
అక్రమ సోదాలు సరికాదు..
భూపాలపల్లి అర్బన్: సాక్షి తెలుగు దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంటిపై పోలీసుల అక్రమ సోదాలను నిరసిస్తూ శుక్రవారం జిల్లాకేంద్రంలోని స్థానిక ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. కాకతీయ ప్రెస్‌క్లబ్ నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఏపీ ప్రభుత్వం జర్నలిస్టుపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని, ప్రజా సమస్యలను వెలికితీస్తే ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడటం సరికాదని జర్నలిస్టులు మండిపడ్డారు. కార్యక్రమంలో జర్నలిస్టులు సామంతులు శ్యామ్, ఎడ్ల సంతోష్, దొమ్మటి రవీందర్, తిక్క ప్రవీణ్, సుధాకర్, రవీందర్, పసుపుల రాజు, వెంకటస్వామి, శేఖర్, పవన్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి జోసఫ్ పాల్గొన్నారు.