సిటీ అధికారులు రెండు సార్లు పరీక్షలు వాయిదా వేశారు. అయినా చాలా కాలేజీలు ముందుకు రాకపోవటంతో ఈనెల 4న కాకతీయ యూనివర్సిటీ అధికారులు ఏయే ప్రైవేట్ కాలేజీలు ఇప్పటివరకు పరీక్షల ఫీజులు చెల్లించలేదో గుర్తించారు. సెమిస్టర్ల పరీక్షలు జరిగేనా ? తప్పనిసరిగా పరీక్షలు నిర్వహిస్తామని యూనివర్సిటీ అధికారులు చెబుతున్నప్పటికీ పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కువశాతం ప్రైవేట్ కాలేజీలు ఫీజులు చెల్లించలేదు. దీంతో వారు పరీక్షలు నిర్వహిస్తారా లేదా అనేది సందిగ్ధం నెలకొంది. ప్రధానంగా డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులకు ఆరవ సెమిస్టర్ కీలకమైంది. ఈ పరీక్షలు జరగకుంటే వారు ఉన్నత చదువులు నష్టపోయే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం వారు టీజీ ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీజీసెట్లకు ప్రిపేరవుతున్నారు. ఆ పరీక్షలు కూడా సమీపిస్తున్నాయి. ఎలాగైనా పరీక్షలు నిర్వహించాలనే డిమాండ్ విద్యార్థులనుంచి వినిపిస్తోంది. డిగ్రీ వివిధ సెమిస్టర్ల పరీక్షలకు సుమారు 1.70లక్షలమందికిపైగా విద్యార్థులు నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఫీజు రీయింబర్స్‌మెంటు చెల్లించేందుకు ముందుకు రాకపోవడంపై కూడా విమర్శలొస్తున్నాయి. ఫీజులు చెల్లించిన కాలేజీలకే పరీక్షలు నిర్వహిస్తే, చెల్లించని కాలేజీల విద్యార్థుల పరిస్థితి ఏమిటనే చర్చ నడుస్తోంది. ఫీజులు చెల్లించిన కాలేజీల విద్యార్థులకే పరీక్షలు కేయూ పరిధిలో విద్యార్థులనుంచి ఫీజులు వసూలు చేసి కూడా ఫీజు రీయింబర్స్‌మెంటు రాలేదని ఎక్కువశాతం ప్రైవేట్ కాలేజీలు ఫీజులు చెల్లించడం లేదు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా వేశాం. వారికి సమయం కూడా ఇచ్చాం. విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఇప్పటివరకు ఫీజులు చెల్లించిన అన్ని యాజమాన్యాల కాలేజీల్లో ఈ నెల14నుంచి తప్పనిసరిగా పరీక్షలు నిర్వహిస్తాం. రెండు, మూడు రోజుల్లో హాల్‌టికెట్లు జారీ చేస్తాం. ఇప్పటికై నా ఫీజులు చెల్లించని కాలేజీలు ఒకటి, రెండు రోజుల్లోనైనా ఫీజులు చెల్లించి నామినల్‌రోల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. – కె.రాజేందర్, పరీక్షల నియంత్రణాధికారిఇటీవల దోస్త్ నోటిఫికేషన్.. 2025–2026 విద్యాసంవత్సరంలో డిగ్రీ ప్రవేశాలకు దోస్త్‌కు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇటీవల నోటిఫికేషన్ జారీచేసింది. కేయూ అధికారులు పరీక్షల ఫీజులు చెల్లించని 138 ప్రైవేట్ డిగ్రీ కాలేజీల పేర్లను దోస్త్‌నుంచి తొలగించారు. దీంతో ఆయా కాలేజీల్లో అడ్మిషన్లకు ఆప్షన్లు ఎంచుకునే అవకాశం లేదు. దీంతోనైనా పరీక్ష ఫీజులు చెల్లించేందుకు యాజమాన్యాలు ముందుకువస్తాయని భావించారు. మంగళవారం పరీక్ష ఫీజు గడువు ముగిసే వరకు 138 కాలేజీల్లో 4 కాలేజీలు మాత్రమే చెల్లించాయి. మొత్తంగా అన్ని యాజమాన్యాలు కలిపి మంగళవారం వరకు 107కాలేజీలు ఫీజులు చెల్లించాయి. ఫీజులు చెల్లించని 138 కళాశాలలను దోస్త్‌నుంచి తొలగింపు వీటిలో ఎక్కువశాతం ప్రైవేట్ కాలేజీలే.. ఇప్పటికే రెండు సార్లు పరీక్షలు వాయిదా ముగిసిన ఫీజు చెల్లింపు గడువు ఫీజులు చెల్లించిన కాలేజీల విద్యార్థులకే పరీక్షలు మిగతా విద్యార్థుల పరిస్థితి ఏమిటీ? -
బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పరిశీలన
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో ఈ నెల 8నుంచి 17 వరకు జరుగనున్న స్వామివారి బ్రహ్మోత్సవాల(జాతర) సందర్భంగా ఆలయంలో వివిధ అభివృద్ధి పనులు, భక్తుల సౌకర్యార్ధం చేస్తున్న ఏర్పాట్లను అదనపు కలెక్టర్ చీమలపాటి మహేందర్‌జీ, ఏటూరునాగారం సీఐ అనుముల శ్రీనివాస్, ఎస్సై టీవీఆర్ సూరితో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా గుట్టపై తాత్కాలికంగా భక్తులు దుస్తులు మార్చుకునేందుకు ఏర్పాటు చేసిన డ్రెస్సింగ్ రూమ్‌లు, నీడకోసం ఏర్పాటు చేస్తున్న తడుకల పందిల్లు, పార్కింగ్ స్థలం, సీసీ రోడ్డు నిర్మాణం పనులను పరిశీలించారు. అదే విధంగా ఆర్టీసీ బస్సు సౌకర్యాల వివరాలను ఏటూరునాగారం కంట్రోలర్ శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు. జాతర ప్రారంభం వరకు అన్ని పనులు పూర్తి చేయాలని భక్తులకు సకల సౌకర్యాలు కల్పించే విధంగా పనుల్లో వేగం పెంచాలని ఆలయ ఈఓ సత్యనారాయణ, ఇరిగేషన్, పంచాయతీ, ట్రాన్స్‌కో అధికారులకు తగు సూచనలు చేశారు. ఆయన వెంట తహసీల్దార్ రవీందర్, ఎంపీడీఓ భద్రు, పంచాయతీ కార్యదర్శి అజ్మత్ తదితరులు ఉన్నారు. -
భద్రకాళి అమ్మవారికి గంధోత్సవం
హన్మకొండ కల్చరల్ : శ్రీభద్రకాళి భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీభద్రకాళి దేవాలయంలో అమ్మవారికి గంధోత్సవం నిర్వహించారు. అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వక్యాన ఉదయం నిత్యాహ్నికం, చతుస్థానార్చన అనంతరం అమ్మవారి స్వపనమూర్తికి గంధంతో అలంకరించి ప్రత్యేకపూజలు చేశారు. సాయంత్రం ఉత్సవమూర్తిని సాలభంజికవాహనంపై ప్రతిష్ఠించి ఊరేగించారు. పూజాకార్యక్రమాలకు ఉమ్మడి వరంగల్ జిల్లాల పద్మశాలి సంఘం వారు ఉభయదాతలుగా వ్యవహరించారు. జిల్లా అధ్యక్షుడు లయన్ డాక్టర్ ఆడెపు రవీందర్, నగర మేయర్ గుండు సుధారాణి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్, కోఆర్డినేటర్ పడ్నాల నరేందర్, కుసుమ సతీష్, సాంబారి సమ్మారావు తదితరులు పాల్గొన్నారు. -
మార్క్సిజంతోనే ప్రజా సమస్యల పరిష్కారం
గోవిందరావుపేట: మార్క్సిజంతోనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బండారు రవికుమార్ అన్నారు. మండల పరిధిలోని పస్రాలో సీపీఎం కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు తుమ్మల వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు కారల్‌మార్క్స్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి మార్క్సిజం పరిష్కారం చూపుతుందన్నారు. మార్క్స్ చెప్పినట్లుగా పెట్టుబడి అతి కొద్ది మంది చేతుల్లో పోగుబడి ఉందన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రవికుమార్ -
ఓరుగల్లుకూ ‘గొర్రెల స్కాం’ సెగ!
సాక్షిప్రతినిధి, వరంగల్ : గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాల బాగోతంపై మళ్లీ విచారణ ఉమ్మడి వరంగల్‌లో కలకలంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గొర్రెల పంపిణీలో అక్రమాల కేసును సీరియస్‌గా తీసుకుని విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో ఏడాది క్రితం వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, ఏసీబీలు వేర్వేరుగా పలుకోణాల్లో విచారణ చేపట్టాయి. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ స్థాయి మొదలు ఆ శాఖ కీలక అధికారుల వరకు సుమారు 42 మందిపై మూడు శాఖలు అభియోగాలు మోపాయి. ఇందులో ఎనిమిది మంది ఉమ్మడి వరంగల్‌లో పనిచేసిన వారు కూడా ఉన్నారు. సుమారు రూ.700 నుంచి రూ.1,200 కోట్ల వరకు స్కాం జరిగినట్లు ప్రాథమిక నివేదిక ఇచ్చిన నిఘావర్గాలు.. కొందరిని అరెస్టు చేసి.. మరికొందరిపై శాఖాపరమైన చర్యలకు సిఫారసు చేశాయి. ఆ కేసుల్లో ఉండి ఏడాదిలో ఉద్యోగ విరమణ చేసిన నలుగురు అధికారుల బెనిఫిట్స్ కూడా నిలిపి వేశారు. తాజాగా ఈ కుంభకోణంలో కీలక వ్యక్తిగా కాంట్రాక్టర్ మొయీనొద్దీన్ దుబాయికి పరారు కావడంతో అక్కడ బ్రేక్ పడింది. తాజాగా మొయీనొద్దీన్కు సంబంధించిన ఇంటిపై దాడులు నిర్వహించి పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న ఏసీబీ.. ఆయన దగ్గర, ఆయన ద్వారా కొనుగోలు చేసిన పలువురిని విచారణకు పిలుస్తుండటం ఆశాఖలో కలకలం రేపుతోంది. యూనిట్ల వివరాలపై ఈడీ నోటీసులు.. గొర్రెల పంపిణీలో గోల్మాల్ వ్యవహారం మనీ ల్యాండరింగ్గా భావించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. ఆ స్కాం గుట్టు తేల్చేందుకు చివరి ప్రయత్నంగా జిల్లాల వారీగా పంపిణీ చేసిన యూనిట్ల వివరాలు కోరింది. 2017 నుంచి 2024 వరకు పంపిణీ చేసిన యూనిట్ల సమాచారం కావాలని ఈ మేరకు జిల్లా వెటర్నరీ, పశుసంవర్థకశాఖ అధికారులకు ఇచ్చిన నోటీసుల్లో ఈడీ పేర్కొంది. ఈ వివరాలు గత నెలాఖరు వరకే ఈడీకి సమర్పించాల్సి ఉండగా, కొందరు అబ్స్ట్రాక్టు మాత్రమే ఇచ్చి, మరికొందరు సంపూర్ణంగా ఇవ్వగా.. రెండు జిల్లాల నుంచి సమాచారం వెళ్లలేదని తెలిసింది. పంపిణీ చేసిన గొర్రెల యూనిట్ల వివరాలు పంపించని అధికారులు ఈనెల 10 వరకు ఇవ్వాలని మరోసారి రిమైండర్ లేఖ పంపించినట్లు సమాచారం. ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులపై దృష్టి ఇదిలా ఉండగా 2017 నుంచి 2024 వరకు గొర్రెల పంపిణీ పథకంలో కీలకంగా వ్యవహరించి ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులపై మళ్లీ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ దృష్టి సారించింది. వరంగల్ కేంద్రంగా ఉన్న కార్యాలయానికి చెందిన ఇద్దరు అధికారులపై రెండు నెలల క్రితం హనుమకొండ డీవీఏహెచ్‌ఓ కార్యాలయంలో ఆరా తీశారు. అలాగే గతంలో ఆరోపణలు ఎదుర్కోవడంతో పాటు సస్పెన్షన్‌కు గురై తిరిగి కొలువులో చేరిన కొందరికీ హైదరాబాద్ నుంచి ఏసీబీ మూడు రోజుల క్రితం నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.వీటిలోనే అక్రమాల లెక్కలు.. ఉమ్మడి వరంగల్‌లో 2017 జూలైలో గొర్రెల పంపిణీ పథకం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా గ్రామాల్లోని గొల్ల, కురుముల కుటుంబాలను పరిగణనలోకి తీసుకొని గ్రామ సంఘంలో సభ్యత్వం ఉన్న వారికి రెండు విడతల్లో గొర్రెలు పంపిణీ చేశారు. మొదటి విడతలో 50 శాతం, రెండో విడతలో మరో 50 శాతం మంది చొప్పున 575 సహకార సంఘాలకు చెందిన 60 వేల మందికి మొదటి విడత(ఎ–లిస్టు)లో 49,276 యూనిట్లు పంపిణీ చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రతి యూనిట్‌కు 20 గొర్రెలు, ఒక పొట్టేలు చొప్పున జిల్లాల వారీగా కోటా నిర్ణయించారు. ఒక్కో జిల్లా నుంచి ఇద్దరు ఏడీలు, ఒక డాక్టర్, ఇద్దరు పారా సిబ్బంది కమిటీగా.. ఉమ్మడి జిల్లాలో సుమారు 12 కమిటీల ద్వారా కొనుగోళ్లు, పంపిణీ చేపట్టారు. రెండో విడతలో 47,750 యూనిట్లకు ప్రణాళిక సిద్ధం చేశారు. దాని ప్రకారం వరంగల్ అర్బన్ జిల్లాలో 5,571 యూనిట్లు, వరంగల్ రూరల్‌లో 12,748, మహబూబాబాద్‌లో 11,868, భూపాలపల్లి/ములుగు జిల్లాల్లో 6,791, జనగామ జిల్లాలో 10,772 యూనిట్లు పంపిణీ చేయాల్సి ఉండగా 12,123 యూనిట్ల తర్వాత అక్రమాలు వెలుగుచూడటంతో నిలిపివేశారు. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్‌గా విచారణకు ఆదేశించడం.. ఏడాది క్రితం అంతా అయిపోయిందని భావించిన తరుణంలో రెండు రోజులుగా మళ్లీ విచారణ స్పీడందుకుంది. ఉమ్మడి వరంగల్ అక్రమాలపైన మళ్లీ నోటీసులు జారీ కావడం లాంటి పరిణామాల నేపథ్యంలో బాధ్యులైన అధికారుల్లో మళ్లీ ఆందోళన మొదలైంది.పశుసంవర్థకశాఖలో మళ్లీ కలకలం యూనిట్ల వివరాలు ఇవ్వాలని ఈడీ నోటీసులు డీవీఏహెచ్ఓలను ఆరా తీస్తున్న ‘విజిలెన్స్’ కొందరు వీఏఎస్లను విచారణకు పిలిచిన ఏసీబీ? రిటైర్ అయినా తప్పని ఎంకై ్వరీ.. రిటైర్మెంట్ బెనిఫిట్స్‌పైనా పేచీ.. -
భూభారతితో సమస్యలు పరిష్కారం
రేగొండ: రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. సోమవారం మండలంలోని కొడవటంచ, లింగాల గ్రామాలలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన చట్టం ద్వారా రైతులకు భూమి హక్కు రికార్డుల్లో తప్పుల సవరణకు అవకాశం కల్పించిందన్నారు. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ చేసే ముందు భూముల పూర్తి వివరాలతో సర్వే చేసి మ్యాప్ తయారు చేస్తారన్నారు. ప్రజలకు ఆధార్ ఎలా ఉందో భూములకు భూధార్ జారీ చేయనున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో దరఖాస్తులను పరిశీలించి జూన్ 2న పట్టా పాస్ పుస్తకాలను అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు సత్యనారాయణ స్వామి, శ్వేత, డిప్యూటీ తహసీల్దార్ రజాక్, కాంగ్రెస్ నాయకులు నాయినేని సంపత్‌రావు, భిక్షపతి, బోయిని వినోద్, కోసరి నరేందర్ పాల్గొన్నారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
విద్యుత్ ప్రమాదాలపై అవగాహన తప్పనిసరి
ఏటూరునాగారం: విద్యుత్ ప్రమాదాలు, విద్యుత్ ఉపకరణాలు ఉపయోగించే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండాలని డీఈఈ నాగేశ్వర్రావు తెలిపారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం విద్యార్థులకు, పలువురికి విద్యుత్ సేఫ్టీ అంశంపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షాలు వచ్చినప్పుడు విద్యుత్ స్తంభాలను పట్టుకోవద్దన్నారు. తడి చేతులు, కాళ్లకు చెప్పులు లేకుండా కరెంటు వస్తువులను తాకొద్దని వివరించారు. విద్యుత్ వైర్లు తెగి రోడ్ల మీద పడినప్పుడు వెంటనే విద్యుత్‌శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈ అశోక్, లైన్ ఇన్స్పెక్టర్ సమ్మయ్యతో పాటు లైన్మెన్లు రాజమౌళి, రవి, శ్రీనివాస్, జూనియర్ లైన్మెన్లు అమర్, సతీష్, రాజు, సాయి తదితరులు పాల్గొన్నారు. -
ఫిర్యాదులపై స్పందించాలి
భూపాలపల్లి రూరల్: ప్రజలనుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఎస్పీ కిరణ్‌ఖరే పోలీసు అధికారులకు సూచించారు. సోమవారం ప్రజాదివస్‌లో భాగంగా ఎస్పీ కార్యాలయంలో 16మంది బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డ్రగ్స్, మత్తు పదార్థాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. బాధితుల సమస్యలు సత్వరంగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు.చర్యలు తీసుకోవాలిభూపాలపల్లి రూరల్: గ్యాస్ సిలండర్లను అధిక ధరలకు విక్రయిస్తున్న గ్యాస్ గోదాముల యాజమానులపై చర్యలు తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) జిల్లా అధ్యక్షుడు పొన్నం భిక్షపతి సోమవారం కలెక్టరేట్లో వినతిపత్రం ఇచ్చారు. అనంతరం భిక్షపతి మాట్లాడారు. లబ్ధిదారులు ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పటికీ హెచ్‌పీ, భారత్, ఇండియన్ గ్యాస్ సిలెండర్లను రూ.100నుంచి రూ.200 వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై సివిల్ సప్లయీస్ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. కలెక్టర్ స్పందించి అధిక ధరలకు విక్రయిస్తున్న గ్యాస్ ఏజెన్సీలతో పాటు వారికి సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేదంటే ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో పార్టీ నాయకులు బెల్పగొండ మహేందర్, మేకల ఓంకార్, మురారి సదానందం, కొయ్యడ దామోదర్ ఉన్నారు.దరఖాస్తుల స్వీకరణభూపాలపల్లి రూరల్: జిల్లాలో 18 సంవత్సరాల బాలబాలికలు పీఎంఆర్బీపీ పురష్కారం కోసం జూలై 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఇన్చార్జ్ సంక్షేమాధికారి మల్లీశ్వరి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏరంగంలోనైనా, సామాజిక సేవ, పర్యావరణం, క్రీడలు, కళ, సంస్కృతి, సైన్స్ టెక్నాలజీలలో ప్రతిభ కనబర్చిన వారు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 94910 51676 నంబర్లో సంప్రదించాలన్నారు.ముగిసిన జాతర వేలం పాటలుమంగపేట: మండల పరిధిలోని మల్లూరు గుట్టపై శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఈ నెల 8నుంచి 17 వరకు జరుగనున్న లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు(జాతర) వేలం పాటలు వాయిదా పడిన విషయం విదితమే. ఈ వేలం పాటలను ఆలయ ఈఓ శ్రావణం సత్యనారాయణ పర్యవేక్షణలో సోమవారం నిర్వహించారు. జాతర సందర్భంగా మే 8వ తేదీ నుంచి నెల రోజుల పాటు ఆలయ ప్రాంగణం పరిధిలో లడ్డూ, పులిహోర ప్రసాదం తయారుచేసి విక్రయించేందుకు మల్లూరుకు చెందిన మారబోయిన గోవర్ధన్ రూ 3,19,116, స్వామివారికి భక్తులు సమర్పించే తలనీలాలు, పుట్టు వెంట్రుకలు పోగు చేసుకునేందుకు జగిత్యాలకు చెందిన ప్రసాదం రాంబాబు రూ 2,17,000లకు వేలం పాటను దక్కించుకున్నట్లు ఈఓ సత్యనారాయణ తెలిపారు.రేపు తెలుగుభాష పరిరక్షణపై చర్చా గోష్టిహన్మకొండ కల్చరల్ : తెలుగుభాష పరిరక్షణపై ఈనెల 7న ఉదయం 10 గంటలకు హనుమకొండ పింజర్లరోడ్లోని రాజరాజనరేంద్రాంధ్ర భాషానిలయంలో చర్చా గోష్టి నిర్వహిస్తున్నట్లు కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ బన్న అయిలయ్య, ప్రముఖ కవి పొట్లపల్లి శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల ఇంటర్మీడియట్ విద్యలో రెండో ఆప్షన్‌గా సంస్కృతాన్ని ప్రవేశపెట్టాలని బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ జీఓ జారీ చేసిందని, దీనిని వ్యతిరేకిస్తూ తెలుగు భాషాభిమానులు, విశ్వవిద్యాలయాల అధ్యాపకులు, కవులు, రచయితలు నిరసన వ్యక్తం చేయగా జీఓ రద్దు చేస్తున్నట్లు గతంలో ప్రకటించినా ఇప్పటి వరకు కళాశాలలకు ఉత్తర్వులు అందలేదన్నారు. ఈ కార్యక్రమంలో కవులు, రచయితలు, భాషాభిమానులు పాల్గొనాలని కోరారు. -
భూ సమస్యలే ఎక్కువ..
భూపాలపల్లి: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 52 దరఖాస్తులు రాగా.. అందులో భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులే ఎక్కువగా ఉన్నాయి. వినతులను కలెక్టర్ రాహుల్‌శర్మ స్వీకరించి, పరిష్కారం కోసం ఆయా శాఖల అధికారులకు పంపించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. సర్వే నంబర్ లేదు.. పట్టా లేదు.. నా పేరు మేదరి వీరస్వామి. మాది చిట్యాల మండలంలోని చల్లగరిగె గ్రామం. నాకు ముచినిపర్తి శివారులో 14 గుంటల భూమి ఉంది. ఇప్పటివరకు ఆ భూమికి సర్వే నంబర్ లేదు. పట్టాదారు పాసుపుస్తకం రావడం లేదు. ఈ విషయమై తహసీల్దార్, కలెక్టర్‌కు చాలాసార్లు ఫిర్యాదు చేశాను. అయినా ఇప్పటి వరకు ఎవరూ సర్వే చేయించలేదు. మళ్లీ ప్రజావాణిలో దరఖాస్తు చేసుకునేందుకు వచ్చా. భూమి మా ఆధీనంలో ఉన్నా ఎటువంటి కాగితం లేకపోవడంతో ఇబ్బంది అవుతుంది. భూమికి పరిహారం ఇప్పించండి.. మా ఊరు వెలిశాల శివారులోని 359 సర్వే నంబర్లో నాకు 12 గుంటల వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమి మీదుగా మంచిర్యాల–వరంగల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే రోడ్డు నిర్మాణం జరగబోతుంది. నాకు ఇప్పటివరకు ఎటువంటి నోటీసు ఇవ్వలేదు. నష్ట పరిహారం అందించలేదు. ఇప్పటికై నా తగు విచారణ జరిపించి భూమికి పరిహారం ఇప్పించండి. – ఎండీ నైమా, వెలిశాల, టేకుమట్ల నా భూమిని కబ్జా చేశారు.. మా ఊరి శివారులోని సర్వే నంబర్ 831లో 1.10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. మా తాతగారి పేరుపై ఉన్న ఆ భూమిని 2017లో పెద్ద మనుషుల సమక్షంలో మా నాన్న బండారి రమేష్, పెద్దనాన్న పోషాలు పంచుకున్నారు. కానీ మాకు తెలియకుండా 2018లో ఆ భూమి మొత్తాన్ని మా పెద్దనాన్న తన పేరు మీద పట్టా చేయించుకున్నాడు. ఇప్పటికై నా గ్రామంలో విచారణ చేపట్టి, ఆ పట్టాను రద్దు చేసి మాకు సగ భాగం వచ్చేలా చూడాలని ప్రజావాణిలో దరఖాస్తు చేసుకునేందుకు వచ్చాను. – బండారి వేణు, జగ్గయ్యపేట, కొత్తపల్లిగోరి ప్రజావాణికి 52దరఖాస్తులు వినతులు స్వీకరించిన కలెక్టర్ రాహుల్‌శర్మ -
సరస్వతి అమ్మవారి విగ్రహం వచ్చేసింది..
తమిళనాడులోని మహాబలిపురం నుంచి లారీలో సరస్వతి అమ్మవారి విగ్రహం, నాలుగు వేదమూర్తుల విగ్రహాలు ఆదివారం సాయంత్రం కాళేశ్వరానికి వచ్చాయి. కాళేశ్వరంలో మే 15నుంచి 26వరకు జరుగు సరస్వతినది పుష్కరాల కోసం త్రివేణి సంగమ తీరంపైన దేవాదాయశాఖ ఆధ్వర్యంలో రూ.కోటితో బేస్మెంట్స్టాండ్ నిర్మాణం, విగ్రహ తయారీ పనులు చేపట్టారు. సోమవారం విగ్రహాన్ని కాంక్రీటు బేస్మెంట్ స్టాండ్‌పై ఇన్స్టాల్ చేయనున్నారు. అమ్మవారి విగ్రహం చుట్టూర వేదమూర్తులను ఆసీనులు చేస్తారు. తరువాత లాన్, ఇతర సుందరీకరణ పనులు చేపట్టనున్నారు. – కాళేశ్వరం -
డేంజర్ మలుపులు
పొంచి ఉన్న ప్రమాదం.. ఈనెల 15నుంచి సరస్వతి పుష్కరాలుకాళేశ్వరం: పన్నెండేళ్లకొకసారి వచ్చే సరస్వతి నది పుష్కరాలకు పలు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా రానున్నారు. ఈనెల 15నుంచి 26వరకు సరస్వతి పుష్కరాలు నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రూ.25కోట్ల నిధులు మంజూరు చేసి పనులు చేపట్టారు. కాటారం టు కాళేశ్వరం వంతెన వరకు ఎన్‌హెచ్ 353(సీ) రహదారిపై 20కిపైగా మలుపులు ఉన్నాయి. కాళేశ్వరం టు వయా మద్దుపల్లి మీదుగా గంగారం వరకు ఆర్అండ్బీ రోడ్డుకు సంబంధించి పలుచోట్ల ‘మహా’డేంజర్ మలుపులు ఉన్నాయి. తెలియని వారు ఆదమరిచి వస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సూచికబోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటుచేస్తే ప్రయాణం సాఫీగా సాగనుంది. పలురాష్ట్రాల భక్తుల రాక.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. త్రివేణి సంగమంలో పుష్కర స్నానాలు చేయనున్నారు. భక్తులు ప్రైవేట్ వాహనాల్లో రాకపోకలు సాగిస్తుంటారు. నిత్యం వేల సంఖ్యలో భక్తులు ఈ రహదారుల వెంట వస్తారు. డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు చేయాలి.. పుష్కరాలు జరిగే రోజుల్లో పోలీసులు వాహనదారులకు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు చేయాలి. మద్యం మత్తులో మలుపులు తెలియక అడవిలోకి దూసుకెళ్లే ప్రమాదం ఉంది. ఎదురుగా వచ్చే వాహనాలకు ఢీకొని ప్రాణాలు కోల్పోయే ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఈ దిశగా అధికార యంత్రాంగం దృష్టిసారించాలి.సూచిక బోర్డులేవి..రహదారుల వెంట సూచికబోర్డులు, ఫ్లెక్సీలు దారులు తెలిపేలాగా అమర్చితే ప్రమాదాలు నివారించొచ్చు. మలుపులపై అవగాహన లేకపోతే రోడ్డు ప్రమాదాల భారినపడే ప్రమాదం ఉంది. ఇటీవల మహాశివరాత్రి రోజు స్కూటీపై దర్శనానికి వచ్చి వెళ్తున్న దంపతులు అన్నారం మలుపు వద్ద అదుపుతప్పి పడిపోయారు. భార్య భాగ్యలక్ష్మి (50) అక్కడికక్కడే మృతిచెందింది. వారం రోజు కిందట మంథనికి చెందిన కుడుదుల అనిల్(20)బైక్‌పై వచ్చి ప్రమాదానికి గురై మృత్యువాతపడ్డాడు. మలుపుల వద్ద అధికారులు దృష్టి సారించకపోతే భారీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సూచిక బోర్డులు, ప్రమాదాలు జరిగే ప్రదేశం లాంటి ప్లెక్సీలు పెడితే డ్రైవర్లకు అవగాహన వస్తుంది.ఆదమరిస్తే అంతే..కాటారం టు కాళేశ్వరం వరకు, కాళేశ్వరం టు గంగారం రహదారుల్లో మలుపులు చాలా వరకు ఉన్నాయి. కాళేశ్వరం వంతెన నుంచి మహదేవపూర్ వరకు సుమారు 18వరకు మలుపులు ఉన్నాయి. గంగారం దారిలో 10కి పైగా మలుపులు ఉన్నాయి. వాహనాలు నడిపేటప్పుడు ఆదమరిస్తే ప్రాణాలు గాలిలో కలువాల్సిందే. అప్రమత్తంగా లేకపోతే ప్రమాదాలు కొని తెచ్చుకున్నట్లే. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తుల రాక కాటారం టు కాళేశ్వరం, కాళేశ్వరం టు గంగారం వరకు పలుచోట్ల మలుపులు ఆదమరిచి వాహనాల్లో ప్రయాణిస్తే ప్రమాదాలకు అవకాశం మలుపుల వద్ద సూచిక బోర్డులు కరువుప్రమాదాలు జరగకుండా చర్యలు.. సరస్వతినది పుష్కరాలకు వచ్చే భక్తులకు ప్రమాదాలు జరుగకుండా చర్యలు చేపడుతున్నాం. ఫ్లెక్సీలు, సూచిక బోర్డులు ప్రైవేట్ ఏజెన్సీకి ఎండోమెంట్‌శాఖ అప్పగించింది. నిత్యం డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు చేపడుతున్నాం. ప్రమాదాలు జరుగకుండా ట్రాఫిక్ నియంత్రణ చేస్తాం. – రామచందర్‌రావు, సీఐ, మహదేవపూర్ -
భద్రకాళి అమ్మవారికి పల్లకీసేవ
హన్మకొండ కల్చరల్ : శ్రీభద్రకాళిభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీభద్రకాళి దేవాలయంలో అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యాన అమ్మవారికి నిత్య పూజలు, అలకరణ అనంతరం ఉత్సవమూర్తికి ఉదయం పల్లకీసేవ, సాయంత్రం శేషవాహనసేవ నిర్వహించారు. మహిళలు కుంకుమపూజలు, లలితాసహస్రనామ పారాయణం చేశారు. అనంతరం అన్నదానం జరిగింది. సేవా కార్యక్రమాలకు వరంగల్ ఉమ్మడి జిల్లా విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సంఘం, తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ మాతృసంఘం బాధ్యులు ఉభయదాతలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, దాసోజు శ్రవణ్‌కుమార్, డాక్టర్ లాల్కోట వెంకటాచారి, రాగిఫణి రవీంద్రాచారి, చొల్లేటి కృష్ణమాచారి, సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు నారోజు సత్యమనోరమ, శశిధర్శిల్పి తదితరులు పాల్గొన్నారు. -
దత్తాత్రేయ ఆలయంలో మంత్రి పూజలు
కాటారం: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి స్వగ్రామం కాటారం మండలం ధన్వాడలోని శ్రీదత్తాత్రేయ స్వామి ఆలయ తృతీయ వార్షికోత్సం వేడుకలు ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పురోహితులు కృష్ణమోహన్‌శర్మ ఆధ్వర్యంలో 32మంది వేద బ్రాహ్మణులు వేదమంత్రోచ్ఛరణల నడుమ పూజా కార్యక్రమాలు కొనసాగించారు. మంత్రి చేతుల మీదుగా పుణ్యాహవాచనము, గణపతి పూజ, 54 కళశములతో పూజ, మూల విరాట్ దత్తాత్రేయ స్వామికి అభిషేకం, పంచామృతాభిషేకం, పుష్పార్చన, దత్తహోమం జరిపించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్‌కుమార్ వార్షికోత్సవ, పూజా కార్యక్రమాల్లో మంత్రి శ్రీధర్‌బాబుతో పాటుగా పాల్గొన్నారు. విప్‌ను మంత్రి శాలువాతో సత్కరించి ఆలయ మెమోంటోను బహుకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మండలంతో పాటు పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి వార్షికోత్సవ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంత్రి శ్రీధర్‌బాబుతో పాటు ఆయన తల్లి జయమ్మ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మంత్రికి వినతుల వెల్లువ.. ధన్వాడకు వచ్చిన మంత్రి శ్రీధర్‌బాబుకు పలువురు ప్రజలు తమ సమస్యలపై వినతులు సమర్పించారు. ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని అధిక సంఖ్యలో ప్రజలు మంత్రికి విన్నవించారు. దశల వారీగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని.. ఎవరూ ఆందోళన చెందవద్దని మంత్రి సూచించారు. అనర్హులకు ఎట్టి పరిస్థితుల్లో ఇళ్లు ఇవ్వబోమని లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. -
ములుగులో మోడల్ బస్టాండ్
ములుగు: జిల్లాకేంద్రంలో అత్యాధునిక హంగులతో మోడల్ బస్టాండ్ నిర్మాణం పనులు వచ్చే నెలలో పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్టీసీ ఈడీతో మాట్లాడి ప్రతినెలా చేపడుతున్న పనులపై నివేదిక ఇచ్చి పనుల్లో వేగం పెంచాలని సూచించామని తెలిపారు. ఈ మేరకు ఆదివారం జిల్లాకేంద్రంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో 32గుంటల స్థలంలో రూ.4.81 కోట్ల వ్యయంతో గ్రౌండ్, ఫస్ట్ఫ్లోర్గా నిర్మించనున్న మోడల్ బస్టాండ్ పనులకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కతో కలిసి ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ 1989లో నిర్మించిన బస్టాండ్ శిథిలావస్థకు చేరుకుందని తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం సుందరీకరణ చేయాల్సిన అవసరం ఉందని మంత్రి సీతక్క చెప్పగానే వెంటనే ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. వచ్చే నెలలో మోడల్ బస్టాండ్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. మంగపేట మండలంలో రూ.50లక్షలతో చేపడుతున్న పనులు కొనసాగుతున్నాయన్నారు. ఏటూరునాగారం డివిజన్లో చేపట్టనున్న బస్‌డిపో పనులకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామన్నారు. గట్టమ్మ ఆలయం సమీపంలోని గిరిజన యూనివర్సిటీ, సమీకృత కలెక్టరేట్ భవనం, వైద్య కళాశాలలకు అనుగుణంగా విద్యార్థులు, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని మినీ బస్టాండ్ నిర్మిస్తామన్నారు. కలెక్టర్ ఎకరం స్థలం కూడా కేటాయిస్తామని తెలిపారని, అధికారులు నివేదిక అంచనా ఇస్తే రూ.45లక్షలతో పనులు చేపడతామని వివరించారు. బీసీలకు 42శాతం అమలుకు కృషి అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు కావడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఎంతో కృషి చేశారని తెలిపారు. ఇప్పటికే ములుగు మున్సిపాలిటీకి గెజిట్ నోటిఫికేషన్ విడుదల అయ్యిందని వివరించారు. ములుగు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధిలో ఉన్న కారణంగా రవాణా పరంగా ఆర్టీసీ సేవలు అవసరం అని చెప్పడంతో సీఎం రేవంత్‌రెడ్డి అడిగినన్ని నిధులు కేటాయిస్తున్నారని మంత్రి వివరించారు. ఆర్టీసీ బస్టాండ్ పనులకు శంకుస్థాపన చేయడానికి వచ్చిన మంత్రి ప్రభాకర్‌కు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. ముందుగా గట్టమ్మ ఆలయంలో పూజలు చేసిన మంత్రి పొన్నం ఆర్అండ్బీ గెస్ట్‌హౌజ్ నుంచి పార్టీ కార్యకర్తల భారీ బైక్‌ర్యాలీ నడుమ జిల్లా కేంద్రానికి వచ్చారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కలకు భారీ గజమాలతో సత్కరించారు. దేవగిరిపట్నం గ్రామంలో బాలబ్రహ్మచారి కిషన్ మహరాజ్ ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి, నందీశ్వర, ధ్వజస్తంభ, గణపతి, దక్షిణామూర్తి, సుబ్రమణ్యేశ్వర స్వాముల నూతన విగ్రహ ప్రతిష్టాపన, ఆలయాన్ని ఘనంగా ప్రారంభించిన కార్యక్రమానికి మంత్రి సీతక్కతో పాటు పొన్నం ప్రభాకర్ హాజరై పలు సూచనలు చేశారు. లీలాగార్టెన్లో డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ అధ్యక్షతన నిర్వహించిన పార్టీ సంస్థాగత ఎన్నికల సన్నాహక సమ్మేళన కార్యక్రమంలో మంత్రి సీతక్కతో పాటు పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. పార్టీ అభ్యున్నతికి కార్యకర్తలు పాటుపడాలని సూచించారు. అత్యాధునిక హంగులతో నిర్మిస్తాం.. బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ -
భూ సమస్యలు పరిష్కరించే దిశగా..
భూపాలపల్లి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూ భారతి చట్టం జిల్లాలో అమల్లోకి రానుంది. ౖపైలట్ ప్రాజెక్ట్‌గా జిల్లాలో రేగొండ మండలాన్ని ప్రభుత్వం ఎంపిక చేసింది. నేటినుంచి ఇద్దరు తహసీల్దార్లు, అధికారులు, సిబ్బందితో కూడిన రెండు బృందాలు రేగొండ మండలంలోని అన్ని గ్రామాల్లో పర్యటించనున్నారు. చట్టం అమల్లోకి వస్తే భూ సమస్యలు తీరుతాయని రైతులు ఆశిస్తున్నారు. ప్రభుత్వం ఆర్ఓఆర్ చట్టాన్ని సవరించి నూతన చట్టాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే జిల్లాలో గతనెల 17నుంచి ఈ చట్టంపై రైతులకు అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహించారు. పైలెట్‌గా రేగొండ మండలం సమస్యల పరిష్కారానికి పైలెట్ ప్రాజెక్ట్ కింద రేగొండ మండలాన్ని ఎంపిక చేసి రెండు బృందాలను నియమించారు. ఈ బృందాలకు రైతులు నేరుగా భూ సమస్యలపై ఫిర్యాదులు చేయవచ్చు. భూ తగాదాలు, వారసత్వ బదిలీలు, మ్యూటేషన్లు, ఏ సమస్య ఉన్నా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. తహసీల్దార్ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను ఆర్డీఓ స్థాయిలో, కలెక్టర్ స్థాయిలో పరిష్కరించనున్నారు. వెనువెంటనే సమస్యలు పరిష్కారం కానున్నాయి. జిల్లాలో ఇప్పటికే అనేక మంది తమ భూమి హక్కుల కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వంలో భూ ప్రక్షాళన సందర్భంగా అనేక తప్పులు దొర్లడంతో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. జిల్లాలో గతంలో సుమారు 50 వేలకు పైగానే సాదాబైనామాల కోసం రైతులు దరఖాస్తు చేసుకున్నారు. అవి పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ చట్టం రావడంతో పరిష్కారమయ్యే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అసైన్డ్, అటవీ భూముల వద్ద కూడా వివాదాలున్నాయి. పార్ట్–బీలో పేర్కొన్న నిషేధ జాబితాలు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ చట్టంతో సమస్యలు తీరుతాయనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. భూభారతిలో ఇక నుంచి ప్రతి భూమికి భూధార్ పేరుతో ప్రత్యేక గుర్తింపు సంఖ్య నంబర్లు సైతం ఇవ్వనున్నారు. రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు సులభంగా అయ్యేలా చట్టాన్ని రూపొందించారు. తహసీల్దార్లకు, ఆర్డీఓలకు సైతం మ్యూటేషన్ అధికారం కల్పించడం వంటివి ఈ చట్టంలో పొందుపర్చారు. ప్రస్తుతం రేగొండ మండలంలో దరఖాస్తులు తీసుకున్న అనంతరం సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తారో చూడాల్సి ఉంది. నూతన చట్టం ప్రకారం సమస్యలను పరిష్కరిస్తే చాలామందికి ఉపశమనం కలుగనుంది. ఒక వేళ సమస్యలు పరిష్కారం కాకపోతే ఎందుకు కాలేదన్నది దరఖాస్తు చేసుకున్న రైతులకు నివేదిక అందిస్తారు. జిల్లా మొత్తం అమలైతే భూ సమస్యలు దాదాపుగా తీరే అవకాశాలుంటాయి. టీమ్–2 సత్యనారాయణస్వామి గణపురం తహసీల్దార్ భరత్, డీటీ దేవేందర్, ఆర్ఐ నిరజంన్, సర్వేయర్ రహ్మత్‌పాషా, ఆర్ఐ శ్రీకాంత్, జూనియర్ అసిస్టెంట్ హరీష్‌కుమార్, ఆపరేటర్ పర్యటించే గ్రామాలు (ఏ తేదీన..) లింగాల 5వ తేది పొనగండ్ల 6వ తేది భాగిర్థిపేట 7వ తేది రామన్నగూడెం 8వ తేది దమ్మన్నపేట 9వ తేది టీమ్–1 శ్వేత, రేగొండ తహసీల్దార్ అబ్దుల్ రజాక్, డీటీ భరత్‌కుమార్, ఆర్ఐ వెంకటేష్, సీనియర్ అసిస్టెంట్ తిరుపతి, సర్వేయర్ రమేష్, జూనియర్ అసిస్టెంట్ రాజు, ఆపరేటర్ పర్యటించే గ్రామాలు (ఏ తేదీన..) కొడవటంచ 5వ తేది మడ్తపల్లి 6వ తేది రేగొండ 7వ తేది తిరుమలగిరి 8వ తేది కనిపర్తి 9వ తేది రేపాక 12వ తేదిపైలట్ ప్రాజెక్ట్టుగా రేగొండ మండలం ఎంపిక నేటినుంచి 12వరకు గ్రామాల్లో పర్యటన -
పేదల కోసమే సన్నబియ్యం పంపిణీ
భూపాలపల్లి రూరల్: పేదోడి కడుపు నింపేందుకే రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిందని మహిళా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలో ఆమె పర్యటించారు. పట్టణంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. కార్డుదారులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం శాంతినగర్ కాలనీలో పేద దళితుల ఇంట్లో కాలనీవాసులతో కలిసి సన్నబియ్యంతో వండిన భోజనాన్ని తిన్నారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అంతకు ముందు అసోం ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మహిళలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అసోం ముఖ్యమంత్రి మహిళలకు క్షమాపణలు చెప్పాలని.. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేవిధంగా కృషి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు గుమ్మడి శ్రీదేవి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, జిల్లా ఇన్చార్జ్ కుమారి, స్టేట్ సెక్రటరీ హారిక, జిల్లా వైస్ ప్రెసిడెంట్లు సుగుణ, జ్యోతిరెడ్డి పాల్గొన్నారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు -
రోడ్లపైనే సిట్టింగ్
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని వైన్‌షాపుల ఎదుట బహిరంగ ప్రదేశాలలో మందుబాబులు సిట్టింగ్ చేస్తున్నారు. సుభాష్‌కాలనీ, హన్మాన్నగర్, జవహర్‌నగర్ కాలనీల సమీపాల్లో ఉన్న వైన్‌షాపులకు పర్మిట్ రూమ్‌లు ఉన్నప్పటికీ పలువురు మందుబాబులు షాపుల ఎదురుగా, పక్కన రోడ్లపై, ఇతర దుకాణాల ఎదుట బహిరంగానే మద్యం సేవిస్తున్నారు. షాపుల పక్కన కాలనీల మహిళలు, దారి వెంట వెళ్లే మహిళలు, బాలికలు ఇబ్బందులు పడుతున్నారు. బహిరంగ మద్యపానంతో రోడ్డుపైనే మలమూత్ర విసర్జన చేయడం ఖాళీ సీసాలను పగలకొట్టడం లాంటి వికృత చేష్టలు చేపడుతున్నారని కాలనీల వాసులు ఆరోపిస్తున్నారు. సుభాష్‌కాలనీలోని వైన్‌షాపును తొలగించాలని గతంలో మహిళలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. దీనిపై జిల్లాకేంద్రంలో పోలీస్‌యంత్రాంగం ఎకై ్సజ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. రోడ్డుపై వాహనాలను పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురిచేసినా కనీసం అటువైపు చూడటం లేదు. జిల్లా కేంద్రంలో పొద్దంతా బహిరంగ మద్యపానం విచ్చలవిడిగా నడుస్తుంది. వార సంత, కేటీకే–5వ గని, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వెనుకాల, అంబేడ్కర్ క్రీడా మైదానం, బాంబులగడ్డ, మంజూర్‌నగర్‌లో వెంచర్ల ప్రాంతాల్లో విచ్చలవిడిగా మద్యం సేవిస్తున్నారు. జిల్లాకేంద్రంలో విచ్చలవిడిగా బహిరంగ మద్యపానం ఇబ్బందులు పడుతున్న మహిళలు -
వెంకటరమణకు గోల్డ్‌మెడల్
చిట్యాల: యాంటీ పైరసీ నివారణలో మండలంలోని చల్లగరిగ గ్రామానికి చెందిన అప్పాల వెంకటరమణ ముంబయిలో జరిగిన కార్యక్రమంలో శనివారం సినీనటుడు అమీర్‌ఖాన్ చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్నారు. సోషల్‌మీడియాలో యాంటీపైరసీ నివారణ, సినిమా రంగం, టెలివిజన్లపై ముంబయిలో నాలుగు రోజులుగా ప్రపంచ స్ధాయి వేవ్స్ సమ్మిట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలకు న్యూరోనిక్స్ ల్యాబ్ హైదరాబాద్ సాఫ్ట్వేర్ కంపీనికి చెందిన వెంకటరమణ, కమిటీ సభ్యుడు సినీ దర్శకుడు తేజ హాజరయ్యారు. 32 కేటగిరిలో యాంటీ పైరసీ కేటగిరిలో సాఫ్ట్వేర్ ఎలా నివారించాలనే విభాగంలో అప్పాల వెంకటరమణ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను సబ్మిట్ చేయగా ఆయన గోల్డ్‌మెడల్‌కు ఎంపికై అవార్డు అందుకున్నారు. -
రక్షణతో కూడిన ఉత్పత్తి చేపట్టాలి
భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని అన్ని గనుల్లో రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి చేపట్టాలని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి అధికారులకు సూచించారు. జీఎం బొగ్గు ఉత్పత్తి, ఉత్పదాకతపై జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ కార్యాలయంలో అన్ని గనుల మేనేజర్లు, షిప్ట్ ఇన్‌చార్జ్‌లతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ... సంస్థ నిర్దేశించిన ప్రకారం లక్ష్యాలను సాధించేందుకు అందరూ కూడా కృషి చేయాలని కోరారు. ఎస్డీఎల్ యంత్రాల పనిగంటలు పెంచి, రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి సాధించాలన్నారు. కార్మికులకు తప్పనిసరిగా ఇన్సెంటివ్ రావాలంటే నిర్దేశించిన టన్నుల బొగ్గు రవాణా జరిగేలా చూడాలన్నారు. కార్మికులు 22రోజులకు తగ్గకుండా హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం కవీంద్ర, ప్రాజెక్ట్ అధికారులు, ఏజెంట్లు భిక్షమయ్య, వెంకటరమణ, అధికార ప్రతినిధి మారుతి, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు సింగరేణి ఉన్నత పాఠశాలలో 100శాతం ఉత్తీర్ణతతో పాటు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి అభినందించి ప్రోత్సాహక బహుమతులను అందించారు. 548మార్కులు సాఽధించిన ఎం.ఆశ్రితతో పాటు 500పై మార్కులు సాధించిన విద్యార్థులకు జీఎం కార్యాలయంలో శనివారం ప్రోత్సాహక బహుమతులు అందించి అభినందించారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించినందుకు పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయ బృందాన్ని అభినందించినట్లు జీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం కవీంద్ర, పాఠశాల కరస్పాండెంట్ మారుతి, ప్రధానోపాధ్యాయురాలు ఝాన్సీ, అధికారులు రాజు, శ్రావణ్‌కుమార్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి -
ఆరున్నర గంటలు.. కీలక అంశాలు
IIలోరాష్ట్ర మంత్రులు నలమాద ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం హనుమకొండ జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. మధ్యాహ్నం 1 గంటనుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పర్యటన కొనసాగింది. హసన్‌పర్తి మండలం దేవన్నపేటలో దేవాదుల పంప్‌హౌజ్, ధర్మసాగర్ రిజర్వాయర్, భద్రకాళి చెరువును సందర్శించారు. చివరగా హనుమకొండ కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి సాగునీటిపారుదల, పౌర సరఫరాల శాఖలపై అధికారులతో మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు. – సాక్షిప్రతినిధి, వరంగల్● ఓరుగల్లులో మంత్రులు ఉత్తమ్, శ్రీనివాస్‌రెడ్డి పర్యటన ● దేవాదుల పంపుహౌజ్, రిజర్వాయర్లపై రివ్యూ... ● భద్రకాళి పూడికతీత, సుందరీకరణ పనులపై సీరియస్ ● హనుమకొండ కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ అధికారులతో భేటీ ● పెండింగ్ ప్రాజెక్టులు, ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష -
రైతుకు గుర్తింపు..
ఆధార్ తరహాలో 11 అంకెల సంఖ్యకాటారం: అన్నదాతలకు సంబంధించిన పూర్తి సమాచారం ఆన్లైన్లో పొందుపర్చడం కోసం కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ప్రతి రైతుకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చేలా ఆధార్‌కార్డు తరహాలో భూధార్ కార్డు జారీకి కేంద్రం శ్రీకారం చుట్టింది. 11 నంబర్లతో కూడిన ప్రత్యేకంగా రూపొందించిన భూధార్‌కార్డు ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి ఈ నెల 5నుంచి 15 వరకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే భూధార్కార్డుల జారీకి అవసరమైన వివరాల సేకరణకు సంబంధించి వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏఈఓలకు తగు సూచనలు చేశారు. రైతు సమగ్ర సమాచారం ఒకే చోట.. రైతులకు సంబంధించిన సమగ్ర వివరాలను ఒకే చోట ఉండేలా నూతన విధానానికి కేంద్రం సంకల్పించింది. దేశ పౌరులకు ఆధార్‌కార్డు మాదిరిగా రైతులకు భూధార్ కార్డులతో గుర్తింపు ఇవ్వాలని ప్రణాళిక సిద్ధం చేసింది. రైతుకు సంబంధించిన భూ కమతానికి 11 అంకెలతో కూడిన విశిష్ట సంఖ్య(యూనిక్ కోడ్)ను కేటాయించనున్నారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేసే క్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలుకు శ్రీకారం చుట్టింది. గత ఏప్రిల్‌లో హైదరాబాద్‌లోని వ్యవసాయశాఖ కార్యాలయంలో అన్ని జిల్లాల అధికారులకు శిక్షణ ఇచ్చారు. రైతులకు కేటాయించిన భూధార్‌కార్డు నంబర్ క్లిక్‌చేస్తే చాలు రైతు పేరు, ఇతర వివరాలు ఇట్టే తెలిసిపోతాయి. సర్వే నంబర్లు, రైతు స్వగ్రామం, భూమి ఏ ప్రాంతాల్లో ఎంత ఉంది, అది సారవంతమైనదేనా..? ఆ భూమి ఏ పంటలకు అనువైనది..దానిపై సదరు రైతుకు బ్యాంకు అప్పు ఎంత ఇవ్వొచ్చు అనే వివరాలు తెలుస్తాయి. అంతేకాకుండా సబ్సిడీ వ్యవసాయ పరికరాలు, రసాయన ఎరువులతో పాటు పీఎం సమ్మాన్ నిధి, పంటనష్ట పరిహారం తదితర పూర్తి వివరాలను అందులోనే పొందపరచనున్నారు. ఇక నుంచి బ్యాంకు రుణం కోసం పట్టా పాస్‌బుక్, ఇతర పత్రాలను రైతు అధికారులకు చూపించాల్సిన అవసరం ఉండదు. కేవలం రైతుకు కేటాయించిన 11 అంకెలనంబర్ను సదరు అధికారికి చెబితే సరిపోతుంది. ఈ–ఫార్మర్ రిజిస్ట్రీ.. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి రైతుకు విశిష్ట గుర్తింపు సంఖ్య జారీచేయడం ద్వారా జాతీయ స్థాయిలో ఈ–ఫార్మర్ రిజిస్ట్రీని రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పైలెట్ ప్రాజెక్ట్‌గా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో అమలులోకి తెచ్చిన ఈ విధానం విజయవంతం అయింది. దీంతో కేంద్రం దేశవ్యాప్తంగా అమలుకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో భూ యజమానులతో పాటు కౌలు రైతులకు సైతం వీటిని జారీచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ అగ్రిస్టాక్ ప్రాజెక్టు పేరిట అమలు చేయబోతున్న ఈ ప్రాజెక్ట్ కోసం స్టేట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్(ఎస్పీఎంయూ)ను ఏర్పాటు చేశారు. వెబ్‌ల్యాండ్ డాటా ఆధారంగా జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా రైతుల ఈ–ఫార్మర్ రిజిస్ట్రీని రూపొందిస్తారు. భూధార్‌కార్డు ఉంటేనే.. జిల్లాలో పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగిన ప్రతి రైతుకు ఈ ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేసి భూధార్‌కార్డులు ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ నెల 5 నుంచి 15 వరకు గ్రామాల్లో ప్రత్యేక అవగాహన సదస్సులు చేపట్టి రైతులకు భూధార్కార్డులపై అవగాహన కల్పించనున్నారు. ఈ కార్డుల ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలను వ్యవసాయశాఖ అధికారులు వివరించనున్నారు. ఈ కార్డులు ఉంటేనే ఇక నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ డబ్బులు రైతులు పొందగలుగుతారు. రైతుకు సంబంధించిన ప్రతి వివరాలు కాగితాలు లేకుండానే ఆన్లైన్లో చూసుకోవడానికి కార్డు నంబర్ ఉపయోగపడుతుంది. ప్రతీ రైతుకు భూధార్‌కార్డు.. జిల్లాలోని ప్రతి రైతుకు భూధార్‌కార్డు ఇచ్చేలా ఏర్పాటు చేస్తున్నాం. రైతువేదికల వద్ద వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది రైతులకు సంబంధించిన వివరాలు సేకరించి ఈ ఫార్మర్ రిజిస్ట్రీలో పొందుపరుస్తారు. ఇప్పటికే ఉన్నతాధికారులు ఈ–ఫార్మర్ రిజిస్ట్రీకి సంబంధించి ఏఓ, ఏఈఓలకు అవగాహన కల్పించారు. ఈ నెల 5నుంచి 15వరకు దీనిపై ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది. – వీరూనాయక్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అందుబాటులోకి ప్రత్యేక యాప్ పీఎం కిసాన్ సమ్మాన్‌కు ఈ కార్డు తప్పనిసరి గ్రామాల్లో రైతు వేదికల వద్ద వివరాలు నమోదు -
ఇందిరమ్మ ఇళ్ల పురోగతి పరిశీలన
రేగొండ: మండలంలోని కనిపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి పరిశీలించారు. గ్రామంలో ఇంది రమ్మ ఇళ్ల కోసం ఎంపికైన లబ్ధిదారుల స్థలాలను శనివారం పరిశీలించారు. ఇళ్ల సర్వే ను త్వరితగతిన పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి పద్మ, తదితరులు పాల్గొన్నారు. పైలట్ ప్రాజెక్టుగా రేగొండ రేగొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతిలో భూ సమస్యల పరిష్కారం కోసం రేగొండ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నట్లు తహసీల్దార్ శ్వేత తెలిపారు. ఈ నెల 5నుంచి 20వరకు మండల పరిధిలోని రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో అధికారులు రైతుల సమస్యలపై అర్జీలు అందజేయాలని కోరారు. రెవెన్యూ సదస్సులపై సలహాలు, సూచనల కోసం మండలకేంద్రంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కావున ఈ రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 6న జాబ్‌మేళా భూపాలపల్లి అర్బన్: జిల్లా ఉపాధి కల్పనశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీన జాబ్‌మేళాను నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాఽధి కల్పన అధికారి శ్యామల శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వీవీసీ మోటార్స్ ప్రైవేట్ కంపెనీలలో ఖమ్మం, కొత్తగూడెం, హైదరాబాద్ ప్రాంతాల్లో పనిచేసేందుకు ఫోర్‌వీలర్ సర్వీస్ టెక్నీషియన్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, కస్టమర్‌కేర్, టెలికాలర్, యాక్సెసరీస్ ఎగ్జిక్యూటివ్స్ల ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. పదవ, ఇంటర్, ఐటీఐ, డిప్లోమా, డిగ్రీ విద్యార్హతలు కలిగిన వారు అర్హులని తెలిపారు. 18నుంచి 28సంవత్సరాలలోపు అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు. వివరాలకు 97010 78288, 95814 32500 ఫోన్ నంబర్లను సంప్రదించాలని తెలిపారు. రేపు కాళేశ్వరంలో బీఆర్ఎస్ బృందం పర్యటన కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మాజీ స్పీకర్, శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ శాసన సభ్యుల బృందం 5న సోమవారం ఉదయం 11గంటలకు పర్యటిస్తున్నట్లు మాజీ సర్పంచ్‌లు శ్రీపతి బాపు, వెన్నపురెడ్డి వసంతమోహన్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ఎండగొట్టి అటు రైతులకు సాగునీరు, తాగునీరు లేకుండా చేసిందన్నారు. త్వరలో జరగనున్న సరస్వతినది పుష్కరాలకు పుష్కర స్నానానికి కూడా గోదావరి నది అడుగంటిపోతున్న సందర్భంగా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అధ్యక్షతన రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. పంటనష్టం పరిశీలన భూపాలపల్లి రూరల్: అకాల వర్షానికి నష్టపోయిన పంటలను జిల్లా ఉద్యానశాఖ అధికారి సునీల్‌కుమార్, మహదేవపూర్ డివిజన్ అధికారి మణి శనివారం పరిశీలించారు. గణపురం మండలం బుర్రకాయలగూడెంలోని మామిడి తోటలతో పాటు రేగొండ మండలంలోని రేపాక, బాగిర్థిపేటలోని అరటి తోటలను పరిశీలించారు. మహాముత్తారం మండలం పోలారంలో మునగ తోటలను పరిశీలించారు. కలెక్టర్ ఆదేశానుసారం పంట నష్టం అంచనా వేస్తున్నామని, పూర్తిగా నష్టం వివరాలను సేకరించి కలెక్టర్‌కు నివేదిస్తామని అధికారి సునీల్ తెలిపారు. పంటలు నష్టం జరిగితే రైతులు ఉద్యాన శాఖ అధికారులకు గాని, మండల వ్యవసాయశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని రైతులకు సూచించారు. పుష్కరాల పనుల పరిశీలన కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మే 15నుంచి 26వరకు జరుగనున్న సరస్వతినది పుష్కరాల పనులను కాటారం సబ్‌కలెక్టర్ మయాంక్‌సింగ్ పరిశీలించి, ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు. శనివారం ఆయన ఇరిగేషన్, ఎన్పీడీసీఎల్, పంచాయతీరాజ్, ఎండోమెంట్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మాట్లాడారు. పనులు త్వరగా పూర్తిచేయాలని చెప్పారు. -
