
మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బుధవారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పుల్లూరిరామయ్యపల్లితో పాటు వేశాలపల్లిలో వివిధ అభివృద్ధి పనులకు మున్సిపాలిటీ కమిషనర్ బిర్రు శ్రీనివాస్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ముందుగా పుల్లూరిరామయ్యపల్లి పెద్దకుంటపల్లి నుంచి పుల్లూరి రామయ్యపల్లి వరకు టీయు ఎఫ్‌ఐడీసీ నిధుల నుంచి నూతనంగా నిర్మించనున్న కల్వర్టులు, బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్ధాపన చేశారు. వేశాలపల్లిలో డ్రెయినేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా పని చేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దాట్ల శ్రీనివాస్, ఆకుల మహేందర్, రవి తదితరులు పాల్గొన్నారు.
విద్యాప్రమాణాలు మెరుగుపర్చాలి
మల్హర్: విద్యార్థులకు అర్థవంతంగా బోధించి పాఠశాలల్లో విద్యాప్రమాణాలు మెరుగుపర్చేందుకు ప్రతీ ఉపాధ్యాయుడు కృషి చేయాలని జిల్లా విద్యాధికారి రాజేందర్ అన్నారు. మండలంలోని వల్లెకుంట జిల్లా పరిషత్ పాఠశాలలో మండల విద్యాధికారి లక్ష్మణ్‌బాబు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు జరుగుతున్న శిక్షణ తరగతులను బుధవారం డీఈఓ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఉపాధ్యాయులు శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోని విద్యార్థులకు మంచి విద్యను అందించాలన్నారు. ఉపాధ్యాయులు మా రుతున్న కా లానికి అనుగుణంగా అప్‌డేట్ కావాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రతీ పాఠశాలలో విద్యార్థుల నమోదు పెరిగేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
శిక్షణతో బోధన నైపుణ్యాలు పెంపు
కాటారం: ఎఫ్‌ఎల్‌ఎన్ శిక్షణ ద్వారా ఉపాధ్యాయుల్లో బోధన నైపుణ్యాలు పెంపొందుతా యని జిల్లా విద్యాధికారి రాజేందర్ అన్నారు. కాటారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న ఎఫ్‌ఎల్‌ఎన్ ప్రాథమిక స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం డీఈఓ పరిశీలించారు. శిక్షణ కొనసాగుతున్న తీరు, హాజరైన ఉపాధ్యాయు ల వివరాలు ఆరా తీశారు. ప్రతీ ఉపాధ్యాయుడు శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డీఈఓ వెంట ఏఎంఓ లక్ష్మణ్, ఎంఈఓ శ్రీదేవి, రిసోర్స్‌పర్సన్స్ తదితరులు ఉన్నారు.
ప్లాస్టిక్ నిషేధంలో
భాగస్వాములు కావాలి
కాళేశ్వరం: కాళేశ్వరంలోని సరస్వతీ పుష్కరాలకు వచ్చే భక్తులు ప్లాస్టిక్ వినియోగాన్ని ని షేధించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కాలుష్య నియంత్రణ మండలి ప్రాజెక్టు అధికారి సత్తయ్య తెలిపారు. ఈ మేరకు ప్రజలకు ప్లాస్టిక్ వినియోగం, విసిరిపడేయంపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో రూపొందించిన ‘ సరస్వతీ పుష్కరాలు ప రిశుభ్ర పుష్కరం – పవిత్ర పుష్కరం అనే వాల్ పోస్టర్లను బస్సులకు అంటించారు. భక్తులు వాడే ప్లాస్టిక్ నది జలాల్లో కలవడంతో పవి త్రమైన నది జలాలు కలుషితమవుతాయన్నా రు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలన్నారు.
‘సదస్సును
విజయవంతం చేయాలి’
ములుగు: ఈ నెల 24న కాకతీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న ఉమ్మడి వరంగల్ జిల్లా సదస్సును విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ నేత, ఉమ్మడి వరంగల్ ఇన్‌చార్జ్ మంద కుమార్‌మాదిగ పిలుపునిచ్చా రు. ఈ మేరకు బుధవారం జిల్లా అధ్యక్షుడు శ్యాంబాబు అధ్యక్షతన నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడా రు. ఈ సమావేశంలో అనుబంధ సంఘాల భ విష్యత్ కార్యచరణను ప్రకటిస్తామన్నారు.

మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా

మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా