
పుష్కర స్నానం.. ముక్తీశ్వర దర్శనం
సరస్వతీనది పుణ్య స్నానాలకు భక్తుల రద్దీ
పుష్కరిణిలో స్నానాలు ఆచరిస్తున్న భక్తులు
భూపాలపల్లి/కాళేశ్వరం: కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీనది పుష్కరాలకు భక్తులు రోజురోజుకు భారీగా తరలివస్తున్నారు. బుధవారం ఏడోరోజు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి భక్తులు కాళేశ్వరానికి తరలివచ్చారు. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతీనదికి పుష్కర పుణ్యస్నానాలు ఆచరించి, నదీమాతకు పూజలు చేశారు. పిండప్రధాన పూజలు చేశారు. నదీమాతకు చీరె, సారెను సమర్పించారు. దంపతిస్నానాలు చేశారు. ముత్తయిదువ మహిళలు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. భక్తులతో గోదావరితీరం వద్ద భక్తప్రవాహం కనిపించింది. నదిలో దీపాలు వదిలి మొక్కులు చెల్లించారు. ఇసుకలో సైకత లింగాలు చేసి పూజించారు. కాళేశ్వరాలయంలో కాళేశ్వరముక్తీశ్వరున్ని దర్శించుకున్నారు.
అలరిస్తున్న స్టాళ్లు
సరస్వతీఘాట్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాళ్లు భక్తులను అలరిస్తున్నాయి. ఫుడ్‌కోర్టులు, వస్త్రాలు, పిల్లల ఆటలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. కాగా రానున్న ఐదు రోజులు పాటు భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున్న అదనంగా పార్కింగ్ స్థలాలను అడిషనల్ కలెక్టర్ అశోక్‌కుమార్, అడిషనల్ ఎస్పీ బోనాల కిషన్‌లు పరిశీలించారు.
వర్షంతో ఇబ్బందులు
రెండు రోజులుగా ఉక్కపోత, ఎండతీవ్రతతో తల్లడిల్లిన భక్తులకు బుధవారం సాయంత్రం గంట పాటు వర్షం పడడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. దీంతో భక్తజనం చల్లని వాతావరణాన్ని ఆస్వాదించారు. మరో వైపు పుష్కరఘాటులో పార్కింగ్‌స్థలాలు బురదమయంగా మారాయి. పార్కింగ్‌లో ఉన్న వాహనాలు బయటకు రావడానికి దిగబడి మొరాయించాయి. గాలి దుమారానికి బస్టాండ్ సమీపంలో హైదరాబాద్ అల్వాల్‌కు చెందిన ఉజ్వల్ అనే భక్తుడి తలపై రేకు లేచి పడి తీవ్రగాయం అయింది. రక్తస్రావం కాగా, వెంటనే అంబులెన్స్ ద్వారా మహదేవపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యసేవలందించారు.
తాగునీరు, మజ్జిగ అందజేత
భక్తులకు దేవాదాయశాఖ ఆధ్వర్యంలో తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు అందించారు. ప్రధాన తూర్పు ద్వారం, దక్షిణ ద్వారాల ద్వార క్యూలైన్‌లలో భక్తులను ఎప్పటికప్పుడు క్లియర్ చేశారు. ఉత్సవ కమిటీ సభ్యులు నిరంతరం అక్కడే ఉంటూ భక్తులకు సేవలందిస్తున్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ ద్వారా పుష్కరఘాటు, నదీతీరం, కాళేశ్వరాలయం ప్రాంతంలో చల్లని తాగునీరు అందిస్తున్నారు.
వివిధ రాష్ట్రాల నుంచి భక్తుల రాక
ఎమ్మెల్యేలు వినోద్, అనిరుధ్‌రెడ్డి,
అంబర్‌కిశోర్‌ఝా, ఎస్పీ శ్రీనివాసరావులు పుణ్యస్నానాలు
ఏడో రోజు లక్షకుపైగా తరలి వచ్చిన జనం
వర్షంతో చల్లబడిన వాతావరణం

పుష్కర స్నానం.. ముక్తీశ్వర దర్శనం

పుష్కర స్నానం.. ముక్తీశ్వర దర్శనం

పుష్కర స్నానం.. ముక్తీశ్వర దర్శనం