ఏర్పాట్ల పరిశీలన
ములుగు: జిల్లాకేంద్రంలో నూతన బస్‌స్టేషన్ పనులను ప్రారంభించడానికి నేడు మంత్రి సీతక్కతో కలిసి రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరు కానున్నారు. ముందుగా ఉదయం 9గంటలకు గట్టమ్మ ఆలయంలో పూజా కార్యక్రమాల అనంతరం పార్టీ కార్యకర్తలతో కలిసి బస్టాండ్‌కు బైక్ ర్యాలీగా వస్తారు. బస్‌స్టేషన్ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం లీలా గార్డెన్లో నిర్వహించే సభకు మంత్రులు హాజరవుతారు. ఈ మేరకు శనివారం డీఎస్పీ రవీందర్, డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవిచందర్ శంకుస్థాపన ఏర్పాట్లను పరిశీలించారు. పోలీసుశాఖ తరఫున భారీ భద్రత ఏర్పాట్లు చేయనున్నారు. -
దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి
● మంత్రి ధనసరి సీతక్క ములుగు: వైకల్యమనేది కేవలం శరీరానికి మాత్రమేనని మనసుకు కాదని, దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, సీ్త్ర శిశు సంక్షేమ, గ్రామీణ నీటి పారుదల శాఖ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా సంక్షేమ అధికారి శిరీష అధ్యక్షతన మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని గోవిందరావుపేట, వెంకటాపూర్ మండలాల పరిధిలోని బళ్ల సంజయ్, నాగయ్య, కృష్ణ, కందికట్ల సాంబ య్యకు రూ.2లక్షల విలువైన బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఉద్యోగాలు, ఉపాధికి ఏ కార్యాలయాల చుట్టూ తిరుగకుండా ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను రూపొందించిందన్నారు. కలెక్టర్ దివాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతీ సంక్షేమ పథకంలో దివ్యాంగులకు తొలి ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ శాలినీ మిశ్రా మాట్లాడుతూ మంత్రి సీతక్క చొరవతో ఈ ఉపకరణాలను ఉచితంగా అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మహేందర్, సంపత్‌రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ తదితరులున్నారు. -
15 వరకు టెన్త్ సప్లిమెంటరీ ఫీజు గడువు
భూపాలపల్లి అర్బన్: పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులతోపాటు, రీ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు ఈ నెల 15వ తేదీలోపు ఆన్లైన్లో ఫీజు చెల్లించాలని జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్ధులు సబ్జెక్ట్‌ల వారీగా ఎటువంటి అపరాద రుసుం లేకుండా అన్లైన్లో ఫీజు చెల్లించాలని సూచించారు. మొదటి నెలలో 70 శాతం బొగ్గు ఉత్పత్తి భూపాలపల్లి అర్బన్: 2025–26 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ఏప్రిల్ మాసంలో బొగ్గు ఉత్పత్తి 70శాతమే సాధించారు. ఈ మేరకు శుక్రవారం ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి ఏరియాలో ఉత్పత్తి వివరాలను శుక్రవారం ప్రకటనలో తెలిపారు. గడిచిన మాసంలో ఏరియా ఉత్పత్తి లక్ష్యం 3.85లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి కాగా.. 2.70లక్షల ట న్నుల బొగ్గును వెలికి తీసినట్లు తెలిపారు. 3.85లక్షల టన్నుల బొగ్గు రవాణాకు 3.25లక్ష ల టన్నుల బొగ్గును రవాణా చేసినట్లు వెల్లడించారు. ఓసీ 2, 3 ప్రాజెక్ట్‌లో 1.35లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీయాల్సి ఉండగా 1.10లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని వెలికితీసినట్లు తెలిపారు. ఏరియాలో ఉత్పత్తిని పెంచడానికి ఉద్యోగులందరూ సమష్టిగా కృషి చేయాలని కోరారు. ఎస్డీఎల్ పని గంటలను పెంచడానికి, రక్షణ నియమాలు పాటిస్తూ పని చేయాలని సూచించారు. పునరుద్ధరణ పనుల పరిశీలన రేగొండ: మండలంలోని తిరుమలగిరి, రామన్నగూడెం, కొత్తపల్లి బి, కొత్తపల్లిగోరి మండలంలోని కొనరావుపేట, జగయ్యపేట గ్రామాల్లో బుధవారం రాత్రి ఈదురుగాలులతో వీచిన వర్షానికి చెట్లు విరిగి తీగల మీద పడడంతో స్థంభాలు విరిగి, ఇన్సులేటర్లు దెబ్బతిన్నాయి. కాగా శుక్రవారం విద్యుత్ పునరుద్ధరణ పనులను సీఎండీ కర్నాటీ వరుణ్‌రెడ్డి పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. విరిగిపడిపోయిన స్థంబాల పునరద్ధరణ పనులు పూర్తి చేసి విద్యుత్ సరఫరా అందించాలన్నారు. కా ర్యక్రమంలో సీజీఎం రాజుచౌహన్, జీఎం సు రేందర్, ఎస్ఈ మల్సూర్ నాయక్, డీఈ పాపిరెడ్డి, ఏడీఈ నాగరాజు, ఏఈలు రాజు, వెంకటరమణ, సురేష్, విశ్వాసరెడ్డి పాల్గొన్నారు. వాలీబాల్ శిక్షణ శిబిరం ప్రారంభం కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కేంద్రంలో వాలీబాల్ వేసవి శిక్షణ శిబిరం జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి రఘు శుక్రవారం ప్రారంభించారు. 14 సంవత్సరాల లోపు ఆసక్తిగల పిల్లలు ఈ శిబిరంలో పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఉదయం రెండు, సాయంత్రం రెండు గంటలపాటు జూన్ 6వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అన్కారి ప్రభాకర్, కోచ్ మోటం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 63 మంది పోలీసు సిబ్బంది బదిలీ భూపాలపల్లి: సాధారణ బదిలీల్లో భాగంగా 63 మంది పోలీసు సిబ్బందిని వివిధ పోలీస్స్టేషన్లకు ట్రాన్స్ఫర్ చేస్తూ ఎస్పీ కిరణ్ ఖరే శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒకే పోలీస్‌స్టేషన్‌లో ఐదేళ్లపాటు పని చేసిన సిబ్బందికి స్థానచలనం కల్పించారు. పోలీస్స్టేషన్లలో ఖాళీల ను సిబ్బందికి తెలుపుతూ, సీనియారిటీ ప్రకా రం ఆయా ఠాణాలకు కేటాయించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన బదిలీ ల్లో మొత్తం 63 మంది ట్రాన్స్ఫర్ కాగా 52 మంది కానిస్టేబుళ్లు, ఏడుగురు మహిళా కానిస్టేబుళ్లు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ఇద్దరు ఏఎస్సైలు ఉన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ బోనాల కిషన్, ఏఓ వసీం ఫర్హాన, ఎస్బీ ఇన్స్పెక్టర్ నరేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం
కాళేశ్వరం: అకాల వర్షం కారణంగా తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపా రు. మహదేవపూర్ మండల కేంద్రంలోని ఎర్ర చెరు వు సమీపంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో గు రువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిసిన ధా న్యాన్ని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. తడిసిన ధాన్యం వెంటనే మిల్లులకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాల ని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ, సహకార శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి నష్టపోయిన రైతుల పంటల వివరాలను నమో దు నివేదిక అందించాలని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, పౌరసరఫరాలశాఖ అధికారి శ్రీనాథ్, డీఎం రాములు, సహకార శాఖ అధికారి వాల్యనాయక్, తహసీల్దార్ ప్రహ్లాద్ రాథోడ్, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలి భూపాలపల్లి: ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. శుక్రవారం క్యాంప్ కార్యాలయం నుంచి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ, మండల ప్రత్యేక అధికారులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల విచారణ ప్రత్యేక అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో నిరుపేదలైన అర్హులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు తక్షణమే నిర్మాణం చేపట్టేలా అవగాహన కల్పించాలని తెలిపారు. అప్రమత్తంగా ఉండాలి వేసవినేపథ్యంలో ప్రజలు ఎండల నుంచి రక్షణ పొందేందుకు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ శర్మ శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నాయని, వడదెబ్బ తగలకుండా ప్రజలు ఆరోగ్య సంరక్షణ చర్యలు పాటించాలని తెలిపారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఇండ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. అత్యవసర వైద్య సేవలకు 108 నంబర్‌కు ఫోన్ చేయాలని తెలిపారు. నిల్వ ఉన్న ఆహారం, వేపుళ్లు, ఆరు బయట ఆహార పదార్థాలు తినొద్దని తెలిపారు. ఒక మండలాన్ని ఎంపిక చేయాలి.. మే 5 నుంచి 20 వరకు జిల్లాలోని ఒక మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి రాష్ట్రస్థాయి అధికారులతో కలిసి రెవెన్యూ సదస్సులు, ఇందిరమ్మ ఇళ్లు, నీట్ పరీక్ష నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పలు సూచనలు, సలహాలు అందించారు. కలెక్టరేట్‌నుంచి కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ -
నర్సరీల సంరక్షణకు చర్యలు తీసుకోవాలి
● డీపీఓ వీరభద్రయ్య రేగొండ: వేసవిలో నర్సరీల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి వీరభద్రయ్య సూచించారు. మండలంలోని రంగయ్యపల్లి గ్రామపంచాయతీని శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీలోని పలు రికార్డులను పరి శీలించారు. అలాగే సెగ్రిగేషన్ షెడ్డు, నర్సరీ, పల్లెప్రకృతి వనాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. నర్సరీల్లో పెరుగుతున్న మొక్కలు చనిపోకుండా చూడాలన్నారు. అనంతరం కొడవంటచ గ్రామంలోని లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఎంపీఓ రాంప్రసాద్, పంచాయతీ కార్యదర్శి జీవిత పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి ● అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ మల్హర్: ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణలో వేగం పెంచాలని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ అన్నారు. మండలంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తాడిచర్ల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. కొనుగోళ్లకు సంబంధించి ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జ్‌లను ట్యాబ్ ఎంట్రీలను తక్షణమే పూర్తి చేయాలని, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించా రు. అకాల వర్షాలు వస్తున్న నేపథ్యంలో కేంద్రాల్లో ధాన్యం నిల్వ లేకుండా తక్షణమే కేటా యించిన మిల్లులకు రవాణా చేయాలని ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియలో తాలు, తరు గు పేరుతో రైతులను ఇబ్బందులు గురిచేయొద్దని నిర్వాహకులకు సూచించారు. కేంద్రాల్లో టార్ఫాలిన్లు సిద్ధంగా ఉంచాలని పేర్కొన్నారు. కొనుగోలు జరిగిన తదుపరి రైతులకు బాధ్య త లేదని కేంద్రాలు ఇన్‌చార్జ్‌లు పూర్తి బాధ్యత వహించాలని ఆయన స్పష్టం చేశారు. సబ్ కలెక్టర్ మాయంక్సింగ్, డీఎస్ఓ శ్రీనాథ్, తహసీల్దార్ రవికుమార్, రైతులు పాల్గొన్నారు. -
సివిల్ సప్లయీస్‌కు ‘సీఎంఆర్‘ చిక్కులు
సాక్షిప్రతినిధి, వరంగల్: ● హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని ఓ రైసుమిల్లుకు 2021–22, 2022–23 సంవత్సరాలకు కేటాయించిన సీఎంఆర్ కింద 4,310 మె.టన్నుల బియ్యానికి 1,889 మె.టన్నులు మాత్రమే సరఫరా చేశారు. సుమారు రూ.7.50 కోట్ల విలువైన బియ్యం ఎగవేయడంతో అప్పట్లో సివిల్ సప్లయీస్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసి బియ్యం లేకపోవడంతో కేసులు నమోదు చేసి డిఫాల్టర్ లిస్టులో చేర్చారు. ● మహబూబాబాద్ జిల్లాలోని మూడు మిల్లుల్లో గత సీజన్లో రూ.30.38 కోట్ల విలువైన 1,13,796 క్వింటాళ్ల ధాన్యం దారి మళ్లించినట్లు తేలింది. అదే విధంగా కేసముద్రం విలేజ్ గ్రామంలోని రైస్ మిల్లుల్లో సివిల్ సప్లయ్, విజిలెన్స్, టాస్క్‌ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.30 కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్లు అధికారులు గుర్తించి కేసులు పెట్టారు. ఉమ్మడి జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. రైతులనుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కింద రైసుమిల్లర్లకు సరఫరా చేయాల్సి ఉండగా.. ఈసారి డిఫాల్టర్లకు ఇవ్వొద్దని ప్రభుత్వంనుంచి కచ్చితమైన ఆదేశాలు ఉన్నాయి. 20 శాతం మిల్లర్లు ఈ జాబితాలో ఉండే అవకాశం ఉంది. సివిల్ సప్లయీస్ అధికారులు వాటిపై పునరాలోచన చేస్తూ మిగతా మిల్లర్లకు ధాన్యం ఇస్తున్నారు. ధాన్యం దిగుబడుల అంచనాలకు అనుగుణంగా ఉమ్మడి వరంగల్‌లో 987 కొనుగోలు కేంద్రాలను పౌరసరఫరాల శాఖ ప్రతిపాదించింది. ఈ మేరకు జిల్లాల వారీగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. జేఎస్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో పాక్షికంగా సాగుతుండగా.. మిగతా జిల్లాల్లో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ధాన్యం అమ్ముకుంటున్న రైతులకు ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మెనేజ్మెంట్ సిస్టం (ఓపీఎంఎస్) ద్వారా డబ్బు బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తున్నారు. దాడులు, కేసులు పెట్టినా అదే మొండివైఖరి... సీఎంఆర్ కింద ఇచ్చిన ధాన్యాన్ని పలు జిల్లాల్లో కొందరు రైస్ మిల్లర్లు పక్కదారి పట్టించారు. రాష్ట్రవ్యాప్తంగా పౌరసరఫరాలశాఖ టాస్క్‌ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మూకుమ్మడి తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేశారు. గత రబీ సీజన్లో సీఎంఆర్ కోసం కూడా హనుమకొండ, వరంగల్, జేఎస్ భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లోనూ ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లాలోని మూడు మిల్లుల్లో రూ.30.38 కోట్ల విలువైన 1,13,796 క్వింటాళ్ల ధాన్యం దారి మళ్లించినట్లు తేలింది. వరంగల్ జిల్లాలోని ఓ మిల్లులో రూ.3.79 కోట్ల విలువైన 12,360 క్వింటాళ్లు పక్కదారి పట్టినట్లు గుర్తించి కేసు పెట్టారు. మొత్తంగా ఉమ్మడి వరంగల్‌లో జరిపిన తనిఖీల్లో ఆరేడు సంవత్సరాలకు సంబంధించిన రూ.201 కోట్లకు పైగా విలువైన బియ్యం బకాయి ఉన్నట్లు వెల్లడించారు. కాగా ఇప్పటికే డిఫాల్టర్ జాబితాలో ఉన్న పలువురికి నోటీసులు జారీ చేశామని, 6ఏ కేసులు కూడా నమోదు చేశామని, అవసరమైతే రెవెన్యూ రికవరీ యాక్టు కూడ పెడతామని పౌరసరఫరాలశాఖ అధికారులు చెబుతున్నారు. రబీ సీజన్ సీఎంఆర్ ఆచితూచి.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బాయిల్డ్, రా రాస్ మిల్లులు 328 వరకు ఉన్నాయి. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, ములుగు, జనగామ, భూపాలపల్లి జిల్లాలోని మిల్లుల నుంచి బకాయిలు సుమారు లక్షా 20వేల మెట్రిక్ టన్నుల పైచిలుకు రావాల్సి ఉందని ఫైనల్‌గా తేల్చారు. సీఎంఆర్ బకాయి ఉన్న డిఫాల్టర్లకు ఈ సీజన్లో ధాన్యం ఇవ్వరాదన్న ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్ 10.24 లక్షల మె.టన్నుల మేరకు ధాన్యం దిగుబడి ఉంటుందని అంచనా వేసిన అధికారులు 987 కొనుగోలు కేంద్రాల కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఇన్‌టైమ్‌లో సీఎంఆర్ ఇచ్చిన మిల్లర్లకే సరఫరా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. డిఫాల్టర్‌గా ఉన్న రైసుమిల్లర్లకు కేటాయించే ధాన్యాన్ని సకాలంలో సీఎంఆర్ ఇచ్చిన మిలర్లకు తరలించడమా... లేక ఈ సీఎంఆర్ బకాయి రాబట్టుకుని అదనంగా జమానత్‌లు తీసుకుని వారికే ఇవ్వడమా... అన్న కోణంలో కసరత్తు చేస్తున్నారు. పెండింగ్‌లో గత రబీ, ఖరీఫ్ సీఎంఆర్ బియ్యం లక్ష్యానికి దూరంగా చాలామంది రైసుమిల్లర్లు గడువు పెంచినా కదలని సీఎంఆర్ బకాయి ఊపందుకున్న రబీ ధాన్యం కొనుగోళ్లు డిఫాల్టర్లకు సీఎంఆర్ ఇవ్వొద్దని సర్కారు ఆదేశం.. ‘ప్రత్యామ్నాయం’పై కసరత్తు -
రాష్ట్రస్థాయిలో జిల్లా ఏ సంవత్సరంలో ఏ స్థానం..
