భక్తులకు ఆహ్లాదం.. | - | Sakshi
Sakshi News home page

భక్తులకు ఆహ్లాదం..

May 21 2025 1:45 AM | Updated on May 21 2025 1:45 AM

భక్తు

భక్తులకు ఆహ్లాదం..

మెరుగులు దిద్దుకున్న ముక్తివనం పార్కు

కాళేశ్వరం: సరస్వతి నది పుష్కరాల నేపథ్యంలో కాళేశ్వరానికి రోజురోజుకూ భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ముక్తేశ్వరస్వామిని దర్శించుకుని వెళ్లారు. తిరిగి వెళ్లే సమయంలో ఆహ్లాదంతో పాటు.. సేదదీరేందుకు అటవీశాఖ ఆధ్వర్యంలో కాళేశ్వరంలోని ముక్తివనం పార్కుకు మెరుగులు దిద్దారు. ఇందుకోసం సీసీఎఫ్‌ ప్రభాకర్‌, కలెక్టర్‌ రాహుల్‌శర్మ, డీఎఫ్‌ఓ నవీణ్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు.

పార్కు ప్రత్యేకత ఏంటంటే..

కాళేశ్వరంలోని ముక్తివనం పార్కులో నాలుగు ఏసీ ట్రీహౌస్‌లు చూడముచ్చటగా ఉన్నాయి. ఏసీ గదులను రోజుకు రూ.2,500 చొప్పున అద్దెకు ఇస్తున్నారు. గదులు అద్దెకు ‘మీ టిక్కెట్‌’ యాప్‌లో ఆన్‌లైన్‌ కూడా బుకింగ్‌ చేసుకోవచ్చు. అడవిలో సేదదీరొచ్చు. రాశివనం, పంచవటి వనం, నక్షత్ర వనం, సప్తరుషి వనం, సైకిలింగ్‌ పాత్‌వే, వాకింగ్‌పాత్‌వేలు ఏర్పాటు చేశారు. పిల్లలు ఆడుకోవడానికి వస్తువులు, ప్రీ వెడ్డింగ్‌, బర్త్‌డే, షూట్స్‌ కూడా జరుగుతున్నాయి. వీటికి టిక్కెట్టు రూ. 1000 వరకు ఉంది. వాటర్‌ ఫాండ్‌, ఇతర ఆహ్లాదాన్ని పంచేవిధంగా పార్కును సిద్ధం చేశారు. పెద్దలకు రూ.20, చిన్నలకు రూ. 10 ప్రవేశ టిక్కెట్‌ ధర తీసుకుంటున్నారు. పుష్కర స్నానాలు, శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకున్న భక్తులు తిరుగు ప్రయాణంలో సేదదీరడానికి చాలా మంచి ప్రాంతంగా చెప్పవచ్చు. పార్కును ఎఫ్‌ఆర్‌ఓ రవికుమార్‌, ఎఫ్‌ఎస్‌ఓలు ఆనంద్‌, తిరుపతి, ఎఫ్‌బీఓ శ్రీలత పర్యవేక్షిస్తున్నారు.

పుష్కర భక్తులు సేదదీరేందుకు సిద్ధం

చూడముచ్చటగా ఏసీ ట్రీహైస్‌లు

బుకింగ్‌ కోసం ‘మీ టిక్కెట్‌’ యాప్‌

భక్తులకు ఆహ్లాదం..1
1/1

భక్తులకు ఆహ్లాదం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement