
భక్తులకు ఏర్పాట్లు చేశాం
కాళేశ్వరం: కాళేశ్వరంలో ఈనెల 15నుంచి జరుగనున్న సరస్వతినది పుష్కరాలకు భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ రాహుల్‌శర్మ అన్నారు. మంగళవారం రాత్రి కలెక్టర్ స్వయంగా తాత్కాలిక బస్టాండ్, సరస్వతి విగ్రహం, వీఐపీ ఘాట్, భక్తులు పుష్కర స్నానాలు చేసే త్రివేణి సంగమ ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మిగిలిన అన్ని పనులను బుధవారం వరకు పెండింగ్ లేకుండా పూర్తిచేయాలని ఆదేశించారు. భక్తులు సురక్షితంగా స్నానాలు చేయగలిగేలా ఘాట్ వద్ద విద్యుత్ ఏర్పాట్లు త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. అన్ని విభాగాల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించాలని అన్నారు. స్వచ్ఛ పుష్కరాలు కావాలని భక్తులు వినియోగించిన వ్యర్థాలను డస్ట్ ఎక్కడ పడితే అక్కడ వేయొద్దని.. గ్రామ పంచాయతీ సిబ్బందికి అప్పగించాలని సూచించారు. వివిధ పనులకు ఉపయోగించిన తదుపరి మిగిలిన పనికిరాని వస్తువులను గ్రామ పంచాయతీ నిర్దేశించిన ప్రాంతాల్లో వేసి పరిశుభ్రతకు సహకరించాలని కలెక్టర్ రాహుల్‌శర్మ సూచించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, డీపీఓ వీరభద్రయ్య, భూపాలపల్లి ఆర్డీఓ రవి, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, అడిషనల్ ఎస్పీ కిషన్ తదితరులు పాల్గొన్నారు.
పకడ్బందీగా సేవలు నిర్వర్తించాలి
పుష్కరాల్లో భక్తులకు ఇబ్బంది కలుగకుండా పోలీసులు పకడ్బందీగా సేవలు నిర్వర్తించాలని ఎస్పీ కిరణ్‌ఖరే పోలీస్ అధికారులు, సిబ్బందికి సూచించారు. సరస్వతి పుష్కరాల బందోబస్తుకు వివిధ జిల్లాల నుంచి కాళేశ్వరం వచ్చిన పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఆయన దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ కిరణ్‌ఖరే మాట్లాడుతూ పుష్కరాలకు వచ్చే భక్తులతో పోలీసులు మర్యాదగా వ్యవహరించాలని, భక్తులసేవే భగవంతుడి సేవగా భావించి విధులు నిర్వర్తించాలని సూచించారు. సెక్టార్ల ఇన్‌చార్జ్‌లు తమ పరిధిలోని సిబ్బందికి మార్గనిర్దేశం చేస్తూ రద్దీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ సమన్వయంతో విధులు నిర్వర్తించాలని తెలిపారు. పుష్కరాలకు పెద్దఎత్తున భక్తులు వస్తారని.. అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎండాకాలం నేపథ్యంలో పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భక్తులకు మెరుగైన సేవలు అందించి పోలీస్‌శాఖకు మంచిపేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ బోనాల కిషన్, డీఎస్పీలు రామ్మోహన్‌రెడ్డి, సంపత్‌రావు, మోహన్, ప్రతాప్, మల్లారెడ్డి, మహదేవపూర్ సీఐ రాంచందర్‌రావు, పోలీ స్ అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్‌శర్మ

భక్తులకు ఏర్పాట్లు చేశాం

భక్తులకు ఏర్పాట్లు చేశాం