భూపాలపల్లి అర్బన్: పదో తరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో 22వ స్థానానికి పడిపోయింది. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత ఒక శాతం పెరిగినప్పటికీ రాష్ట్రస్థాయి స్థానంలో తగ్గింది. గతేడాది 15వ స్థానంలో నిలవగా.. ఈసారి తగ్గడం గమన్హారం. బాలురతో పోలిస్తే బాలికలు ఒక శాతం పైచేయి సాధించారు. జిల్లాలో 66 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించగా.. 10మంది ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యార్థులు 550కిపైగా మార్కులు సాధించారు. ప్రైవేట్‌కు దీటుగా సర్కారు బడుల్లో చదివిన విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 3,221 మంది విద్యార్థుల పాస్ జిల్లాలో 121 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. వీటినుంచి 3,443మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 3,221 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలుర విభాగంలో 1,725 మందికి 1,606మంది (93.10శాతం) ఉత్తీర్ణులు కాగా.. బాలికల విభాగంలో 1,718మందికి 1,615మంది (94శాతం) ఉత్తీర్ణులయ్యారు. 222మంది విద్యార్థులు వివిధ సబ్జెక్టులలో ఫెయిలయ్యారు.పరీక్ష రాసిన విద్యార్థులు 3,443 ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు 3,221సాధించిన శాతం 93.52ఫెయిల్ అయిన విద్యార్థులు 222వంద శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు 66సంవత్సరం సాఽధించిన స్థానం 2016–17 14 2017–18 5 2018–19 7 2021–22 8 2022–23 5 2023–24 16 2024–25 22 (ప్రస్తుతం) కరోనా కారణంగా 2019–20, 2020–21 సంవత్సరాల్లో పరీక్షలు నిర్వహించలేదు. ఉత్తీర్ణత శాతం పెరిగినా తగ్గిన స్థానం పలువురు విద్యార్థులకు రాష్ట్రస్థాయి మార్కులు 66 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత -
అకాల వర్షం.. అతలాకుతలం
రేగొండ: జిల్లా కేంద్రంతో పాటు రేగొండ, కాటారం, మహాముత్తారం మండలాల్లో బుధవారం రాత్రి అకాలవర్షం కురిసింది. ఈదురుగాలులకు జిల్లా కేంద్రంలోని సుభాష్‌కాలనీ సింగరేణి ఫంక్షన్ హాల్ వద్ద చెట్టు కారుపై పడడంతో కారు ధ్వంసమైంది. ఎస్ఎం కొత్తపల్లిలో కర్ణాటకపు రమేష్‌కు చెందిన ఇంటి పైకప్పు పూర్తిగా గాలికి ఎగిరిపోయింది. రేగొండ మండలం కొత్తపల్లి (బీ)లో ఇంటి రేకులు గాలికి కొట్టుకుపోయాయి. బాగిర్తిపేట క్రాస్ రోడ్డు నుంచి మూల కొత్తపల్లి వరకు రోడ్డుకిరువైపులా చెట్టు నేలవాలడంతో ఎస్సై సందీప్‌కుమార్ చెట్లను జేసీబీ సహాయంతో తొలగించారు. భూపాలపల్లి, రేగొండ, మహాముత్తారం, కాటారం మండలాల్లో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం వర్షానికి పూర్తిగా తడిసిపోయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు వర్షార్పణం కావడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మహాముత్తారం పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం సమీపంలో పిడుగుపడింది. దీంతో కేంద్రం వద్ద ఉన్న రైతులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. -
దేవాలయాల అభివృద్ధికి కృషి..
భూపాలపల్లి రూరల్: దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి పట్టణం సుభాష్‌కాలనీలో బుధవారం పోచమ్మ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పోచమ్మ గుడి అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభంభూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని పెద్దకుంటనల్లి తండాలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సత్యనారాయణరావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోద్దన్నారు.అధికారుల సేవలు మరువలేనివిభూపాలపల్లి: జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు, బీసీ సంక్షేమ అధికారి శైలజ జిల్లాకు అందించిన సేవలు మరువలేనివని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. నారాయణరావు, శైలజ ఉద్యోగ విరమణ సందర్భంగా బుధవారం రాత్రి ఐడీఓసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్మాన మహోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే, కలెక్టర్ ముఖ్య అతిథులుగా హాజరై వారిని సన్మానించారు. -
చెక్ బౌన్స్ కేసులను పరిష్కరించాలి
భూపాలపల్లి అర్బన్: వచ్చే స్పెషల్ లోక్ అదాలత్‌లో పెండింగ్‌లో ఉన్న చెక్‌బౌన్స్ కేసులను పరిష్కరించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి నాగరాజు ఆదేశించారు. న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బ్యాంకు మేనేజర్లు, న్యాయవాదులతో బుధవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. బ్యాంకులు, కోర్టులలో పెండింగులో ఉన్నటువంటి చెక్ బౌన్స్ కేసులను పరిష్కారం చేయడానికి బ్యాంకు మేనేజర్లు, న్యాయవాదులు కలిసిరావాలని అన్నారు. ఆర్థిక నేరాలను కట్టడి చేయడం అవసరమన్నారు. జూన్ 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు నిర్వహించే స్పెషల్ లోక్ అదాలత్‌లో పెద్దఎత్తున పరిష్కారం చేసేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి అఖిల, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రావణ్‌రావు, న్యాయవాదులు రవీందర్, విష్ణువర్ధన్‌రావు, రాజేందర్, కవిత, ప్రియాంక, శివకుమార్, రాకేష్, రమేష్ పాల్గొన్నారు. -
పుష్కరాల పనుల్లో వేగం పెంచండి
కాళేశ్వరం: మే 15నుంచి 26వరకు కాళేశ్వరంలో జరుగనున్న సరస్వతి నది పుష్కరాల్లో అధికారులు సమన్వయంతో పనిచేసి వేగం పెంచాలని కలెక్టర్ రాహుల్‌శర్మ అన్నారు. మంగళవారం కలెక్టర్ వీఐపీ ఘాటు విస్తరణ పనులు, సరస్వతి మాత విగ్రహం ఏర్పాటు, టెంట్ సిటీ ఏర్పాటు, పార్కింగ్ ప్రదేశాలు, వంద గదుల గెస్ట్‌హౌస్, జాయ్‌రైడ్స్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్న ప్రదేశాలను పరిశీలించారు. అనంతరం ఈఓ కార్యాలయంలో పనుల పర్యవేక్షణ ప్రత్యేక అధికారులు, రెవెన్యూ, పోలీస్, దేవాదాయ, ఇరిగేషన్, విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్, పీఆర్, రవాణా, వైద్య తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్‌శర్మ మాట్లాడుతూ వీఐపీ ఘాట్ వద్ద టెంట్ సిటీ, ఎగ్జిబిషన్, ఫుడ్ కోర్టు, స్టాళ్లు, కిడ్స్ జోన్ తదితర ఏర్పాటు చేసేందుకు స్థలాలకు మార్కింగ్ చేయాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. వీఐపీ ఘాట్ వెళ్లే రహదారి నిర్మాణానికి మార్కింగ్ చేయాలన్నారు. హెలికాప్టర్లో జాయ్‌రైడ్ చేసేందుకు కౌంటర్ ఏర్పాటుచేయాలని తెలిపారు. పుష్కరాల్లో భక్తులకు ప్రత్యేక ఘాట్లు, తాత్కాలిక వసతి కేంద్రాలు, ఆరోగ్య శిబిరాలు, తాగునీటి ఏర్పాట్లు, పరిశుభ్రత చర్యలు చేపట్టాలని సూచించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆదేశించారు. ప్రతి రోజు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు స్టేజీ ఏర్పాట్లు, విద్యుద్ధీకరణ, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ప్రవచన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. రెవెన్యూ, పోలీస్, దేవాదాయ శాఖల అధికారులు సంయుక్తంగా పార్కింగ్ ప్రదేశాలను గుర్తించి విద్యుద్ధీకరణ చేయాలని సూచించారు. విధుల్లో ఉండే సిబ్బందికి నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లు, పార్కింగ్, ఆర్టీసీ ప్రదేశాల్లో సురక్షిత తాగునీరు సరఫరా చేయాలని తెలిపారు. భక్తులు నదిలోకి వెళ్లడానికి చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఎండోమెంట్‌కు సంబంధించిన శ్రాద్ధ మండపం, సరస్వతిమాత విగ్రహం పనులు, ప్రసాదం కౌంటర్ పనులు నెమ్మదిగా జరుగుతుండడంతో అసహనం వ్యక్తం చేశారు. మే 4వరకు పనులన్నీ పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్‌కలెక్టర్ మయాంక్‌సింగ్, దేవస్థానం సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ మల్చూర్‌నాయక్, ఎండోమెంట్ ఎస్ఈ కనకదుర్గా ప్రసాద్, డీపీఓ నారాయణరావు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈలు తిరుపతిరావు, వెంకటేశ్వర్లు, నిర్మల, ఆబ్కారీ ఈఎస్ శ్రీనివాస్, కాటారం డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి, సీఐ రామచందర్‌రావు, ఎస్సై తమాషారెడ్డి పాల్గొన్నారు. మే 4వరకు పూర్తిచేయాలని ఆదేశం కలెక్టర్ రాహుల్‌శర్మ -
రిజల్ట్స్ ఎలా ఉన్నా పాజిటివ్‌గా తీసుకోవాలి...
పరీక్ష ఫలితాలు అంటేనే చాలా మంది విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల్లో కంగారు ఉండడం సహజమే. ఫలితాలు ఎలా ఉంటాయో...ఎన్ని మార్కులు వస్తాయోనని విద్యార్థులు సైతం టెన్షన్ పడుతుంటారు. కానీ, పరీక్ష ఫలితం ఎలా వచ్చినా ఆందోళన చెందకూడదు. అంతా పాజిటివ్‌గా తీసుకోవాలి. అనుకున్న దాని కంటే తక్కువ మార్కులు వచ్చినా, చదివినా చదువుకు తగిన ఫలితాలు రాలేదని అతిగా స్పందించొద్దు. ఒక్క ఓటమితో తమ చదువు ముగిసిపోదు. ప్రపంచంలోని మేధావులంతా ఎక్కువ మార్కులు సాధించినవారేమీ కాదని విషయాన్ని గుర్తించాలి. తల్లిదండ్రులు కూడా ఈ దిశగా విద్యార్థులకు ప్రోత్సాహం ఇవ్వాలి. – డాక్టర్ రాజు, మానసిక వైద్య నిపుణుడు -
వాతావరణం
జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండతో పాటు ఉక్కపోతగా ఉంటుంది. వడగాలలు వీచే అవకాశం ఉంది.తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.. పంట కోసిన తర్వాత వరి ధాన్యం చాలా తేమతో కూడుకొని ఉంటుంది. పది, పదిహేను రోజులు ఆరబెట్టుకోవాల్సి వస్తుంది. సరైన ఫ్లాట్‌ఫాంలు లేక రోడ్డపైన, ఖాళీ ప్రదేశాల్లో ధాన్యం ఆరబెడుతున్నాం. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ధాన్యం ఆరబోతకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలి. ఫ్లాట్‌ఫాంల నిర్మాణానికి సహకరించాలి. – తిరుపతిగౌడ్, రైతు, వెంకట్రావుపల్లి ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే.. గతంలో గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా కల్లాల నిర్మాణానికి అవకాశం ఉండేది. మూడేళ్లుగా ఆ పథకం నిలిచిపోయింది. ప్రస్తుతం ప్రభుత్వం ద్వారా కల్లాల నిర్మాణానికి నిధులు మంజూరయ్యే అవకాశం లేదు. ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే రైతులకు తెలియజేస్తాం. – నరేశ్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి● -
జిల్లాల వారీగా పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు
సాక్షి, వరంగల్: చదువంటే మార్కులు తెచ్చుకోవడం కాదు...జీవితాన్ని నేర్చుకోవడం, పరీక్షలో ఫెయిలవడం సరిదిద్దుకోలేని తప్పేమీ కాదు...అందరూ ఎప్పుడో ఒకప్పుడూ ఫెయిల్ అవుతారు...కానీ పరీక్షలో మార్కులే ప్రతిభకు, సామర్థ్యానికి కొలమానం కాదు...జీవితంలో ఇంకా చాలా అవకాశాలున్నాయనే విషయాన్ని మర్చిపోతే వచ్చేది దుఃఖం, ఆవేశమే. ఇవి సాధిస్తామన్న ఆశను చంపకూడదు. వారం క్రితం వెల్లడైన ఇంటర్ ఫలితాల్లో తప్పిన కొందరు విద్యార్థులు క్షణికావేశంతో ఆత్మహత్యలు చేసుకున్నా దరిమిలా...పదో తరగతి ఫలితాలు బుధవారం వెల్లడవుతున్న నేపథ్యంలో తమ పిల్లలతో తల్లిదండ్రులు ఓ స్నేహితునిలా...గురువులా మెదిలి వారిలో ఉన్న భయాన్ని పోగొట్టాలి. భవిష్యత్‌పై భరోసా ఇవ్వాల్సిన అవసరముందన్న అభిప్రాయం విద్యావేత్తలు, మానసిక వైద్యనిపుణుల్లో వ్యక్తం అవుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షలకు 42,262 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష ఫలితాల సమయంలో ర్యాంక్‌లు రాలేదని కొందరు...మార్కులు తక్కువ వచ్చాయని ఇంకొందరు...ఫెయిల్ అయ్యామని మరికొందరు మానసిక ఒత్తిడికి గురై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థుల కంటే కూడా వారి ఫలితాలపై తల్లిదండ్రులు ఎక్కువ అంచనాలు పెట్టుకోవడం కూడా ఈ తరహా ఘటనలకు అవకాశం ఇస్తోంది. పిల్లల మార్కులను తల్లిదండ్రులు ప్రతిష్టగా భావించొద్దని సూచిస్తున్నారు. ఇతర విద్యార్థులతో పోల్చడం వల్ల పిల్లల మానసిక వ్యథకులోనై కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశముంటుందని అంటున్నారు. హనుమకొండ12,010వరంగల్9,237జయశంకర్ భూపాలపల్లి6,2383,4493,134 8,194మానుకోట దీన్ని అధిగమించి సక్సెస్ ఫుల్ లైఫ్‌తో ముందుకెళ్లొచ్చు పిల్లల మార్కులను పేరెంట్స్ ప్రతిష్టగా భావించొద్దు ఫలితం ఎలా ఉన్నా ప్రోత్సహిస్తేనే బంగారు భవిష్యత్ పదో తరగతి ఫలితాల వేళ మానసిక, వైద్య నిపుణుల సూచనలు -
ఒక్కసారి ఫెయిలైతే జీవితమే అయిపోయినట్టు కాదు
మీరు (పరీక్షల్లోనైనా, ఇతర అంశాల్లో అయినా) విఫలమైతే, ఎప్పటికీ వదులుకోకండి ఎందుకంటే వైఫల్యం అంటే నేర్చుకోవడంలో మొదటి ప్రయత్నం అని అర్థం. వైఫల్యం అనే వ్యాధిని చంపడానికి ఆత్మవిశ్వాసం, కృషి ఉత్తమ ఔషధం. అది మిమ్మల్ని విజయవంతమైన వ్యక్తిగా చేస్తుంది. – ఏపీజే అబ్దుల్ కలాంఇటీవల విడుదలైన టెన్త్ ఫెయిల్ సినిమాలో హీరో తన గ్రామంలోని పాఠశాలలో పదో తరగతి ఫెయిలవుతాడు. ఆ తరువాత కష్టపడి చదువుతాడు. ఢిల్లీ వెళ్లి పిండిమర, టీస్టాల్ తదితర పనులు చేసుకుంటూనే సివిల్స్‌కు ప్రిపేరవుతాడు. ఒకటి, కాదు రెండు కాదు.. ఆరోసారి తను అనుకున్న ఐపీఎస్ సాధిస్తాడు. అతను మొదటిసారి రాలేదని కుంగిపోకుండా ‘రీస్టార్ట్’ అంటూ తన చదువు మొదలుపెట్టి చివరికి అనుకున్నది సాధిస్తాడు. -
నేడు పోచమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన
భూపాలపల్లి: భూపాలపల్లి పట్టణంలోని సుభాష్‌కాలనీలో నూతనంగా నిర్మించిన పోచమ్మ తల్లి దేవాలయంలో నేడు(బుధవారం) విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. పోచమ్మ తల్లి ప్రాణ ప్రతిష్ఠను పురస్కరించుకొని మూడు రోజులుగా ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం హోమం, కుంకుమార్చన, సాయంత్రం శట్కోనం పూజ నిర్వహించారు. అనంతరం ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. నేడు ఉదయం 9 గంటలకు పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, భక్తులు భారీ సంఖ్యలో హాజరు కావాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.ఏరియాలో పర్యటించిన సెక్యూరిటీ జీఎంభూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలో సింగరేణి సెక్యూరిటీ జీఎం లక్ష్మినారాయణ మంగళవారం విస్తృతంగా పర్యటించారు. ఏరియాలోని సింగరేణి భూములు, ఖాళీ స్థలాలు, బొగ్గు నిల్వలు, సోలార్ ప్లాంట్ భద్రతలను పరిశీలించి, సీసీ కెమెరాలను పర్యవేక్షించి రికార్డులను తనిఖీచేశారు. బొగ్గు దొంగతనం జరగకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి ఏరియా సెక్యూరిటీ అధికారి మురళీమోహన్‌తో చర్చించారు. స్థలాలు కబ్జా కాకుండా చూసేందుకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు.విశ్రాంత జీవితం ప్రశాంతంగా గడపాలిభూపాలపల్లి: ఉద్యోగ విరమణ అనంతరం విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. టేకుమట్ల పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తూ, మంగళవారం ఉద్యోగ విరమణ పొందిన ఏఎస్సై పింగలి అమరేందర్‌రెడ్డికి జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ పూలమాలవేసి, శాలువాతో సత్కరించి గృహోపకరణాలు అందించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి ఉద్యోగ విరమణ అనివార్యమన్నారు. ఎన్నో సవాళ్లతో కూడుకొని ఉన్న పోలీస్ ఉద్యోగం సంపూర్ణంగా పూర్తి చేయడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బోనాల కిషన్, ఏఆర్ అదనపు ఎస్పీ వేముల శ్రీనివాస్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు నగేష్, రత్నం, కిరణ్, శ్రీకాంత్, అమరేందర్‌రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.వేసవి క్రీడా శిక్షణ శిబిరం ప్రారంభంభూపాలపల్లి అర్బన్: సింగరేణి వర్క్‌పీపుల్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏరియాలోని అంబేడ్కర్ స్టేడియంలో మంగళవారం ఉచిత వేసవి క్రీడా శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఇన్చార్జ్ ఎస్వోటు జీఎం పోశమల్లు హాజరై ప్రారంభించి మాట్లాడారు. క్రీడలు మానసికోల్లాసానికే కాక శారీరక దృఢత్వానికి కూడా ఉపయోగపడుతాయన్నారు. సింగరేణి ఉద్యోగుల పిల్లలు, పరిసర ప్రాంతాల పిల్లలు ఈ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఈ శిక్షణ శిబిరం ద్వారా పిల్లలు సెల్ ఫోన్, టీవీలకు దూరంగా ఉంటారని తల్లిదండ్రులకు సూచించారు. సెల్‌ఫోన్ ద్వారా ఊబకాయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ శిక్షణ తరగతులలో ఫుట్‌బాల్, వాలీబాల్, బాస్కెట్‌బాల్, అథ్లెటిక్స్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు జోతి, అరుణ్‌ప్రసాద్, యూనియన్ నాయకులు బేతెల్లి మధుకర్‌రెడ్డి, మోటపలుకుల రమేష్, సీనియర్ పీఓ శ్రావణ్‌కుమార్, స్పోర్ట్స్ సూపర్వైజర్ శ్రీనివాస్, కోచులు తిరుపతి, రఘువీర్, శరత్, నెహ్రూ, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. -
పింఛన్ కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నా..
నా పేరు సమ్మక్క. నాకు పక్షవాతం వచ్చి ఒక కాలు, ఒక చేయి పడిపోయింది. నడవలేని, నిలబడలేని స్థితిలో ఉన్నాను. పింఛన్ కోసమని గణపురంలో చాలాసార్లు అప్లికేషన్ ఇచ్చిన. అక్కడ సదరం సర్టిఫికెట్ కావాలన్నరు. జిల్లా ఆస్పత్రికి పోగా 65 శాతం వికలాంగత్వం ఉన్నట్లు సర్టిఫికెట్ ఇచ్చిర్రు. దీంతో ఎంపీడీఓ కార్యాలయంలో చాలాసార్లు దరఖాస్తు చేసిన. అయినా పింఛన్ రాకపోవడంతో కలెక్టరేట్‌కు వస్తున్నా. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మూడుసార్లు దరఖాస్తు ఇచ్చిన. అయినా పింఛన్ మంజూరు కాలేదు. నాకు భూమి జాగా లేదు. ఆస్పత్రిలో చూయించుకోవడం, ఇంటి ఖర్చులకు ఇబ్బంది అయితాంది. – చివిటిబోయిన సమ్మక్క, చెల్పూరు, గణపురం -
జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన ఎస్పీ
భూపాలపల్లి అర్బన్: ఇటీవల జిల్లాకు బదిలీపై వచ్చిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేష్‌బాబును ఎస్పీ కిరణ్ ఖరే మర్యాదపూర్వకంగా సోమవారం కలిశారు. కోర్టు కార్యాలయంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం జిల్లాలో న్యాయ, రక్షణ సంబంధిత విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాజు పాల్గొన్నారు.సివిల్ కోర్టులో చలివేంద్రం ప్రారంభంభూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలో జూనియర్ సివిల్ కోర్టులో సోమవారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వలబోజు శ్రీనివాస్‌చారి హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవికాలం నేపథ్యంలో కోర్టుకు వచ్చే ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు శ్రీనివాస్‌చారి తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ నాయకులు శ్రవణరావు, రాజ్ కుమార్, రాకేష్, అనిల్ పాల్గొన్నారు.సీసీఎస్ కానిస్టేబుల్ రాజుకు రివార్డుభూపాలపల్లి అర్బన్: సీసీఎస్ కానిస్టేబుల్ ఉప్పుల రాజు డీజీపీ డాక్టర్ జితేందర్ చేతుల మీదుగా రివార్డు అందుకున్నారు. జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు రాజు చేసిన కృషికి రివార్డుకు ఎంపికయ్యారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో రాజును డీజీపీ సన్మానించి రివార్డు అందజేశారు. ఈ సందర్భంగా రాజును ఎస్పీ కిరణ్‌ఖరే అభినందించారు.నేడు కలెక్టర్ సమీక్షకాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాలేశ్వరంలో మే 15నుంచి 26వరకు జరుగనున్న సరస్వతి నది పుష్కరాల అభివద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ రాహుల్ శర్మ సంబంధిత శాఖ అధికారులతో మంగళవారం ఉదయం 10 గంటలకు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. కాళేశ్వరంలో జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించనున్నారు.సివిల్స్ ర్యాంకర్‌కు సన్మానంభూపాలపల్లి అర్బన్: వారం రోజుల క్రితం విడుదల అయిన సివిల్స్ ఫలితాలలో ప్రతిభ కనబరిచి 85వ ర్యాంకు సాధించిన బానోతు జితేంద్ర నాయక్‌ను సింగరేణి సీఎండీ బలరాం సన్మానించారు. సోమవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో జితేంద్ర నాయక్‌ను సీఎండీ సన్మానించి జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా వారి తల్లిదండ్రులను అభినందించారు.మేడే వాల్‌పోస్టర్ ఆవిష్కరణభూపాలపల్లి అర్బన్: మే 1వ తేదీన నిర్వహించనున్న మేడే ఉత్సవాల వాల్ పోస్టర్‌ను ఏఐటీయూసీ నాయకులు సోమవారం ఏరియాలోని వివిధ గనులలో ఆవిష్కరించారు. ఏరియాలోని కేటీకే ఒకటవ గనిలో నిర్వహించిన కార్యక్రమానికి ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేశ్ హాజరై మాట్లాడారు. మేడేను అన్ని గనులు, డిపార్ట్మెంట్లలో ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామ చందర్, శ్రీనివాసు, చంద్రమౌళి, సదయ్య, నరేష్, అరుణ్ పాల్గొన్నారు. -
‘ఇరిగేషన్’లో ఏసీబీ గుబులు!
ఏసీబీ రంగప్రవేశం.. ఆందోళనలో ఇంజనీర్లు.. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు వివాదంలో రంగంలోకి దిగిన ఏసీబీ.. ప్రాజెక్టులో ముఖ్య భూమిక పోషించిన నీటి పారుదల శాఖ గజ్వేల్ ఈఎన్సీ భుక్యా హరిరామ్‌పై దాడులు నిర్వహించడం నీటిపారుదలశాఖను కుదిపేసింది. భారీగా అక్రమాస్తులు కూడబెట్టారనే అభియోగాల నేపథ్యంలో శుక్రవారం, శనివారం దాడులు నిర్వహించి... శనివారం సాయంత్రం అరెస్టు చేసినట్లు ప్రకటించింది. ఆయన వద్ద ప్రాథమికంగా రూ.200 కోట్ల మేరకు అక్రమాస్తులుంటాయని భావించిన ఏసీబీ ఇంకా తనిఖీలు కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు అధికారుల ఆస్తుల గురించి కూడా ఏసీబీ ఆరా తీస్తుందన్న ప్రచారం ఇంజనీరింగ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.సాక్షిప్రతినిధి, వరంగల్ : నీటిపారుదలశాఖలోని కొందరు ఇంజనీర్లలో మళ్లీ ఏసీబీ కలకలం మొదలైంది. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఆందోళనలో పడ్డారు. మేడిగడ్డ మొదలుకుని కన్నెపల్లి, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు, పలు ప్యాకేజీ పనుల్లో లొసుగులపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించింది. ఇప్పటికే చాలామందిని విచారించిన ఆ కమిటీ ప్ర భుత్వానికి ప్రాథమిక నివేదిక అందించింది. ఈ నివేదిక ఆధారంగా ప్రాజెక్టు పరిధిలోని వివిధ కేడర్లలో ఉన్న 17 మందిపై క్రిమినల్ కేసులు, 30 మందిపై శాఖాపరమైన చర్యలను సిఫారసు చేశారు. ఇ దే సమయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అ ధికారులు ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లు గు ర్తించి ప్రాజెక్టు ఎండీ హరీరామ్ ఇళ్లలో సోదాలు ని ర్వహించి అరెస్టు చేయడం సంచలనంగా మారింది. విచారణలతో ఉక్కిరిబిక్కిరి... మేడిగడ్డ బ్యారేజీ కుంగి, పియర్లు దెబ్బతిన్న ఘటనలో తొలుత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల సీపేజీపైనా విచారణ జరిపి తుది నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి కారణాలపై వివరంగా నివేదించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏకంగా 17 మంది సీనియర్ ఇంజనీర్లపై క్రిమినల్ కేసులకు సిఫార్సు చేసింది. అందులో అంతా మేడిగడ్డతో సంబంధం ఉన్నవారేనని తెలిసింది. నిర్మాణంతోపాటు డిజైన్లు, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ తదితర విభాగాల్లో పనిచేసిన ఇంజనీర్లు ఉన్నట్లు ప్రకటించారు. క్రిమినల్ కేసుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఫార్సు చేసిన వారిలో కాళేశ్వరం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లుతోపాటు గతంలో ఎస్ఈగా పనిచేసిన రమణా రెడ్డి, ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతి రావు సహా 17 మంది ఉన్నారు. శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేసిన 30 మందిలో వివిధ విభాగాలకు చెందిన డీఈఈ, ఏఈఈలు ఉన్నట్లు తెలిసింది. నివేదికలో ఉన్న ఇంజనీర్లను పదోన్నతులకు పరిశీలనకు తీసుకోవాలా లేదా తేల్చుకోలేక ఉన్నతాధికా రులు పెండింగ్‌లో పెట్టారు. నిర్మాణ సమయంలో నాణ్యత తనిఖీ విభాగం, నిర్వహణ సమయంలో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగం ఇంజనీర్లు వైఫల్యం చెందినట్లుగా నిర్ధారించి, వారిపైనా కేసులకు సిఫార్సు చేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఇందుకు సంబంధించి మాజీ ఈఎన్సీ మురళీధర్, ప్రస్తుత చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి తదితరులపైనా చర్యలకు సిఫార్సు చేసినట్లు తెలుస్తున్నా, శాఖాపరమైన చర్యలా? క్రిమినల్ చర్యలా? అన్నది తేలలేదు. ఏదేమైనా కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంలో చిక్కుకున్న పలువురు ఇంజనీర్లు విచారణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చర్చనీయాంశంగా ఎండీ హరీరామ్పై దాడులు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇక్కడి వాళ్లే.. ఇప్పటికే 17మందిపై క్రిమినల్ కేసులు 30మందిపై శాఖాపరమైన చర్యలకు సిఫారసు తాజాగా ఏసీబీ దాడులకు దిగడంతో కలకలం -
ఉపాధి కల్పిస్తామని ఉసురు తీస్తున్నారు..
గణపురం మండలం పరశురాంపల్లి గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్లో గ్రీవెన్స్‌లో తమ గ్రామ సమస్యపై అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. వారి మాటల్లోనే.. 2003 సంవత్సరంలో భూగర్భ గని ఏర్పాటులో భాగంగా సింగరేణి యాజమాన్యం మా వ్యవసాయ భూములను తీసుకొని పరిహారం చెల్లించింది. ఇప్పుడు ఆ గనిని తొలగించి ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్ట్ 3 ఏర్పాటు చేశారు. ప్రాజెక్టులో బాంబు బ్లాస్టింగ్ల మూలంగా మా ఇళ్ల గోడలు బీటలు వారుతున్నాయి. చిన్నచిన్న గుడిసెలు కూలిపోయే స్థితిలో ఉన్నాయి. భారీ వాహనాల రాకపోకలు, బాంబు బ్లాసింగ్‌లతో గాలి కాలుష్యమై మా ఊరి వాళ్లు ఆస్పత్రుల పాలవుతున్నారు. కొంతమంది శ్వాసకోస ఇబ్బందులకు గురై మృతి చెందారు. భారీ వాహనాల రాకపోకలతో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఇక ఇక్కడ మేము ఉండలేమని, మా గ్రామాన్ని సేకరించి పరిహారం చెల్లించాలని సింగరేణి యాజమాన్యాన్ని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా మా గ్రామాన్ని తరలించి పునరావాసం, ప్యాకేజీ అందజేయాలి. -
చెరువుల్లో మట్టి దోపిడీని అరికట్టాలి..
కాటారం సబ్ డివిజన్ పరిధి పలు చెరువుల్లోని మట్టిని కొందరు వ్యక్తులు అక్రమంగా తరలిస్తున్నారు. అనుమతులు తీసుకోకుండా చెరువులను చెరబడుతున్నారు. పలుమార్లు తహసీల్దార్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. కాటారం పరిధిలోని పోతులవాయి శివారులోని నల్లగుంట, విలాసాగారం, శంకరంపల్లి, దేవరాంపల్లి, పరికిపల్లి చెరువుల్లో ప్రతీరోజు రాత్రి జేసీబీలతో మట్టిని తవ్వి తరలిస్తున్నారు. ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాల మూలంగా చెరువులు దెబ్బతింటున్నాయి. ఇప్పటికై నా చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించా. – ఆత్కూరి శ్రీకాంత్, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి -
బాల్యవివాహాలను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత
భూపాలపల్లి రూరల్: బాల్యవివాహాలను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జస్ట్రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ సహాయ వెల్పేర్ అసోసియేషన్ ఎన్జీఓ జిల్లా ప్రాజెక్టు కోఆర్డినేటర్ శాస్త్రాల తిరుపతి అన్నారు. ఎన్జీఓ డైరెక్టర్ వంగ రాజ్‌కుమార్ ఆదేశానుసారం జిల్లాలోని దేవాలయాలు, మజీదులు, చర్చిలు, కాలనీలు, అంగన్వాడీ కేంద్రాల్లో బాల్యవివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ.. బాల్య వివాహాలు చేయడమంటే చిన్న పిల్లలపై అత్యాచారాలు ప్రోత్సహించడం లాంటిదన్నారు. పూజారులు, ఫాస్టర్లు, ముస్లిం మతపెద్దలు పెళ్లిళ్లు చేసే సమయంలో అమ్మాయి, అబ్బాయి మేజర్లు అయితేనే వివాహాలు జరిపించాలన్నారు. బాల్య వివాహాలను ప్రోత్సహించిన రూ.లక్ష జరిమానతో పాటు రెండు సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆలయాలు, అంగన్వాడీ కేంద్రాల్లో చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ భారత్ ప్రతిజ్ఞ చేయించామన్నారు.జిల్లా ప్రాజెక్టు కో ఆర్డినేటర్ శాస్త్రాల తిరుపతి -
భూ భారతితో భూ వివాదాలు పరిష్కారం
కాళేశ్వరం/పలిమెల: భూ భారతి చట్టంతో భూ సమస్యలు సత్వర పరిష్కారానికి నోచుకుంటాయని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. మహదేవపూర్ మండలకేంద్రం, పలిమెల మండలకేంద్రంలో సోమవారం భూ భారతి చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ భూమి కలిగిన ప్రతి రైతుకు భూధార్ కార్డు జారీ చేయనున్నట్లు తెలిపారు. ప్రతి అంశం భూ భారతి పోర్టల్‌లో ఉంటుందని భూములకు సంబంధించిన వివరాలను ఎవరికి వారు పరిశీలించుకోవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా రైతులు, భూ యజమానులు అడిగిన పలు సందేహాలను కలెక్టర్ స్వయంగా నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, తహసీల్దార్ ప్రహ్లాద్ రాథోడ్, అనిల్, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, వ్యవసాయ అధికారి సుప్ర జ్యోతి, పీఏసీఎస్ చైర్మన్ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ -
కేయూలో విద్యార్థుల ఆందోళన
కేయూ హాస్టళ్లు, మెస్‌లను యథావిధిగా కొనసాగించాలని కోరుతూ విద్యార్థులు ఆందోళన చేశారు. హన్మకొండ: వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంపై టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. తరచూ ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి వినియోగదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇంటివద్ద నుంచి పరిష్కరించుకునే వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం కొత్తగా వాట్సాప్ చాట్‌బాట్‌ను తీసుకువచ్చింది. దీనిద్వారా విద్యుత్ వినియోగదారులు వాట్సాప్ ద్వారా తమ సమస్యను సులువుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లొచ్చు. -
యువత సన్మార్గంలో నడవాలి
పలిమెల: యువత చెడు వ్యసనాలు, బెట్టింగ్‌లకు దూరంగా ఉంటూ వారి భవిష్యత్‌ను తీర్చిదిద్దుకునేలా సన్మార్గంలో నడవాలని ఎస్పీ కిరణ్‌ఖరే సూచించారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర సరిహద్దు జిల్లాలు గడ్చిరోలి (మహారాష్ట్ర), బీజాపూర్ (ఛత్తీస్‌గఢ్), ములుగు, భూపాలపల్లి జిల్లాల పరిధిలోని క్రీడాకారులకు ప్రజా భరోసా వాలీబాల్ టోర్నమెంట్ పోటీలను సోమవారం పలిమెల మండలకేంద్రంలో ఎస్పీ కిరణ్ ఖరే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ క్రీడాకారులతో కలిసి కాసేపు సరదాగా వాలీబాల్ ఆడారు. అనంతరం ఎస్పీ కిరణ్‌ఖరే మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం, ఉత్సాహం లభిస్తాయన్నారు. సరిహద్దు ప్రజలు, యువతతో మమేకమవ్వడమే ప్రజా భరోసా టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ టోర్నమెంట్లో 105 టీంలు పాల్గొన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బోనాల కిషన్, ఏఆర్ అదనపు ఎస్పీ వేముల శ్రీనివాస్, కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి, మహదేవపూర్, కాటారం సీఐలు రామచందర్ రావు, నాగార్జునరావు, పలిమెల ఎస్సై జె.రమేష్, ఎస్సైలు పాల్గొన్నారు. ఎస్పీ కిరణ్ ఖరే -
మే 5న అర్చక పోస్టులకు పరీక్ష
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానంలో ఖాళీగా ఉన్న ఐదు అర్చక పోస్టులకు మే 5న రాతి, మౌఖిక పరీక్షలు నిర్వహించనున్నారు. ఇటీవల దేవాదాయశాఖ ఐదు అర్చక పోస్టుల కోసం నోటిఫికేషన్ వేసి దరఖాస్తులు ఆహ్వానించారు. మొత్తం 41మంది దరఖాస్తులు ఈఓ కార్యాలయంలో సమర్పించారు. మే 5న హైదరాబాద్‌లోని కమిషనర్ కార్యాలయంలో పరీక్ష నిర్వహించనున్నారు. మే 15నుంచి జరుగు సరస్వతి పుష్కరాల వరకు అర్చకుల నియామకం చేయడానికి దేవాదాయశాఖ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. అకాల వర్షం కాటారం: మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం తెల్లవారుజామున అకాల వర్షం కురిసింది. వర్షంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. గ్రామాల్లో రైతులు కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం కొంత మేర తడిసింది. రాత్రిపూట ధాన్యం కుప్పలపై పరదాలు కప్పి తడవకుండా రక్షించుకోవడానికి నానా పాట్లు పడ్డారు. వర్షాభావ సూచనలతో రైతులు అప్రమత్తమయ్యారు. -
రోడ్డు మధ్యలో ‘బోరు’
నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్న చందంగా మారింది పంచాయతీరాజ్ అధికారులు, కాంట్రాక్టర్ల వ్యవహారం. మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మే 15నుంచి 26వరకు జరుగు సరస్వతి నది పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరుచేసి పనులు ప్రారంభించింది. త్రివేణి సంగమం వద్ద సరస్వతి ఘాట్ రోడ్డులో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో సీసీ రోడ్డు నిర్మించారు. రోడ్డు మధ్యలో బోరును అలాగే వదిలేశారు. రోడ్డు మధ్యలో అడ్డుగా ఉన్న బోరును చూసినవారంతా నవ్వుకుంటున్నారు. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో రోడ్డు మధ్యలో బోరును వదిలేశారని విమర్శలు గుప్పిస్తున్నారు. – కాళేశ్వరం -
ముమ్మరంగా నిర్మాణం
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మే 15నుంచి 26వరకు జరుగు సరస్వతినది పుష్కరాల కోసం (వీఐపీ) జ్ఞాన సరస్వతి ఘాట్ వద్ద సరస్వతి మాత విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి బేస్స్టాండ్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రూ.కోటితో సరస్వతిమాత విగ్రహం, చుట్టూర నలుగురు వేదమూర్తుల విగ్రహాలు, లాన్ నిర్మించనున్నారు. సరస్వతిమాత విగ్రహం తమిళనాడులోని మహాబలిపురంలో తుది మెరుగులు దిద్దుకున్నట్లు ఆలయవర్గాలు పేర్కొంటున్నాయి. మే మొదటివారంలో విగ్రహాన్ని హైడ్రాలిక్‌తో స్టాండ్ బేస్‌పై ఎరక్షన్ చేయడానికి ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. -
తరలివచ్చిన జన ప్రవాహం..కిక్కిరిసిన సభా ప్రాంగణం
సోమవారం శ్రీ 28 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025ప్రసంగిస్తున్న కేసీఆర్, అభివాదం చేస్తున్న కేసీఆర్ఎల్కతుర్తి క్రాస్ వద్ద జరిగిన రజతోత్సవ సభకు హాజరైన ప్రజలు, పార్టీ కార్యకర్తలుసాక్షిప్రతినిధి, వరంగల్: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రజతోత్సవ సభ మినీ కుంభమేళాను తలపించింది. హనుమకొండ జిల్లా ఎల్క తుర్తి ఎక్స్‌రోడ్‌లోని సభావేదికకు ఆదివారం మధ్యాహ్నంనుంచే వివిధ జిల్లాలకు చెందిన ప్రజలు, కార్యకర్తలు చేరుకోవడం మొదలైంది. సాయంత్రానికి ఇసుకేస్తే రాలనంతగా జనం తరలిరాగా, సభా ప్రాంగణమంతా చీమల దండును తలపించింది. సభా ప్రాంగణానికి దాదాపు నాలుగైదు కిలోమీటర్ల వరకు జనం బారులు దీరారు. ఇక సభా ప్రాంగణంలో కళాకారుల ఆటపాటలకు జనం ఉరకలేస్తూ.. ఉత్సాహంతో డ్యాన్సులు చేశారు. తెలంగాణ పాటలతో గులాబీ సైనికులు, ప్రజలు ఊగిపోయారు. గులాబీ జెండాలను రెపరెపలాడిస్తూ.. బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఉరకలెత్తిన ఉత్సాహంతో ఊగిపోయారు. కిక్కిరిసిన జనం, బాహుబలి వేదికపై కొలువుదీరిన నేతలు.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగం.. గులాబీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపింది. తెలంగాణ ఉద్యమానికి ఓరుగల్లు తల్లి వంటిది 6.59 గంటలకు మైక్ అందుకున్న కేసీఆర్.. గ్యాదరి బాలమల్లును మైక్ సౌండ్ పెంచమంటూ ప్రసంగం మొదలుపెట్టారు.. 7:57 నిమిషాలకు ప్రసంగం ముగించారు. శ్రీ సీతారాముల జీవిత చరిత్రలో అయోధ్య ప్రాశస్త్యం మాదిరిగా తెలంగాణ సాధన ఉద్యమానికి ఓరుగల్లు కన్నతల్లి వంటిదని అభివర్ణిస్తూ ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఎగిరిన గులాబీ జెండా అంటూ.. ఈ జెండాను అనేక మంది ఎగతాళి చేసినా.. ఎట్టకేలకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. 25 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో నిర్వహించుకున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రత్యేకత ఉందని.. 1969లో మూగబోయిన తెలంగాణ ఉద్యమానికి రాణి రుద్రమదేవి, సమ్మక్క,సారలమ్మ స్ఫూర్తితో గులాబీ జెండా ఊపిరిలూదిందని.. ఓరుగల్లు ప్రాశస్త్యం, ఉద్యమంలో ఓరుగల్లుతో తనకున్న అనుబంధాన్ని వివరించారు. బీఆర్ఎస్ పాలనను గుర్తు చేసిన కేసీఆర్ కాంగ్రెస్ వచ్చి ఏడాదిన్నరయ్యింది.. ఏం చెప్పిండ్రు.. ఏం ఇస్తుండ్రు అనగానే ఏం ఇవ్వట్లేదు అని జనం పలికారు. ఇంతలో సభా వేదికకు దగ్గరగా ఉన్న పార్టీ శ్రేణుల గోలపై సహనం కోల్పోయిన కేసీఆర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని పిలిచి ‘రాజేశ్వర్ వీళ్లెవరయ్యా.. మనోళ్ల వేరే వాళ్ల జర చూడు’ అన్నారు. అనంతరం కాంగ్రెస్ పరిపాలనను దుయ్యబట్టారు. ఇక కాంగ్రెస్ హామీల అమలు బుట్టదాఖలు తీరుపై జనం నోట పలికిస్తూ జోష్ తెచ్చారు. తెలంగాణ ప్రాంత దేవుళ్ల మీద ఒట్టు వేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఉనికి కోసం బీఆర్ఎస్పై అర్థరహిత విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘కేసీఆర్ పాలనకు.. కాంగ్రెస్ పాలనను పోల్చుకుని చూడండీ.. మీరేమో వాళ్లకు కత్తిచ్చి.. నన్ను యుద్ధం చేయిమంటున్నారు’ అని చమత్కరించారు. వైఎస్సార్ పాలనను.. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ శాశ్వత ప్రజాసంక్షేమం కోసమని భావించి నిర్విరామంగా కొనసాగించామని కితాబిచ్చారు. సభకు భూములిచ్చిన రైతులకు కృతజ్ఞతలు రజతోత్సవ సభను ఇంత భారీగా నిర్వహించడానికి కృషి చేసిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, దాస్యం వినయభాస్కర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ తక్కళ్లపెల్లి రవీందర్ రావులకు కేసీఆర్ అభినందనలు తెలిపారు. అలాగే సభకు స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వాహనాలతో నిండిన పార్కింగ్ స్థలాలు.. పూర్వ వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ తదితర జిల్లాలనుంచి వాహనాల ద్వారా వేలాదిగా తరలివచ్చారు. చింతలపల్లిలో సుమారు 1,059 ఎకరాల్లో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలు వాహనాలతో నిండిపోయాయి. పోలీసులతో పాటు 2,500 మంది వలంటీర్లు ట్రాఫిక్ నియంత్రణలో నిమగ్నమైనా.. వందలాది వాహనాలు రోడ్లపైనే నిలిచిపోయాయి. మరిన్ని సభా విశేషాలు కట్టిపడేసిన ఆటాపాట.. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో తెలంగాణ సాధన ఉద్యమానికి ఊపిరిలూదిన ఆట, పాటలతో సుమారు మూడు గంటల పాటు ఆటపాటలతో సభికులను కట్టిపడేశారు. పాత పాటలతో పాటు కొత్తగా కేసీఆర్ పాలన, పునఃపరిపాలనకు దోహదం చేసే తీరుపై పలువురు గాయకులు ఆలోచింపజేస్తూ జోష్ నింపారు. ఈసందర్భంగా దివంగత గాయకుడు సాయిచంద్‌కు కళాకారులు ఆటపాటతో ఘన నివాళులు అర్పించారు. విభిన్న సాంస్కతిక కళాకారులు తమ ప్రతిభతో తెలంగాణ ఉద్యమ తీరును చాటారు. కేసీఆర్ సభాస్థలికి వచ్చే ముందు తెలంగాణ సాధన మలి ఉద్యమంలో కేసీఆర్ పాత్ర తీరుతెన్నులు, సాధించిన తెలంగాణ పురోగతిపై బహుబలి సినిమా తరహాలో డిజిటల్ స్క్రీన్లపై ప్రదర్శన ఇచ్చారు. సభకు వచ్చిన జనం నిశ్శబ్దంగా తిలకించడం గమనార్హం. ‘‘మందెంట పోతుండే ఎలమంద... వాడు ఎవ్వాని కొడుకమ్మ ఎలమందా’’ పాటకు సభికులు ఉర్రూతలూగారు. ‘‘సారే కావాలంటున్నరే... తెలంగాణ పల్లెలల్ల.. మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్ల’’ తదితర పాటలతో సభాప్రాంగణం దద్దరిల్లింది. సభలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, సత్యవతిరాథోడ్, జి.జగదీశ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, డా.బండా ప్రకాష్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కల్వకుంట్ల కవిత, తక్కళ్లపెల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీష్‌కుమార్, వినయ్‌భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, డా.టి.రాజయ్య, ధరంసోతు రెడ్యానాయక్, శంకర్‌నాయక్, బాల్క సుమన్, గాదరి కిషోర్, చల్లా ధర్మారెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్, మాజీ ఎంపీ మాలోతు కవితతోపాటు పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు పాల్గొన్నారు. గులాబీ వనంగా మారిన ఎల్కతుర్తి రోడ్లపైనే కిలోమీటర్ల మేర వాహనాలు ఆపరేషన్ కగార్‌ను ఆపాలి, నక్సల్స్‌తో చర్చించాలి.. తీర్మానానికి సభ ఆమోదం అట్టహాసంగా బీఆర్ఎస్ రజతోత్సవ సభ శ్రేణుల్లో జోష్..చప్పట్లు, కేరింతల నడుమ సాగిన కేసీఆర్ ప్రసంగం మృతులకు నివాళి అర్పించి.. మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు సైతం సభపై ఆసీనులయ్యారు. కశ్మీర్లో ఉగ్రవాదులు అమాయక దేశ బిడ్డలను దారుణంగా బలి తీసుకున్నారని.. ఇందుకు మౌనం పాటిద్దామని కేసీఆర్ పిలుపునివ్వడంతో సభకు వచ్చిన వారంతా నిలబడి నిమిషంపాటు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును స్వాగతోపన్యాసం చేయాలని కోరారు. రజతోత్సవ సభకు హాజరైన బీఆర్ఎస్ రథసారథి కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రసంగించారు. 2013 తర్వాత జరుగుతున్న భారీ సభకు విచ్చేసిన మాజీ మంత్రులు, బీఆర్ఎస్ అధినేతలు, తెలంగాణ నలుమూల నుంచి వచ్చిన జనానికి కూడా ఆయన స్వాగతం చెప్పారు. -
నిరుద్యోగ సమస్యను రూపుమాపుతాం
భూపాలపల్లి అర్బన్/భూపాలపల్లి రూరల్: నిరుద్యోగ సమస్యను రూపు మాపుతామని, నిరుద్యోగులు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని స్వయం కృషితో ఎదగాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. జిల్లాకేంద్రంలోని పుష్ప గ్రాండ్లో ఆదివారం మెగా జాబ్‌మేళా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి పెద్దఎత్తున నిరుద్యోగులు హాజరయ్యారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ కిరణ్‌ఖరేతో కలిసి ప్రారంభించారు. జాతీయ, రాష్ట్రస్థాయిలోని సుమారు 75 కంపెనీల నిర్వాహకులు పాల్గొనగా 12వేల మంది నిరుద్యోగులు హాజరయ్యారు. ఉద్యోగాలకు ఎంపికై న 280మంది అభ్యర్థులకు ఎమ్మెల్యే, కలెక్టర్ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి, ఉద్యోగావకాశాలను కల్పించడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలోనూ ఉద్యోగావకాశాలను కల్పించేందుకు జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. యువత ఉపాధి కోసం ఇతర జిల్లాలకు సైతం వెళ్లాలని సూచించారు. కలెక్టర్ పంజాబ్ నుంచి, ఎస్పీ మహారాష్ట్ర నుంచి వచ్చి మన జిల్లాలో ఉద్యోగం చేస్తున్నారని, యువత ఉన్న చోటనే ఉద్యోగం చేయాలన్న లక్ష్యాన్ని విడనాడాలని స్పష్టంచేశారు. జిల్లాలో సింగరేణి ఆధ్వర్యంలో వృత్తి నైపుణ్య కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఆసక్తి ఉన్న రంగంలో నైపుణ్యం సాధించడానికి శిక్షణ కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు లేక మద్యం, మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని, ప్రైవేట్ సంస్థల్లో ఉపాధి కల్పన వల్ల జీవనోపాధి లభిస్తుందని చెప్పారు. యువత ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకునేందుకు నైపుణ్యాలను పెంపొందించడానికి ప్రభుత్వం హైదరాబాద్‌లో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసిందన్నారు. స్కిల్ యూనివర్సిటీ దేశంలో మరెక్కడా లేదని తెలిపారు. కలెక్టర్ రాహుల్‌శర్మ మాట్లాడుతూ జిల్లాలో 10వేల మందికి పైగా నిరుద్యోగులు ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకున్నారని, గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కమిటీలు వేసి యువతకు సమాచారాన్ని చేరవేసినట్లు కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా, వివిధ శాఖల జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
నాడు పిడికిలెత్తి.. నేడు ఉరకలెత్తి
కాంగ్రెస్ ఇక ఖతమే!● ప్రభుత్వ మోసాలు ప్రజలకు తెలిసిపోయినయ్.. ● రజతోత్సవ సభకు భారీగా తరలిరావాలి ● మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు చాకలి ఐలమ్మ పౌరుషం.. రాణి రుద్రమ వారసత్వం.. భూపతి కృష్ణమూర్తి పోరాట పటిమ. బత్తిని మొగిలయ్య అమరత్వం. జయశంకర్ సార్ మేధస్సు. కణకణమండిన కాళోజీ రచనల ఉద్వేగం. వీరందరి స్ఫూర్తితో నాడు ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. ఈ గడ్డపై నుంచి ఏ కార్యం మొదలు పెట్టినా విజయవంతమవుతుందన్న కేసీఆర్ నమ్మకంతో నేడు పార్టీ 25 ఏళ్ల వేడుకను ఇక్కడ నిర్వహిస్తున్నారు. – సాక్షిప్రతినిధి, వరంగల్ ఉద్యమ స్ఫూర్తితో ఓరుగల్లులో రజతోత్సవ సంబురం● కాకతీయుల గడ్డపై స్వరాష్ట్ర సాధన ఉద్యమం ● ఉద్యమ పార్టీగా ఆదరణ 25 ఏళ్లలో ఎన్నో ఒడిదొడుకులు ● తెలంగాణ సాధనలో వరంగల్దే కీలక భూమిక – IVలోu -
పలిమెలలో వాలీబాల్ టోర్నమెంట్
భూపాలపల్లి: ఈ నెల 28వ తేదీ నుంచి పలిమెల మండలంలో పోలీస్ ప్రజా భరోసా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు ఎస్పీ కిరణ్ ఖరే శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మూడు రోజుల పాటు ఈ పోటీలు నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గల భూపాలపల్లి, ములుగు జిల్లాలతో పాటు రాష్ట్ర సరిహద్దులో గల ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్, మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొనవచ్చని తెలిపారు. విజేతలకు మొదటి బహుమతి కింద రూ.25వేలు, రెండవ బహుమతి రూ.15వేలు, మూడవ బహుమతి రూ.10వేలతో పాటు ట్రోఫీలు బహుకరిస్తామన్నారు. టోర్నమెంట్‌కు ఎంట్రీ ఫీజు లేదన్నారు. క్రీడాకారులకు భోజన వసతి, దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి వసతి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. మరిన్ని వివరాల కోసం 73961 47071, 73069 07549 ఫోన్ నంబర్లను సంప్రదించాలని ఎస్పీ వెల్లడించారు. ఎస్పీ కిరణ్ ఖరే -
భరోసా నింపని ఉపాధి..
కాటారం: గ్రామాల్లో వలసలు నివారించి పేదలకు ఉన్న ఊరిలోనే పని చూపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ఉపాధిహామీ పథకం నిరుపేద కూలీలకు భరోసా నింపడం లేదు. మూడేళ్లుగా వచ్చిన నూతన మార్పులతో పథకం నిర్వహణ అస్తవ్యస్తంగా మారిపోయింది. క్షేత్రస్థాయిలో పనులు చేసిన కూలీలకు రోజుల తరబడి వేతనాలు అందకపోవడంతో పాటు పనులకు వద్దామని అనుకునే అర్హులైన కూలీలకు జాబ్‌కార్డుల మంజూరు నిలిచిపోయింది. దీంతో ఇటు పనిచేసిన కూలీలు, అటు ఉపాధి పొందాలని అనుకునే కూలీలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. నిబంధనల ప్రకారం పనులు నిర్వహించినప్పటికీ కూలీలకు కూలి గిట్టుబాటు అవడం లేదు. ఇలా అనేక లోటుపాట్లతో ఉపాధిహామీ పథకంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలలుగా నిలిచిన ఉపాధి వేతనాలు.. జిల్లాలో 2.41లక్షల మంది కూలీలు ఉండగా.. 1.31లక్షల మంది కూలీలు పనులకు హాజరవుతున్నారు. జిల్లాలోని పలు మండలాల్లో ఉపాధిహామీ పనులు కొనసాగుతున్నాయి. ఉపాధిహామీ పథకంలో భాగంగా గ్రామాల్లోని రైతుల పొలాల్లో ఫాంఫండ్ల నిర్మాణం, నర్సరీల నిర్వహణ, బ్యాగ్ ఫిల్లింగ్, మొక్కల సంరక్షణ చర్యల పనులను కూలీలు చేపడుతున్నారు. ఈ పనులకు సంబంధించి గత జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి కూలీలకు ఇప్పటివరకు కూలి డబ్బులు అందలేదు. ఒక్కో కూలీకి సగటున రూ.1500నుంచి రూ.2వేల వరకు కూలి డబ్బులు అందాల్సి ఉంది. కూలి డబ్బుల చెల్లింపు జాప్యంలో అధికారులకు సైతం పూర్తి సమాచారం లేదు. కూలీలకు వేతనాలు ఎప్పుడు జమ అవుతాయనే స్పష్టత కరువైంది. అసలే వేసవికాలం కావడంతో కూలీలు ఇతర పనులకు వెళ్లే అవకాశం లేకపోవడంతో ఉపాధి పనుల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో కూలి డబ్బులు వస్తేనే వారి కుటుంబ పోషణ ముందుకు సాగుతోంది. రోజుల తరబడి కూలి డబ్బులు చేతికి రాక ఉపాధి కూలీలు తమ పూట గడుపుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు. కొంతమంది కూలీల ఖాతాల్లో డబ్బులు జమ అయినట్లు అధికారులు చెప్పుకొస్తున్నప్పటికీ కూలీల నుంచి మాత్రం స్పష్టత రావడం లేదు. నూతన జాబ్‌కార్డుల ఊసే లేదు.. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కారణంగా ఉపాధిహామీ పథకానికి ప్రాధాన్యత పెరిగిపోయింది. కనీసం 20రోజుల పనిదినాలు చేసి ఉండాలనే నిబంధనతో కూలీలు అధికంగా ఉపాధి పనులవైపు మొగ్గు చూపుతున్నారు. జాబ్‌కార్డు కలిగిన కుటుంబంలో ఒక్కరికే అవకాశం ఉండటంతో నూతన జాబ్‌కార్డులు, వేరుగా జాబ్‌కార్డుల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. కానీ ప్రభుత్వ ఆదేశాలతో కొంతకాలంగా జిల్లాలో నూతన జాబ్‌కార్డుల మంజూరు నిలిచిపోయింది. రెండేళ్ల క్రితం జాబ్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి సైతం ఇప్పటికీ జాబ్‌కార్డు మంజూరు కాలేదని సమాచారం. జాబ్‌కార్డులో పేరు మార్పు, తొలగింపు లాంటి సవరణలకు సైతం అవకాశం లేకుండా పోయింది. దీంతో అర్హులైన నిరుపేద కూలీలు సైతం ఉపాధి పనులకు దూరమవుతున్నారు. ఇప్పటివరకు నూతన జాబ్‌కార్డుల కోసం సుమారు 200పైచిలుకు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. త్వరలో ఖాతాల్లో జమ అవుతాయి ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో మూడు నెలలకు సంబంధించిన ఉపాధి కూలీల వేతనాలు నిలిచిపోయాయి. పనులు చేసిన కూలీల ఖాతాల్లో త్వరలోనే కూలి డబ్బులు జమవుతాయి. ఆందోళన చెందొద్దు. ప్రభుత్వ ఆదేశాలతో నూతన జాబ్‌కార్డుల జారీ తాత్కాలికంగా నిలిచిపోయింది. అనుమతి రాగానే నూతన కార్డులు మంజూరు చేస్తాం. – నరేశ్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి 2,41,6671,09,84324412గ్రామపంచాయతీలు జాబ్‌కార్డుల సంఖ్యమూడు నెలలుగా కూలీలకు అందని డబ్బులు మంజూరుకు నోచుకోని నూతన జాబ్‌కార్డులు ఆందోళనలో ఉపాధిహామీ కూలీలు -
భూ భారతితో భూ వివాదాలు పరిష్కారం
● కలెక్టర్ రాహుల్‌శర్మ కాటారం/మల్హర్: భూ భారతి చట్టంతో భూ సమస్యలు సత్వర పరిష్కారానికి నోచుకుంటాయని కలెక్టర్ రాహుల్‌శర్మ అన్నారు. మహాముత్తారం మండలం బోర్లగూడెం, మల్హర్ మండలం కొయ్యూరులో శనివారం భూ భారతి చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ భూమి కలిగిన ప్రతి రైతుకు భూధార్ కార్డు జారీ చేయనున్నట్లు తెలిపారు. ప్రతి అంశం భూ భారతి పోర్టల్‌లో ఉంటుందని భూములకు సంబంధించిన వివరాలను ఎవరికి వారు పరిశీలించుకోవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా రైతులు, భూ యజమానులు అడిగిన పలు సందేహాలను కలెక్టర్ స్వయంగా నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, మండల ప్రత్యేకాధికారి వెంకటేశ్వర్లు, తహసీల్దార్ రవికుమార్, పీఏసీఎస్ చైర్మన్ మొండయ్య తదితరులు పాల్గొన్నారు. -
నేడు చింతలపల్లిలో బీఆర్ఎస్ రజతోత్సవం
సాక్షిప్రతినిధి, వరంగల్: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లిలో నేడు (ఆదివారం) నిర్వహించనున్న బీఆర్ఎస్ రజ తోత్సవ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర నలుమూలల నుంచి జనాలను సమీకరించే పనిలో నాయకులు తలమునకలయ్యారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సిల్వర్ జూబ్లీ వేడుకలకు 10 లక్షల మంది వస్తారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి జనాల ను సభకు తరలించేందుకు వాహన సౌకర్యం కూడా కల్పించారు. ఆదివారం సాయంత్రం 4:30 గంటలలోపు సభా ప్రాంగణానికి చేరుకునేలా నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. టీఆర్ఎస్ ఏర్పడి 24 ఏళ్లు పూర్తయి 25వ ఏట అడుగుపెడుతున్న నేపథ్యంలో.. రజతోత్సవం పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన ఈ సభను ఎల్కతుర్తిలో నిర్వహించడం చర్చనీయాంశం కాగా.. దారులన్నీ ఎల్కతుర్తి వైపే కదులుతున్నాయి. బాహుబలి వేదిక.. తరలివస్తున్న జనం గులాబీ పార్టీ పాతికేళ్ల పండుగకు ఎల్కతుర్తి చూడముచ్చటగా ముస్తాబైంది. చరిత్రలో నిలిచేలా నిర్వహించే ఈవేడుకల కోసం ఎల్కతుర్తి ఎక్స్ రోడ్డులో బాహుబలి సభావేదిక రెడీ అయ్యింది. రజతోత్సవానికి అధినాయకత్వం ఎంచుకున్న ఎల్కతుర్తి ఎక్స్‌రోడ్డు సమీపంలో వేదిక నయనానందంగా రూపుదిద్దుకుంది. ఇందుకోసం పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో 1,213 ఎకరాలను రైతుల నుంచి సమీకరించిన గులాబీ శ్రేణులు సుమారు నెల రోజులుగా శ్రమించారు. సుమారు పది లక్షల మంది హాజరయ్యే ఈ వేడుకకు కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సభావేదిక ఏర్పాట్లలో ఆ ఆరుగురు.. గులాబీ దళపతి, పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలు, సూచనలు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యవేక్షణలో ఆరుగురు నేతలు ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ గ్యాదరి బాలమల్లు, మాజీ ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, వొడితెల సతీశ్‌కుమార్ అవిశ్రాంతంగా శ్రమించారు. ఎల్కతుర్తి, శివారు గ్రామాల రైతుల నుంచి భూముల హామీ పత్రాల స్వీకరణ మొదలు.. సభావేదిక ఏర్పాటు వరకు అధినేత ఆదేశాల మేరకు పని చేశారు. పోలీసుల భారీ బందోబస్తు ఎల్కతుర్తి: సభకు పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. వరంగల్ సీపీ సన్‌ప్రీత్‌సింగ్ ఇదివరకే సభా ప్రాంగణాన్ని పరిశీలించి నిర్వాహకులతో చర్చించారు. సభలో ఎలాంటి అవాంతరాలు, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా భారీగా పోలీసులను నియమించారు. ఇద్దరు డీసీపీలు, మరో ఇద్దరు అడిషనల్ డీసీపీలు, ఎనిమిది మంది ఏసీపీలు, 28 మంది సీఐలు, 66 మంది ఎస్సైలు, 137 మంది ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 511 మంది కానిస్టేబుళ్లు, 200 మంది హోంగార్డులతోపాటు మిగతా డిస్ట్రిక్ట్ గార్డ్స్‌ను నియమించారు. మొత్తం 1,100 మందికిపైగా పోలీసులను కేటాయించారు. హెలిపాడ్, సభా ప్రాంగణం, పార్కింగ్ స్థలాలు, ట్రాఫిక్ క్రౌడ్ కంట్రోలింగ్ తదితర ప్రాంతాల్లో సేవలందించనున్నారు. వరంగల్ నగరం నుంచి ఎల్కతుర్తి వరకు ప్రదర్శనగా వెళ్తున్న ఆటోలుగంటకుపైగా ప్రసంగించనున్న కేసీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయల్దేరనున్న అధినేత కేసీఆర్ నేరుగా సభావేదికకు సుమారు 500 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్ద దిగుతారు. సుమారు 5.30 గంటల సమయంలో వేదికపైకి చేరుకునే అవకాశం ఉంది. వేదికపై ఆయన సుమారు గంటకుపైగా ప్రసంగించే అవకాశం ఉందని పార్టీవర్గాల సమాచారం. పాతికేళ్ల పండుగకు తరలుతున్న జనం ఉమ్మడి వరంగల్ టార్గెట్ 2.50 లక్షల మంది జన సమీకరణలో నాయకుల తలమునకలు సాయంత్రం 4.30 గంటలలోపు సభకు చేరేలా ప్లాన్ 5.30 గంటల సమయంలో వేదికపైకి అధినేత కేసీఆర్ -
ఫిట్ సెక్రటరీగా దాసరి శ్రీనివాస్
భూపాలపల్లి అర్బన్: ఏరియా వర్క్‌షాపు ఏఐటీయూసీ ఫిట్ సెక్రటరీగా దాసరి శ్రీనివాస్‌ను నియమించినట్లు బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్ తెలిపారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో శనివారం ఫిట్ కమిటీ ఎన్నిక నిర్వహించారు. అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ అబ్దుల్ ఖాదర్, ఎలక్ట్రిషన్ సేఫ్టీ కమిటీ సభ్యులుగా జి.కొమురయ్య, రమేష్, పిల్లి రవి, వర్క్ కమిటీగా కరుణాకర్, శ్రీనివాస్, గరిగ రమేష్‌లను ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు శ్రీనివాస్, విజేందర్, రవికుమార్ పాల్గొన్నారు.ఫార్మసిస్టుల హర్షంభూపాలపల్లి అర్బన్: వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఫార్మసిస్టుల హోదాను ఫార్మసీ ఆఫీసర్స్‌గా మార్చడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ఫార్మసీ కౌన్సిల్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు ఉప్పు భాస్కర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వైద్య విద్య, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, వైద్య విధాన పరిషత్‌లో పనిచేస్తున్న ఫార్మసిస్టు గ్రేడ్–2లను ఫార్మసీ ఆఫీసర్స్‌గా, ఫార్మసిస్టు గ్రేడ్–1లను సీనియర్ ఫార్మసీ ఆఫీసర్స్‌గా, ఫార్మసీ సూపర్వైజర్లను చీఫ్ ఫార్మసీ ఆఫీసర్స్‌గా మార్పు చేస్తూ ఈ నెల 25వ తేదీన జీఓ జారీ చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా సీఎం, వైద్యారోగ్యశాఖ మంత్రికి కృతజ్ఙతలు తెలిపారు.వృత్తి విద్య కోర్సులకు శిక్షణభూపాలపల్లి అర్బన్: జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు వృత్తి విద్య కోర్సులలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఏరియా సింగరేణి అధికార ప్రతినిధి మారుతి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డ్రైవాల్ అండ్ ఫాల్స్ సీలింగ్ టెక్నిషియన్, వెల్డింగ్ అండ్ ప్రాబ్సికేషన్ టెక్నిషియన్, ఆటోమొబైల్ అండ్ టూ వీల్లర్స్, ఎక్సకవేటర్ ఆపరేటర్, ఫుడ్ బెవరేజీస్ అసిస్టెంట్, గెస్ట్ సర్వీస్ అసోసియేట్ హోటల్ మేనేజ్మెంట్, ఆఫీసర్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్, ఫీల్ట్, టెక్నిషియన్ కోర్సులలో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. మూడు నెలల శిక్షణ, భోజన వసతి సదుపాయం, నిపుణుల ద్వారా సాఫ్ట్ స్కిల్ శిక్షణ, శిక్షణ పొందిన అనంతరం ఇండస్ట్రీ గుర్తింపు పొందిన సర్టిఫికెట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అడ్మిషన్ కోసం సంబంధిత కోర్సులో విద్యార్హత ధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికెట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రాలు అందించాలని సూచించారు. ఆసక్తి, అర్హత గల వారు ఏరియాలోని ఎంవీటీసీ కార్యాలయంలో సంపద్రించాలన్నారు.సర్వే పనుల అడ్డగింతమొగుళ్లపల్లి: మండలకేంద్రంలో నేషనల్ హైవే రోడ్డు సర్వే పనులను రైతులు శనివారం అడ్డుకున్నారు. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ భూములు కోల్పోతున్న తమకు సరైన న్యాయం జరగకపోతే సర్వే పనులను ముందుకు సాగనివ్వమని రైతులు ఆర్డీఓ రవికి మొరపెట్టుకున్నారు. సర్వే పనులకు రైతులు సహకరించాలని ఆర్డీఓ కోరారు. తమ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని రైతులు తెలిపారు. ఆర్డీఓ వెంట తహసీల్దార్ సునీత, ఆర్ఐ శివరామ కృష్ణ, రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు.మే మొదటివారంలో ట్రస్టుబోర్డు?కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానం ట్రస్టుబోర్డు (పాలక వర్గం) నియామకానికి మే మొదటి వారంలోగా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రానున్నట్లు తెలిసింది. మే 15నుంచి 26వరకు సరస్వతి నది పుష్కరాలు జరగనున్న నేపథ్యంతో ట్రస్టుబోర్డు నియామకం కోసం ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ట్రస్టుబోర్డు కోసం జనవరి 6న దేవాదాయశాఖ నోటిఫికేషన్ వేసిన విషయం తెలిసిందే. దీంతో వివిధ ప్రాంతాల వారు ఽట్రస్టుబోర్డు డైరెక్టర్ల కోసం 86కు పైగా దరఖాస్తులు సంబంధిత కార్యాలయంలో చేసుకున్నారు. అందులో ధృవీకరణ పత్రాలు, పోలీసు కేసులు, ఇతర వ్యవహారాలు, వివరాలు సరిగ్గా లేని వారిని స్క్రూటినీలో తీసివేశారు. అన్ని సరిగ్గా ఉన్న 41మందిలో నుంచి 14మందిని డైరెక్టర్ల కోసం మంత్రి శ్రీధర్‌బాబు ఎంపికచేసి దేవాదాయశాఖకు లేఖ పంపించనున్నట్లు సమాచారం. ట్రస్టుబోర్డులో ఎక్స్అఫీషియో(అర్చక)తో 15మంది డైరెక్టర్లు కాగా అందులో ఒక్కరిని చైర్మన్‌గా ఎన్నుకోనున్నారు. ఇప్పటికే ఆశావహులు మంత్రి శ్రీధర్‌బాబు ఇతర నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మంథనికి చెందిన కాళేశ్వరం దేవస్థానం మాజీ చైర్మన్ అవధాని మోహన్శర్మకు పదవి వరించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. -
చిన్న పిల్లల్లో హీట్ స్ట్రోక్
– డాక్టర్ సుధాకర్, పిడియాట్రిషన్ ఎంజీఎం : హీట్ స్ట్రోక్ (ఎండదెబ్బ) వల్ల ఎండాకాలంలో పిల్లలు బాగా ఇబ్బందులు పడుతుంటారు. ఎక్కువగా ఎండలో తిరిగేవారు, శుభకార్యాలకు వెళ్లేవారు, ఇంటి అవరణలో, ఆట స్థలంలో తిరిగే పిల్లలకు ఎక్కువగా హీట్ స్ట్రోక్‌కు గురవుతారు. ● శరీరం బాగా వేడెక్కడం. వాంతులు, విరోచనాలతో శరీరంలో నీటిశాతం పడిపోతుంది ● పిల్లలకు మూత్రం సరిగ్గా రాకపోవడం, ఎర్రగా రావడం. ఎండలో తిరిగే పిల్లలు తొందరగా అలిసిపోవడం, తలనొప్పి, శరీరంలో నొప్పులు, నరాల బలహీనత , తీవ్ర అస్వస్థతతో కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ● పసిపిల్లలు డల్‌గా ఉంటారు. బరువు తగ్గడం, పాలు సరిగ్గా తాగకపోవడంలాంటి లక్షణాలు ఉంటాయి. ● అందుకే పిల్లలను ఎండలో ఎక్కువగా తిరగకుండా ఉండాలి. ప్రయాణాలు తగ్గించుకోవాలి. ● పిల్లలు ఎక్కువ మోతాదులో నీళ్లు తాగాలి. ఓఆర్ఎస్ తాగించాలి. ● వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరింపజేయాలి. -
ప్రతీ ఇంట్లో ఎర్త్ వైరింగ్ ఏర్పాటుచేసుకోవాలి
నెహ్రూసెంటర్: ఇళ్లలో వినియోగించే ఎలక్ట్రానిక్ వస్తువుల పట్ల జాగ్రత్తలు పాటించాలి. ఇంట్లో వాడుకునే ఫ్రిజ్, టీవీ, ఏసీ, కూలర్, ఫ్యాన్, వంటి వాటిిని పిల్లలు ముట్టుకోకుండా చూసుకోవాలి. దీంతో పాటు వేసవిలో విద్యుత్ సరఫరా, అంతరాలు జరిగినప్పుడు, వడ గాలుల వల్ల విద్యుత్ వైర్లు తెగినప్పుడు వాటిని సరి చేసుకునే వరకు ఎలక్ట్రానిక్ వస్తువులను వినియోగించొద్దు. సొంతంగా ఎలక్ట్రీషియన్ పనులు చేయవద్దు. అకాల వర్షాల కారణంగా వర్షాలు, ఉరుములు, మెరుపులు, పిడుగులు పడిన సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగి ఎలక్ట్రానిక్ వస్తువులను కాలిపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి సమయంలో ఎలక్ట్రానిక్ వస్తువులను వినియోగించకూడదు. ఇంట్లో వస్తువులను ఏర్పాటు చేసుకున్నప్పుడు తప్పకుండా ఎర్త్ వైరింగ్ చేయాలి. చార్జింగ్ తీసిన తర్వాత ఫోన్ వినియోగించుకోవాలి. ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు ఎక్కువగా వాడితే మంచి క్వాలిటీ కలిగిన విద్యుత్ వైర్లను వినియోగించాలి. ఇంటి ఆవరణలో ఇనుప తీగలతో దండెం కట్టుకోవద్దు. దీని వల్ల విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైతే మెకానిక్, ఎలక్ట్రీషియన్‌కు చూపించాలి. – కూరాకుల పాల్, ఎలక్ట్రీషియన్