భూపాలపల్లి అర్బన్: కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతి పుష్కరాల సందర్భంగా భక్తుల సౌకర్యాల కల్పనలో సింగరేణి యాజమాన్యం తోడ్పాటునందిస్తుంది. ప్రభుత్వంతో పాటు సింగరేణి సంస్థ సేవ కార్యక్రమాలతో పాటు పలు సౌకర్యాల ఏర్పాటులో ముందుంది. ప్రత్యేకంగా పుష్కరాలలో పలు కార్యక్రమాల నిర్వహణ కోసం యాజమాన్యం రూ.78లక్షల నిధులు కేటాయించింది. ఈ నెల 15వ తేదీన ప్రారంభమైన సరస్వతి పుష్కరాల్లో కార్యక్రమాలు ప్రారంభించింది. ఈ నిధులతో ఆర్టీసీ తాత్కాలిక బస్టాండ్ నుంచి వీఐపీ సరస్వతి ఘాట్ వరకు ఉచితంగా 30 స్పెషల్ షెటిల్ సర్వీస్‌లను ప్రారంభించింది. పుష్కరాలకు ఆర్టీసీ బస్సుల ద్వారా వస్తున్న భక్తులను పుష్కర స్నానాలకు తరలిస్తున్నారు. ఎండ నేపథ్యంలో భక్తుల దాహార్తిని తీర్చేందుకు చల్లటి తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లను అందిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో భక్తులకు సేవలందించేందుకు సింగరేణి స్క్యౌట్ సిబ్బంది, పుష్కర ఘాట్‌ల వద్ద గోదావరిలో స్విమ్మర్లు, రెస్క్యూ సిబ్బందిని కేటాయించారు. వీరంతా కాళేశ్వరంలో పుష్కర విధులు నిర్వర్తిస్తున్నారు. పుష్కరాలు ముగిసే వరకు భక్తులకు సౌకర్యాలు, సేవలు కల్పించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.
రూ.78లక్షల నిధులు కేటాయించిన యాజమాన్యం
భక్తుల సౌకర్యాల కల్పనకు
సింగరేణి తోడ్పాటు
పుష్కరసేవలో సింగరేణి
పుష్కరసేవలో సింగరేణి