
కోటగుళ్లను సందర్శించిన ఎస్‌ఐబీ డైరెక్టర్
గణపురం: మండల కేంద్రంలోని కోటగుళ్లను రాష్ట్ర ఎస్‌ఐబీ డైరెక్టర్ తరుణ్‌జోషి మంగళవారం సందర్శించారు. కోటగుళ్ల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో అర్చకుడు జూలపల్లి నాగరాజు ఘన స్వాగతం పలి కారు. శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయంలో పూ జలు నిర్వహించారు. కోటగుళ్ల సంపదను కొనియాడారు. ఈ కార్యక్రమంలో చిట్యాల సీఐ మల్లేష్, భూపాలపల్లి సీఐ నరేష్, ఎస్సై అశోక్ ఉన్నారు.
కంట్రోల్ రూంను
పరిశీలించిన ఎస్పీ
భూపాలపల్లి అర్బన్: కాళేశ్వరంలోని పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన పోలీస్ కంట్రోల్ రూంను మంగళవారం ఎస్పీ కిరణ్‌ఖరే మంగళవారం పరిశీలించారు. సరస్వతి పుష్కరాల నేపథ్యంలో కాళేశ్వరంలో పటిష్ట నిఘాను ఏర్పాటు చేశారు. కాళేశ్వరంలో ఏర్పాటు చేసి 220 సీసీ కెమెరాలు పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేశారు. భద్రత నేపథ్యంలో కంట్రోల్ రూమ్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మహదేవపూర్ సీఐ రాంచందర్‌రావు, కాళేశ్వరం ఎస్సై తమాషారెడ్డి పాల్గొన్నారు.
ఆర్టీసీలో 10వేల మంది ..
భూపాలపల్లి అర్బన్: కాళేశ్వరం సరస్వతి పుష్కరాల నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సుల్లో మంగళవారం కాళేశ్వరానికి సుమారు 10వేల మంది వచ్చినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 209 ఆర్టీసీ బస్సుల్లో 10వేల మంది కాళేశ్వరానికి చేరుకొగా.. 207 బస్సుల్లో 8,878వేల మంది భక్తులు తిరిగి గమ్య స్థానాలకు వెళ్లారు.

కోటగుళ్లను సందర్శించిన ఎస్‌ఐబీ డైరెక్టర్