
నిలుపుతున్న ఆర్టీసీ బస్సులు
కాటారం: కాళేశ్వరం సరస్వతి నది పుష్కరాల సందర్భంగా మొదటి రెండు రోజులు కాటారంలో ఆర్టీసీ బస్సులు నిలపకపోవడంతో భక్తులు, సాధారణ ప్రయాణికులు మహదేవపూర్, కాళేశ్వరం వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో సాక్షిలో శనివారం ‘ఆర్టీసీ అత్యుత్సాహం’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. ఆర్టీసీ ఉన్నతాధికారులు కథనంపై ఆరా తీసి వివరాలు సేకరించారు. బస్సులు కాటారంలో నిలపాలని డ్రైవర్లు, కండక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కాటారం ప్రధాన కూడలిలో ఆదివారం బస్సులు నిలిపారు. కానీ వరంగల్, హనుమకొండ డిపోలకు చెందిన కొన్ని బస్సులు మాత్రం ఆపడం లేదు. భక్తులు, ప్రయాణికులు రోడ్డుపైకి వచ్చి చేతులు అడ్డుపెట్టినప్పటికీ ఫలితం లేదు. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.