
ప్రముఖుల పుష్కర స్నానం..
కాటారం/కాళేశ్వరం: సరస్వతీనది పుష్కరాల్లో భాగంగా సోమవారం పలువురు ప్రముఖులు పుష్కర స్నానం ఆచరించారు. డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రునాయక్, వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్, హైకోర్టు జడ్జి నందికొండ నర్సింగరావు దంపతులు, త్రయంబకేశ్వర్ నాసిక్‌కు చెందిన మహామండలేశ్వర్ ఆచార్య సంవిధానందాసరస్వతి మహారాజ్ స్వామి సరస్వతి ఘాట్ వద్ద త్రివేణి సంఘమంలో పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం సరస్వతి మాతను దర్శించుకుని కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జడ్జి దంపతులను కలెక్టర్ రాహుల్‌శర్మ, భూపాలపల్లి న్యాయమూర్తి అఖిల మర్యాదపూర్వకంగా కలిసి సరస్వతీమాత చిత్రపటం అందజేశారు. ఆలయ అధికారులు సంవిధానందాసరస్వతి మహారాజ్ స్వామికి సరస్వతీమాత విగ్రహం బహూకరించారు.
శివుడి ప్రతిమ సెట్టింగ్‌కు మంటలు
కాటారం: పుష్కరాల్లో భాగంగా సరస్వతి(వీఐపీ)ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన శివుడి ప్రతిమ సెట్టింగ్‌కు సోమవారం మంటలు అంటుకున్నాయి. థర్మకోల్‌తో తయారు చేసిన శివుడి ప్రతిమ సెట్టింగ్ వద్ద భక్తులు పుష్కర స్నానం అనంతరం దీపాలు వెలిగిస్తున్నారు. ఈ క్రమంలో దీపాలు ప్రతిమ కింద గల థర్మకోల్ స్టాండ్‌కు అంటుకుని మంటలు చెలరేగాయి. అక్కడే డ్యూటీలో ఉన్న పోలీసులు నీళ్లతో మంటలు ఆర్పారు. భక్తులు దీపాలు వెలిగించకుండా చర్యలు చేపట్టారు.

ప్రముఖుల పుష్కర స్నానం..

ప్రముఖుల పుష్కర స్నానం..