ఓరుగల్లు కీర్తి ప్రతిష్టను పెంచేలా.. | - | Sakshi
Sakshi News home page

ఓరుగల్లు కీర్తి ప్రతిష్టను పెంచేలా..

May 20 2025 1:06 AM | Updated on May 20 2025 1:06 AM

ఓరుగల్లు కీర్తి ప్రతిష్టను పెంచేలా..

ఓరుగల్లు కీర్తి ప్రతిష్టను పెంచేలా..

ఖిలా వరంగల్‌ : ఓరుగల్లు కీర్తి ప్రతిష్టతను మరింత పెంచేలా.. అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దిన వరంగల్‌ రైల్వేస్టేషన్‌ను ఈనెల 22న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నట్లు అసిస్టెంట్‌ కమర్షియల్‌ మేనేజర్‌ (ఏసీఎం) ఎస్‌ఆర్‌.మూర్తి తెలిపారు. ఈమేరకు సోమవారం వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.25.41కోట్ల వ్యయంతో అమృత్‌ భారత్‌ స్టేషన్‌ కింద తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా వరంగల్‌ రైల్వే స్టేషన్‌ సరికొత్తగా రూపుదిద్దుకుందన్నారు. విశాల ప్లాట్‌ ఫామ్‌లు, లిఫ్టులు, ఎస్కలేటర్లు, విశ్రాంతి గదులు, ఆధునిక టాయిలెట్లు, దివ్యాంగుల కోసం ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. స్టేషన్‌ గోడలకు కాకతీయుల కళావైభం ఉట్టిపడేలా రంగుల చిత్రాలు వేశామని, ప్రయాణికులకు సరికొత్త అనుభూతి కలిగేలా ఆహ్లాదం, పచ్చని తోరణాలు, ఆకట్టుకునే విద్యుత్‌ కాంతులు, 12 ఫీట్ల వెడల్పుతో ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి నిర్మించామని వివరించారు. అనంతరం రైల్వేస్టేషన్‌లో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఇన్‌చార్జ్‌ స్టేషన్‌ మేనేజర్‌ కె.సారయ్య, సీసీఐ ఇన్‌స్పెక్టర్‌ రాజగోపాల్‌, ఐఓడబ్ల్యూ శ్రీనివాస్‌, ఆర్పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొన్నారు.

విద్యార్థులకు వ్యాసరచన పోటీలు..

కాజీపేట రూరల్‌ : కాజీపేట సబ్‌ డివిజన్‌ పరిధిలోని పలు పాఠశాలల్లో దక్షిణ మధ్య రైల్వే అధికారులు ‘మేరా అమృత్‌ స్టేషన్‌ అండ్‌ ఆపరేషన్‌ సిందూర్‌’ అనే అంశంపై విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్‌ సోమవారం తెలిపారు. ఈ నెల 22న ప్రధాని మోదీ అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకంలో భాగంగా 103 పునరాభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభిస్తారని, వీటిలో దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్‌ డివిజన్‌లో వరంగల్‌, కరీంనగర్‌, బేగంపేట స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం, సోమవారం వరంగల్‌, రామగుండం, కరీంనగర్‌లో వివిధ పాఠశాలల్లో వ్యాస రచన, డ్రాయింగ్‌, పెయింటింగ్‌ పోటీలు నిర్వహించగా 170 మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. వరంగల్‌ అమృత్‌ భారత్‌ స్టేషన్‌ ప్రారంభోత్సవం రోజున విజేతలకు ముఖ్య అతిథులతో సర్టిఫికెట్లు ప్రదానం చేయనున్నట్లు సీపీఆర్వో తెలిపారు.

అత్యాధునిక హంగులతో వరంగల్‌ రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ

22న వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ

అసిస్టెంట్‌ కమర్షియల్‌ మేనేజర్‌(ఏసీఎం) ఎస్‌ఆర్‌.మూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement