
ఎడ్ల బండ్లకు పెరిగిన గిరాకీ
భూపాలపల్లి అర్బన్: కాళేశ్వరం పుష్కరాల్లో భాగంగా సరస్వతి ఘాట్ వద్ద ఎడ్ల బండ్లకు గిరాకీ పెరిగింది. శుక్రవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ బురదమయంగా మారాయి. దాంతో బురద రోడ్లపై వాహనాలు ముందుకు సాగక భక్తులు ఇబ్బందులు పడ్డారు. కార్లు, వాహనాలను దూరంగా పార్కింగ్ చేసి కాలినడకన వెళ్లలేక ఎడ్ల బండ్లను ఆశ్రయించారు. ఎడ్లబండ్ల యజమానులు ఒక్కరికి రూ.50 చొప్పున చార్జీ వసూలు చేస్తున్నారు. పట్టణాల నుంచి వచ్చిన భక్తులు ఎడ్ల బండ్లపై ప్రయాణం చేస్తూ సంబురపడుతూ, సెల్ఫీలు తీసుకుంటున్నారు.