ఈదురుగాలులతో వర్ష బీభత్సం
భూపాలపల్లి/కాళేశ్వరం: సరస్వతి పుష్కరాలకు లక్షలాది మంది భక్తులు వస్తున్న సమయంలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. కాళేశ్వరంలో శుక్రవారం రాత్రి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో త్రివేణి సంగమం పుష్కర ఘాట్ తీరాన ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు నేలకూలాయి. పలుగుల బైపాస్ రోడ్, బస్టాండ్, వీఐపీ ఘాట్ రోడ్, టెంట్ సిటీ, సరస్వతి మాత విగ్రహం వెనుక, సాధారణ ఘాట్ వద్ద గల భారీ హోర్డింగ్‌లు, ఫ్లెక్సీ కటౌట్‌లు కూలిపోయాయి. రాత్రివేళ ఈదురుగాలులు వీయడంతో ఎటువంటి ప్రమాదమూ వాటిళ్లలేదు. 120 ఎకరాల్లో ఉన్న పార్కింగ్ స్థలాలు రేగడి భూముల్లో ఉండటంతో వాహనాలను శుక్రవారం ఉదయం వరకు బయటకు తీయలేని పరిస్థితి నెలకొంది. వర్ష బీభత్సం జరిగిన వెంటనే రాత్రి కలెక్టర్ రాహుల్ శర్మ పలు ప్రాంతాలను సందర్శించారు. శనివారం ఉదయం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ, మరమ్మతు పనులు చేపట్టారు.
ఫాస్ట్ –5 ఫైనల్‌లో గెలుపొందిన మేడ్చల్ బాలికల టీం


