
ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు
భూపాలపల్లి అర్బన్: సరస్వతీ పుష్కరాల నేపథ్యంలో కాళేశ్వరం పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు ము మ్మరంగా చేపడుతున్నారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పారిశుద్ధ్య సిబ్బంది చెత్తను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. సరస్వతీ ఘాట్, మొయిన్ ఘాట్, బస్టాండ్, పార్కింగ్ పాయింట్లు, గోదావరికి వెళ్లే రహదారుల్లో, ఆలయ పరిసర ప్రాంతాల్లో పడేసిన చెత్తను ఎప్పటికప్పుడు సేకరిస్తున్నారు. దుర్వాసన రాకుండా, వ్యాధులు ప్రభలకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. దోమలు వృద్ధి చెందకుండా రాత్రి వెళలో దోమల మందు స్ప్రె చేస్తున్నారు. రోడ్లపై దుమ్ము లేవకుండా ట్రాక్టర్ల ద్వారా నీళ్లు చల్లుతున్నారు. సేకరించిన చెత్తను ఎప్పటికప్పడు ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు జిల్లా పంచాయితీ శాఖ ఆధ్వర్యంలో 400 మంది తాత్కాలిక కార్మికులను నియమించారు. పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు 150 మంది ఎంపీడీఓ, ఎంపీఓ, పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వర్తిస్తున్నారు. రెండు షిప్టుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు.

ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు