
భక్తుల రద్దీ పెరిగే అవకాశం
● మంత్రి శ్రీధర్‌బాబు
కాళేశ్వరం: రానున్న ఆరు రోజుల్లో సరస్వతి పుష్కరాలకు భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని, అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మంగళవారం (ఆరవరోజు) సాయంత్రం సరస్వతి పుష్కరాల్లో భాగంగా కాళేశ్వరంలో సరస్వతి నవరత్న మాల హారతి మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ గడిచిన ఆరు రోజుల్లో లక్షలాది మంది భక్తులు పుష్కర స్నానాలు చేసి కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నారన్నారు. రానున్న ఆరు రో జులు చాలా కీలకమని.. భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటిలిజెన్స్ డీజీ శివధర్‌రెడ్డి, కలెక్టర్ రాహుల్ శర్మ దంపతులు, ఎస్పీ కిరణ్ ఖరే, మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయులకు శిక్షణ
భూపాలపల్లి అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత, ప్రాఽథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు మంగళవారం శిక్షణ కార్యక్రమాలు ప్రా రంభించారు. ఉన్నత పాఠశాలల స్కూల్ అసిస్టెంట్లకు జిల్లాకేంద్రంలో, ప్రాథమిక పాఠశాల ల ఎస్జీటీలకు మండలకేంద్రంలో ఆర్పీలు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 24వ తే దీ వరకు శిక్షణ ఇవ్వనున్నారు. కస్తూరిబా గాంఽధీ బాలికల విద్యాలయంలో జరిగిన శిక్షణ కా ర్యక్రమానికి జీసీడీఓ శైలజ, క్వాలిటీ కోఆర్డినేటర్ కాగిత లక్ష్మణ్, ఆర్పీలు హాజరయ్యారు.
అధికారులు నిర్లక్ష్యం
వహిస్తున్నారని ఫిర్యాదు
కాటారం: కాటారం సబ్ డివిజన్‌లో అక్రమంగా చెరువులను తవ్వి మట్టి రవాణా చేపడుతున్నారని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఆత్కూరి శ్రీకాంత్ మంగళవారం హైదరాబాద్‌లోని మానవహక్కుల కమిషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. కొన్ని రోజులుగా కాటారం సబ్ డివిజన్ కేంద్రంగా జరుగుతున్న మట్టి అక్రమ రవాణాపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తిని కొల్లగొడుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు సుమారు రూ.10 కోట్ల విలువచేసే మట్టిని పలువురు అక్రమార్కులు దోచేశారని శ్రీకాంత్ ఫిర్యాదులో ప్రస్తావించారు. చెరువుల పరిరక్షణ నిబంధనలు ఉల్లంఘించి మట్టిని దోచుకుంటున్న వారిపై చట్టపరమైన క్రిమినల్ కేసులు నమోదయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
సింగరేణి ఉద్యోగి ఆత్మహత్య
గణపురం: సింగరేణి ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన గణపురం మండలం చెల్పూర్ గ్రామ శివారు రామప్ప కాలనీలో మంగళవారం చోటుచేసుకుంది. సింగరేణి ఉద్యోగి సిద్దార్థ్(36) కేటీకే–1 మైన్‌లో ట్రామర్‌గా పని చేస్తున్నాడు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. తీవ్ర మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై రేక అశోక్ పేర్కొన్నారు.

భక్తుల రద్దీ పెరిగే అవకాశం

భక్తుల రద్దీ పెరిగే అవకాశం