
రామప్పలో అందాలభామల సందడి
వేయిస్తంభాల ఆలయం, వరంగల్ కోట సందర్శన
అడుగడుగునా సీసీ కెమెరాల నిఘా.. 3వేల మందికి పైగా పోలీసులు
మూడంచెల భద్రత.. సీనియర్ అధికారుల పర్యవేక్షణ
సుందరీమణుల రాక సందర్భంగా రామప్ప ఆలయం జిగేల్‌మంటోంది. విదేశీ వనితలు భారతీయ సంప్రదాయాలను గౌరవిస్తూ రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆలయం చుట్టూ గ్రీన్ మ్యాట్ వేశారు. ప్రత్యేక విద్యుత్‌దీపాలు ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల కోసం గార్డెన్‌లో స్టేజీ నిర్మించారు. సరస్సు కట్టపై ఉన్న హరి త కాటేజీలను ముస్తాబు చేశా రు. వెయ్యి మంది సిబ్బందితో మూడంచెల భద్రత ఏర్పాటు చేసి మంగళవారం రాత్రి నుంచే పోలీసులు విధుల్లో చేరారు. పర్యాటకులకు బుధవారం రామప్ప సందర్శనకు అనుమతి లేదు.
● 4గంటలకు రామప్పకు చేరుకుంటారు. 4:40 గంటలకు రామప్ప సరస్సు అందాల వద్ద ఫొటో సెషన్‌లో పాల్గొంటారు.
● 4:55 గంటలకు రామప్ప ఆలయానికి చేరుకుంటారు. 5 గంటలకు రామప్ప ఎంట్రెన్స్ గేట్ వద్ద కొమ్ముకోయ నృత్యంతో కళాకారులు వారికి స్వాగతం పలుకుతారు.
● 5:10 నుంచి 6 గంటల వరకు సంప్రదాయ దుస్తుల్లో రామప్ప రామలింగేశ్వరస్వామిని దర్శించుకొని శిల్పకళాసంపదను తిలకిస్తారు.
● 6.10 గంటల నుంచి రాత్రి 7.00 గంటల వరకు రామప్ప గార్డెన్‌లో అలేఖ్య శాసీ్త్రయ నృత్యం, పేరిణి ప్రదర్శన వీక్షించిన అనంతరం ప్రముఖులు అతిథులను సన్మానిస్తారు.
● రాత్రి 7.20 గంటలకు ఇంటర్‌ప్రిటిషన్ సెంటర్‌కు చేరుకుంటారు. 7.30 గంటలకు డిన్నర్ చేసి 8:15 గంటలకు హైదరాబాద్‌కు ప్రయాణమవుతారు.
● హైదరాబాద్ నుంచి రెండు బృందాలుగా ప్రత్యేక బస్సుల్లో బయలుదేరుతారు.
● ఒక బృందం హనుమకొండలోని హరిత కాకతీయకు సాయంత్రం 4.35 గంటలకు చేరుకుంటుంది.
● సుమారు గంటపాటు హోటల్‌లోనే గడిపి సాయంత్రం 5.45 గంటలకు వేయిస్తంభాల గుడికి చేరుకుంటారు.
ఏయే దేశాల సుందరీమణులంటే..
ప్రపంచంలోని 19 దేశాలకు చెందిన సుందరీమణులు గ్రేటర్ వరంగల్ నగరానికి, 32 దేశాల వారు రామప్ప ఆలయానికి రానున్నట్లు సమాచారం. వారిలో అర్జెంటీనా, బొలివియా, బ్రెజిల్, కెనడా, చీలి, కొలంబో, ఈక్వెడార్, ఈ సాల్వడార్, గౌతమాల, మెక్సికో, పనామా, పరాగ్వే, పెరు, యునైటెడ్ స్టేట్స్, వెనిజులా, హైతీ, హోందురాస్, నికరగ్వా, సురినామే తదితర దేశాల సుందరీమణులు ఉన్నారు.
● 40 నిమిషాలు పాటు అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
● సాయంత్రం 6.25 వరంగల్ కోటకు చేరుకుంటారు. 7.30 గంటలకు వరకు అక్కడే పేరిణి శివతాండవం, ఇతర సంప్రదాయ నృత్యాలను తిలకించి తిరిగి హరిత హోటల్‌కు చేరుకుంటారు.
● 8 గంటల నుంచి 9 గంటల వరకు పర్యాటక శాఖ విందులో పాల్గొని 9.15 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరుతారు.
డిన్నర్‌లో ఇవే..
సుందరీమణులకు హనుమకొండ నక్కలగుట్టలోని టూరిజం హోటల్ హరిత కాకతీయ ముస్తాబైంది. హోటల్‌కు చేరుకున్న బృందానికి స్వాగత పలకరింపుగా నారింజ జ్యూస్ అందిస్తారు. స్టాటర్‌గా ప్రెలూడే ప్లేట్–స్టార్టర్ ట్రియో, గోల్డెన్ కోస్ట్ ఫిష్ బైట్స్ లేదా చీజ్ అండ్ హెర్బ్ మిలాంజ్ క్రాక్వెట్స్, సీసర్స్ గార్డెన్, మెయిన్ ఆఫెయిర్– సిగ్నేచర్ ప్లేట్స్‌గా నాన్ వెజిటేరియన్‌గా హర్బ్ గ్రిల్డ్ చికెన్ సుప్రీం, వెజిటేరియన్‌గా గ్రిల్డ్ కాటేజ్ చీస్ స్టీక్, మెడిటెర్రానీన్ వెజిటబుల్ గ్రాటిన్, టస్కాన్ పెన్న అర్రాబిటా, గోల్డెన్ చిప్స్, స్వీట్ ఇప్రెషన్‌గా చాక్‌లెట్ మౌసెస్, సాఫ్రాన్ ఫిర్ని, సీసన్స్ బౌంటి అందిస్తారు.