నేటి నుంచి జాయ్‌రైడ్స్
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో జాయ్‌రైడ్స్‌కు ఆదివారం నుంచి హెలికాప్టర్ చక్కర్లు కొట్టనుంది. కన్నెపల్లిలోని లక్ష్మీ పంపుహౌస్ వద్ద భక్తులు విహంగ వీక్షణం చేయడానికి ఏవియేషన్ అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. యాత్రధామ్.ఓఆర్‌జీ యాప్‌లో ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలని, జాయ్‌రైడ్స్, టెంట్‌సిటీ, దేవస్థానం పూజలను ఈ యాప్‌లో పొందుపర్చినట్లు వివరించారు. జాయ్‌రైడ్స్ బుకింగ్ కోసం ఒక్కరికి రూ.4,500తో 6 – 7 నిమిషాల పాటు గాలిలో చక్కర్లు కొట్టనున్నారు. కన్నెపల్లి హెలిపాడ్ వద్ద హెలికాప్టర్ సిద్ధంగా ఉంది. టెంట్‌సిటీకి ఒక రోజుకు రూ.3వేల వరకు తీసుకుంటున్నట్లు ప్రతినిధులు పేర్కొన్నారు.


