
భద్రకాళి అమ్మవారికి పల్లకీసేవ
హన్మకొండ కల్చరల్ : శ్రీభద్రకాళిభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీభద్రకాళి దేవాలయంలో అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యాన అమ్మవారికి నిత్య పూజలు, అలకరణ అనంతరం ఉత్సవమూర్తికి ఉదయం పల్లకీసేవ, సాయంత్రం శేషవాహనసేవ నిర్వహించారు. మహిళలు కుంకుమపూజలు, లలితాసహస్రనామ పారాయణం చేశారు. అనంతరం అన్నదానం జరిగింది. సేవా కార్యక్రమాలకు వరంగల్ ఉమ్మడి జిల్లా విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సంఘం, తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ మాతృసంఘం బాధ్యులు ఉభయదాతలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, దాసోజు శ్రవణ్‌కుమార్, డాక్టర్ లాల్‌కోట వెంకటాచారి, రాగిఫణి రవీంద్రాచారి, చొల్లేటి కృష్ణమాచారి, సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు నారోజు సత్యమనోరమ, శశిధర్‌శిల్పి తదితరులు పాల్గొన్నారు.

భద్రకాళి అమ్మవారికి పల్లకీసేవ