
డిప్యూటీ సీఎం కాలసర్ప పూజలు
హోరాహోరీగా నెట్‌బాల్ పోటీలు
కాటారం/కాళేశ్వరం: సరస్వతి పుష్కరాల్లో భాగంగా సరస్వతి ఘాట్ వద్ద రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తన సోదరుడు మల్లు ప్రసాద్‌తో కలిసి శనివారం తమ పితృదేవతలకు పిండప్రదానం చేశారు. అనంతరం పుష్కర స్నానం ఆచరించి కాళేశ్వర ముక్తీశ్వర ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భట్టికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కుటుంబ సమేతంగా స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కాలసర్ప నివారణ పూజలు, స్వామి వారికి క్షీరాభిషేకం చేశారు. ఆలయ పురోహితులు వేద మంత్రోచ్ఛరణల మధ్య డిప్యూటీ సీఎం దంపతులకు ఆశీర్వచనం చేసి స్వామి వారి ప్రసాదం అందజేశారు.